BhaktiVed

కిష్కింధాకాండ తృతీయః సర్గః – Kishkindha Kanda Sarga 3 In Telugu

భక్తి యోగం2024-07-09

రామాయణంలోని కిష్కింధాకాండ తృతీయ సర్గలో, సుగ్రీవుడు రాముని సహాయంతో తన అన్న వాలిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాడు. సుగ్రీవుడు, రాముడు కలిసి, వాలిని సవాలు చేయడానికి పథకాలు వేస్తారు. సుగ్రీవుడు వాలిని పిలిచి, సవాలు చేస్తాడు. రాముడు తన విల్లుతో దాక్కుని ఉంటాడు, సుగ్రీవుడు వాలితో యుద్ధం చేస్తాడు. రాముడు సుగ్రీవుని గుర్తించడానికి ఒక సూచిక ఇవ్వమని సూచిస్తాడు, ఎందుకంటే వాలి, సుగ్రీవులు ఒకేలా కనిపిస్తారు. సుగ్రీవుడు మెడలో పచ్చ కంబళిని ధరిస్తాడు. రాముడు ఈ సూచికతో వాలిని బాణంతో వధిస్తాడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.

హనూమత్ప్రేషణమ్

వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః |
పర్వతాదృశ్యమూకాత్తు పుప్లువే యత్ర రాఘవౌ || ౧ ||

కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః || ౨ ||

తతః స హనుమాన్ వాచా శ్లక్ష్ణయా సుమనోజ్ఞయా |
వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ || ౩ ||

ఆబభాషే తదా వీరౌ యథావత్ ప్రశశంస చ |
సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజః || ౪ ||

ఉవాచ కామతో వాక్యం మృదు సత్యపరాక్రమౌ |
రాజర్షిదేవప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ || ౫ ||

దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ |
త్రాసయంతౌ మృగగణానన్యాంశ్చ వనచారిణః || ౬ ||

పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః |
ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ || ౭ ||

ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం చీరవాససౌ |
నిఃశ్వసంతౌ వరభుజౌ పీడయంతావిమాః ప్రజాః || ౮ ||

సింహవిప్రేక్షితౌ వీరౌ సింహాతిబలవిక్రమౌ |
శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ || ౯ ||

శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠవిక్రమౌ |
హస్తిహస్తోపమభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ || ౧౦ ||

ప్రభయా పర్వతేంద్రోఽయం యువయోరవభాసితః |
రాజ్యార్హావమరప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ || ౧౧ ||

పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ |
అన్యోన్యసదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ || ౧౨ ||

యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరామ్ |
విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ || ౧౩ ||

సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ |
ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః || ౧౪ ||

సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః |
ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమామ్ || ౧౫ ||

ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరువిభూషితామ్ |
ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే || ౧౬ ||

ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమవిభూషితే |
సంపూర్ణా నిశితైర్బాణైస్తూణాశ్చ శుభదర్శనాః || ౧౭ ||

జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః |
మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ || ౧౮ ||

ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నాగౌ |
ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషథః || ౧౯ ||

సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయూథపః |
వీరో వినికృతో భ్రాత్రా జగద్భ్రమతి దుఃఖితః || ౨౦ ||

ప్రాప్తోఽహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా |
రాజ్ఞా వానరముఖ్యానాం హనూమాన్నామ వానరః || ౨౧ ||

యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్ఛతి |
తస్య మాం సచివం విద్ధి వానరం పవనాత్మజమ్ || ౨౨ || [విత్తం]

భిక్షురూపప్రతిచ్ఛన్నం సుగ్రీవప్రియకామ్యయా |
ఋశ్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణమ్ || ౨౩ ||

ఏవముక్త్వా తు హనుమాంస్తౌ వీరౌ రామలక్ష్మణౌ |
వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన || ౨౪ ||

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ |
ప్రహృష్టవదనః శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతః స్థితమ్ || ౨౫ ||

సచివోఽయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః |
తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః || ౨౬ ||

తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవసచివం కపిమ్ |
వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమరిందమ || ౨౭ ||

నానృగ్వేదవినీతస్య నాయజుర్వేదధారిణః |
నాసామవేదవిదుషః శక్యమేవం ప్రభాషితుమ్ || ౨౮ ||

నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ |
బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్ || ౨౯ ||

న ముఖే నేత్రయోర్వాఽపి లలాటే చ భ్రువోస్తథా |
అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్ || ౩౦ ||

అవిస్తరమసందిగ్ధమవిలంబితమద్రుతమ్ |
ఉరఃస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే || ౩౧ ||

సంస్కారక్రమసంపన్నామద్రుతామవిలంబితామ్ |
ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహారిణీమ్ || ౩౨ ||

అనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యంజనస్థయా |
కస్య నారాధ్యతే చిత్తముద్యతాసేరరేరపి || ౩౩ ||

