BhaktiVed

Ayodhya Kanda Sarga 82 In Telugu – అయోధ్యాకాండ ద్వ్యశీతితమః సర్గః

Bhakti Yogam2024-06-21

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ 82వ సర్గ, “సేనాప్రస్థాపనమ్”, రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడిని తిరిగి తీసుకురావడానికి వనానికి సేనను ప్రస్థానిస్తాడు. భరతుడు తన సైన్యంతో సహా, రాముడు ఉంటున్న అరణ్యానికి బయలుదేరతాడు. ఈ సర్గ భరతుడి ధైర్యం, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమ, మరియు రాముడు తిరిగి రావాలని కోరుకునే భరతుడి పట్టుదలను స్పష్టంగా చూపిస్తుంది. సేనాప్రస్థాపన సందర్భంలో, భరతుడు తన సైన్యానికి మార్గదర్శకత్వం చేస్తూ, రాముడి సేవలో ఉండడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ సర్గ భరతుడి విధేయత, ధర్మపరాయణత, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

సేనాప్రస్థాపనమ్

తామార్యగణసంపూర్ణాం భరతః ప్రగ్రహాం సభామ్ |
దదర్శ బుద్ధి సంపన్నః పూర్ణచంద్రో నిశామివ ||

1

ఆసనాని యథాన్యాయమార్యాణాం విశతాం తదా |
వస్త్రాంగరాగప్రభయా ద్యోతితా సా సభోత్తమా ||

2

సా విద్వజ్జనసంపూర్ణా సభా సురుచిరా తదా |
అదృశ్యత ఘనాపాయే పూర్ణచంద్రేవ శర్వరీ ||

3

రాజ్ఞస్తు ప్రకృతీః సర్వాః సమగ్రాః ప్రేక్ష్య ధర్మవిత్ |
ఇదం పురోహితః వాక్యం భరతం మృదు చాబ్రవీత్ ||

4

తాత రాజా దశరథః స్వర్గతర్ధర్మమాచరన్ |
ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీం తవ ||

5

రామస్తథా సత్యధృతిః సతాం ధర్మమనుస్మరన్ |
నాజహాత్పితురాదేశం శశీ జ్యోత్స్నామివోదితః ||

6

పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహతకణ్టకమ్ |
తద్భుంక్ష్వ ముదితామాత్యః క్షిప్రమేవాభిషేచయ ||

7

ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః |
కోట్యాపరాంతాః సాముద్రా రత్నాన్యభిహరంతు తే ||

8

తచ్ఛ్రుత్వా భరతః వాక్యం శోకేనాభిపరిప్లుతః |
జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా ||

9

స బాష్ప కలయా వాచా కలహంస స్వరః యువా |
విలలాప సభామధ్యే జగర్హే చ పురోహితమ్ ||

10

చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః |
ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్ ||

11

కథం దశరథాజ్ఞాతః భవేద్రాజ్యాపహారకః |
రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి ||

12

జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ ధర్మాత్మా దిలీపనహుషోపమః |
లబ్ధుమర్హతి కాకుత్స్థో రాజ్యం దశరథో యథా ||

13

అనార్య జుష్టమస్వర్గ్యం కుర్యాం పాపమహం యది |
ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులపాంసనః ||

14

యద్ధి మాత్రా కృతం పాపం నాహం తదపిరోచయే |
ఇహస్థో వనదుర్గస్థం నమస్యామి కృతాంజలిః ||

15

రామమేవానుగచ్ఛామి స రాజా ద్విపదాం వరః |
త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవో ||

16

తద్వాక్యం ధర్మసంయుక్తం శ్రుత్వా సర్వే సభాసదః |
హర్షాన్ముముచురశ్రూణి రామే నిహితచేతసః ||

17

యది త్వార్యం న శక్ష్యామి వినివర్తయితుం వనాత్ |
వనే తత్రైవ వత్స్యామి యథాఽర్యో లక్ష్మణస్తథా ||

18

సర్వోపాయం తు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ |
సమక్షమార్య మిశ్రాణాం సాధూనాం గుణవర్తినామ్ ||

19

విష్టికర్మాంతికాః సర్వే మార్గశోధకరక్షకాః |
ప్రస్థాపితా మయా పూర్వం యాత్రాఽపి మమ రోచతే ||

20

ఏవముక్త్వా తు ధర్మాత్మా భరతః భ్రాతృవత్సలః |
సమీపస్థమువాచేదం సుమంత్రం మంత్రకోవిదమ్ ||

21

తూర్ణముత్థాయ గచ్ఛ త్వం సుమంత్ర మమ శాసనాత్ |
యాత్రామాజ్ఞాపయ క్షిప్రం బలం చైవ సమానయ ||

22

ఏవముక్తః సుమంత్రస్తు భరతేన మహాత్మనా |
హృష్టస్తదాదిశత్సర్వం యథాసందిష్టమిష్టవత్ ||

23

తాః ప్రహృష్టాః ప్రకృతయో బలాధ్యక్షా బలస్య చ |
శ్రుత్వా యాత్రాం సమాజ్ఞప్తాం రాఘవస్య నివర్తనే ||

24

తతః యోధాంగనాః సర్వా భర్త్రూన్ సర్వాన్ గృహే గృహే |
యాత్రా గమనమాజ్ఞాయ త్వరయంతి స్మ హర్షితాః ||

25

తే హయైర్గోరథైః శీఘ్రైః స్యందనైశ్చ మహాజవైః |
సహయోధైః బలాధ్యక్షాః బలం సర్వమచోదయన్ ||

26

సజ్జం తు తద్బలం దృష్ట్వా భరతః గురుసన్నిధౌ |
రథం మే త్వరయస్వేతి సుమంత్రం పార్శ్వతోఽబ్రవీత్ ||

27

భరతస్య తు తస్యాజ్ఞాం ప్రతిగృహ్య చ హర్షితః |
రథం గృహీత్వా ప్రయయౌ యుక్తం పరమవాజిభిః ||

28

స రాఘవః సత్యధృతిః ప్రతాపవాన్
బ్రువన్ సుయుక్తం దృఢసత్యవిక్రమః |
గురుం మహారణ్యగతం యశస్వినమ్
ప్రసాదయిష్యన్భరతోఽబ్రవీత్తదా ||

29

తూర్ణం సముత్థాయ సుమంత్ర గచ్ఛ
బలస్య యోగాయ బలప్రధానాన్ |
ఆనేతుమిచ్ఛామి హి తం వనస్థమ్
ప్రసాద్య రామం జగతః హితాయ ||

30

స సూతపుత్రః భరతేన సమ్యక్
ఆజ్ఞాపితః సంపరిపూర్ణకామః |
శశాస సర్వాన్ప్రకృతి ప్రధానాన్
బలస్య ముఖ్యాంశ్చ సుహృజ్జనం చ ||

31

తతః సముత్థాయ కులే కులే తే
రాజన్యవైశ్యా వృషలాశ్చ విప్రాః |
అయూయుజన్నుష్ట్రరథాన్ ఖరాంశ్చ
నాగాన్ హయాంశ్చైవ కులప్రసూతాన్ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వ్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 82 Meaning In Telugu

రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.

‘రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు.” అని పలికాడు వసిష్ఠుడు.

అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. “కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.

భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు.

“మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి ” అని అన్నాడు.

భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః (83) >>

Also read

Sai Baba Stotram Pdf, Sai Baba Stotram Lyrics in TeluguSai Baba Kashta Nivarana Stotram, Shirdi Sai Baba Stotram Lyrics శ్రీ సాయినాథాయ నమః షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే, సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం. రఘుపతి రాఘవ రాజారా…Sivapuranam Lyrics in Tamil English Hindi Telugu with Meaning, Sivapuranam Pdf Free DownloadThe Puran itself is the creation of Lord Shiva himself, the mystical wisdom crafted in words, moulded into one hundred thousand couplets or quartets (Shlokas), divided into twelve …Sivapuranam in English – Vidyeshwara SamhitaSivapuranam is a sacred Tamil text that extols the greatness of Lord Shiva. Sivapuranam in English – Vidyeshwara Samhita Vidyeshwara Samhita Thus spoke Sage Soota : ‘After many yug…Sivapuranam in English – Rudra SamhitaDevotees often recite Sivapuranam Pdf as part of their daily prayers. Sivapuranam in English – Rudra Samhita Rudra Samhita Proceeded further Sage Soota to reveal mysticism of a new…Sivapuranam in English – Shatarudra SamhitaThe verses of Sivapuranam Lyrics narrate the divine stories and attributes of Lord Shiva. Sivapuranam in English – Shatarudra Samhita Shaearudra Samhita Enumerated Sage Soota the v…Sivapuranam in English – Kotirudra SamhitaThe recitation of Sivapuranam Lyrics in English is believed to bring inner peace and spiritual growth. Sivapuranam in English – Kotirudra Samhita Kotirudra Samhita Enlightened Sage…