BhaktiVed
विष्णु

తందనాన ఆహి (చాలదా హరినామ)

संकीर्तनरचना: అన్నమాచార్య (Annamacharya)

इस पाठ की जाँच अभी बाकी है।

చాలదా హరి నామ సౌఖ్యామృతము

తవిలి సకల జీవులకు నాధారము

ఇదియే పరమ మంత్రము ఇదియే ముక్తి సాధనము

ఇదియే సర్వ దేవతల కెల్ల బ్రియము

ఇదియే సకల కర్మములు నిర్మలము సేయుటకు

ఇదియే నాలుక కెల్ల నింపు హరి నామము

ఇది కదా యోగులకు నిహపర సాధనము

ఇది కదా మునులకెల్ల నెక్కుడు తపము

ఇది కదా శ్రీవేంకటేశుని సంకీర్తనము

ఇది కదా నరులకెల్ల నిహము పరము

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Annamacharya sankirtana; TTD Annamacharya Sankirtanalu; text as commonly sung

ये भी पढ़ें