మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రము గురించి తెలుసుకుందాం…
Sri Lalitha Sthava Raja Sthotram In Telugu
శ్రీ లలితా స్తవ రాజ స్తోత్రం (విశ్వరూప స్తోత్రం)
|| శ్లో ||
జయదేవి ! జగన్మాతః జయదేవి పరాత్పరే
జయకల్యాణ నిలయే జయకామకళాత్మికే
జయకామేశవామాక్షి జయకామాక్షి సుందరి
జయాఖిల సురారాధ్యే జయకామేశి కామదే
జయబ్రహ్మమయే దేవి బ్రహ్మానందరసాత్మికే
జయనారాయణి, పరే నందితాశేషవిష్టపే
జయశ్రీకంఠదయితే జయశ్రీలలితాంబికే
జయశ్రీ విజయే, దేవి విజయశ్రీ సమృద్ధిదే
జాతస్య జాయమానస్యచేష్టాపూర్తస్య హేతవే
నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యైపరాత్పరే
కల ముహూర్తకాష్ఠాం హ, ర్మాసర్తు, శరదాత్మనే
నమస్సహస్రశీర్షాయై, సమస్రముఖలోచనే
అణోరణుతరే, దేవి మహతోపి మహీయసి
పరాత్పరతరే, మాతః తేజస్త్వం తేజసామపి
అతలంతు భవేత్పాదౌ వితలంజానునీతవ
రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్
హృదయంతు భువర్లోకః స్వస్తే ముఖ ముదాహృతం
దృశశ్చంద్రార్కదహనాః దిశస్తే బాహవోంబికే
మరుతస్తే తనూచ్ఛ్వాసాః వాచస్తే శ్రుతయో ఖిలాః
క్రీడాతే లోకరచనా, సఖాతే చిన్మయశ్శివః
ఆహారస్తే సదానందో వాసస్తే హృదయం సతాం
దృశ్యాదృశ్య స్వరూపాణి, రూపాణి భువనానితే
శిరోరుహానభస్తేతు తారకాః కుసుమానితే
ధర్మాద్యా బాహవస్తేస్యు, రధర్మాద్యాయుధానితే
యమాశ్చ నియమాశ్చైవ, కరపాదరుహాస్తథా
స్తనౌ స్వాహా స్వథాకారౌ, లోకోజ్జీవనకార
ప్రాణాయామస్తు తే నాసా, రసనాతే సరస్వతీ
ప్రత్యాహారస్త్వింద్రియాణి, ధ్యానం తేదీస్తు సత్తమా
మనస్తే ధారణాశక్తిః హృదయంతే సమాధికా
మహీరుహాస్తేింగరుహాః ప్రభాతం వసనం తవ
భూతం భవ్యం భవిష్యంచ నిత్యంచ తవవిగ్రహం
యజ్ఞరూపా జగద్ధాత్రీ, విశ్వగ్రూపాచపావనీ
ఆధారం త్వాం ప్రపశ్యంతి న సమ్యక్ నిఖిలాః ప్రజాః
హృదయాస్థాపిలోకానాం అదృశ్యామోహనాత్మికా
నామరూపవిభాగం చ యాకరోతి స్వలీలయా
తాన్యథిష్టాయ తిష్ఠంతి తేష్వసక్తా చ కామదా
నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యే నమోనమః
యాదేవీ పరమాశక్తిః పరబ్రహ్మాభిథాయినీ
బ్రహ్మానందాభిథానాయై తస్యైదేవ్యై నమోనమః
యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందు మారుతాః
పృథివ్యాదీని భూతాని తస్యైదేవ్యై నమోనమః
యయా ధృతాతుధరణీ యయాకాశా ద్యమేయయా
యస్యాముదేతి సవితా తస్యైదేవ్యై నమోనమః
యదంతరస్థం త్రిదివం యదాధారో ంతరిక్షకః
యన్మయశ్ఛాఖిలోలోకస్తస్యైదేవ్యై నమోనమః
యత్రోదేతి జగత్కృత్స్నం యత్రతిష్ఠతి నిర్భరం
యంత్రాంతమేతి కాలేతు తస్యైదేవ్యై నమోనమః ||
నమో నమస్తే రజసే, భవాయై నమో నమస్సాత్విక సంస్థితాయై
నమో నమస్తే తమసే హరాయై, నమో నమో నిర్గుణతశ్శివాయై ||
నమో నమస్తే జగదేకమాత్రే నమోనమస్తే జగదేకపిత్రే
నమో నమస్తేఖిఖిలతంత్రరూపే, నమోనమస్తే ఖిలయజ్ఞరూపే||
నమో నమోలోక గురుప్రధానే, నమో నమస్తే ఖిల వాగ్విభూత్యై
నమోస్తు లక్ష్య్మై జగదేక తుప్ల్యై, నమో నమశ్శాంభవి సర్వశక్యై ॥
అనాదిమధ్యాంత మపాంచ భౌతికం హ్యవాఙ్మనోగమ్య మతర్క్యవైభవం
అరూప మద్వంద్వమదృష్టి గోచరం, ప్రభావమగ్ర్యం కధమంబవర్ణ్యతే||
ప్రసీద విశ్వేశ్వరి, విశ్వవందితే, ప్రసీద విశ్వేశ్వరి వేదరూపిణి
ప్రసీద మాయామయి మంత్రవిగ్రహే ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి॥
ఇతిస్తుత్వా మహాదేవీం దేవాస్సర్వే సవాసవాః
భూయో భూయో సమస్కృత్యశరణం జగ్మురంజసా ||
మరిన్ని స్తోత్రములు: