BhaktiVed
Vishnu

Tandanana Aahi (chalada Harinama)

SankirtanaAuthor: అన్నమాచార్య (Annamacharya)

This text is still being proofread.

చాలదా హరి నామ సౌఖ్యామృతము

తవిలి సకల జీవులకు నాధారము

ఇదియే పరమ మంత్రము ఇదియే ముక్తి సాధనము

ఇదియే సర్వ దేవతల కెల్ల బ్రియము

ఇదియే సకల కర్మములు నిర్మలము సేయుటకు

ఇదియే నాలుక కెల్ల నింపు హరి నామము

ఇది కదా యోగులకు నిహపర సాధనము

ఇది కదా మునులకెల్ల నెక్కుడు తపము

ఇది కదా శ్రీవేంకటేశుని సంకీర్తనము

ఇది కదా నరులకెల్ల నిహము పరము

No video for this text yet.Search on YouTube
Source: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

Also read