మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రము గురించి తెలుసుకుందాం…
Sri Lalitha Panchavimsati Nama Sthotram In Telugu
శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం
వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః
లలితా పరమేశాన్యా దేహి కర్ణరసాయనం ||
సింహాసనేశీ లలితా మహారాజ్ఞి వారంకుశా
చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ
సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రినీ తధా
చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ
కామరాజ ప్రియా కామకోటికా చక్రవర్తినీ
మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా
కులనాథా22 మ్నాయనాధా సర్వామ్నాయనివాసినీ
శృంగారనాయికా చేతి పంచవింశతి నామభిః||
స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం
తేప్రాప్నువంతి సౌభాగ్యం అష్టసిద్దీర్మహద్యశః॥
కామేశ్వరోత్సంగసదానివాసి కాలాత్మికే దేవి కృతానుకంపే
కల్పావసానోస్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమస్తే ॥
ఈ స్తోత్రం అన్నిటా విజయమును కలిగిస్తుంది. అందుచే దీనిని సమర విజయ ప్రద స్తోత్రం అని కూడా అంటారు.
మరిన్ని స్తోత్రములు: