Go Pooja Phalitamulu In Telugu – గో పూజా ఫలితములు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా ఫలితములు గురించి తెలుసుకుందాం…

Gomata Pooja Phalithalu In Telugu

గో పూజా ఫలితములు

  1. గో ప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానము.
  2. ఆవు కుడి ప్రక్కను బ్రహ్మ ఉండును. అచట పూజించినవారికి సంతానము కలుగును.
  3. గోవు కొమ్ములకు ఎడమప్రక్క విష్ణువు ఉండును. కాన ఆ తావును పూజించిన వారికి జ్ఞానమోక్షములు లభించును.
  4. ఆవు కొమ్ముల చివరిభాగములో మూడు కోట్లు ఏబదిలక్షల తీర్థములు వుండును. వాటిపై చల్లిన నీటిని త్రాగిననూ, శిరస్సున, చల్లుకొనినూ త్రివేణీ సంగమ స్నానఫలము లభించును.
  5. ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు వుండును. కావున మల్లె పూవులతో పూజించి నచో కాశీవిశ్వేశ్వరుని పూజించిన ఫలితము కలుగును.
  6. గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి వసిం చును. ఆ భాగమును పూజించినవారికి చెవి పోటురాదు. సంతాననష్టము వుండదు.
  7. ఆవుచెవియందు అశ్వనీదేవతలు ఉంటారు. ఆ ప్రదేశములను పూజించినచో అసాధ్య రోగములు నివారింపబడును.
  8. ఆవు కన్నులలో సూర్యచంద్రులు వుంటారు. వానిని పూజించినవారికి అజ్ఞానమనే చీకటినశించి జ్ఞానకాంతియు, సకల సంపదలు కలుగును.
  9. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండును. దానిని పూజించినచో సంతానము కలుగును.
  10. ఆవు హుంకారమునందు సరస్వతి వుండును. దానిని పూజించినచో విద్య లభించును.
  11. ఆవు గండస్థలముల (చెక్కిళ్ళు) యందు కుడి భాగమున యముడు, ఎడమభాగమున ధర్మ దేవతయు వుందురు. దానిని పూజించినచో యమబాధలు వుండవు. ధర్మపరులకు లభించే పుణ్యలోకము ప్రాప్తించి, జ్ఞానవృద్ధి యగును.
  12. ఆవు పెదవులయందు ప్రాతఃసంధ్యాది దేవతలు ఉందురు. దానిని పూజించినచో సంధ్యా సమయంలో కావించిన పాపములు తొలగును.
  13. ఆవు కంఠమునందు ఇంద్రుడు వుండును. దానిని పూజించినవారికి ఇంద్రియ పాటవము కలుగును. సంతానాభివృద్ధి యగును. పక్షవా తాది రోగములు రావు.
  14. ఆవు వక్షస్థలము నందు సాధ్యదేవతలు వుం దురు. ఆ భాగమును పూజించినవారికి సాధింపరాని కార్యములు ఉండవు.
  15. ఆవు నాలుగుపాదములలోను నాలుగు పురు షార్ధములు వుండును. ఆ నాల్గింటిని పూజించినవారికి ధర్మార్ధకామమోక్షములు సిద్ధించును.
  16. ఆవు గిట్టలచివరి భాగమున నాగులు వుందురు. ఆ ప్రదేశమున పూజించినవారికి గంధర్వలోకములు లభించును.
  17. ఆవు గిట్టలనందు గంధర్వులు వుందురు. అచట పూజించినవారికి నాగలోకము సిద్ధిం చును. ఈ భూమియందు నాగభయము వుండదు.
  18. ఆవుగిట్టల ప్రక్క భాగములందు దేవవేశ్యలు ఉందురు. అచట పూజించినవారికి అప్సరో లోకము సిద్ధించును.

మరిన్నిపూజా విధానాలు:

Leave a Comment