అరణ్యకాండ పంచసప్తతితమః సర్గః అరణ్యకాండ లోని ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో వాసం ఉంటున్నారు. ఆ సమయంలో శూర్పణఖ రాముడిని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు తాను సీతకు అంకితమై ఉన్నానని, ఆమెకు తగినవాడు లక్ష్మణుడని చెప్పి, ఆమెను లక్ష్మణుడి వద్దకు పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరిస్తాడు. శూర్పణఖ తన అసలు రూపంలోకి మారి సీతను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. క్షణంలోనే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవిని కత్తితో కోసివేస్తాడు. శూర్పణఖ రక్తమోడుతూ లంకకు పారిపోతుంది.
శబరి తన భౌతిక శరీరమును విడిచి ఉత్తమలోకములు పొందిన తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! మనము ఆశ్చర్యకరమైన ఈ వనమును చూచినాము. ఏడు సముద్రములు కలిసిన ఈ తీర్థములలో స్నానము చేసాము. మన పితరులకు జలతర్పణములు విడిచాము. మనకు ఉన్న అశుభములు అన్నీ తొలగిపోయాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు పంపాసరస్సు దగ్గర ఉన్న ఋష్యమూక పర్వతమునకు పోవుదము. వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలెనని అతనితో మైత్రిచేసుకొనవలెనని నాకు చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమము సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది” అని అన్నాడురాముడు.
“అలాగే అన్నయ్యా! మనము తొందరగా ఋష్యమూక పర్వతము వద్దకు పోవుదము.” అని అన్నాడు లక్ష్మణుడు. తరువాత రామలక్ష్మణులు పంపాసరోవరతీరమునకు చేరుకున్నారు. ఆ పంపాసరోవరము చాలా మనోహరంగా ఉంది. ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి. ఆ సరోవరము పక్కనే ఉన్న మతంగ సరస్సు లో రాముడు స్నానం చేసాడు. తరువాత రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు. దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతమును చూచారు.
“లక్ష్మణా! అదే ఋష్యమూక పర్వతము దాని మీదనే ఋక్షరజస్సు అనే వానరుని కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. లక్ష్మణా! నీవు సుగ్రీవుని వద్దకు పోయి మన రాక గురించి చెప్పు. నీకు తెలుసు కదా! నేను రాజ్యమును, నా భార్య సీతను పోగొట్టుకొని అపారమైన దుఃఖములో ఉన్నాను. నీవు వెళ్లి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు” అని అన్నాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిసప్తతితమః సర్గ రామాయణంలో కీలకమైన అధ్యాయం. ఈ సర్గలో రావణుడు తన చెల్లెలు శూర్పణఖ రాముడిచేతిలో అవమానించబడిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. సీతను అపహరించడానికి రావణుడు మారీచుడి సహాయంతో పన్నాగం వేస్తాడు. మారీచుడు మాయమ్రుగం రూపంలో కనిపించి, సీతను ఆకర్షిస్తాడు. సీత అతన్ని పట్టుకోవాలని రాముడిని పంపిస్తుంది. రాముడు అతన్ని అనుసరించి అటవీ లోతుల్లోకి వెళ్ళాడు. ఇది రావణుడు సీతను అపహరించడానికి సువర్ణావకాశంగా మారుతుంది.
కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లు. నీకు దారితో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అదీ ఆ వనము మహాత్మ్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరము చేరుకుంటారు.
ఆ పంపా సరస్సు కలువలతోనూ, పద్మములతోనూ నిండుగా ఉంటుంది.. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు, ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది.
పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు
నివసించేవారు. ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు, పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరమునుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.
ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శనభాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది.
ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గానీ ఇతరులు గానీ పాడు చేయలేరు.
పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వపములో ఏమి కనిపిస్తుందో మెలుకువ రాగానే అది లభిస్తుంది.. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా, నిద్రపోతున్నపుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యమూక పర్వతముమీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వతశిఖరము మీద కు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళు తుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది.” అని పలికాడు కబంధుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుః సప్తతితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్తాడు. సీత రాముని కోసం విలపిస్తూ, రావణుని వేధింపులను తిప్పికొడుతుంది. మార్గమధ్యలో జటాయువు రావణుని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ రావణుడు అతనిని గాయపరుస్తాడు. సీత తన ఆభరణాలను కిందకు విసిరి, వాటిని వానరులు కనుగొంటారు. రాముడు, లక్ష్మణుడితో కలిసి సీతను వెతుకుతూ జటాయువును కలుస్తాడు. జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి, తన ప్రాణాలను కోల్పోతాడు.
తరువాత రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపాసరోవరము చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళు తున్నారు. వారు పంపా సరోవరము పశ్చిమదిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమము కనపడింది. వారు ఆ ఆశ్రమము దగ్గర ఉన్న శబరిని చూచారు.
రామలక్ష్మణులను చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్లను వారికి సమర్పించింది. (ఎంగిలి పళ్లను ఇచ్చింది అన్న విషయం వాల్మీకి రామాయణంలో లేదు). రాముడు శబరిని పరామర్శించాడు.
“ఓ మాతా! నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా! నీ తపస్సు సిద్ధించిందా!” అని అడిగాడు.