ఏవంవిధో యస్య దూతో న భవేత్పార్థివస్య తు |
సిధ్యంతి హి కథం తస్య కార్యాణాం గతయోఽనఘ || ౩౪ ||

ఏవం గుణగణైర్యుక్తా యస్య స్యుః కార్యసాధకాః |
తస్య సిధ్యంతి సర్వార్థా దూతవాక్యప్రచోదితాః || ౩౫ ||

ఏవముక్తస్తు సౌమిత్రిః సుగ్రీవసచివం కపిమ్ |
అభ్యభాషత వాక్యజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజమ్ || ౩౬ ||

విదితా నౌ గుణా విద్వన్ సుగ్రీవస్య మహాత్మనః |
తమేవ చావాం మార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరమ్ || ౩౭ ||

యథా బ్రవీషి హనుమన్ సుగ్రీవవచనాదిహ |
తత్తథా హి కరిష్యావో వచనాత్తవ సత్తమ || ౩౮ ||

తత్తస్య వాక్యం నిపుణం నిశమ్య
ప్రహృష్టరూపః పవనాత్మజః కపిః |
మనః సమాధాయ జయోపపత్తౌ
సఖ్యం తదా కర్తుమియేష తాభ్యామ్ || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయః సర్గః || ౩ ||

Kishkindha Kanda Sarga 3 Meaning In Telugu

సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్నచోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామ లక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేసారు. రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు.

“మీరు ముని కుమారులవలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజూటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలలవలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు.

మీరు ఆజానుబాహులుకదా! మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించ గల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి.

ఇక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానర రాజు సుగ్రీవుడు మా ప్రభువు. ఈ ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి.” అని పలికాడు హనుమంతుడు.

ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము ఎవరి కోసరం వెదుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మనవద్దకు వచ్చాడు. ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహము చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇతడు చాకచక్యంగా మాట్లాడటం తెలిసిన వాడు. మంచి స్నేహశీలి. కాబట్టి లక్ష్మణా! ఇతనితో నీవు మాట్లాడు. నాకు చూడగా ఇతడు నాలుగు వేదములు, వ్యాకరణశాస్త్రము చదివిన వాడులాగా కనపడుతున్నాడు. లేకపోతే ఇంత చాకచక్యముగా, ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాటలాడలేడు.

లక్ష్మణా! ఇతని శరీరములో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనపడటం లేదు. సర్వలక్షణ సంపన్నుడు లాగా ఉన్నాడు. ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది కానీ విసుగురావడం లేదు. కాబట్టి నీవు అతనితో మాటలాడుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిసాడు. ” మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. ఇతను రాముడు. నా పేరు లక్ష్మణుడు. నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను మేము వెతుకుతున్నాము. మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహము చేయవలెనని, పరస్పరసాయము చేసుకొనవలెనని అభిలషించుచున్నాము.”అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు పలికినపలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలము అవుతుందని మనసులో అనుకున్నాడు.

శ్రీమద్రామాయణముకిష్కింధాకాండము
మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ చతుర్థః సర్గః (4) >>

ఇవి కూడా చదవండి

Sai Baba Stotram Pdf, Sai Baba Stotram Lyrics in TeluguSai Baba Kashta Nivarana Stotram, Shirdi Sai Baba Stotram Lyrics శ్రీ సాయినాథాయ నమః షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే, సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం. రఘుపతి రాఘవ రాజారా…Sivapuranam Lyrics in Tamil English Hindi Telugu with Meaning, Sivapuranam Pdf Free DownloadThe Puran itself is the creation of Lord Shiva himself, the mystical wisdom crafted in words, moulded into one hundred thousand couplets or quartets (Shlokas), divided into twelve …Sivapuranam in English – Vidyeshwara SamhitaSivapuranam is a sacred Tamil text that extols the greatness of Lord Shiva. Sivapuranam in English – Vidyeshwara Samhita Vidyeshwara Samhita Thus spoke Sage Soota : ‘After many yug…Sivapuranam in English – Rudra SamhitaDevotees often recite Sivapuranam Pdf as part of their daily prayers. Sivapuranam in English – Rudra Samhita Rudra Samhita Proceeded further Sage Soota to reveal mysticism of a new…Sivapuranam in English – Shatarudra SamhitaThe verses of Sivapuranam Lyrics narrate the divine stories and attributes of Lord Shiva. Sivapuranam in English – Shatarudra Samhita Shaearudra Samhita Enumerated Sage Soota the v…Sivapuranam in English – Kotirudra SamhitaThe recitation of Sivapuranam Lyrics in English is believed to bring inner peace and spiritual growth. Sivapuranam in English – Kotirudra Samhita Kotirudra Samhita Enlightened Sage…