BhaktiVed
Ram

Shri Anuraghavendra Stotram

Stotram

This text is still being proofread.

శ్రీరాఘవేంద్ర గురుపుంగవ రోగభంగభంగీ

కృతాఖలపిశాచసుయక్షరక్షః |

మాంక్షీణ పాపమనిశం గురుకర్మణా హంవాచా

హృదాశరణమేమి శరణ్యపాల ||

వ్యాఖ్యాదీపం వినా యస్య మాధ్వేస్థాన చతుష్టయే |

ప్రకాశం లభతే కోఽద్య రాఘవేంద్రం తమాశ్రయే ||

యద్య్రం ధేరన ఘైవాచః ప్రాచామువచయం గతాః |

ధీరం శ్రీరాఘవేంద్రార్యదేశికం తముపాస్మహే ||

ఎవని గొప్పగ్రంథముల చేత ప్రాచీనుల వాక్కులు అభివృద్ధి చెందినవో, అట్టి ధీరు డైన శ్రీరాఘవేంద్ర దేశికుని

ఉపాసించెదను.

శ్రీరాఘవేంద్రగురుపాదజలం కషాయం

మాత్రోత్తమాం గురుశిరోగతమృత్తికాం చ |

సేవేసదా సకల రోగనివృత్తి హేతుం

సంప్రాప్య సద్గుణనిధిం గురురాఘవేంద్రమ్ ||

రాఘవేంద్రో దయాలుశ్చ రాఘవేంద్రం తమాశ్రయే

రక్షితో రాఘవేంద్రేణ రాఘవేంద్రాయ తే నమః |

రాఘవేంద్రాద్గురుర్నాస్తి రాఘవేంద్రస్య సేవకః

రాఘవేంద్రే రమేఽభీక్ష్ణంరాఘవేంద్రోద్ధర ప్రభో ||

క్వభ్రాతశ్చలితోఽసి వైద్యకగృహం కిం తత్ర శాంత్యై నా ఋజంకింతే

నాస్తి సఖే గృహే గురువరః సర్వం గదం హంతి యః |

వాత శ్చేన్నమనాదితో గురుభరోః పిత్తం చ పాదోదకాళ్

శ్లేష్మాణంవినిహంతిహంత గురురాట్ మృత్స్నాదనా ద్భక్తితః ||

శ్రీలక్ష్మీవరవక్షసం సుజనసంర త్ నిబద్ధాదరం

శ్రీలప్రేష్ఠవియన్నృపాల తనయావ క్రాంబుజాతారుణం |

“యోషాలోకన మోహితద్విజవరామఘ్నం కటాక్షమద్భుతో

భూపారత్నముపాస్మహే విధిముఖాదిత్యార్చితాఘ్యం ||

సన్ని దాంచిలిలో చనోవ్యనిరతం జాగర్తి లోకావనే

యోషాధిస్థి.త హృత్తిటోకియఓ ర్ముక్యమా సేవితః |

శ్యామోఽపి స్వగుణోత్కకై ఉతపయోవార్థ్యు -్భ మాధవో

దేవో భావుక మాతినోతు సతతం శ్రీ రంగనాథో హరిః ||

స్మేరాననం నవఘనాఘననీలభాసం

శ్రీ జానకీ కనక పీఠవ రే నిషణ్ణం |

బింబాధరద్యుతిసుర క్తతనం స్వనాథం

సంప్రేక్ష్య మందహసితాంకగతా సదావ్యాత్ ||

అంధో యత్ కరుణాలవేన మఘవా మూకోఽపి భోగీశితా

నంధ్యాయత్ పదకంజతోయసుకృతేనాప్నోతి పుత్రాన్ సతః |

యం సం సేవ్యాపుమర్థసార్థ మధునాప్యవింద తే సజ్జనః

సోఽయం మంత్రగృహాలయో గురువరః స్తాదిష్టసిధ్ధమమ ||

యో దానే ప్రతిమో జనాః ముదితాః యం ప్రాప్య – యే నార్డితం

‘దత్తం భూసురసద్గణాయ సతతం యస్మై హరీరోచ తే. |

యస్మాద్భిభ్యతి దుర్మతిర్నరహరిర్యస్య ప్రియం సర్వదా

యస్మిన్ భ క్తి యుతో జనః సుఖయుతః సశ్రీగుతో మామవ ||

శ్రీ ప్రహ్లాదః సుబాలో నరవరమృగ రాట్ పాదకంజాలిలీలః

బాహ్లికో యాదవేశ ప్రభుపదనలినద్వంద్వ సేవా దురంధరః |

వ్యాసార్యో మేదినింద్రోమితమతి సమయాంభోధిజైవాతృ కోయం

సశ్రీమద్రాఘవేంద్రోఽవతు సుపరిమళాచార్యకర్మందివర్యః ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రంగురించి తెలుసుకుందాం…

Sri Anu Raghavendra Sthotram In Telugu

గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘవేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా పనము గావించెను.

శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రం

1

నానారోగములను నివారించు విధానము కలవాడు, యక్షరాక్షసాది గ్రహముల నన్నింటిని భంగ మొనరించినవాడు, వాక్కు చేత మమ్ములను పాపరహితులుగ నొనరించిన వాడు, శరణన్న వారిని పరిపాలించువాడు అగు శ్రీరాఘవేంద్ర గురు పుంగవుని నాహృదయపూర్వకముగ నాశ్రయించుచున్నాను.

2

ఎవని వ్యాఖ్యాన మనుప్రకాశ దీపము లేనిచో నాల్గు మధ్వస్థానము లందెవరు వికాసమును (ప్రకాశమును) పొంద గలరు? ఆరాఘవేంద్రుని నేనాశ్రయిం చెదను.

3

4

ఎవని పాదోదకమును కషాయముగ (మందుగ), ఏ గురు దేవుని శిరముపై నున్న బృందావన మృత్తికను (మట్టిని) మాత్రగ స్వీకరించినచో నిత్యము రోగము లన్నియు తొలగి పోవునో, ఆసద్గుణనిధి యగు గురురాఘవేంద్రుని చేరి
సేవించెదను.

5

శ్రీరాఘవేంద్రుడు దయాస్వభావము కలవాడు. నేను శ్రీరాఘవేంద్రు నాశ్రయించెదను. శ్రీరాఘవేంద్రుడు నన్ను రక్షించెను. శ్రీరాఘవేంద్రునకు నమస్కారము. శ్రీరాఘవేంద్రుని కన్న వేరొక గురువు లేడు. నేను శ్రీరాఘవేంద్రుని సేవకుడను. శ్రీరాఘవేంద్రుని యందే నేను రమించెదను. శ్రీరాఘవేంద్రుడు నన్ను రక్షించును. (ఈ శ్లోకములో సంస్కృతములో గల ఏడు విభక్తులను పొందుపరచిరి. 1. రాఘవేంద్రః 2. రాఘవేంద్రం లి. రాఘవేం ద్రేణ 4. రాఘవేంద్రాయ 5. రాఘవేంద్రాత్, 6. రాఘవేంద్రస్య 7. రాఘ వేందౌ.

6

సోదరా ! నివెక్కడకు పోవుచుంటివి? వైద్యుని గృహమునకు, అక్కడ ఏమికలదు? నాకు రోగము కలదు, అక్కడ రోగనివారణమునకు ఔషధములు కలవు? ఓయీ ! సఖుడా ! నాగృహములో రోగముల నన్నింటిని నివారింపగల గురువు కలడు. వాయురోగ మున్నచో నమస్కారమొన రింపుము. పిత్త మున్నచో పాదోదకమును సేవింపుము. శ్లేష్మ మున్నచో భక్తి తో బృందావన మృత్తికను స్వీకరింపుము.

7

శ్రీలక్ష్మీనాథుని వక్షము నందు ధరించినవాడు, మంచి వారిని రక్షించుటలో ఆదరము కలవాడు, సంపన్నులు, శ్రేష్ఠులు రాజకుమారులు మొదలగువారి ముఖములచే అరుణవర్ణ ములుగ ప్రకాశించు పాదములు కలవాడు, స్త్రీలను జూచి మోహము పొందిన ద్విజుని పాపమును నశింపజేసి ఉద్ధరించినవాడు, కట పర్వత (మంత్రాలయ) ప్రదేశమునకు ఆభూషణ మైనరత్నము వంటివాడు, బ్రహ్మాదు లైన దేవతల యొక్క విందములను అర్చించువాడు నగు శ్రీ గురు దేవుని సేవించెదను.

8

నిద్రాముద్రిత నేత్రములు (యోగనిద్రలో నున్నను) కలవాడైనను లోకరక్షణమునందు జాగరూకుడై యుండు వాడును, శ్రీమహాలక్ష్మీ విరాజిల్లుహృదయము కలవాడై నను ము క్తిని కాంక్షీంచు యతీశ్వరులచే సేవింపబడువాడును, నల్లని రూపము కలవాడై నను తనదివ్యగుణాతిశయముల చే సముద్రమును జయించినవాడును, దేవాది దేవుడును నైన మాధవుడు రంగనాథుడు శ్రీహరి మాకుయెల్లప్పుడుశుభములను కలుగ జేయుగాక !

9

మందహాసవదనము గలవాడును, నూతనమైన దట్టమైన మేఘముయొక్క నల్లని కాంతివంటి కాంతి గలవాడును, బంగారు పీఠమునందు ఆసీనుడై యున్నవాడును, బింబాధరము యొక్క కాంతిచే మిగుల యెజ్జగా చేయబడిన శరీరము గలవాడును, తనకు నాథుడును నగు శ్రీరాముని చూచుచు మందహాసము కలదియు అంకపీఠముపై గూర్చున్నదియు నగు ఆజానక దేవి ఎల్లప్పుడు రక్షించుగాక!

10

ఏ గురుదేవుని కరుణా లేశము చేత గ్రుడ్డివాడు గూడ (నూరు నేత్రములుగల) ఇంద్రుడగునో, మూగ వాడు శేషుని వలె వక్త యగునో, ఎవనిపాదోదకము స్వీకరించినచో గొడ్రా లైనను సుపుత్రవతి యగునో ఏగురు దేవుని సేవించినచో చతుర్విధ పురుషార్థములు లభించునో, మంత్రాలయ గృహాలయములో నున్నఆగుకు దేవులు నాకు ఇష్టసిద్ధులను ప్రసాదించు గాక !

11

ఏ గురువు దానమునం దసమానుడో, ఎవనిని పొంది జనులు సంతుష్టి నొందెదరో, ఎవరు భూసురులకు యిష్ట ద్రవ్యముల నిచ్చెనో, ఎవనికై శ్రీమహావిష్ణువు ఇష్టుడగునో, ఎవనివలన దుర్మతులు భయపడెదరో, శ్రీనృసింహస్వామి ఎవనికి ప్రియుడో, జనులు నిత్యము ఎవనియందు భక్తికల్గి యుందురో ఆగురు దేవుడు మమ్ములను రక్షించుగాక !

12

మరిన్ని స్తోత్రములు:

Also read