BhaktiVed
అమ్మవారు

శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

స్తోత్రం
లిపి
ఫాంట్ సైజు

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

అగస్త్య ఉవాచ |

వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతినామభిః |

లలితాపరమేశాన్యా దేహి కర్ణరసాయనమ్ ||

హయగ్రీవ ఉవాచ |

సింహాసనేశీ లలితా మహారాజ్ఞీ పరాంకుశా |

చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ ||

సుందరీ చక్రనాథా చ సామ్రాజీ చక్రిణీ తథా |

చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ ||

కామరాజప్రియా కామకోటికా చక్రవర్తినీ |

మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా ||

కులనాథాఽఽమ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ |

శృంగారనాయికా చేతి పంచవింశతినామభిః ||

స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీమ్ |

తే ప్రాప్నువంతి సౌభాగ్యమష్టౌసిద్ధీర్మహద్యశః ||

కామేశ్వరోత్సంగసదానివాసి కాలాత్మికే దేవి కృతానుకంపే

కల్పావసానోస్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమస్తే ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే అష్టాదశోఽధ్యాయే శ్రీలలితా పంచవింశతినామ స్తోత్రమ్ |

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Lalitha Panchavimsati Nama Sthotram In Telugu

శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

ఈ స్తోత్రం అన్నిటా విజయమును కలిగిస్తుంది. అందుచే దీనిని సమర విజయ ప్రద స్తోత్రం అని కూడా అంటారు.

మరిన్ని స్తోత్రములు:

ఇవి కూడా చదవండి