BhaktiVed
మీ పేరుతో దీపావళి Wishes · WhatsApp Status
కృష్ణుడు

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)Raga Kurinji
లిపి
ఫాంట్ సైజు

ఈ పాఠానికి సంపాదకీయ సమీక్ష అవసరం.

సంపాదకీయ సమీక్ష · సమీక్ష అవసరం

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలపైన కప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము

పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము

బాలునివలె దిరిగీ పద్మనాభుడు

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

ఇవి కూడా చదవండి