BhaktiVed
Krishna

Shri Krishnashtottara Shatanamastotram

Stotram

This text is still being proofread.

శ్రీకృష్ణః కమలానాథో, వాసుదేవస్సనాతనః,

వసుదేవాత్మజః పుణ్యో, లీలామానుషవిగ్రహః.

శ్రీవత్సకౌస్తుభధరో, యశోదావత్సలో హరిః,

చతుర్భుజాత్తచక్రాసి, గదాశంఖాద్యుదాయుధః.

దేవకీనందన శ్రీశో, నందగోపప్రియాత్మజః,

యమునావేగ సంహారీ, బలభద్ర ప్రియానుజః.

పూతనాజీవితహర, శ్శకటాసురభంజనః,

నందవ్రజజనానందీ సచ్చిదానంద విగ్రహః.

నవనీత విలిప్తాంగో నవనీతనటో నఘః,

నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః.

షోడశస్ర్తీ సహస్రేశః త్రిభంగీమధురాకృతిః,

శుకవాగమృతాబ్దేందుః గోవిందో యోగినాం పతిః.

వత్సవాటచరో నంతో, ధేనుకాసురభంజనః,

తృణీకృతతృణావర్తో, యమళార్జునభంజనః.

ఉత్తాలతాలభేత్తా చ, తమాల శ్యామలాకృతిః,

గోపగోపీశ్వరో యోగీ, కోటిసూర్యసమప్రభః.

ఇళాపతిః పరంజ్యోతిః, యాదవేంద్రో యదూద్వహః,

వనమాలీ పీతవాసాః, పారిజాతాపహారకః.

గోవర్ధనాచలోద్ధర్తా, గోపాలస్సర్వపాలకః,

అజో నిరంజనః కామజనకః కంజలోచనః.

మధుహా మధురానాథ్, ద్వారకానాయకో బలీ,

బృందావనాంత సంచారీ, తులసీ దామభూషణః.

శ్యమంతకమణేర్హర్తా, నరనారాయణాత్మకః,

కుబ్జా కృష్ణాంబరధరో, మాయీ పరమపూరుషః.

ముష్టికాసుర చాణూర, మల్లయుద్ధ విశారదః,

సంసారవైరీ కంసారి, మురారిర్నరకాంతకః.

అనాదిబ్రహ్మచారీ చ, కృష్ణావ్యసనకర్శకః,

శిశుపాల శిరశ్చేత్తా, దుర్యోధన కులాంతకః.

విదురాక్రూర వరదో, విశ్వరూప ప్రదర్శకః,

సత్యవాక్సత్యసంకల్పః, సత్యభామారతో జయీ.

సుభద్రాపూర్వజో విష్ణుః భీష్మముక్తి ప్రదాయకః.

జగద్గురు ర్జగన్నాథో, వేణునాద విశారదః.

వృషభాసుర విధ్వంసీ, బాణాసురకరాంతకః,

యుధిష్టిరప్రతిష్ఠాతా, బర్హిబర్హావతంసకః.

పార్థసారథిరవ్యక్తో, గీతామృతమహోదధిః,

కాళీయఫణి మాణిక్య, రంజిత శ్రీపదాంబుజః.

దామోదరో యజ్ఞభోక్తా, దానవేంద్రవినాశకః,

నారాయణః పరం బ్రహ్మ, పన్నగాశనవాహనః.

జలక్రీడాసమాసక్త, గోపీవస్త్రాపహారకః,

పుణ్యశ్లోకస్తీర్థపాదో, వేదవేద్యో దయానిధిః.

సర్వతీర్థాత్మకస్సర్వగ్రహరూపీ పరాత్పరః,

ఏవం శ్రీకృష్ణదేవస్య, నామ్నామష్టోత్తరం శతమ్.

కృష్ణనామామృతం నామ, పరమానందదాయకమ్,

అత్యుపద్రవదోషఘ్నం, పరమాయుష్యవర్ధనమ్.

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Krishna Ashtottara Shatanama Stotram Telugu

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

ఇతి శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్.

మరిన్ని అష్టోత్తరములు:

Also read