Sri Sai Baba Ekadasa Sutralu In Telugu – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

Sri Sai Baba Ekadasa Sutralu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి తెలుసుకుందాం…

Sri Sai Baba Ekadasa Sutralu Telugu

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

  1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
  2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.
  3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
  4. నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును.
  5. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
  6. నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
  7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
  8. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను.
  9. నా సహాయమును గాని, నా నలహాను గాని, కోరిన తక్షణమోసంగ సంసిద్దుడను.
  10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దమే పొడచూపదు.
  11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

మరిన్ని పోస్ట్లు:

Sri Sai Aarti In Telugu – శ్రీ సాయి హారతి

Sri Sai Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి హారతి గురించి తెలుసుకుందాం…

Sri Sai Aarti In Telugu

శ్రీ సాయి హారతి

1. ఓం జయ జగదీశహరే – స్వామి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట – దాసగణోంకే
సంకటక్షణమే దూర్: కరే

॥ఓం॥

2. జోధ్యావే ఫలపావే – దుఃఖ వినశమనకా –
సాయి దుఃఖ వినశ మనకా-
సుఖ సంపత్తిఘర్ అవే –
సుఖ సంపత్తిఘర్: అవే కష్టమిటే తనకా-ఓం

॥జయ॥

3. మాత పితా తుమ్ మేరే –
శరణు గహూ కిసకీ సాయి శరణుగహూ కిసకీ
తుమ్ బిన ఔర్ దూజా
తమ బిన ఔర్ నదూజా ఆసకరూ జిసకీ –

ఓం||జయ||

4. తుమ పూరణ పరమాత్మా
తుమ్ అంతర్యామీ సాయి తుమ్ అంతర్యామీ
పరబ్రహ్మ పరమేశ్వర – పరబ్రహ్మ పరమేశ్వర
తుమ్ సబ్ కే స్వామి –

ఓం||జయ||

5. తుమ్ కరుణాకేసాగర్ – తుమ్ పాలనకర్తా –
సాయి తుమ్ పాలనకర్తా
మై మూరఖ్ ఖలా కామి – మై సేవకు తుమ్
స్వామికృపాకరో భర్తా –

ఓం||జయ||

6. తుమ్హ ఏక్ అగోచర సబకే ప్రాణపతీ సాయి సబకే ప్రాణపతీ
కిసీవిధి మిలూందయామయి-కిసీవిధి మిలూందయామయి
తుమకోమైఁకుమతీ-

ఓం||జయ||

7. దీనాబంధూ దుఃఖ హరతా-తుమ్ ఠాకుర్ మేరే
సాయి తుమ్ ఠాకుర్ మేరే
అనే హాత్ బడావో – అపనే హాత్ బడావో
ద్వార పడా తేరే !

ఓం||జయ||

8. విషయ వికార మిఠావో –
పాపహరోఁ దేవా సాయి పాపహరోఁ దేవా-
శ్రద్ధాభక్తి భడావో – శ్రద్ధా భక్తి భడావో –
సంతనకీ సేవా –

ఓం||జయ||

9. పూర్ణబ్రహ్మకీ ఆరతీ జోకోయీ బావే స్వామి జో
కోయీబావే
కహత్ శివానంద స్వామీ కహత్ శివానంద్ స్వామి
సుఖ సంపతి ఆవే
ఓం జయ జగదీశహరే –
సాయి జయజగధీశ హరే
భక్తజనోంకే సంకట –
దాసగణోంకే సంకటక్షణమే దూర్: కరే

॥ఓం॥

శ్రీ సచ్ఛిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Sri Shiridi Sai Saptha Swararalu In Telugu – శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు

Sri Shiridi Sai Saptha Swararalu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు గురించి తెలుసుకుందాం…

Sri Sai Saptha Swara Geethikalu Telugu

శ్రీ సాయి సప్త స్వర గీతికలు

గీతిక: 1

సాకి:

తల్లి నీవె తండ్రి నీవె రాగమైన భావమైన
ప్రాణమైన దైవమైన నీవె
మదిని మందిరాన్ని చేసి
పరిచితిమి మమతల సింహాసనాన్ని

పల్లవి:

రావయ్య దేవ రమణీయ రూప
కరుణించ రార కరుణా సముద్ర
ఆలకించ రార ఆత్మబంధు నీవ
ఆపదలను పాపెడు అవని నేలు దైవమ
బాబా నీవే… మా సాయి నీవే

॥రావయ్య ||

చరణం 1:

నీ చల్లని చూపుతో పుడమి పావని ఆయె
నీ కాలు తాకినంత కలి అహం పారిపోయె
ఏనాటి పుణ్య వరమొ, ఏనాటికి తీరని బంధమొ
పాపాలను పాపి వేయ మానవ రూపం దాల్చిన
మమ్ముకన్న దైవమ మరల రావయ్య స్వామి

॥రావయ్య ||

చరణం 2:

పూలు పళ్ళు ధూప దీపాలతో
ప్రేమే నైవేద్యాన్ని చేసి నీ నామమే స్మరిస్తు
రాముడవు నీవంటు రహీమువు నీవంటు
ఏసువైన బుద్ధుడైన నానకైన నీవంటు
నీ రాకకె నీ కోసమె నిరీక్షించగ

॥రావయ్య ॥

గీతిక: 2

పల్లవి:

పాహి పాహి పాహి పాహి
పాపనాశక మా ప్రాణ రక్షక
సాయి సాయి సాయి సాయి
సాధు పుంగవ మా ఇష్ట దైవమా

॥ పాహి॥

చరణం 1:

మా కళ్లలోకి చూడవయ్య కాంతులను నింపగ
లోగిల్లలోకి చేరవయ్య లోపాలను తీర్చగ
మనస్సులోన నిలువవయ్య కలతలను పాపగ
మహిమగల స్వామి నీకు మొక్కెదను భక్తి తోడ
మమత గల తండ్రి నిన్ను తలచెదను ప్రేమ తోడ
ముల్లోకాలనేలు వాడవట సృష్టికి మూలానివట

॥పాహి॥

చరణం 2:

అణువణువు ప్రతి అణువు నీ రాకకె నీ కోసమె
క్షణ క్షణము ప్రతి క్షణము పరితపిస్తున్నవి
పంచ భూతమ్ములు పంచేద్రియాలు
నీ కరుణనె నీ తోడునే కోరుతున్నాయి
నాలుగు వేధమ్ములైన నాలుగు దిక్కులైన
నాలుగు వేళలందు కోటి తారకలైన
నీకే దాసోహమట నీవే బ్రహ్మాండమట

॥పాహి॥

గీతిక: 3

పల్లవి:

షిరిడీ పురం మా సాయీ నగరం
కనులారా గాంచినంత కలుగు దర్శనం- కలుగు సాయి దర్శనం
మనసార తలచినంత పలుకు మందిరం- పలుకు బాబ మందిరం

॥షిరిడీ॥

చరణం 1:

పాపాలను పారద్రోలు పావనదామం
ఆర్థులను అక్కు చేర్చు కరుణాలోకం
గుడి కట్టిన గురుద్వారం కనుపించు కాశీ నిలయం
కీర్తించగ క్రీస్తూ గానం ఆలకించ అల్లా నామం
వెలుగొందె ఈ ద్వారక మాయి క్షేత్రం

||షిరిడీ||

చరణం 2:

రోగాలకు తావు లేదు బోగాలకు తావు లేదు
కోపాలకు రూపు లేదు తాపాలకు తనువు లేదు
మమతకిది మందిరమై భక్తికి భవ సాగరమై
వెలుగొందె ఈ ద్వారకమాయి క్షేత్రం

||షిరిడీ||

గీతిక: 4

సాకి:

బాబా… సాయి బాబా…

పల్లవి:

నీ పాదాలే కడుగన పూజలే సేయన
భక్తితోడ కొలువన భజనలే సేయన
బాబా అని పిలువన సాయీ అని తలువన

॥పాదాలే॥

చరణం:

నీ రూపం నీ నామం ప్రతి అణువున నిండగ
అణువునై పోన నీ చెంతకు నే చేరన

॥పాదాలే॥

నీ ప్రేమ నీ కరుణ ప్రతి పువ్వున విరియగ
పువ్వునై పోన నీ చరణాలను తాకన

॥పాదాలే॥

నీ చూపు నీ తోడు ప్రతి మదిన నిలువగ
భక్తుడనై పోన నే హారతులే యివ్వన

॥పాదాలే॥

గీతిక: 5

పల్లవి:

అన్నింట నీ రూపమె ప్రతినోట నీ నామమె
సద్గురు నాథ మా సాయీ ప్రభువా
పాలించు వాడవు లాలించు వాడవు
మనసున్న వాడవు మానవీయ రూపుడవు

॥అన్నింట॥

చరణం 1:

కుల మతాలు కూల దన్ని ప్రేమలే పంచినావు
మానవతను బోధించి మనస్సులే దోచినావు
భక్తినే చాటి నువ్వు కరుణయే చూపినావు
బాబాగా మిగిలినావు

॥అన్నింట॥

చరణం 2:

అఖిలాండ మూర్తివి అండగ నిలిచినావు
లోకాలను ఏలు నీవు లోగిల్లకు చేరినావు
చింతలనే తీర్చి నువ్వు చీకట్లను బాపినావు
చిదానందునిగా మారినావు

॥అన్నింట॥

గీతిక: 6

పల్లవి:

షిరిడీశ తండ్రి పరమేశ
శివరూప సాయి రామేశ
యేలుకొను వాడవయ్య వరాలిచ్చు వాడవయ్య
మహిమ గల తండ్రివయ్య మహితాత్ముడ నీవయ్య
అలకయేల భూనితివో మంకు నేల పట్టితివో

చరణం 1:

ఆర్థులము మేమయ్య ఒంటరిగా మిగిలితిమి
తోడుగ నిలువ రార తప్పులను తెలుపగ
కన్నులలో నీవుంటివి కడదాక నిలిచి పోర
కపటాలు లేనట్టి కమనీయ రూపుడవు

॥షిరిడీశ॥

చరణం 2:

దైవానివి నీవయ్య దయగల తండ్రివయ్య
భక్తులము మేమురాగ భజనలే సేయగ
ప్రేమతో మమ్ము చేరి భక్తినే చాటర
మానవతారూపుడ మనస్సు గల నాథుడ

॥షిరిడీశ ॥

గీతిక: 7

సాకి:

ఓం షిరిడి నాథాయ నమః
ఓం మాధవ సాయినే నమః

పల్లవి:

జగతికి మూలం సృష్టికి ప్రతి రూపం
మానవతకు మారు పేరు సాయీ నామం
మా బాబా నిలయం

చరణం 1:

ఈశుడు తానె పరమేశడు తానె
జీవుడు తానె దేవుడు తానె
ఆత్మయు తానే పరమాత్మయు తానె
ఎలా పిలిచిన ఎలా తలచిన
పిలిస్తే పలుకు వాడు సాయీ…

॥జగతికి॥

చరణం 2:

లీలలెన్నొ చేయువాడు ప్రేమలే పంచువాడు
కరుణయే చూపు వాడు లోకమ్ముల నేలు వాడు
గీతలోన నిండినాడు ఖురానైన వెలిగినాడు
క్రీస్తుగా పిలిచిన నానకని తలచిన
మదిలోన నిలుచు వాడు సాయీ…..

॥జగతి॥

మరిన్ని పోస్ట్లు:

Bhakti Vedalu | ఆధ్యాత్మిక విశ్వం లోకి స్వాగతం

Discover The Ultimate Collection Of Devotional Hymns And Prayers | Bhakti Ved

Welcome to the Bhakti Ved Website. Our platform provides an extensive array of hymns, ashtakas, dandakas, and other sacred chants and devotional verses In Telugu. We are dedicated to facilitating your spiritual journey, ensuring that you can effortlessly follow and engage in devotionaland rituals. With our resources, you can profoundly enrich your devotional path and elevate your spiritual experiences.

STHOTHRALU – స్తోత్రాలు

ASHTOTTARA – అష్టోత్తర

ASHTAKAMULU – అష్టకములు

MANTRALU – మంత్రాలు

BHAKTI GEETHALU – భక్తి గీతాలు

BHAKTI YOGAM – భక్తి యోగం

DANDAKALU – దండకాలు

CHALISALU – చాలీసాలు

KAVACHALU – కవచాలు

KEERTHANALU – కీర్తనలు

NEETHIKATHALU – నీతికథలు

శ్రీమద్రామాయణం లోని కథ

శ్రీమద్భాగవతము లోని కథ

శ్రీమహాభారతం లోని కథ

PANDUGALU – పండుగలు

POOJA – పూజ

PRAPATTULU – ప్రపత్తులు

SUKTULU – సూక్తులు

SUPRABHATAMULU – సుప్రభాతములు

VRATHALU – వ్రతాలు

Parvathi Devi Mangala Harathulu In Telugu – మంగళ హారతులు

Parvathi Devi Mangala Harathulu In Telugu

Parvathi Devi Mangala Harathulu – మంగళ హారతులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పార్వతి దేవి, హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవతలలో ఒకరు. ఆమె శివుని పత్నిగా, గణపతి మరియు కార్తికేయుల తల్లిగా విఖ్యాతి గాంచింది. పార్వతి, శక్తి లేదా దుర్గా రూపంలో కూడా పూజించబడుతుంది. ఆమె శాంతియుత స్వభావంతో పాటు శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధించబడుతుంది. పార్వతి దేవి కథలు, పురాణాలు, వేదాలు, మరియు ఇతిహాసాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. ఆమె జీవితంలో ప్రతి ఘట్టం ఆదర్శప్రాయంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. పార్వతి దేవి కృష్ణవర్ణంలో, అందమైన మంగళసూత్రం ధరించి, నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంది. పార్వతి దేవి పూజ అనేక రూపాల్లో, రీతులలో జరుగుతుంది. భక్తులు ఆమెను శివునితో కలిసి లేదా స్వతంత్రంగా కూడా పూజిస్తారు. పార్వతి దేవి పూజించడం వలన భక్తులకు శాంతి, సమృద్ధి, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. తద్వారా పార్వతి దేవి తెలుగు ప్రజల మన్ననలు పొందుతూ, వారి జీవితాల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు పార్వతీదేవి మంగళ హారతులు భక్తి గీతాలలో తెలుసుకుందాం…

అంబా జగదంబా
పరమ పావనీ “పార్వతీదేవి” గీర్వాణనుత గిరిజాదేవి

(జౌళిరాగం – త్రిశ్రగతి తాళం)

చ 1) అంబా జగదంబా అంబా కంబుకంఠి
అంబా ఫలదాయినీ శాంభవీ
అంబుజభవ రాణి అలివేణి శాంకరి
కంబుకంథరి నీను కనుగొంటి ఈశ్వరీ॥

||మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||

చ 2) తళుకు చెక్కుల కాంతి ధగధగ మెరయగ
మొలక నవ్వుల ముద్దు గుల్కగనూ
చిలుక పలుకు లతో కులుకుచు నున్నట్టి
చిలుకల కొలికీ కలికి బంగరు బొమ్మ।।

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||

చ 3) సరిగంచు చీరయు జాబిలి రవికెయు
సిరులొప్పు మల్లెల విరిదండలు
పరిమళ గంధంబు పచ్చకస్తురి నలది
భక్తుల రక్షించే బాల చాముండీ!॥

||మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||

శ్రీవిద్య నాలింపు ఆటలు పాటలు
సింహవాసిని నీవు చాముండికాదేవి

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం!॥

చ 5) సందిట దండలు జతల తాయెతులు
విందగు నవరత్న కంకణాలు
అందమై కనిపించు చంద్రహారములు
దుగా దాల్చిన పూబోడి ఈశ్వరీ

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం ॥

చ 6) క్రౌంచ పర్వత మందు గ్రక్కున వెలసిన
మంజు భాషలు దెలసి మురియుచునూ
అంచయానలు అపుడు హారతులివ్వగ
సింహవాసిని నీవు చాముండికాదేవి

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥

చ 7) పచ్చని కమ్మలు పసిడి తాయెత్తులు
హెచ్చైన సొమ్ములు వేడ్కమీరా
గుత్తపు సరులతో కుచ్చుల ముంగర
అచ్చరూపము గనుచు ముచ్చటతీర

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥

చ 8) బాజా భజంత్రీలు పంచమ స్వరమున
తేజమయిన మంచి దివిటీలతో
రాజ్యలక్ష్మిని గూడి నాట్యములాడె
రాజవీధులు తిరుగు రాజరాజేశ్వరీ

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం||

చ 9) అమరావతీ నగరమందు శృంగారించి
వైభవముతో కృష్ణాతీరమందు
అమరేశ్వరుని గూడి ఆనంద లీలల
వెలుగుచున్నట్టి చాముండికా దేవి

॥మంగళం మంగళం శర్వాణి నీకు మంగళం॥

ఆహా సుకుమారీ
గిరిజా శుభకరి శాంకరి గౌరీ

(కళ్యాణిరాగం – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: ఆహ సుకుమారీ గరళకంఠుని నారీ
కొనుము జయహారతిదే గౌరీ

॥హర॥

చ 1) హరుని సతీ ఆ అంబై హృదయా
నందము నీయ రమ్మా హారతిదే గౌరీ

॥హర॥

చ 2) అందమైన వెండి పళ్ళెరమున
అమరించితిమి ఆత్మవిచారిణి
పరమపావని మోదమలర హరతిగైకొను గౌరీ

॥ఆహ॥

ఘల్లు ఘల్లున పాద గజ్జె లందెలు మ్రోయ
హరిహర మహాశివ

(సురట రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోను గంగను ధరియించుకొన్నట్టి
జగములేలెడు జగధీశు సన్నిధికీ!
॥మంగళం మంగళం ॥

చ 2) బొడ్డుమల్లెలు జాజి దండలు మెడనిండ
అందమెరిగిన జగదంబ ఎక్కడికే
అందము విభూతి అలరు శ్రీగంధము
నలదిన నీలకంఠేశు సన్నిధికే

॥మంగళం మంగళం ॥

చ 3) తళతళమను రత్న తాటంకములు మెరయ
పసిడి మండలముల పడతి ఎక్కడికే
కలియుగ జన్మముగల శివుడై నట్టి
గురువైన శంఖు శంకరుని సన్నిధికే

॥మంగళం మంగళం ॥

చ 4) హెచ్చు పాపట బొట్టు పచ్చల కిరీటమ్ము
ఏమమ్మ కరుణాకటాక్ష మెక్కడికే?
కడు పెద్ద రుద్రాక్ష మెడలో హారము దాల్చి
నంది నెక్కెడు జగధీశు సన్నిధికే

॥మంగళం మంగళం ॥

చ 5) చెంగావి చీరలు కొంగులు చెంగున జారంగ
రంగైన నవమోహనాంగి ఎక్కడికే?
చంద్రుని శిరమున ధరియించు కొన్నట్టి
మండల మేలే నందీశు సన్నిధికే

॥మంగళం మంగళం||

చ 6) సన్నపు నడుముపై బిళ్ళ వొడ్డాణము
మెరిసేటి బంగారుబొమ్మ’ ఎక్కడికే
కన్నులు మూడు భుజంబు లారు
గల అర్ధనారీశు శివుని సన్నిధికే

॥మంగళం మంగళం||

మంగళ హారతులు
రంగదుత్తుంగ తరంగమంగళాంగీ పార్వతీ

(ఆనందభైరవి రవిరాగం ఆదితాళం)

చ 1) జయజయ హారతీ జననీ పార్వతీ
శరణు శుద్ధిమతీ! శంకరుని ప్రియసతీ

||జయ||

చ 2) సుందరవదన! సురనుత చరణ
వందన మంటిని! వాదమేలనే

||జయ||

చ 3) నగరాజ బాలశ్రీ! నారద సురపాల
నగుమోముతో బాల! నన్నేలు మీవేళ

||జయ||

చ 4) ఓం బీజవాసినీ! ఓంకార రూపిణి
శ్రీంకార కారుణి! సామ్రాజ్య పోషణీ

||జయ||

మంగళమే శంభురాణి
శుంభదారంభ జృంభిత పార్వతి

(హరికాంభోజి రాగస్వరాలు – త్రిశ్రగతి తాళం)

పల్లవి: మంగళమే శంభురాణి మానిని యో పూవుబోణీ
చ 1) భంగు కుంతల బ్రోవుమా పుత్తడి బంగరుబొమ్మా
నిన్ను గొల్చుచుంటినమ్మా నీదు దయ నుంచవమ్మా

చ 2) మల్లెపూల సరులు తెచ్చి
మగువరో నిను పూజింతునమ్మా
ఉల్లము నందుంచవమ్మా
మగువరో దయ యుంచవమ్మా||

చ 3) దోసిలొగ్గి యుంటినమ్మా దోషము లింక ఎంచకమ్మా
కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కనికరింప సమయమమ్మా॥

హారతి మీరేల ఇవ్వరే
దివ్య నవ్య శ్రావ్యభవ్యా పార్వతీ

(సింధుభైరవి రాగం – మిశ్రచాపు తాళం)

చ 1) హారతి మీరేల ఇవ్వరే? అంబకు మంగళ ॥ హారతి ॥
హారతి మీరేల ఇవ్వరే? జ్ఞాన విద్యలకెల్ల ప్రథితము
లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి

చ 2) పాదములకు పూజచేయరే మా తల్లి కిపుడు
పారిజాత హారతివ్వరే హారములు మొలలో గజ్జలు
రవల పాపిడి, ముక్కు పుడకలు
సమముగ ధరియించు తల్లికి ॥ హారతి॥

చ 3) ఇంతపరాకేలనే ఆమ్మా రుద్రాణిదేవి
చెంతనుండి పూజ చేయరే శంకరీ ఓంకార రూపిణి
కుంకుమాక్షత లలంకారికి పొంకమెసగ అలంకారిణీ

4) లక్షవత్తుల జ్యోతి కూర్చరే మా తల్లి కిపుడు
పచ్చ పళ్ళెర ముంచరే
రక్షితంబుగ నుడి వేదాక్షరంబై
రాక్షస సంహారమున కిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు

హారతిదిగో శ్రీ పార్వతీ
గీరత! సారత ధీరత! పార్వతీ

(కాపిరాగం – త్రిశ్రగతి ఆదితాళం)

పల్లవి: హారతిదిగో శ్రీ పార్వతీ కాపాడవే మమ్ము కాత్యాయనీ

చ 1) మురహరు రాణి మా పాలిట జననీ
పూర్ణేందు బింబానన పువ్వుబోణీ
సారసాక్షీ మమ్ము బ్రోవజాలమేలనే

॥హారతిదిగో||

చ 2) వాదమేల నమ్మా వారిజ ముఖి
కదంబ వనివాసినీ ఫలదాయినీ
మందయాన సుందరేశుని మనోహరిణీ

॥హారతిదిగో||

మరిన్ని భక్తి గీతాలు : 

Menaka In Telugu – మేనక

Menaka In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… మేనక నీతికథ.

మేనక

(బహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలాముఖ్యమయన పాత్ర నిర్వ హిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది.)

వసిష్ఠమహర్షితో వచ్చిన వైరం కారణంగా, ఆయనవలె బ్రహ్మర్షి కావాలనే కోరికతో విశ్వామిత్రుడు తీవ్రనియమాలతో తపస్సు చేస్తున్నాడు.

దేవేంద్రుడు ఆ తపోదీక్షకు భయపడి ఏ విధంగానయినా దానికి భంగం కలిగించాలని బాగా ఆలోచించి, ఆలోచించి ఏ మానవుడయినా కామినీ, కాంచనాలకు దాసు డవుతాడని నిశ్చయించుకున్నాడు.

ధనంకంటే మనిషిని సుందరీమణులే మరింతగా వంచించగలరని భావించి, అప్సరసలకు తలమానికమయిన మేనకను పిలిపించి:

‘ అప్పరోజునశిరోమణి !
ఇప్పుడు మవ్వాక దేవకార్యం సాధించవలసి ఉంది. నా వజ్రా యుధం పనిచెయ్యనిచోట్ల నీ కంటిచూపులు తీవ్రంగా పనిచేస్తాయని మేమెరుగుదుము. ఆ శక్తిని ప్రయోగించి కార్యం సాధించాలి.

విశ్వామిత్రిమహర్షి పేరు విని ఉంటావు. ఆయన గాధిరాజ నంద మడు. రాజభోగాలన్నీ అనుభవించి, వసిష్ఠులవారితో యుద్ధానికిపోయి, ఆ బ్రహ్మవేత్తముందు ఆగలేక రాజశక్తికంటే బ్రహ్మవిదులశక్తి ఘన మనదని గ్రహించి, దానిని సాధించడానికి తీవ్రంగా తపస్సు చేస్తు న్నాడు. అదిమాకు సంతానం కలిగిస్తున్నది. ఆయన దీక్షకు భంగం కలిగించడం సామాన్యవిషయంకాదు. ఆయన శక్తి కూడా అసాధారణ మయినది,

అయినా నీ రూపం, లావణ్యంగా, నాట్య విద్యా ప్రావీణ్యం వీటితో ఆయన తపస్సమాధికి భంగం కలిగించాలి’ అన్నాడు.

మాటలు వింటున్న మేనక శరీరం ఆపాదమస్తకం కంపించింది. గుండె నిబ్బరం తగ్గింది.

‘ ప్రభూ ! మీ మాటకు ఏనాడూ ఎదురు చెప్పకుండా తలవంచి వెళ్ళి పనులు చేసుకువచ్చాం. కాని, విశ్వామిత్రులవారి పేరు వింటేనే మాకు గుండె దద్దరిల్లుతున్నది.

ఆయన సామర్థ్యం మీ రెరుగనిదికాదు. ఆయన తపస్సు, తేజస్సు ఎంతటివో అంతకంటే పదిరెట్లు ఆయనకు క్రోధం. దీనికేకదా మీరు భయ పడుతున్నారు మీరే భయభ్రాంతులయేచోట మా గతి ఏం కావాలి?

వసిష్ఠులవారి కొడుకు లందరినీ సంహరించిన క్రోధమూర్తి ఆయని. తపస్సుకి అంతరాయం కలగకుండా తన ఆశ్రమ సమీపంలో నదిని ప్రవ హింపజేసుకున్న శక్తిశాలి. మతంగునిచేత యజ్ఞం చేయించినప్పుడు మీరు స్వయంగా వెళ్ళి సోమపానం చెయ్యక తప్పలేదు. వసిష్ఠులవారు శపించిన త్రిశంకునిచేత యజ్ఞంచేయించి, ఆ రునికోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు.

ఆయన కన్నులెర్రజే స్తే ముల్లోకాలూ భస్మం అవుతాయి. కోపంతో భూమిమీద తన్నితే భూగోళం గజ గజ వణుకుతుంది. మేరు పర్వతాన్ని గడ్డి పరకలా చూడగలడు. అంతటి మహామహుని దగ్గరకు నన్ను వెళ్ళ మంటున్నారు.

నేను పెడతాను. అంతకుముందు ఆయన ఉన్న వనం అంతా వసంతశోభతో, మల యవవనాలతో, సుగంధ సౌరభంతో అలరారు తుండాలి. నేను ఆమహర్షి ఎదుటకు వెడుతున్నప్పుడు వాయువు నా పైట చెరుగును ఎగరవేసుకు పోవాలి.

ఇన్నిటితోపాటు మన్మథుడు జాగరూకతతో తన పనిని కొనసాగిం చాలి. అప్పుడు మీ శాసనాన్ని నేను సక్రమంగా పాలించగలుగు తామ’ అంది.

దేవేంద్రుడు చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి పంపించాడు.
మేనక అమరావతి విడిచి విశ్వామిత్రుని తపోవన వాటికకు వచ్చింది.
అప్పటికే ఆశ్రమ పరిసరాలలో అతలు మొగ్గ తొడిగాయి. చెట్లు పూలతోనిండి సువాసన భీమతున్నాయి. గాలి చల్లగా పోతుతున్నది.

పక్షులన్నీ అమరాగంతో ఒకదానినొకటి ముక్కులతో ముద్దులాడు కుంటున్నాయి.

అటువంటి సమయంలో ఆశ్రమ సమీపాన తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రునికి అల్లంతదూరంలో నిలబడి, అభినయంతో చేతులు జోడించింది మేనక.

ఆమె చేతిగాజులు, కాలి అందెలమువ్వలు కదలి వన సన్నగా ధ్వని చేస్తూ ఆ మహర్షి చెవులలో చేరుతున్నాయి.

ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచే వేళకు ఆమె అంజలి బంధంతో నాట్యం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి గాలి విసురుతో ఆమె పైట కండువా ఎగిరి దూరంగా పడింది.
కన్నులు విప్పిచూశాడు విశ్వామిత్రుడు.
చూస్తున్న విశ్వామిత్రుడు తపస్వి,
చూసిన విశ్వామిత్రుని దీక్ష పడలింది.
నెమ్మదిగా లేచాడు.

ఆమె సిగ్గుతో వెనుదిరిగి పై టకండువా కోసం అడుగులు వేస్తూ వెను దిరిగి చూస్తున్నది.
కనులు మిలమిలలాడిస్తున్నది.
గాలి మరింత రేగింది.
ఆమె పరికిణీ చక్రంలో తిరిగి పైకి లేచింది.
విశ్వామిత్రుని మనస్సు వివశమయింది.
తన స్వాధీనం తప్పిన మనస్సులో కామవికారం పుట్టింది.

కామక్రోధాలను జయించి బ్రహ్మర్షి వదం చేరాలనే పట్టుదలతో మానవ సంచారం లేని మహారణ్యంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న విశ్వామిత్రుడు ఆ వనంలో ఏకాంతంలో పైటజారిన మందరీమణి కనిపించే సరికి సర్వమూ మరిచిపోయి మనసులో మదనతాపం రేగగా మేనకను చేరబిలిచాడు.

మేనక సిగ్గుతో, భయపడుతూన్నట్లు రాజహంసలా నెమ్మదిగా అడుగులో అడుగువేస్తూ ఆయనను సమీపించింది.

విశ్వామిత్రుడు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
పది సంవత్సరాల కాలం గడిచింది.
అంతా ఒక నిమేషంలో అనిపించింది, ఆ విశ్వామిత్రునికి.
అప్పటికి మేనక గర్భవతి అయింది.
ప్రసవ కాలం సమీపిస్తున్నది.
నాటికి తెలిపింది, విశ్వామిత్రునికి
ఏమని?

తను కామాన్ని జయించలేదని.
అంతే మేనకను విడిచి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు, తపో దీక్ష
మేనక ప్రసవించి శిశువును మాలినీ నదితీరాన ఒక చెట్టు క్రింద వదలి దేవలోకం చేరుకుంది.

ఆ అమ్మాయి పేరే శకుంతల.
(ఎంతటి మహామహులయినా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలను చేర నిస్తే పతనం తప్పదని నీతి)

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Sai Shej Aarti In Telugu – శ్రీ సాయి శేజారతి

Sri Sai Shej Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి శేజారతి గురించి తెలుసుకుందాం…

Sai Baba Shej Aarti Lyrics

శ్రీ సాయి శేజారతి

(రాత్రి 10 గం||లకు దూపదీప నైవేద్యాలర్పించి ఐదు వత్తులతో హారతి యివ్వాలి)

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్కి జై

ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాథా ।
పాంచాహీ తత్త్వంచా దీప లా విలా ఆతా
నిర్గుణాతీస్థితి కైసీ ఆకార ఆలీబాబా ఆకార ఆలీ
సర్వాఘటీ భరూనీ ఉరలీసాయిమావులీ
ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాథా
పాంచాహీ తత్త్వాంచా దీపలావీలా ఆతా
రజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీ బాబామాయా ప్రసవలీ
మాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీ
ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాథా |
పాంచాహీ తత్త్వాంచాదీప లావిలా ఆతా
సప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేజ్ మండీలా
ఖేళూనియా ఖేళ అవఘా విస్తారకేలా
ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాథా
పాంచాహీ తత్త్వాంచా దీపలావిలా ఆతా
బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీడోలా బాబా దాఖవిలీడోలా
తుకాహ్మణే మాఝా స్వామి కృపాళూ భోళా
ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాథా
పాంచాహీ తత్త్వాంచాదీపలావిలా ఆతా
లోపలేజ్ఞాన జగీ హితనేణతికోణి
అవతార పాండురంగా నామఠేవిలేజ్ఞానీ
ఆరతిఙ్ఞానరాజా మహకైవల్య తేజ
సేవితిసాధు సంతా మనువేదలామఝా ఆరతీఙ్ఞానరాజా..
కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ
నారద తుంబురహో సామగాయనకరీ
ఆరతీఙ్ఞానరాజా మహకైవల్య తేజా
సేవితిసాధుసంతా మనువేదలామాఝా ఆరతిఙ్ఞానరాజా
పగట గుహ్యబోలే విశ్వబ్రహ్మ చికేలె
రామజనార్ధనీ (పా) సాయి మస్తకఠేవిలే
ఆరతి జ్ఞానరాజా మహకైవల్య తేజా
సేవితిసాధుసంతా మనువేదలామాఝా ఆరతి జ్ఞానరాజా
ఆరతి తుకరామా స్వామి సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా ..
రాఘవే సాగరాతా పాషాణతారిలే
తైసే తుకో బాచే అభంగ రక్షిలే
ఆరతి తుకారామ స్వామి సద్గురుధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతి తుకారామా …
తూనేకిత తుల నేపీ బ్రహ్మతుకాసి ఆలే
హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే
ఆరతి తుకరామా స్వామి సద్గురుధామా
సచ్చిదానందమూర్తి పాయాదాఖవి ఆహ్మా ఆరతి తుకరామా…
జైజై సాయినాథ ఆతా పహుడావేమందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘె ఉనికరీహో
జైజై సాయినాథ ఆతా పహుడావేమందిరీహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయజశీనిజ ములాహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయజశీనిజ ములాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఃఖలాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఃఖలాహో
దావుని భక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలహో
దావుని భక్త వ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో
ఝాలే అసతిలకష్ట అతీశయాతుమచే యాదేహాలాహో
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతి ఘే ఉనికరీహో
జైజై సాయినాథ ఆతా పహుడావే మందిరహో
క్షమాశయన సుందరహిశోభా సుమనశేజత్యావరీహో
క్షమాశయన సుందరహిశోభా సుమనశేజత్యావరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
సేవాకింకరభక్త ప్రీతి అత్తరపరిమళవారిహో
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో
సోడునిజాయా దుఃఖవాటతే బాబా (సాయి) త్వచ్చరణాసీహో
సోడునిజాయా దుఃఖవాటతే బాబా (సాయి) త్వచ్చరణాసీహో
ఆజ్ఞేస్తవహా అసీప్రసాదఘే ఉని నిజసదనాసీహో
ఆజ్ఞేస్తవహా అసీప్రసాదఘే ఉని నిజసదనాసీహో
జాతో ఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
జాతోఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసీహో
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో
ఆతాస్వామీ సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాథా
చిన్మయహే (నిజ) సుఖదామ జావుని పహుడా ఏకాంత
వైరాగ్యాచా కుంచ ఘేఉని చౌక ఝాడిలా బాబాచౌకఝాడిలా
తయావరీ సుప్రేమాచా శిడకావాదిదలా
ఆతాస్వామీసుఖేనిద్రాకరా అవదూతాబాబాకరా సాయినాథా
చిన్మయహే సుఖదామ జావునిపహుడా ఏకాంతా
పాయఘడ్యా ఘాతల్య సుందర నవవిదా భక్తిఈత బాబానవవిదా భక్తి
జ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్యాజ్యోతీ
ఆతాస్వామి సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాథా
చిన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా
భావార్ధాన్ చా మంచక హృదయాకాశీటాంగిలా బాబా (హృదయా) కాశీటాంగిలా
మనాచీ సుమనే కరునీకేలే శేజేలా
ఆతాస్వామీ సుఖే నిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా
చిన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా
ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే
దుర్భుద్దీంచ్యా గాంలీ సోడుని పడదేసోడిలే
ఆతాస్వామీ సుఖేనిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా
చిన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా
ఆశాతృష్ణ కల్పనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా
దయాక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా
అతాస్వామి సుఖే నిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా
చిన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా
అలక్ష్య ఉన్మని ఘేఉని నాజుక దుశ్శాలా బాబా నాజుక దుశ్శాలా
నిరంజనే సద్గురుస్వామి నిజవిలశేజేలా
అతాస్వామి సుఖే నిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా
చిన్మయ హేసుఖదామ జావుని పహుడా ఏకాంతా

శ్రీ గురుదేవదత్త :

పాహేప్రసాదాచి వాటద్యావేదుఓనియాతాటా
శేషాఘే ఉని జా ఈనతుమచే ఝాలీయాబోజన
ఝాలో ఆతాఏకసవాతుహ్మా ఆళంవావోదేవా
తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్
పావలాప్రసాద ఆత విఠోనిజవే బాబా ఆతానిజవే
ఆపులాతో శ్రమకళోయేతసేభావే
అతాస్వామి సుఖే నిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాథ జాతో ఆపులేస్థళా
తుహ్మాసీ జాగవూ ఆహ్మా ఆపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా
శుభా శుభ కర్మేదోష హరావయాపీడా
అతాస్వామి సుఖే నిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాథ జాతా ఆపులేస్థళా
తుకాహ్మణేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా) ఉచ్చిష్టాచే బోజన
నాహినివడిలే ఆహ్మ ఆపుల్యాభిన్నా
అతాస్వామి సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరథజాతో ఆపులేస్థలా
సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్కజై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహరాజ్
సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Gomatha Pooja Vidhanam In Telugu – గోమాత పూజా విధానం

Gomatha Pooja Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా విధానం గురించి తెలుసుకుందాం…

Gomatha Pooja Vidhanam In Telugu Pdf

గోమాత పూజా విధానం

గో – ప్రార్ధన

నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయచ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః
కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ |
గవాం ప్రశస్యతేవీర, సర్వపాపహరం శివమ్ ||
ఘృతక్షీర ప్రదాగావో ఘృతయోన్యో ఘృతోద్భవాః |
ఘృతనద్యోఘృతావర్తా స్తామేసంతు సదాగృహే ||
సుృతంమే హృదయేనిత్యం ఘృతంనాభ్యాం ప్రతిష్ఠితం |
ఘృతంసర్వేషు గాత్రేషు ఘృతంమేమనసిస్థితమ్
గావోమమాగ్రతో నిత్యంగావః పృష్ఠత ఏవ చ |
గావోమేసర్వత శైవగవాంమధ్యేవసామ్యహమ్ ||
ఇత్యాచమ్య జపేత్సాయంప్రాతశ్చపురుష స్సదా |
యదహ్నాత్కురుతేపాపం తస్మాత్ స పరిముచ్యతే ||

ఆచమ్య :

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అనుచు మూడుసార్లు జలపానము చేయవలయును.)
(గోకర్ణమువలె చేతిని ముడచి మినపగింజ మునుగ నంత నీరుచేతిలోపోసికొని గ్రహించవలయును.)
ఓం గోవిందాయ నమః (అనుచు ఎడమచేతిని కుడిఅరచేతితోను)
ఓంవిష్ణవేనమః (అనుచుకుడి అరచేతినిఎడమఅరచేతితోను కడుగవలయును.)
ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటనవ్రేలితో పై పెదవిని తడిచేతితోతాకి)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వ్రేలితో పై పెదవిని)
ఓం వామనాయ నమః (అనుచుశిరమున నుదకము చల్లుకొనవలయును)
ఓం శ్రీధరాయ నమః (అనుచుశిరమున జలము చల్లుకొనవలయును.)
ఓం హృషీకేశాయనమః (అనుచుఎడమచేతిపైనను)
ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండుపాదములపైనను)
ఓం దామోదరాయ నమః (అనుచు శిరముపైనను నీరు చల్లుకొనవలయును.)
ఓం సంకర్షణాయ నమః (అన్నివ్రేళ్ళు ముడిచి వ్రేళ్ళమొదళ్ళతో గడ్డమును తాకవలయును.
ఓంవాసుదేవాయనమః (ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (కుడిముక్కును అంగుష్ఠ తర్జనులతో తాకవలయును.)
ఓం అనిరుద్ధాయనమః (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (కుడికన్నును అంగుష్ఠానామికలతో తాకవలయును.)
ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమచెవిని)
ఓం నారసింహాయ నమః (కుడిచెవిని అంగుష్ఠానామికలతో తాకవలయును)
ఓం అచ్యుతాయై నమః (అనుచు అంగుష్ఠ కనిష్ఠికలతోతాకవలయును.)
ఓం జనార్దనాయ నమః (అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయనమః(శిరమును కరాగ్రముతో తాకవలయును.)
ఓం హరయే నమః (ఎడమ బాహుమూలమును)
ఓం కృష్ణయేనమః (బాహుమూలములను వ్రేళ్ళుముడిచి తాకవలెను. తరువాత భూతోచ్ఛాటనము గావింపవలెను.)

భూతోచ్ఛాటనము

శ్లో॥ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అక్షతలు వెనుకకు చల్లుకొనవలయును.)

ప్రాణాయామము

ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
(చూపుడువేలు, చిటికినవేలు విడిచి మిగిలిన మూడువేళ్ళతో ముక్కు మూసుకొని ఒక్కనిమిషం ఆగిమెల్లగావ్రేళ్ళు వదలి గాలిని విడిచిపెట్టవలెను.) మంత్ర మును ముక్కునుపట్టుకొని ముమ్మారు జపించిన ప్రాణాయామము చేసినట్లుగును)

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పర మేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః | ద్వితీయపరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే | కలి యుగే ప్రథమపాదే | జంబూద్వీపే | భరతవర్షే భరతఖండే అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవ త్సరే…ఆయనే….ఋతౌ… మాసే… పక్షే.. తిధౌ… వాసరే… శుభ నక్షత్రే… శుభయోగే..శుభకరణ… ఏవంగుణ విశేషణ విశిష్టా యాం…శుభతిధౌ… శ్రీమాన్ గోత్రః నామధేయ ధర్మపత్నీ సమేతః శ్రీమతః గోత్రస్య.. నామధేయస్య… ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం | క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్య ఐశ్వ ర్యాభి వృద్ధ్యర్థం। ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమదీర్ఘ సౌమాంగళ్య ప్రాప్యర్థం సకల భాగ్య ప్యర్థం పుత్రపౌత్రాభి వృద్ధ్యర్ధం గోదేవతా ముద్దిశ్య దేవ దేవతాపూజంకరిషే || (అక్షతలు ఉదకము పళ్ళెరములో వదలవలయును.)

తదంగ కలశపూజాం కరిష్యే

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రఃస్సమాశ్రితః |
మూలే తత్రస్థితో బ్రహ్మామధ్యే మాతృగణాస్మృతాః॥
శ్లో॥ కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదో౨ ధ యజుర్వేదః స్సామవేదో హ్యధర్వణః ||
శ్లో॥ అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ ||
శ్లో॥ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
ఆయాంతు శ్రీదేవీ పూజార్థం దురితక్షయ కారకాః ||
(కలశోదకేన, దేవంఆత్మానం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య అని కలశోదకమునుదేవతమీద, తనమీద, పూజాద్రవ్యములమీద చల్లవలెను.)

గణపతిపూజ

అదౌ నిర్విఘ్నపరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే॥ (నీరువదలిపెట్టవలయును)
గణానాంత్వా గణపతిగ్ం హవామహే |
కవిం కవీనాం ఉపమశ్ర వస్త మమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశ్శృణ్వన్ ఊతిభిః సీదసాదనమ్|| (అక్షతలుంచవలెను)
శ్రీమహాగణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి ధ్యాయామి నవరత్నఖచితసింహాసనం సమర్పయామి (అక్షతలుంచవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి (నీరుచల్లవలెను)

అపోహిష్టామయోభువః తానూర్ణేదధాతన । మహేరణాయ చక్షసే । యోవశ్శి వతమో రసస్తస్యభాజయతే హనః | ఉశతీరివమాతరః తస్మాఅరంగమామవో యస్యక్షయాయ ఉన్వధ । ఆపోజనయధాచనః || శ్రీమహాగణాధిపతయేనమః శుద్దోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్ప యామి. అభివస్తాను వసన్యరుషాభిదేయాః నురుషూః॥ పూజమా। అభిచంద్రాభర్తవే నోహరిణ్య ధ్యస్వాన్ రధినో దేవసోమ॥ శ్రీమహా గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
(ప్రత్తిచేసి వస్త్రంగాని యజ్ఞోపవీతంగానివేయవలె)

యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్రియం ప్రతిముంచశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
శ్రీమహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధద్వారాం దురాం ధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
శ్రీ ఈశ్వరీగ్ం సర్వభూతానాం తా మిహోపాహ్వయే శ్రియం॥
శ్రీమహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి.
ఆయనేతే పరాయణే దుర్వారోహంతుపుష్పిణీః
హ్రదాశ్చపుండరీకాణిసముద్రస్యగృహాఇమే
శ్రీమహాగణాధిపతయేనమఃపుష్పాణి పూజయామి

మరిన్ని పూజా విధానాలు:

Sri Sai Sandhya Aarti In Telugu – శ్రీ సాయి సంధ్య ఆరతి

Sri Sai Sandhya Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి సంధ్య ఆరతి గురించి తెలుసుకుందాం…

Sri Sai Baba Sandhya Aarti Telugu

శ్రీ సాయి సంధ్య ఆరతి

(సాయం సంధ్య సమయంలో ధూపదీపనైవేద్యానంతరం ఒక వత్తితో ఆరతి ఇవ్వవలెను)

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ
చరణ రజతాలీద్యావాదాసావిసావా
భాక్తావిసావా ఆరతిసాయిబాబా
జాళునియ అనంగ స్వరూపిరాహేదంగ
ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోలా శ్రీరంగ ఆరతిసాయిబాబా
జయమనికైనాభావ తయతైనా అనుభవ
దావిసి దయాఘనా ఐసి తుఝహిమావ
తుఝహిమావ ఆరతిసాయిబాబా
తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా
అగాధతవకరణి మార్గ దవిసి అనాథా
దావిసి అనాథా ఆరతి సాయిబాబా
కలియుగి అవతార సగుణ పరబ్రహ్మాచార
అవతీర్ణ ఝాలాసే స్వామి దత్త దిగంబర
దత్త దిగంబర ఆరతి సాయిబాబా
ఆఠాదివసాగురువారీ భక్త కరీతివారీ
ప్రభుపదపహావయా భవభయ నివారీ
భయనివారీ ఆరతి సాయిబాబా
మాఝాని ద్రవ్యరేవ తవచరణరజసేవా
మాగణేహేచిఆతా తుహ్మాదేవాదిదేవా
దేవాదిదేవ ఆరతిసాయిబాబా
ఇచ్చితా దీనచాతక నిర్మల తోయనిజసూఖ
మాధవేమాధవాయ సంభాళ ఆపుళిబాక
ఆపుళిబాక ఆరతిసాయిబాబా
సౌఖ్యదాతారజీవాచరణ రజతాలీ ద్యావాదాసా
విసావా భక్తాంవిససావా ఆరతి సాయిబాబా
శిరిడి మారే పండరీపుర సాయిబాబారమావర
బాబారమావర- సాయిబాబారమావర
శుద్దభక్తి చంద్రభాగా భావపుండలీకజాగా
పుండలీక జాగా భావపుండలీకజాగా

2

యహోయహో అవఘేజన కరూబాబాన్సీ వందన
సాయిసీ వందన | కరూబాబాన్సీ వందన ॥

3

గణూహ్మణే బాబాసాయి | దావపావ మారేయాఈ
పావమాఝాయాఈ దావపావ మారేయాఈ ॥
ఘాలీన లోటాంగణ, వందీన చరణ,
డోల్యానీ పాహీన దూపతుఝ |
ప్రేమే ఆలింగన, ఆనందే పూజిన
భావే ఓవాళిన హ్మణే నామా॥

1

త్వమేవ మాతాచ పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ ॥

2

కాయేన వాచా మనసేంద్రియైర్వా,
బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్!
కరోమి యద్యత్సకలం పరస్థి
నారాయణాయేతి సమర్పయామి॥

3

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం,
జానకీ నాయకం రామచంద్రం భజే|
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిః ఓంగురుదేవదత్త
అనంతా తులాతేకసేరే స్తవావే।
అనంతా తులాతే కసేరే సమావే
అనంతాముఖాచా శిణే శేష గాత
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

1

స్మరావేమనీత్వత్పదా నిత్యభావే
ఉరావేతరీ భక్తిసారీ స్వభావే
తరావే జగా తారునీమాయ తాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

2

వసే జోసదా దావయా సంతలీలా
దిసే లోకా పరీ జోజనాలా
పరీ అంతరీజ్ఞానకైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

3

భరాలధలా జన్మహా మాన వాచా
నరాసార్థకా సాధనీభూత సాచా
ధరూసాయి ప్రేమా గళాయా అహంతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

4

ధరావే కరీసాన అల్పజ్ఞ బాలా
కరావే అహ్మాధన్యచుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాన అతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

5

సురా దీక జ్యాంచ్యాపదావందితా
శుదీక జాతే సమానత్వదేశీ
ప్రయాగాది తీర్థే పదీనమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

6

తుఝాజాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీరాసక్రీడా సవేకృష్ణనాథా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

7

తులామాగతో మాగణే ఏకథ్యావే
సాయిరూపధర రాఘోత్తమం
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుమ్
మాయయోపహత చిత్త శుద్ధయే
చింతయా మ్యహ మ్మహర్షిశం ముదా
శరత్సుధాంశు ప్రతిమప్రకాశం
కృపాతపత్రం తవసాయినాథం
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాకరోతు
ఉపాసనాదైవతసాయినాథ
స్తవైర్మయోపాసనాస్తుత్వస్త్వమ్
రామేన్మనోమే తపాదయుగ్మే
భృంగే యదాబే మకరందలుబ్ధః
అనేక జన్మార్జితపాప సంక్షయో
భవేద్భవత్సాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీదసాయీశ సద్గురోదయానిధే
శ్రీ సాయినాథ చరణామృత పూర్ణచిత్తా
త్వత్పాద సేవనరత్సాతతం భక్త్యా
సంసారజన్య దురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామపరమం సమవాప్నువంతి
స్తోత్రమే తత్పఠే ద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాథస్యకృపాపాత్రంభవేద్భవమ్
రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో
రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో
రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో
నదత్త గురుసాయిమా మజవకీ కదీహీ రుసో
పుసోనసునభాయిత్యామజన భ్రాతృజాయాపుసో
పుసోనప్రియసోయరే ప్రియసగేనజ్ఞాతీపుసో
పుసోసుహృదయనాసఖా స్వజననాప్త బంధూపుసో
పరీన గురుసాయిమామజవరీ కదిహీరుసో
పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో
పుసోన గురుదాకుటే మజన దోరసానే పుసో
పుసోనచబలే బురే సుజనసాదుహీన పుసో
పరీన గురుసాయిమా మజవరీకదీహీరుసో
దుసోచతురత్వవిత్ విబుధ ప్రాజ్ఞజ్ఞానీరుసో
రుసో హివిదు స్త్రీయా కుశల పండితాహీరుసో
రుసోమహిపతీయతీ భజకతాపసీపీ రుసో
నదత్త గురుసాయిమా మజవరీ కదిహీరుసో
రుసోకవిఋషి మునీ అనఘుసిద్ధయోగీరుసో
రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో
రుసోఖల పిశాచ్చహీ మలీనడాకినీ హీరుసో
నదత్త గురుసాయిమామజవరీ కదిహీరుసో
రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో
రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధిరుసో
రుసోఖపవనాగ్నివార్ అవనిపంచతత్త్వేరుసో
నదత్త గురుసాయిమా మజవరీ కదిహీరుసో
రుసో విమలకిన్నరా అమలయక్షిణీవారుసో
రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరుసో రుసో
అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో
నదత్త గురుసాయిమా మజవరీ కదీహీరుసో
రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో
రుసోవవుది శాఖిలాకఠినకాల తోహిరుసో
రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో
నదత్త గురుసాయి మామజవరీకదీహీరుసో
విమూఢ హ్మణుని హసో మజనమత్సరాహీ ఢసో
పదాభిరుచి ఉల్హసో జననకర్దమీనాఫసో
నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో
ప్రపంచి మనహేరుసో దృడవిరక్తి చిత్తిరసో
కుణాచిహి ఘృణానసోనచస్పృహకశాచీ అసో
సదైవ హృదయీ వసో మనసిద్యాని సాయివసో
పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో
నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రూసో
హరి ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి
ప్రథమాన్యాసన్ | తేహనాకం మహిమానఃస్సచంత
యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః |
ఓమ్ రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే
నమోవయం వైశ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణోదధాతు
కుబేరాయ వై శ్రవణాయా మహారాజాయనమః
ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం
మహారాజ్య మాధిపత్యంమయం సమంతపర్యాః
ఈశ్యా | సార్వభౌమ: సార్వాయుష ఆన్
తాదాపదార్ధత్ పృథివ్యై సముద్ర పర్యంతాయా
ఏకరాళ్ళితి తద ప్యేష శ్లోకోభిగీతో మరుతః
పరివేష్టారో మరుత్తస్యావసన్ గృహే |
అవిక్షితస్య కామప్రేర్ విశ్వేదేవా సభాసద ఇతి ॥
శ్రీ నారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై
కరచరణ కృతం వాక్కాయ జంకర్మజం వా
శ్రవణనయనం వామానసంవా పరాధమ్ .
విదిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీప్రభోసాయినాథ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Sri Gomatha Ashtottara Shatanamavali In Telugu – గోమాత అష్టోత్తర శతనామావళి

Gomatha Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Gomata Ashtottara Shatanamavali Lyrics

గోమాత అష్టోత్తర శతనామావళి

  1. ఓం కృష్ణవల్లభాయై నమః
  2. ఓం కృష్ణాయై నమః
  3. ఓం శ్రీ కృష్ణ పారిజాతాయై
  4. ఓం కృష్ణ ప్రియాయైనమః
  5. ఓం కృష్ణ రూపాయై నమః
  6. ఓం కృష్ణ ప్రేమ వివర్దిన్యై నమః
  7. ఓం కమనీయాయై నమః
  8. ఓం కళ్యాన్యై నమః
  9. ఓం కళ్య వందితాయై నమః
  10. ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః
  11. ఓం దివ్య కల్ప సమలంకృతాయై నమః
  12. ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః
  13. ఓం క్షీరదాయై నమః
  14. ఓం క్షీర రూపిన్యై నమః
  15. ఓం నందాదిగోపవినుతాయై నమః
  16. ఓం నందిన్యై నమః
  17. ఓం నందన ప్రదాయై నమః
  18. ఓం బ్రహ్మాదిదేవవినుతాయై నమః
  19. ఓం బ్రహ్మ నందవిదాయిన్యై నమః
  20. ఓం సర్వధర్మ స్వరూపిన్యై నమః
  21. ఓం సర్వభూతావనతాయై నమః
  22. ఓం సర్వదాయై నమః
  23. ఓం సర్వామోదదాయై నమః
  24. ఓం శిశ్టేష్టాయై నమః
  25. ఓం శిష్టవరదాయై నమః
  26. ఓం సృష్టిస్థితితిలయాత్మికాయై నమః
  27. ఓం సురభ్యై నమః
  28. ఓం సురాసురనమస్కృతాయై నమః
  29. ఓం సిద్ధి ప్రదాయై నమః
  30. ఓం సౌరభేయై నమః
  31. ఓం సిద్ధవిద్యాయై నమః
  32. ఓం అభిష్టసిద్దివర్షిన్యై నమః
  33. ఓం జగద్ధితాయై నమః
  34. ఓం బ్రహ్మ పుత్ర్యై నమః
  35. ఓం గాయత్ర్యై నమః
  36. ఓం ఎకహాయన్యై నమః
  37. ఓం గంధర్వాదిసమారాధ్యాయై నమః
  38. ఓం యజ్ఞాంగాయై నమః
  39. ఓం యజ్ఞ ఫలదాయై నమః
  40. ఓం యజ్ఞేశ్యై నమః
  41. ఓం హవ్యకవ్య ప్రదాయై నమః
  42. ఓం శ్రీదాయై నమః
  43. ఓం స్తవ్యభవ్య క్రమోజ్జ్వలాయై నమః
  44. ఓం బుద్దిదాయై నమః
  45. ఓం బుద్యై నమః
  46. ఓం ధన ధ్యాన వివర్దిన్యై నమః
  47. ఓం యశోదాయై నమః
  48. ఓం సుయశః పూర్ణాయై నమః
  49. ఓం యశోదానందవర్దిన్యై నమః
  50. ఓం ధర్మజ్ఞాయై నమః
  51. ఓం ధర్మ విభవాయై నమః
  52. ఓం ధర్మరూపతనూరుహాయై నమః
  53. ఓం విష్ణుసాదోద్భవప్రఖ్యాయై నమః
  54. ఓం వైష్ణవ్యై నమః
  55. ఓం విష్ణురూపిన్యై నమః
  56. ఓం వసిష్ఠపూజితాయై నమః
  57. ఓం శిష్టాయై నమః
  58. ఓం శిష్టకామదుహే నమః
  59. ఓం దిలీప సేవితాయై నమః
  60. ఓం దివ్యాయై నమః
  61. ఓం ఖురపావితవిష్టపాయై నమః
  62. ఓం రత్నాకరముద్భూతాయై నమః
  63. ఓం రత్నదాయై నమః
  64. ఓం శక్రపూజితాయై నమః
  65. ఓం పీయూషవర్షిన్యై నమః
  66. ఓం పుణ్యాయై నమః
  67. ఓం పుణ్యా పుణ్య ఫలప్రదాయై నమః
  68. ఓం పయః ప్రదాయై నమః
  69. ఓం పరామోదాయై నమః
  70. ఓం ఘ్రుతదాయై నమః
  71. ఓం ఘ్రుతసంభవాయై నమః
  72. ఓం కార్త వీర్యార్జున మృత హేతవే నమః
  73. ఓం హేతుకసన్నుతాయై నమః
  74. ఓం జమదగ్నికృతాజస్ర సేవాయై నమః
  75. ఓం సంతుష్టమానసాయై నమః
  76. ఓం రేణుకావినుతాయై నమః
  77. ఓం పాదరేణుపావిత భూతలాయై నమః
  78. ఓం శిశ్టేష్టాయై నమః
  79. ఓం సవత్సాయై నమః
  80. ఓం యజ్ఞ రూపిన్యై నమః
  81. ఓం వత్స కారాతిపాలితాయై నమః
  82. ఓం భక్తవత్సలాయై నమః
  83. ఓం వ్రుషదాయై నమః
  84. ఓం క్రుషిదాయై నమః
  85. ఓం హేమ శ్రుజ్ఞాగ్రతలశోభనాయై నమః
  86. ఓం త్ర్యైలోక్య వందితాయై నమః
  87. ఓం భవ్యాయై నమః
  88. ఓం భావితాయై నమః
  89. ఓం భవనాశిన్యై నమః
  90. ఓం భుక్తి ముక్తి ప్రదాయై నమః
  91. ఓం కాంతాయై నమః
  92. ఓం కాంతాజన శుభంకర్యై నమః
  93. ఓం సురూపాయై నమః
  94. ఓం బహురూపాయై నమః
  95. ఓం అచ్చాయై నమః
  96. ఓం కర్భురాయై నమః
  97. ఓం కపిలాయై నమః
  98. ఓం అమలాయై నమః
  99. ఓం సాధుశీతలాయై నమః
  100. ఓం సాధు రూపాయై నమః
  101. ఓం సాధు బృందాన సేవితాయై నమః
  102. ఓం సర్వవేదమయై నమః
  103. ఓం సర్వదేవ రూపాయై నమః
  104. ఓం ప్రభావత్యై నమః
  105. ఓం రుద్ర మాత్రే నమః
  106. ఓం ఆదిత్య సహోదర్యై నమః
  107. ఓం మహా మాయాయై నమః
  108. ఓం మహా దేవాది వందితాయై నమః

మరిన్ని అష్టోత్తరములు: