Sri Shiva Panchakshari Stotram In Telugu – శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Panchakshara Stotram Lyrics

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్

శ్రీ మచ్ఛంకరాచార్య విరచితమ్

ఓంనాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమశ్శివాయ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మ కారాయ నమశ్శివాయ॥

శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ।
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శి కారాయ నమశ్శివాయ॥

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చిత శేఖరాయ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వ కారాయ నమశ్శివాయ॥

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ।
సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై య కారాయ నమశ్శివాయ॥

పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ చ్ఛివసన్నిధౌ।
శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
శివపంచాక్షరీ స్తోత్రం సంపూర్ణమ్.

మరిన్ని స్తోత్రములు

Leave a Comment