Sri Sai Baba Ekadasa Sutralu In Telugu – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి తెలుసుకుందాం…

Sri Sai Baba Ekadasa Sutralu Telugu

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

  1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
  2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.
  3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
  4. నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును.
  5. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
  6. నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
  7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
  8. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను.
  9. నా సహాయమును గాని, నా నలహాను గాని, కోరిన తక్షణమోసంగ సంసిద్దుడను.
  10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దమే పొడచూపదు.
  11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

మరిన్ని పోస్ట్లు:

Leave a Comment