Sri Shiridi Sai Saptha Swararalu In Telugu – శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి గీతాలు సాధకులను ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీస్తాయి, ప్రేమ, శాంతి, సమాధానం మరియు సాంత్వన అంతా వీటికి ఆధారం ఉంటాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ షిరిడి సాయి సప్త స్వరరాలు గురించి తెలుసుకుందాం…

Sri Sai Saptha Swara Geethikalu Telugu

శ్రీ సాయి సప్త స్వర గీతికలు

గీతిక: 1

సాకి:

తల్లి నీవె తండ్రి నీవె రాగమైన భావమైన
ప్రాణమైన దైవమైన నీవె
మదిని మందిరాన్ని చేసి
పరిచితిమి మమతల సింహాసనాన్ని

పల్లవి:

రావయ్య దేవ రమణీయ రూప
కరుణించ రార కరుణా సముద్ర
ఆలకించ రార ఆత్మబంధు నీవ
ఆపదలను పాపెడు అవని నేలు దైవమ
బాబా నీవే… మా సాయి నీవే

॥రావయ్య ||

చరణం 1:

నీ చల్లని చూపుతో పుడమి పావని ఆయె
నీ కాలు తాకినంత కలి అహం పారిపోయె
ఏనాటి పుణ్య వరమొ, ఏనాటికి తీరని బంధమొ
పాపాలను పాపి వేయ మానవ రూపం దాల్చిన
మమ్ముకన్న దైవమ మరల రావయ్య స్వామి

॥రావయ్య ||

చరణం 2:

పూలు పళ్ళు ధూప దీపాలతో
ప్రేమే నైవేద్యాన్ని చేసి నీ నామమే స్మరిస్తు
రాముడవు నీవంటు రహీమువు నీవంటు
ఏసువైన బుద్ధుడైన నానకైన నీవంటు
నీ రాకకె నీ కోసమె నిరీక్షించగ

॥రావయ్య ॥

గీతిక: 2

పల్లవి:

పాహి పాహి పాహి పాహి
పాపనాశక మా ప్రాణ రక్షక
సాయి సాయి సాయి సాయి
సాధు పుంగవ మా ఇష్ట దైవమా

॥ పాహి॥

చరణం 1:

మా కళ్లలోకి చూడవయ్య కాంతులను నింపగ
లోగిల్లలోకి చేరవయ్య లోపాలను తీర్చగ
మనస్సులోన నిలువవయ్య కలతలను పాపగ
మహిమగల స్వామి నీకు మొక్కెదను భక్తి తోడ
మమత గల తండ్రి నిన్ను తలచెదను ప్రేమ తోడ
ముల్లోకాలనేలు వాడవట సృష్టికి మూలానివట

॥పాహి॥

చరణం 2:

అణువణువు ప్రతి అణువు నీ రాకకె నీ కోసమె
క్షణ క్షణము ప్రతి క్షణము పరితపిస్తున్నవి
పంచ భూతమ్ములు పంచేద్రియాలు
నీ కరుణనె నీ తోడునే కోరుతున్నాయి
నాలుగు వేధమ్ములైన నాలుగు దిక్కులైన
నాలుగు వేళలందు కోటి తారకలైన
నీకే దాసోహమట నీవే బ్రహ్మాండమట

॥పాహి॥

గీతిక: 3

పల్లవి:

షిరిడీ పురం మా సాయీ నగరం
కనులారా గాంచినంత కలుగు దర్శనం- కలుగు సాయి దర్శనం
మనసార తలచినంత పలుకు మందిరం- పలుకు బాబ మందిరం

॥షిరిడీ॥

చరణం 1:

పాపాలను పారద్రోలు పావనదామం
ఆర్థులను అక్కు చేర్చు కరుణాలోకం
గుడి కట్టిన గురుద్వారం కనుపించు కాశీ నిలయం
కీర్తించగ క్రీస్తూ గానం ఆలకించ అల్లా నామం
వెలుగొందె ఈ ద్వారక మాయి క్షేత్రం

||షిరిడీ||

చరణం 2:

రోగాలకు తావు లేదు బోగాలకు తావు లేదు
కోపాలకు రూపు లేదు తాపాలకు తనువు లేదు
మమతకిది మందిరమై భక్తికి భవ సాగరమై
వెలుగొందె ఈ ద్వారకమాయి క్షేత్రం

||షిరిడీ||

గీతిక: 4

సాకి:

బాబా… సాయి బాబా…

పల్లవి:

నీ పాదాలే కడుగన పూజలే సేయన
భక్తితోడ కొలువన భజనలే సేయన
బాబా అని పిలువన సాయీ అని తలువన

॥పాదాలే॥

చరణం:

నీ రూపం నీ నామం ప్రతి అణువున నిండగ
అణువునై పోన నీ చెంతకు నే చేరన

॥పాదాలే॥

నీ ప్రేమ నీ కరుణ ప్రతి పువ్వున విరియగ
పువ్వునై పోన నీ చరణాలను తాకన

॥పాదాలే॥

నీ చూపు నీ తోడు ప్రతి మదిన నిలువగ
భక్తుడనై పోన నే హారతులే యివ్వన

॥పాదాలే॥

గీతిక: 5

పల్లవి:

అన్నింట నీ రూపమె ప్రతినోట నీ నామమె
సద్గురు నాథ మా సాయీ ప్రభువా
పాలించు వాడవు లాలించు వాడవు
మనసున్న వాడవు మానవీయ రూపుడవు

॥అన్నింట॥

చరణం 1:

కుల మతాలు కూల దన్ని ప్రేమలే పంచినావు
మానవతను బోధించి మనస్సులే దోచినావు
భక్తినే చాటి నువ్వు కరుణయే చూపినావు
బాబాగా మిగిలినావు

॥అన్నింట॥

చరణం 2:

అఖిలాండ మూర్తివి అండగ నిలిచినావు
లోకాలను ఏలు నీవు లోగిల్లకు చేరినావు
చింతలనే తీర్చి నువ్వు చీకట్లను బాపినావు
చిదానందునిగా మారినావు

॥అన్నింట॥

గీతిక: 6

పల్లవి:

షిరిడీశ తండ్రి పరమేశ
శివరూప సాయి రామేశ
యేలుకొను వాడవయ్య వరాలిచ్చు వాడవయ్య
మహిమ గల తండ్రివయ్య మహితాత్ముడ నీవయ్య
అలకయేల భూనితివో మంకు నేల పట్టితివో

చరణం 1:

ఆర్థులము మేమయ్య ఒంటరిగా మిగిలితిమి
తోడుగ నిలువ రార తప్పులను తెలుపగ
కన్నులలో నీవుంటివి కడదాక నిలిచి పోర
కపటాలు లేనట్టి కమనీయ రూపుడవు

॥షిరిడీశ॥

చరణం 2:

దైవానివి నీవయ్య దయగల తండ్రివయ్య
భక్తులము మేమురాగ భజనలే సేయగ
ప్రేమతో మమ్ము చేరి భక్తినే చాటర
మానవతారూపుడ మనస్సు గల నాథుడ

॥షిరిడీశ ॥

గీతిక: 7

సాకి:

ఓం షిరిడి నాథాయ నమః
ఓం మాధవ సాయినే నమః

పల్లవి:

జగతికి మూలం సృష్టికి ప్రతి రూపం
మానవతకు మారు పేరు సాయీ నామం
మా బాబా నిలయం

చరణం 1:

ఈశుడు తానె పరమేశడు తానె
జీవుడు తానె దేవుడు తానె
ఆత్మయు తానే పరమాత్మయు తానె
ఎలా పిలిచిన ఎలా తలచిన
పిలిస్తే పలుకు వాడు సాయీ…

॥జగతికి॥

చరణం 2:

లీలలెన్నొ చేయువాడు ప్రేమలే పంచువాడు
కరుణయే చూపు వాడు లోకమ్ముల నేలు వాడు
గీతలోన నిండినాడు ఖురానైన వెలిగినాడు
క్రీస్తుగా పిలిచిన నానకని తలచిన
మదిలోన నిలుచు వాడు సాయీ…..

॥జగతి॥

మరిన్ని పోస్ట్లు:

Leave a Comment