“రామా! ఈ రోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాకకోసరమే నేను వేచిఉన్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్ధకం అయ్యాయి. నీ దయా దృష్టి తగిలి నేను ఉత్తమ లోకములకు వెళ్లగలను. నేను సేవచేసిన మునులందరూ ఉత్తమలోకములు పొందారు. నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నీగురించి వారే నాకు చెప్పారు. “ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమమునకు రాగలడు. నీవు రామునికి అతిథి సత్కారములు చేసి తరించు.” అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసరం ఎదురు చూస్తున్నాను… రామా! నీవు ఎప్పుడు వస్తావో ఏమోఅని ఈ పంపాతీరంలో దొరికే తినే పదార్థములనుసేకరించి ఉంచాను వాటిని నీవుస్వీకరించు.” అని అన్నది శబరి.
శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శబరితో ఇలా అన్నాడు. “ఓ శబరీ! దనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతము గురించి, విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షముగా చూడాలని అనుకుంటున్నాను.” అని అన్నాడు.
అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకొని వెళ్లి ఆ వనము నంతా చూపించింది. “రామా! ఈ వనము మతం వనము అని ప్రసిద్ధిచెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేసారు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్తసముద్రములు ఇక్కడకు వచ్చాయి. ఆ సముద్రములలో వారు స్నానము చేసి ఆరవేసిన నార చీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావము చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు. ఫలములు చెడిపోవు.
రామా! నీకు ఈ వనములోని విశేషములు అన్నీ చూపించాను. ఇంక నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను.” అని పలికింది శబరి.
ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమలోకములకు వెళ్లిపోయింది. శబరి తన తపోబలము చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది.
కిష్కింధాకాండ త్రింశః సర్గః, ఈ సర్గలో హనుమంతుడు, వాలి హతమైన తరువాత, సుగ్రీవుని రాముడి వద్దకు తీసుకువస్తాడు. రాముడు సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని అప్పగించతాడు. సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధ చేరుకొని వాలి పంతుల్ని, మిత్రుల్ని సాంత్వన పరుస్తాడు. అనంతరం, సుగ్రీవుడు తన భార్య తారతోపాటు, సర్వమాన్యుల సమక్షంలో రాముడి ఆజ్ఞానుసారం రాజ్యపదవిని స్వీకరిస్తాడు. ఆ తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు రాముని సేవలో ఉంటారు. హనుమంతుడు, రాముడు సీతా మాతను రక్షించడానికి తీసుకునే చర్యలపై చర్చిస్తారు.
వర్షాకాలము గడిచి పోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మరచినాడని, తన భార్య సీతను తలచుకొని దు:ఖిస్తున్నాడు. “ఈ శరత్కాలములో పండువెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారము భార్యావియోగము అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు. రాముడు. ఒకవేళ బతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు.
మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూచాడు లక్ష్మణుడు. మరలా రాముని ఉత్తేజపరచి కార్యోన్ముఖుడిని చేయదలిచాడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఏమిటీ వెర్రి! ఈ ప్రకారము కామానికి వశుడు కావడం వలన ప్రయోజనము ఏముంది! దీని వలన మానసిక స్థైర్యము నశించడం తప్ప వేరే ఏమీ జరగదు. ఏ కార్యమూ సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి, మనసును నిర్మలం చేసుకొని, కాగల కార్యము నందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యము నైననూ సిద్ధింప చేసుకొన వచ్చును కదా! మనం ధైర్యంగా ఉంటే దైవము కూడా మనకు తోడుపడుతుంది. ముందు సుగ్రీవుడు మనకు ఎంత వరకూ సాయ పడగలడో ఆలోచించాలి.” అని లక్ష్మణుడు రామునికి కర్తవ్యమును బోధించాడు. రాముడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణా! అప్పుడప్పుడు నా మనసు అలా దైన్యము చెందుతూ ఉంటుంది. నీ మాటలతో మరలా ధైర్యము తెచ్చుకుంటూ ఉంటాను. మనము తల పెట్టిన కార్యమును నెరవేరేట్టు చూడాలి.
లక్ష్మణా! వర్షాకాలము పూర్తి అయినది. వర్షములు ఆగిపోయినవి. శరత్కాలము ప్రవేశించినది. ఆకాశము నిర్మలంగా ఉంది. రాత్రుళ్లు చంద్రుడు తన కాంతితో ఈ జగత్తును అంతా తేజోమయం చేస్తున్నాడు. నేలంతా తడి ఆరిపోయి నడవడానికి అనుకూలంగా ఉంది. రాజులు శత్రురాజుల మీద దండయాత్రలు చేయుటకు తగు సమయము ఆసన్నమయింది. కానీ సుగ్రీవుడు ఎందుకో ఇంకా నా వద్దకురాలేదు. కనీసము సీతను వెదకడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు.
నేనేమో ఇక్కడ సీతా వియోగ దుఃఖంతో అలమటిస్తుంటే, అక్కడ సుగ్రీవుడు కామభోగాలలో మునిగి తేలుతున్నాడు. అటు రాజ్యం పోగొట్టుకొని, ఇటు భార్యను పోగొట్టుకొని బాధ పడుతున్న నా మీద సుగ్రీవునికి దయ కలగడం లేదు. సుగ్రీవుడు తన పని అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు.
“ఈ రాముడు తండ్రి చేత రాజ్యము నుండి వెళ్ల గొట్టబడిన అనాధ. పైగా రావణుడు అతని భార్యను అపహరించాడు. నా శరణు వేడాడు. ప్రస్తుతము నేనే రామునికి దిక్కు” అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సుగ్రీవుడు, తన పని పూర్తి కాగానే, నాతో చేసుకొన్న ఒడంబడికను మరచి పోయినట్టున్నాడు. లక్ష్మణా! నీవు కిష్కింధకు పోయి, సుగ్రీవుని కలిసి నా మాటగా చెప్పు.
” మిత్రుని వలన తన పనిపూర్తి కాగానే, తాను మిత్రునికి ఇచ్చిన మాట మరచిన వాడు అధముడు. అది పుణ్యమైనను, పాపమైనను, మిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేవాడు ఉత్తముడు. తనకు సంబంధించిన పనులు పూర్తి అయిన తరువాత, ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరైతే సాయం చెయ్యరో అటువంటి వారి మాంసమును కుక్కలు కూడా ముట్టవు. ఇది ధర్మము.
సుగ్రీవుడు మరలా నా ధనుష్టంకారమును వినదలచు కొన్నాడో ఏమో అడిగి తెలుసుకో. ఈ సారి నేను బాణం ఎక్కుబెడితో అది సుగ్రీవుని మీదనే అవుతుంది. సుగ్రీవుడు లేకపోయినా నీ సాయంతో నేను కార్యం సాధించగలను. కానీ, సుగ్రీవుడు తన పని పూర్తి అయిన తరువాత, మనలను మరచిపోయినట్టున్నాడు. అది గుర్తు చెయ్యి. సుగ్రీవుడు మనలను వర్షాకాలము వరకూ ఆగమన్నాడు. వర్షాకాలము అయిపోయినా, సుగ్రీవుడు ఇంకా మద్యపాన మత్తులో, కామభోగములలో మునిగి తేలుతున్నాడు. ఇంకా మత్తు వదిలినట్టు లేదు. మనలను పూర్తిగా మరచినట్టున్నాడు.
లక్ష్మణా! నీవు పోయి సుగ్రీవుని కలిసి, నాకు కోపం వస్తే జరిగే పరిణామాలను అతనికి తెలియజెయ్యి.
“సుగ్రీవా! వాలి వెళ్లిన మార్గము ఇంకా మూసివేయబడ లేదు. నీ కోసం ఇంకా తెరిచి ఉంచాను. వాలి వెళ్లిన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించకు. ఓ సుగ్రీవా! నేను వాలిని ఒక్క బాణంతోనే చంపాను. కానీ మాట తప్పిన నిన్ను మాత్రం బంధు మిత్రులతో సహా చంపుతాను.
ఓ సుగ్రీవా! అశాశ్వతములైన కామసుఖములను విడిచి పెట్టి, శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించు. పూర్వము నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అంతేకాని, నా బాణములకు ఎరగా మారి, పరలోకంలో ఉన్నవాలిని కలవడానికి ప్రయత్నించకు.”
అని నా మాటగా చెప్పు. ఇంకా నీకు తోచినవి, మనకు హితము చేకూర్చే మాటలు చెప్పు. ఇంక ఆలస్యముచేయకు.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
కిష్కింధాకాండ ఏకోనత్రింశః సర్గః, ఈ సర్గలో హనుమంతుడు లంకా నుంచి తిరిగి రావడంతో రాముడు హర్షం పొందుతాడు. హనుమంతుడు సీతకు సంబంధించిన చూడు, రాక్షసుల గురించి రాముడికి వివరించతాడు. హనుమంతుడు సీతమ్మత చేతులు రాముడి పాదుకలను తీసుకొని వచ్చి, రాముడికి అందిస్తాడు. హనుమంతుడు సీతా మాత రాముడిని స్మరించి ఉంచిన అంగుళి రింగును కూడా రాముడికి చూపిస్తాడు. రాముడు సీతా మాతకు భరోసా కల్పిస్తాడు. హనుమంతుడు సీతని రక్షించడానికి తీసుకువెళ్లే విధానాలపై చర్చిస్తాడు. రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు లంకా యుద్ధానికి సన్నద్ధమవుతారు.
వర్షాకాలము పూర్తి అయింది. శరదృతువు ప్రవేశించింది. ఆకాశం నిర్మలమయింది. కాని సుగ్రీవుడు ఇంకా కామభోగములలో మునిగి తేలుతున్నాడు. అంత:పురము విడిచి రావడం లేదు. స్త్రీల సాహచర్యంలోనే గడుపుతున్నాడు. తన భార్య రుమతోనూ, తన అన్న భార్య తార సాహచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు.
(స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్, విహరన్తమహోరాత్రం అంటే తన భార్యను, తానుకోరిన తారను అహోరాత్రాలు విహరిస్తున్నాడు… అని ఉంది. అలాగే ముప్పది ఒకటవ సర్గలో కూడా ఈ క్రింది శ్లోకము ఉంది. “తారయా సహితః కామాసక్త:” అంటే తారతో కలిసి కామాసక్తుడై ఉన్నవాడు అనిఉంది. అంటే వాలి చని పోయిన తరువాత వాలి భార్య తార సుగ్రీవుని వశం అయిందని అర్ధం అవుతూ ఉంది. మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా! అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే వాలి, సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు. కానీ సుగ్రీవుడు, వాలి చనిపోయిన తరువాత, వాలి భార్య తారను అనుభవించాడు అని అర్థం చెప్పుకోవాలి.)
సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వడం లేదు. కార్యభారము అంతా మంత్రులకు అప్పచెప్పాడు. ఇంక ఎవరి వల్లా తనకు ఆపదలేదు అని నిర్భయంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు. రాముడికి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తుచేయాలని అనుకున్నాడు. సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు. ” ఓ రాజా! నీవు రాముని మూలంగా ఈ రాజ్యమును, కీర్తిని సంపాదించుకున్నావు. ఇంక నీవు, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. నీవు రాముని కార్యము నిర్వర్తించాలి.
మిత్రుల విషయంలో బాగా ప్రవర్తించే వాళ్లు కీర్తిమంతులు అవుతారు. ఒక రాజుకు తన కోశాగారము, సైన్యము, తన మిత్రులు, తన ప్రభుత్వము ఈ నాలుగు అత్యంత ముఖ్యమైనవి. అందుకని, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాట నెరవేర్చు. మిత్రునికి ఇచ్చిన మాట నెరవేర్చని వాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటాడు.
రాజా! ఏకార్యము చేసినా సకాలంలో చెయ్యకపోతే, తరువాత ఎంత గొప్పగా చేసినా దానికి ఫలితం ఉండదు. పైగా ఆ పనిచెయ్యనట్టే అవుతుంది. ఓ రాజా! రాముని కార్యం చెయ్యడంలో ఇప్పటికే కాలం మించిపోయింది. ఇప్పటికైనా రామకార్యములో నిమగ్నమవ్వు. వానలు తగ్గిపోయాయి. సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది. వానాకాలము ఆగిపోయింది, సమయం మించి పోయింది అని రామునికి తెలిసినా, నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు. రాముడు నీకు మేలు చేసాడు. తిరిగి రాముడికి మేలు చెయ్యడానికి ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తుచేసే వరకూ ఆగకు. అప్పటిదాకా ఆగితే, నీవు కావాలని ఆలస్యము చేసినట్టు అవుతుంది.
ఓ రాజా! నీకు ఏ సాయమూ చేయని వారికి కూడా నీవు సాయం చేస్తావు కదా! మరి నీకు ఇంత సాయం చేసిన రామునికి సాయం చెయ్యడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వానరులను పిలిచి వారికి సీతాన్వేషణకు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? రాముడు తన బాణములతో దేవతలను, రాక్షసులను అంతమొందించ గల సామర్ధ్యము కలవాడు. కానీ నీ సాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తావా లేదా అని వేచి ఉన్నాడు.
కాబట్టి ఓ వానర రాజా! నీకు ముందుగా ఉపకారము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయడానికి ఉద్యమించు. మేమందరమూ నీ కొరకు ఎదురుచూస్తున్నాము. నీ ఆజ్ఞ అయితే మేము భూమ్యాకాశములను గాలించి సీత జాడ తెలుసుకుంటాము. నీ అధీనములో ఒక కోటి కంటే ఎక్కువ సంఖ్యలో వానరులు ఉన్నారు. వారిని రామకార్యమునకు తగిన విధంగా నియోగించు. త్వరపడు.” అని హితబోధ చేసాడు హనుమంతుడు. తనమంత్రి అయిన హనుమంతుని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు. వెంటనే నీలుని పిలిపించాడు. సీతాన్వేషణ కొరకు వానర సేనలను అన్నిదిక్కులనుండి కిష్కింధకు రప్పించమని ఆదేశాలు ఇచ్చాడు. సమస్త వానరసేనలను తన ముందు నిలుప మని ఆదేశాలు ఇచ్చాడు. “పదిహేను దినములలో వానరులందరూ కిష్కింధ చేరు కోవాలి. ఆ గడువు మించితే మరణదండన విధించబడుతుంది.” అని వానరులను ఆదేశించాడు. హనుమంతుని, అంగదుని కొంతమంది వానర ప్రముఖులను కలిసికొనమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చిన సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లిపోయాడు.
కిష్కింధాకాండ అష్టావింశః సర్గః, ఈ సర్గలో సుగ్రీవుడు తన వానర సేనను సీతా మాత కోసం అన్వేషణ ప్రారంభించాలని ఆదేశిస్తాడు. సేనను ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అనే నాలుగు దిశల్లో పంపుతాడు. సేనకు నాయకత్వం వహించడానికి ప్రధాన వానరులను నియమిస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు దక్షిణ దిశలో అన్వేషణకు బయలుదేరుతారు. రాముడు హనుమంతుడికి తన రింగును అందించి, సీతా మాతకు చూపించమని ఆదేశిస్తాడు. ఈవిధంగా, వానర సేన సీతా మాత కోసం విస్తృతంగా అన్వేషణ మొదలుపెడుతుంది.
వర్షాకాలము మొదలయింది. ఆకాశమంతా మేఘావృతము అయింది. వేసవి కాలము అంతా ఆకాశము సూర్య కిరణముల ద్వారా నీటిని తాగి, వర్షాకాలములో ఆ జలములను మరలా భూమి మీదికి వదులుతూ ఉంది. ఆకాశమునుండి కారుతున్న వర్షపు ధారలు సీత కళ్ల నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనపడుతున్నాయి రామునికి.
మేఘాలు వర్షిస్తున్నాయి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నెమళ్లు నర్తిస్తున్నాయి. అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు, వర్షము పడగానే భూమిపైకి వచ్చి రణగొణధ్వనులు చేస్తున్నాయి. నదులన్నీ గట్లు తెంచుకొని ప్రవహిస్తూ తమ నాధుడైన సముద్రుని చేరుటకు ఉరకలు వేస్తున్నాయి. ఇవన్నీ చూచి రాముడు ఇలా అనుకుంటున్నాడు.
“అయోధ్యలో కూడా సరయూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకొని ఆషాఢ మాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు. భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టు కొని దు:ఖిస్తున్నాను.
సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో! ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్లి వెతకడం అసాధ్యం కదా! అందుకే సుగ్రీవుడు వర్షాకాలము అయిపోయిన తరువాత వస్తాడు. అప్పుడు సీతను వెదకడం సులభం అవుతుంది. సుగ్రీవుని కోసరం వేచి ఉండక తప్పదు” అని అనుకొన్నాడు రాముడు.
కిష్కింధాకాండ సప్తవింశః సర్గః, ఈ సప్తవింశ సర్గలో, వానర సైన్యాలు నాలుగు దిక్కులలో పంపబడతాయి. సుగ్రీవుడు, రాముడు ఇచ్చిన ఉంగరంతో హనుమంతుడు నాయకత్వంలో దక్షిణ దిశకు వెళ్ళే వానర సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తూ సీతమ్మకు చూపించాలని ఆదేశిస్తాడు. వానరులు దారిలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ ప్రయాణంలో, వారు సీతమ్మ జాడను కనుగొనడమే ప్రధాన లక్ష్యం. హనుమంతుడు మరియు అతని సహచరులు, సీతమ్మను రక్షించడం కోసం తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ముందుకు సాగుతారు. ఈ సర్గ సీతమ్మ గవేషణలో కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది.
రాముడు, లక్ష్మణుడు ప్రస్రవణ పర్వతము చేరుకున్నారు. ఆ పర్వతము మీద పులులు, సింహములు, మొదలగు క్రూరజంతువులు నివాసముంటున్నాయి. అవే కాకుండా ఎన్నోరకములైన వానరములు, భల్లూకములు కూడా నివాసముంటున్నాయి. అనేకములైన పొదలు, లతలు, వృక్షములతో ఆ పర్వతము శోభిల్లుతూ ఉంది.
ఆ పర్వతము మీద ఉన్న ఒక పెద్ద గుహను తమ నివాసంగా చేరుకున్నారు రామలక్ష్మణులు. “లక్ష్మణా! ఈ గుహ మనకు నివాస యోగ్యముగా ఉన్నది కదూ! వర్షాకాలము అంతా ఇక్కడే ఉందాము. ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సుఉంది. అందులో అందమైన పద్మములు వికసించి ఉన్నాయి. కొంచెం దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. అందులో మనము స్నానాదులు చేయవచ్చును. ఈ నదీ తీరంలో వందలాది పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఈ అందమైన ప్రదేశములో మనము సుఖంగా జీవించెదము. పైగా ఇక్కడి నుండి కిష్కింధా నగరము కనుచూపుమేరలోనే ఉంది. వానర రాజైన సుగ్రీవుడు తన రాజ్యమును, తన భార్యను తిరిగి పొంది, తన బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు.” అని అన్నాడు రాముడు.
కాని రాముని మనసులో తన భార్య తనకు దూరంగా ఉంది అనే బాధ మాత్రం తొలుస్తూనే ఉంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. అనుక్షణం సీసీత గుర్తుకు వస్తూనే ఉంది. రాముని బాధను చూచి లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నీవు వీరుడవు. వీరుడవైన నీవు ఇలా దు:ఖించడం తగదు. దు:ఖముతో అన్నిపనులు నాశనం అవుతాయి. నీవు భగవంతుడిని నమ్ముతావు. నీవు చేయవలసిన పనులను సక్రమంగా చేస్తావు. ఎల్లప్పుడూ ధర్మంగా ప్రవర్తిస్తావు. అలాంటి నీవు ఇలా దు:ఖపడుతూ ఉంటే, నీ భార్యను అపహరించిన దుర్మార్గుడైన రాక్షసుని ఎలా సంహరిస్తావు. కాబట్టి దు:ఖమును విడిచి పెట్టు. ధైర్యం తెచ్చుకో. అప్పుడు సరిగా ఆలోచించ గలుగుతావు. రాక్షస సంహారము చేయగలుగుతావు.
ఓ రామా! నీవు తలచుకుంటే ముల్లోకములను గడగడ లాడించగలవు. అటువంటప్పుడు ఈ రాక్షసుడు రావణుడు ఒక లెక్కా! ఈ వర్షాకాలము పోయి శరత్కాలము రాగానే వానర వీరులతో కలిసి రాక్షస సంహారము చేయగలవు. రామా! నేను నీకు నీతులు చెప్పడం లేదు. నీలో నివురు కప్పిన నిప్పులా ఉన్న పరాక్రమాన్ని ప్రజ్వరిల్ల జేస్తున్నాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు నాకు నీతులు చెప్పలేదు. ఒక మంచి మిత్రుని మాదిరి హితబోధ చేసావు. నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసావు. అన్ని అనర్ధములకు మూలమైన ఈ శోకమును తక్షణము విడిచిపెడుతున్నాను. ధైర్యము తెచ్చుకుంటున్నాను. శరత్కాలము కొరకు, సుగ్రీవుని రాక కొరకు ఎదురుచూస్తుంటాను.”అని అన్నాడు రాముడు. రాముని మాటలకు సంతోషించాడు లక్ష్మణుడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఈ నాలుగు నెలలు ఇట్టే గడిచిపోతాయి. సుగ్రీవుడు నీకు ఇచ్చిన మాట ప్రకారము సీతను వెదకడానికి వానరులను పంపుతాడు. శత్రు సంహారము జరుగుతుంది. అంత దాకా కోపమును అణిచి పెట్టి ఓపిక వహించు. ఈ నాలుగునెలలు మనము ఈ పర్వత గుహలో ఆనందంగా గడుపుదాము.” అని అన్నాడు లక్ష్మణుడు.
వాల్మీకి రామాయణం ఒక ప్రాచీన భారతీయ ఇతిహాసం, ఇందులో కిష్కింధాకాండ నాల్గవ భాగంగా ఉంది. ఈ కాండలో శ్రీరాముడు, సీతను వెతుకుతూ కిష్కింధకు చేరుకుంటాడు. అక్కడ వనవాసంలో హనుమంతుడు, సుగ్రీవుడు, మరియు వాలి వంటి వానరులను కలుస్తాడు. సుగ్రీవుడు, వాలి మధ్య శత్రుత్వాన్ని చూసిన రాముడు, సుగ్రీవుడికి సహాయం చేసి వాలి ని సంహరిస్తాడు. సుగ్రీవుడు వానర రాజుగా నియమితుడవుతాడు. హనుమంతుడు సీతను వెతికేందుకు లంకకు వెళ్ళతాడు. ఈ కథలో స్నేహం, విధేయత, ధర్మం ప్రధానమైన అంశాలు.
కిష్కింధాకాండ ఈ సర్గలో, సుగ్రీవుని రాముడు శాపం నుండి విముక్తుడిని చేస్తాడు. సుగ్రీవుడు తన సైన్యాన్ని సిద్ధం చేసి, సీతమ్మను వెతకడానికి నాలుగు దిక్కులకు పంపాలని నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు, అంగదుడు మరియు ఇతర వానరులు దక్షిణ దిశలో వెళ్లాలని సూచించబడతారు. సుగ్రీవుడు వారికి రాముడు ఇచ్చిన ఉంగరం అందజేస్తాడు, దాన్ని సీతమ్మకు చూపించి ఆమెను నమ్మించేందుకు. ఈ ప్రయాణంలో, వారు వివిధ ప్రాంతాలు మరియు అవాంతరాలు ఎదుర్కొంటారు, చివరికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవడం అనేది ఈ సర్గలో ముఖ్యాంశం.
వాలికి దహన సంస్కారములు చేసిన అనంతరము, సుగ్రీవుడు, మిగిలిన వానర ప్రముఖులు అందరూ కలిసి రాముని వద్దకు వెళ్లారు. వారందరి సమక్షములో హనుమంతుడు రామునితో ఇలాఅన్నాడు.
“ఓ ప్రభో! కాకుత్థా! నీ అనుగ్రహము వలన సుగ్రీవునికి తిరిగి రాజ్యము లభించింది. నీ అనుజ్ఞ అయితే సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించి యథావిధిగా రాజ్యాభిషిక్తుడై, కిష్కింధను పాలిస్తాడు. నీకు తగిన కానుకలు సమర్పించుకొని నిన్ను పూజించవలెనని అనుకుంటున్నాడు. కాబట్టి మా అందరి కోరిక మేరకు నీవు కిష్కింధా నగరమునకు వచ్చి మా సత్కారములను అందుకని మమ్ములను ఆనందింపజేయమని ప్రార్ధించుచున్నాము.” అని వినయంగా అన్నాడు హనుమంతుడు.
ఆ మాటలకు రాముడు ఇలా అన్నాడు. “హనుమా! నేను నా తండ్రి ఆజ్ఞమేరకు వనవాసము చేయుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు జనావాసములలోకి అడుగుపెట్టను. మీరందరూ కలిసి సుగ్రీవునికి పట్టాభిషేకము చేయండి.” అని అన్నాడు రాముడు. తరువాత సుగ్రీవునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సుగ్రీవా! వాలి కుమారుడు అంగదుని యువరాజుగా అభిషేకించు. నీ అన్నగారి కుమారుడు అంగదుడు యువరాజుగా అభిషేకించడానికి తగినవాడు. ఇప్పుడు వర్షకాలము ఆరంభమయినది. ఈ నాలుగు నెలలు సీతాన్వేషణకు తగిన సమయము కాదు. కాబట్టి ఈ నాలుగు నెలలు నీవు కిష్కింధకుపోయి రాజ్యాభిషిక్తుడవై, రాచ కార్యములు చక్కబెట్టుకో. ఈ నాలుగునెలలు నేను, లక్ష్మణుడు, ఈ పర్వతము మీద నివాసము ఉండెదము. కార్తీక మాసము రాగానే సీతను వెదకడానికీ, సీతను అపహరించిన రావణుని చంపడానికీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అదీ మన ఒప్పందము. మిత్రమా! ఇప్పుడు నీవు కిష్కింధకు వెళ్లి పట్టాభిషిక్తుడివి కా!” అని పలికాడు రాముడు.
రాముని అనుజ్ఞపొంది సుగ్రీవుడు కిష్కింధకు బయలు దేరాడు. సుగ్రీవుడు వెళుతుంటే వానరులందరూ ఆయనకు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నారు. సుగ్రీవుడు వారిని లేవదీసి ఆదరిస్తున్నాడు. వానరులందరూ సుగ్రీవుని కిష్కింధకు రాజుగా అభిషిక్తుని చేసారు. బంగారుతో చేసిన తెల్లని గొడుగును, తెల్లని జాలను సిద్ధం చేసారు. రత్నములు, మణులు, మాణిక్యాలు సుగ్రీవునికి సమర్పించారు. సుగంధ ద్రవ్యములు, తేనెను, నవధాన్యములను సిద్ధం చేసారు. తూర్పుగా ప్రవహించే నదుల నుండి, నాలుగు సముద్రముల నుండి బంగారు కలశములలో పుణ్యజలములు తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులకు దానములు చేసారు. అగ్నిని ప్రజ్వరిల్లజేసి హోమం చేసారు. వానర శ్రేష్టులు అయిన గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గన్ధమానుడు, మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా ఇతర వానర ప్రముఖులు పుణ్యజలములతో సుగ్రీవుని అభిషేకించారు. వానరులందరూ ఆనందంతో ఊగిపోయారు.
అదే సమయంలో వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా అభిషేకించారు. అంగదునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేసినందుకు సుగ్రీవుని అందరూ అభినందించారు. సుగ్రీవుని రాజుగా అభిషిక్తుడు కావడానికి, అంగదుడు యువరాజుగా అభిషిక్తుడు కావడానికి కారణమైన రామలక్ష్మణులను అందరూ వేనోళ్ల స్తుతించారు. సుగ్రీవుడు కిష్కింధా రాజ్యమును, తన భార్య రుమను మరలాపొంది ఇంద్రుని వలె రాజ్యపాలన సాగించాడు.
కిష్కింధాకాండ పంచవింశః సర్గంలో, వాలి మరణానంతరం సుగ్రీవుడు రాముడి సూచనలతో కిష్కింధ రాజ్యాన్ని శ్రేష్ఠంగా పాలిస్తాడు. వానరులు సంతోషంగా ఉంటారు, కానీ రాముడు సీత కోసం విచారంలో ఉంటాడు. హనుమాన్, లక్ష్మణుడు రాముని ధైర్యం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. రాముడు సుగ్రీవుని దగ్గరికి వెళ్లి, సీత కోసం వెతకడం ప్రారంభించమని గుర్తు చేస్తాడు. సుగ్రీవుడు తన శక్తివంతమైన వానర సైన్యాన్ని సమీకరించి, వివిధ దిశల్లో పంపి, సీతను కనుగొనడానికి తన వ్రతాన్ని ప్రారంభిస్తాడు. వానర సైన్యం సీతకు సంబంధించిన సమాచారం కోసం అన్ని ప్రదేశాలను శోధించడం మొదలుపెడుతుంది.
తరువాత రాముడు సుగ్రీవుని, తారను, అంగదుని ఓదారుస్తూ ఇలా అన్నాడు. “మీరు ఈ ప్రకారంగా ఒకరికి మించి ఒకరు శోకంతో రోదిస్తుంటే, ఏమీ ప్రయోజనము లేదు. జరుగ వలసిన కార్యము గురించి ఆలోచించండి. మీరు ఈవిధంగా శోకిస్తుంటే మరణించిన వాలి ఆత్మకు శాంతి కలుగదు. లోకాచారము ప్రకారము వాలికి జరుగ వలసిన అంత్య క్రియల గురించి ఆలోచించండి.
ముల్లోకములు కాలమునను సరించి నడుస్తున్నాయి. మానవులు చేసే కర్మలకు అన్నింటికీ కాలమే మూలము. కాలము ననుసరించి అందరూ కాలధర్మము చెందవలసిన వారే. కాకపోతే కొంచెం అటు ఇటు అంతే. సమస్త భూతములను కర్మచేయమని ప్రేరేపించునది కాలమే కదా! అంతే కానీ, ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. అలా చేయడానికి సమర్థులు కూడా కారు. జనన మరణాలను నిర్ణయించేది కాలమే కానీ వేరు కాదు. ముల్లోకములు ఆ కాలమునకు లోబడి ప్రవర్తించవలసినదే!
ఆ కాలము కూడా తన ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించ జాలదు. దానికీ ఒక నియమము ఉంది. కాలాన్ని మార్చడానికి ఎవరి తరమూ కాదు. ఏ వస్తువూ కాల స్వభావమును దాటలేదు. అంతే కాదు. కాలము ఎవరి పక్షమూ వహించదు. కాలమునకు పక్షపాతము లేదు. కాలమును ఎవరూ వశము చేసుకోలేరు. ఎవరూ జయించలేరు.
శత్రువులు కానీ, జ్ఞాతులు కానీ, ఏ కులము కానీ, ఏ జాతీ కానీ, కాలానుగుణంగా ప్రవర్తించవలసిన వారే కానీ ఎవరూ కాలమును వశపరచుకోలేరు. కాబట్టి తెలివి కలవారు, కాలము యొక్క స్వభావమును పరిశీలించి, తెలుసుకొని, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. వానర రాజు అయిన వాలి ఈ దేహమును విడిచి తన స్వస్వరూపమును పొందాడు. వాలి అశాశ్వతమైన ఈ దేహమును అంటిపెట్టుకొని ఉండక, శాశ్వతమైన స్వర్గలోకమునకు వెళ్లాడు. అందుకని, మీరు వాలి కోసరం శోకించడం మాని, కాలోచితముగా జరగవలసిన కార్యముల గురించి ఆలోచించండి.” అని రాముడు కాల స్వభావమును తెలిపి, జరుగ వలసిన కార్యములను జరిపించమని సుగ్రీవునికి చెప్పాడు.
రాముని మాటలు విన్న లక్ష్మణుడు, సుగ్రీవుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. “ఓ సుగ్రీవా! రాముడు చెప్పిన మాటలు వింటివి కదా! వెంటనే వాలికి జరుగ వలసిన ప్రేతకార్యములు, దహన సంస్కారములు గూర్చి ఆలోచించు. వాలి దహన సంస్కారమునకు కావలసిన ఎండి పోయిన కాష్ఠములు (కట్టెలు) చందనపు కర్రలు తెప్పించు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోతున్న అంగదుని ఓదార్చు. కిష్కింధకు ఇంక నీవే దిక్కు. పుష్పమాలలు, సుగంధ ద్రవ్యములు, వస్త్రములు, నెయ్యి, ఇతరములు తెప్పించు. వాలిని ఊరేగింపుగా తీసుకొనిపోవుటకు ఒక పల్లకినీ సిద్ధం చేయండి. దానిని మోయుటకు తగిన బలిష్ఠులైన వాహకులను ఏర్పాటు చేయండి. ఈ కార్యములు అన్నీ వేగంగా జరగాలి. ఈ సమయంలో ఆలస్యము పనికిరాదు.” అని లక్ష్మణుడు సుగ్రీవునితో చెప్పి, రాముని పక్కన వచ్చి నిలబడ్డాడు.
తారుడు పల్లకినీ దానిని మోయడానికి బలిష్ఠులైన వానరులను సిద్ధం చేసాడు. ఆ పల్లకిలో వాలిని కూర్చోపెట్టడానికి తగిన ఆసనము ఏర్పాటు చేసారు. పల్లకి రాగానే రాముడు లక్ష్మణునితో “ప్రేత కార్యము ప్రారంభించండి” అని ఆదేశించాడు. సుగ్రీవుడు మొదలగు వానరులు వాలిని మంచి వస్త్రములతోనూ, పూలమాలలతోనూ అలంకరించారు. వాలిని పట్టుకొని తీసుకొనివెళ్లి ఆ పల్లకిలో కూర్చోపెట్టారు.
సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు: “ఇప్పుడు మనము అన్నగారైన వాలికి ప్రేతకార్యము నిర్వర్తించాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయండి. కొంత మంది వానరులు పల్లకి ముందు నడుస్తూ రత్నములను వెదజల్లండి. భూలోకములో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండునో అట్టి ఐశ్వర్యములతో వాలికి అంతిమ సత్కారములు చేయండి” అని ఆజ్ఞాపించాడు.
సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వాలికి అంతిమ సంస్కారాలు జరిగాయి. తారుడుమొదలగు వానరులు తండ్రిని కోల్పోయిన అంగదుని పట్టుకొని విలపిస్తూ పల్లకీ వెంట వెళ్లారు. వాలి భార్యలందరూ భర్తను గురించి ఆయన గుణగుణములను తలచుకుంటూ పల్లకీవెంట నడిచారు. వానరులు నదీ తీరంలో, జనావాసాలకు దూరంగా, సమతల ప్రదేశంలో, ఒక ఇసుక దిబ్బ మీద చితిని ఏర్పాటు చేసారు.
(ఇక్కడ ఒక విషయం గమనించండి. దహన సంస్కారాలు జనావాసాలకు దూరంగా జరగాలి అని రామాయణ కాలం నుండి, వానరులలో కూడా ఉన్న ఆచారము. గ్రామీణప్రాంతాలలో కొంత వరకూ ఈ ఆచారము అమలులో ఉంది. కాని నాగరికులు నగరాల్లో, ఆనియమాలను పూర్తిగా గాలికి వదిలారు. నగరంలో శ్మశానాలన్నీ నగర నడిబొడ్డులోనే ఉన్నాయి. (హైదరాబాద్ లో అంబర్ పేట, పంజగుట్ట, బన్సీలాల్ పేట మొదలగునవి) శ్మశానాల చుట్టు అపార్టుమెంటులు, ఇండ్లు వెలిసాయి. కాలుష్యం ప్రబలి పోయింది. రోగాలు పెరిగాయి. మరణాలూ పెరిగాయి. శ్మశానాలకు గిరాకీ పెరిగింది. ఇదీ నేటి సంస్కృ్కతి.)
తరువాత వానర ప్రముఖులు పల్లకీనుండి వాలి మృతదేహమును కిందికి దించారు. తార తన భర్త మృతదేహమును ఒడిలో పెట్టుకొని విలపించింది.
“నాధా! నీవు మరణనించిననూ నీముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు. చూడండి. నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందరినీ అనాధలుగా మార్చాడు. నాధా! చూడండి. నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడకు వచ్చారు. నీ మంత్రులు అందరూ నీచుట్టునిలబడి శోకించుచున్నారు. వారితో మాట్లాడు.” అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తార. పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకొని వెళ్లారు.
తరువాత అంగదుడు, సుగ్రీవుడు వాలి శరీరమును చితి మీద ఉంచారు. అంగదుడు తన తండ్రి వాలి చితికి శాస్త్రోక్తముగా నిప్పు అంటించాడు. తండ్రి చితి చుట్టు అప్రదక్షిణముగా తిరిగాడు. తరువాత అందరూ జలతరణములు విడవడానికి నదీ తీరానికి వెళ్లారు.
అంగదుడు, సుగ్రీవుడు మొదలగు వానరులు వాలికి జలతరణములు విడిచారు. అంతిమ సంస్కారములు పూర్తి అయిన తరువాత సుగ్రీవుడు అంగదుని ముందుంచుకొని, రాముని వద్దకు వెళ్లాడు.