మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రం గురించి తెలుసుకుందాం…
Sri Anu Raghavendra Sthotram In Telugu
గోలోకవాసి, శ్రీహరి పార్ష దుడు నైనశ్రిశంఖుకర్ణుడు బ్రహ్మదేవు నా దేశానుసారముగ యీ యవనిపై బ్రహ్మదేవు శ్రీ ప్రహ్లాదునిగ, శ్రీ విభీషణునిగ, శ్రీ బాహ్లికునిగా, శ్రీ వ్యాస నాయతీర్థునిగ, శ్రీ రాఘ వేంద్ర తీర్థునిగా యుగయుగములంద వత పంచి శ్రీ హరిశక్తిని, భక్తిని ప్రచారమొనరించి ధర్మసంస్థా పనము గావించెను.
శ్రీ అనురాఘవేంద్ర స్తోత్రం
శ్రీరాఘ వేంద్ర గురుపుంగవ రోగభంగభంగీ
కృతాఖలపిశాచసుయక్షరక్షః |
మాంక్షీణ పాపమనిశం గురుకర్మణా హంవాచా
హృదాశరణమేమి శరణ్యపాల ||
1
నానారోగములను నివారించు విధానము కలవాడు, యక్షరాక్షసాది గ్రహముల నన్నింటిని భంగ మొనరించినవాడు, వాక్కు చేత మమ్ములను పాపరహితులుగ నొనరించిన వాడు, శరణన్న వారిని పరిపాలించువాడు అగు శ్రీరాఘవేంద్ర గురు పుంగవుని నాహృదయపూర్వకముగ నాశ్రయించుచున్నాను.
వ్యాబ్యాదీపం వినాయస్య మాధ్వేస్థాన చతుష్టయే |
ప్రకాశం లభ తే కొద్య రాఘవేంద్రం తమాశ్రయే ||
2
ఎవని వ్యాఖ్యాన మనుప్రకాశ దీపము లేనిచో నాల్గు మధ్వస్థానము లందెవరు వికాసమును (ప్రకాశమును) పొంద గలరు? ఆరాఘ వేంద్రుని నేనాశ్రయిం చెదను.
యద్య్రం ధేరన ఘైవాచః ప్రాచామువచయం గతాః |
ధీర శ్రీరాఘ వేంద్రార్య దై శికంతముపాస్మహే ||
3
ఎవని గొప్పగ్రంథముల చేత ప్రాచీనుల వాక్కులు అభివృద్ధి చెందినవో, అట్టి ధీరు డైన శ్రీరాఘవేంద్ర దేశికుని
ఉపాసించెదను.
శ్రీరాఘ వేంద్రగురుపాదజలం కషాయం
మాత్రో త్తమాం గురుశిరోగతమృత్తి కాం చ |
సేవేసదా సకల రోగనివృత్తి హేతుం
సంప్రాప్య సద్గుణనిధిం గురురాఘ వేంద్రమ్ ||
4
ఎవని పాదోదకమును కషాయముగ (మందుగ), ఏ గురు దేవుని శిరముపై నున్న బృందావన మృత్తికను (మట్టిని) మాత్రగ స్వీకరించినచో నిత్యము రోగము లన్నియు తొలగి పోవునో, ఆసద్గుణనిధి యగు గురురాఘ వేంద్రుని చేరి
సేవించెదను.
రాఘ వేంద్రో దయాలుశ్చ రాఘ వేంద్రం తమాశ్రయే
రక్షితో రాఘ వేంద్రేణ రాఘవేంద్రాయ తే నమః |
రాఘవేంద్రాద్దుకున్నాస్తి రాఘవేంద్రస్య సేవకః
రాఘ వేం దేరమే ఒభీక్షంరాఘ వేంద్రోద్ధర ప్రభో ||
5
శ్రీరాఘ వేంద్రుడు దయాస్వభావము కలవాడు. నేను శ్రీరాఘ వేంద్రు నాశ్రయించెదరు. శ్రీరాఘ వేంద్రుడు నన్ను రక్షించెను. శ్రీరాఘ వేంద్రునకు నమస్కారము. శ్రీరాఘ మేద్రుని కన్న వేరొక గురువు లేడు. నేను శ్రీరాఘ వేంద్రుని సేవకుడను. శ్రీరాఘ వేంద్రుని యందే నేను రమించెదను. శ్రీరాఘ వేంద్రుడు నన్ను రక్షించును. (ఈ శ్లోకములో సంస్కృతములో గల ఏడు విభక్తులను పొందుపరచిరి. 1. రాఘవేంద్రః 2. రాఘవేంద్రం లి. రాఘవేం ద్రేణ 4. రాఘవేంద్రాయ 5. రాఘ వేంద్రాత్, 6. రాఘవేంద్రస్య 7. రాఘ వేందౌ.
క్వభ్రాతశ్చలితోసి వైద్యకగృహం కిం తత్ర శాంత్యై నా ఋజంకింతే
నాస్తి సఖే గృహే గురువరః సర్వం గదం హంతి యః |
వాత శ్చేన్నమనాదితో గురుభరోః పిత్తం చ పాదోదకాళ్
శ్లేష్మాణంవినిహంతిహంత గురురాట్ మృత్స్నాదనా ద్భక్తితః ||
6
సోదరా ! నివెక్కడకు పోవుచుంటివి? వైద్యుని గృహమునకు, అక్కడ ఏమికలదు? నాకు రోగము కలదు, అక్కడ రోగనివారణమునకు ఔషధములు కలవు? ఓయీ ! సఖుడా ! నాగృహములో రోగముల నన్నింటిని నివారింపగల గురువు కలడు. వాయురోగ మున్నచో నమస్కారమొన రింపుము. పిత్త మున్నచో పాదోదకమును సేవింపుము. శ్లేష్మ మున్నచో భక్తి తో బృందావన మృత్తికను స్వీకరింపుము.
శ్రీలక్ష్మీవరవక్షసం సుజనసంర త్ నిబద్ధాదరం
శ్రీలప్రేష్ఠవియన్నృపాల తనయావ క్రాంబుజాతారుణం |
“యోషాలోకన మోహితద్విజవరామఘ్నం కట్టాక్షమబ్రుతో
భూపారత్నముపాస్మహే విధిముఖాదిత్యార్చితాఘ్యం ||
7
శ్రీలక్ష్మీనాథుని వక్షము నందు ధరించినవాడు, మంచి వారిని రక్షించుటలో ఆదరము కలవాడు, సంపన్నులు, శ్రేష్ఠులు రాజకుమారులు మొదలగువారి ముఖములచే అరుణవర్ణ ములుగ ప్రకాశించు పాదములు కలవాడు, స్త్రీలను జూచి మోహము పొందిన ద్విజుని పాపమును నశింపజేసి ఉద్ధరించినవాడు, కట పర్వత (మంత్రాలయ) ప్రదేశమునకు ఆభూషణ మైనరత్నము వంటివాడు, బ్రహ్మాదు లైన దేవతల యొక్క విందములను అర్చించువాడు నగు శ్రీ గురు దేవుని సేవించెదను.
సన్ని దాంచిలిలో చనోవ్యనిరతం జాగర్తి లోకావనే
యోషాధిస్థి.త హృత్తిటోకియఓ ర్ముక్యమా సేవితః |
శ్యామోపి స్వగుణోత్కకై ఉతపయోవార్థ్యు -్భ మాధవో
దేవో భావుక మాతినోతు సతతం శ్రీ రంగనాథో హరిః ||
8
నిద్రాముద్రిత నేత్రములు (యోగనిద్రలో నున్నను) కలవాడైనను లోకరక్షణమునందు జాగరూకుడై యుండు వాడును, శ్రీమహాలక్ష్మీ విరాజిల్లుహృదయము కలవాడై నను ము క్తిని కాంక్షీంచు యతీశ్వరులచే సేవింపబడువాడును, నల్లని రూపము కలవాడై నను తనదివ్యగుణాతిశయముల చే సముద్రమును జయించినవాడును, దేవాది దేవుడును నైన మాధవుడు రంగనాథుడు శ్రీహరి మాకుయెల్లప్పుడుశుభములను కలుగ జేయుగాక !
స్మేరాననం నవఘనాఘననీలభాసం
శ్రీ జానకీ కనక పీఠవ రే నిషణ్ణం |
బింబాధరద్యుతిసుర క్తతనం స్వనాథం
సంప్రేక్ష్య మందహసితాంకగతా సదావ్యాత్ ||
9
మందహాసవదనము గలవాడును, నూతనమైన దట్టమైన మేఘముయొక్క నల్లని కాంతివంటి కాంతి గలవాడును, బంగారు పీఠమునందు ఆసీనుడై యున్నవాడును, బింబాధరము యొక్క కాంతిచే మిగుల యెజ్జగా చేయబడిన శరీరము గలవాడును, తనకు నాథుడును నగు శ్రీరాముని చూచుచు మందహాసము కలదియు అంకపీఠముపై గూర్చున్నదియు నగు ఆజానక దేవి ఎల్లప్పుడు రక్షించుగాక!
అంధో యత్ కరుణాలవేన మఘవా మూకోపి భోగీశితా
నంధ్యాయత్ పదకంజతోయసుకృతేనాప్నోతి పుత్రాన్ సతః |
యం సం సేవ్యాపుమర్థసార్థ మధునాప్యవింద తే సజ్జనః
సోయం ఒమంత్రగృహాలయో గురువరః స్తాదిష్టసిధ్ధమమ ||
10
ఏ గురుదేవుని కరుణా లేశము చేత గ్రుడ్డివాడు గూడ (నూరు నేత్రములుగల) ఇంద్రుడగునో, మూగ వాడు శేషుని వలె వక్త యగునో, ఎవనిపాదోదకము స్వీకరించినచో గొడ్రా లైనను సుపుత్రవతి యగునో ఏగురు దేవుని సేవించినచో చతుర్విధ పురుషార్థములు లభించునో, మంత్రాలయ గృహాలయములో నున్నఆగుకు దేవులు నాకు ఇష్టసిద్ధులను ప్రసాదించు గాక !
యో దానే ప్రతిమో జనాః ముదితాః యం ప్రాప్య – యే నార్డితం
‘దత్తం భూసురసద్గణాయ సతతం యస్మై హరీరోచ తే. |
యస్మాద్భిభ్యతి దుర్మతిర్నరహరిర్యస్య ప్రియం సర్వదా
యస్మిన్ భ క్తి యుతో జనః సుఖయుతః సశ్రీగుతో మామవ ||
11
ఏ గురువు దానమునం దసమానుడో, ఎవనిని పొంది జనులు సంతుష్టి నొందెదరో, ఎవరు భూసురులకు యిష్ట ద్రవ్యముల నిచ్చెనో, ఎవనికై శ్రీమహావిష్ణువు ఇష్టుడగునో, ఎవనివలన దుర్మతులు భయపడెదరో, శ్రీనృసింహస్వామి ఎవనికి ప్రియుడో, జనులు నిత్యము ఎవనియందు భక్తికల్గి యుందురో ఆగురు దేవుడు మమ్ములను రక్షించుగాక !
శ్రీ ప్రహ్లాదః సుబాలో నరవరమృగ రాట్ పాదకంజాలిలీలః
బాహ్లికో యాదవేశ ప్రభుపదనలినద్వంద్వ సేవా దురంధరః |
వ్యాసార్యో మేదినింద్రోమితమతి సమయాంభోధిజైవాతృ కోయం
సశ్రీమద్రాఘవేంద్రో౭వతు సుపరిమళాచార్యకర్మందివర్యః ||
12
శ్రీనృసింహమూర్తి యొక్క పాదపద్మములయందు తుమ్మెదవలె ఆటాడుచున్న మంచిబాలుడు శ్రీప్రహ్లాదుడు, అతడే బాహ్లికరాజు. యదుశ్రేష్ఠుడు, జగత్ప్రభువు నగు శ్రీకృష్ణునియొక్క పాదపద్మముల రెండింటిని సేవ చేయుటయం దగ్రగణ్యు డైన వ్యాసార్యు డతడే. ప్రభువు పూర్ణప్రజ్ఞుడు. నై నమధ్వాచార్యుల మత గ్రంథము లనెడుసముద్రమునకు చంద్రునివంటివాడు, పరిమళ వ్యాఖ్యానము రచించిన ఆచార్యుడు, యతీశ్వరులలో శ్రేష్ఠుడు నై నశ్రీమద్రాఘ వేంద్ర స్వామి అతడే. అయన మమ్ములను రక్షించుగాక !
మరిన్ని స్తోత్రములు: