Ayodhya Kanda Sarga 83 In Telugu – అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  త్ర్యశీతితమః సర్గ, “భరతవనప్రస్థానమ్”, రామాయణంలో ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో భరతుడు తన సైన్యంతో, మంత్రులతో, మరియు ప్రజలతో కలిసి రాముడిని తిరిగి తీసుకురావాలన్న పట్టుదలను చూపిస్తాడు. భరతుడు తన అన్న రాముడిని తిరిగి తెచ్చేందుకు చేసిన ఈ యాత్ర, అతని విధేయతను, ధర్మపరాయణతను, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

భరతవనప్రస్థానమ్

తతః సముత్థితః కాల్యమాస్థాయ స్యందనోత్తమమ్ |
ప్రయయౌ భరతః శీఘ్రం రామదర్శనకాంక్షయా ||

1

అగ్రతః ప్రయయుస్తస్య సర్వే మంత్రిపురోధసః |
అధిరుహ్య హయైః యుక్తాన్ రథాన్సూర్యరథోపమాన్ ||

2

నవనాగసహస్రాణి కల్పితాని యథావిధి |
అన్వయుర్భరతం యాంతమిక్ష్వాకు కులనందనమ్ ||

3

షష్ఠీ రథసహస్రాణి ధన్వినో వివిధాయుధాః |
అన్వయుర్భరతం యాంతం రాజపుత్రం యశస్వినమ్ ||

4

శతం సహస్రాణ్యశ్వానాం సమారూఢాని రాఘవమ్ |
అన్వయుర్భరతం యాంతం సత్యసంధం జితేంద్రియమ్ ||

5

కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్వినీ |
రామానయన సంహృష్టా యయుర్యానేన భాస్వతా ||

6

ప్రయాతాశ్చార్యసంఘాతాః రామం ద్రష్టుం సలక్ష్మణమ్ |
తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః ||

7

మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్త్వం దృఢవ్రతమ్ |
కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశనమ్ ||

8

దృష్ట ఏవ హి నః శోకమపనేష్యతి రాఘవః |
తమః సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కరః ||

9

ఇత్యేవం కథయంతస్తే సంప్రహృష్టాః కథాశ్శుభాః |
పరిష్వజానాశ్చాన్యోన్యం యయుర్నాగరికా జనాః ||

10

యే చ తత్రాపరే సర్వే సమ్మతా యే చ నైగమాః |
రామం ప్రతి యయుర్హృష్టాః సర్వాః ప్రకృతయస్తదా ||

11

మణికారాశ్చ యే కేచిత్ కుంభకారాశ్చ శోభనాః |
సూత్రకర్మకృతశ్చైవ యే చ శస్త్రోపజీవినః ||

12

మాయూరకాః క్రాకచికా రోచకాః వేధకాస్తథా |
దంతకారాః సుధాకారాస్తథా గంధోపజీవినః ||

13

సువర్ణకారాః ప్రఖ్యాతాస్తథా కంబలధావకాః |
స్నాపకోచ్ఛాదకా వైద్యా ధూపకాః శౌండికాస్తథా ||

14

రజకాస్తున్నవాయాశ్చ గ్రామఘోషమహత్తరాః |
శైలూషాశ్చ సహ స్త్రీభిర్యయుః కైవర్తకాస్తథా ||

15

సమాహితా వేదవిదో బ్రాహ్మణా వృత్తసమ్మతాః |
గోరథైః భరతం యాంతమనుజగ్ముః సహస్రశః ||

16

సువేషాః శుద్ధ వసనాస్తామ్ర మృష్టానులేపనాః |
సర్వే తే వివిధైః యానైః శనైర్భరతమన్వయుః ||

17

ప్రహృష్టముదితా సేనా సాఽన్వయాత్కైకయీ సుతమ్ |
భ్రాతురానయనే యాంతం భరతం భ్రాతృవత్సలమ్ ||

18

తే గత్వా దూరమధ్వానం రథయానాశ్వకుంజరైః |
సమాసేదుస్తతో గంగాం శృంగిబేరపురం ప్రతి ||

19

యత్ర రామసఖో వీరో గుహో జ్ఞాతిగణైర్వృతః |
నివసత్యప్రమాదేన దేశం తం పరిపాలయన్ ||

20

ఉపేత్య తీరం గంగాయాశ్చక్రవాకైరలంకతమ్ |
వ్యవతిష్ఠత సా సేనా భరతస్యానుయాయినీ ||

21

నిరీక్ష్యానుగతాం సేనాం తాం చ గంగాం శివోదకామ్ |
భరతః సచివాన్ సర్వాన్ అబ్రవీద్వాక్యకోవిదః ||

22

నివేశయత మే సైన్యమభిప్రాయేణ సర్వతః |
విశ్రాంతః ప్రతరిష్యామః శ్వైదానీమిమాం నదీమ్ ||

23

దాతుం చ తావదిచ్ఛామి స్వర్గతస్య మహీపతేః |
ఔర్ధ్వదేహనిమిత్తార్థమ్ అవతీర్యోదకం నదీమ్ ||

24

తస్యైవం బ్రువతోఽమాత్యాస్తథా ఇత్యుక్త్వా సమాహితాః |
న్యవేశయంస్తాం ఛందేన స్వేన స్వేన పృథక్ పృథక్ ||

25

నివేశ్య గంగామను తాం మహానదీమ్
చమూం విధానైః పరిబర్హశోభినీమ్ |
ఉవాస రామస్య తదా మహాత్మనో
విచింతయానో భరతర్నివర్తనమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 83 Meaning In Telugu

మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాతఃకాల సంధ్యావందనాదికార్యకమములు నిర్వర్తించాడు. తన రథముఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.

భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.

వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.

“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది. చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతరణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః (84) >>

Leave a Comment