Kaliyugam In Telugu – కలియుగం

Kaliyugam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కలియుగం నీతికథ.

కలియుగం

[అయిదువేల సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కనక సావధానంగా చిత్తగించండి.]

అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజు వండములకు మార్కండేయ మహామునీంద్రుని దర్శన భాగ్యం లభించింది.

ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెపుతూ తాను ఒకానొకప్పుడు చూపిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు.

ధర్మనందనా !
కృతయుగంలో రాజు ఉండడు. సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింసా నృతదీక్షితులు. అటువంటి సమయంలో సేనలూ, రాజులూ అవసరం లేదు.

త్రేతాయుగంలో సత్య, ధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం మూడు పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడుకాయి.

ద్వాపర యుగంలో సగం మంది ఆధర్మ పరాయణులే. యుగాంత వేళకే కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువు అవుతారు.

ఇక కలియుగం
ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చెయ్యగలడో వాడు సింహా ననం ఎక్కి అధికారం చెలాయిస్తాడు.

అటువంటి వారు అధికారులయినప్పుడు వివేక వంతులకు, కామ లకూ స్థానం ఉండదు. అందువల్ల అవివేకులూ, జ్ఞానశూన్యులూ ఉన దేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు.

వేదాధ్యయనమూ, సత్కతువులూ సాగించి పరబ్రహ్మను ఆరా ధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలూ సేవిస్తూ, రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపవలసిన వీరే యిటువంటి దురాచారాలకూ, దుర్వ్యసనాలకూ లొంగితే వీరి ననుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా!

అసత్యవాదులూ, అల్పాయుర్దాయం కలవారూ పుడుతుంటారు, అంతేకాదు, ఇప్పటివలె ఆజానుబాహులూ, తాళవ్రమాణదేహులూ పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరిచెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవల సిన అంగుష్ఠమాత్ర శరీరాలవారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం

ఆహార పదార్థాలలో రుచిఉఁడదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు, దొరికిన పదార్థం తినడమే.

అంతకన్న ఆశ్చర్యం ఏమిటంటే
సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు.
ఆ యుగంలో మనుషులకు పదహారేళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడి పోతుంది.

ఏడెనిమిది సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా !
మానవుడి పూర్ణాయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా !
పదహారేళ్ళు అంతే !
అప్పటికే అన్నీ తీరిపోతాయి.
మత్స్యమాంసాలు తిపనివారు కనిపించరు.

దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు.

ఏ రోజు తెల్లవారి లేచినా
హత్యలూ, దొమ్మీలు, దోపిడీలు యివే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంచారు.

గోళ్ళూ, వెంట్రుకలూ వివరీతంగా పెంచుకుని రాజవీథులలో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తి కులు కూడా ప్రబలుతారు కదా ! అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు.

పోనీ మనుషులు ఎలా తయారయితే ఏం? అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పౌలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గో సంపద క్షీణి స్తుంది.

గోవుల పాలే కదుటయ్యా ! మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు.

ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్లు ప్రజ లను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు.

పాపిష్ఠి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదిరిస్తుంది. జనవనార వంటి వానితో తయారయిన వస్త్రాలు ధరించి తిరుగుతారు.

కన్యాదానాలు, వివాహాలూ ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు వచ్చిన యిద్దరు ముగ్గురు యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం.

శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు.

ధర్మనందనా !
ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి, నీడయిచ్చి, విద్య నేర్చే, ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి ‘దేహి’ అన్న పిలుపు వినబడితే ఆదరంతో అన్న దానం చేసే సంసారులు కనిపిస్తున్నారు.

కలియుగంలో అన్న దానం, విద్యాదానం ఉండవు. అన్నా హా రాలు అమ్ముకుంటారు. విద్యకూడా వ్యాపార వస్తువే అవుతుంది.

అన్నవిక్రయం, విద్యావిక్రయం ఆరంభించాక యింక ఏం జరు గుతుందో ఊహించలేవు.

అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి.

ప్రజలకు పచ్చని పొలాలూ, తోటలూ ఉంటే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగర వాస వ్యామోహమే। పల్లెలు నిర్జన ప్రాంతా అవుతాయి. పంటలు పశి స్తాయి.

యుగాంత సమయంలో ఝంఝామారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది.

ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు. భగభగలాడుతూ అగ్ని జ్వాలలు. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది.

అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. ఆది యుగసంధి.

నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు.

కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చ పచ్చని చెట్లతో, అతలతో, ఫల, పుష్ప భరితం అవుతుంది.

ప్రజలు జరా రోగపీడలు లేకండా అన్న దాన, విద్యాదానాది సత్రా ర్యాలతో సుఖంగా ఉంటారు”. అది కృతయుగం.
అన్నాడు మార్కండేయుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Narayani Stuti In Telugu | నారాయణి స్తుతి

Narayani Stuti In Telugu

Narayani Stuti In Telugu Lyrics

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నారాయణి స్తుతి స్తోత్రము గురించి తెలుసుకుందాం…

నారాయణి స్తుతి

సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తు తే ||

కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తు తే ||

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తు తే ||

సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తు తే ||

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తు తే ||

హంసయుక్తవిమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |
కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమోస్తు తే ||

త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని |
మాహేశ్వరీస్వరూపేణ నారాయణి నమోస్తుతే ||

మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోస్తు తే ||

శంఖచక్రగదాశార్జగృహీతపరమాయుధే |
ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోస్తు తే ||

గృహీతోగ్రమహాచక్రే దంష్టోద్ధృతవసుంధరే |
వరాహరూపిణి శివే నారాయణి నమోస్తు తే ||

నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే |
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోస్తు తే ||

కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |
వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోస్తు తే ||

శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |
ఘోరరూపే మహారావే నారాయణి నమోస్తు తే ||

దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |
చాముండే ముండమథనే నారాయణి నమోస్తు తే ||

లక్ష్మి లజ్జీ మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే |
మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తు తే ||

మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే ||

మరిన్ని స్తోత్రాలు:

Durga Saptashati Uttara Nyasa In Telugu (Upasamharaha) | దుర్గా సప్తశతీ ఉత్తరాన్యాసః

Durga Saptashati Uttara Nyasa In Telugu

Durga Saptashati Uttara Nyasa (Upasamharaha) 

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతీ ఉత్తరాన్యాసః స్తోత్రము గురించి తెలుసుకుందాం…

దుర్గా సప్తశతీ ఉత్తరాన్యాసః

|| అథ ఉత్తరన్యాసః ||

కరన్యాసః

ఓం ఖడ్గనీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా ||
అంగుష్ఠాభ్యాం నమః |

ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ||
తర్జనీభ్యాం నమః |

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి ||
మధ్యమాభ్యాం నమః |

ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యంతఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ ||
అనామికాభ్యాం నమః |

ఓం ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తేజంబికే |
కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః ||
కనిష్ఠికాభ్యాం నమః |

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమోస్తు తే ||
కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః 

ఓం ఖడ్గనీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా ||
హృదయాయ నమః |

ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ||
శిరసే స్వాహా |

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే |
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి ||
శిఖాయై వషట్ |

ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యంతఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ ||
కవచాయ హుమ్ |

ఓం ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తేజంబికే |
కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః ||

నేత్రత్రయాయ వౌషట్ |

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమోస్తు తే ||
అస్త్రాయ ఫట్ ||

భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ||

ధ్యానమ్ –

విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ |
హస్త్రైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

లమిత్యాది పంచపూజా 

లం పృథివీతత్త్వాత్మికాయై చండికాయై నమః గంధం పరికల్పయామి |
హం ఆకాశతత్త్వాత్మికాయై చండికాయై నమః పుష్పం పరికల్పయామి |
యం వాయుతత్త్వాత్మికాయై చండికాయై నమః ధూపం పరికల్పయామి |
రం తేజస్తత్త్వాత్మికాయై చండికాయై నమః దీపం పరికల్పయామి |
వం అమృతతత్త్వాత్మికాయై చండికాయై నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
సం సర్వతత్త్వాత్మికాయై చండికాయై నమః సర్వోపచారాన్ పరికల్పయామి |

అనేన ప్రథమ-మధ్యమ-ఉత్తమచరిత్రం మంత్రపారయణేన భగవతీ సర్వాత్మికా శ్రీచండికాపరమేశ్వరీ ప్రీయతామ్ ||

మరిన్ని స్తోత్రాలు:

Sri Sai Madhyana Aarti In Telugu – శ్రీ సాయి మధ్యాహ్న ఆరతి

Sri Sai Madhyana Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి మధ్యాహ్న ఆరతి గురించి తెలుసుకుందాం…

Sai Baba Madhyana Aarti Telugu Lyrics

శ్రీ సాయి మధ్యాహ్న ఆరతి

(మధ్యాహ్నం 12 గం॥లకు ధూప దీపనైవేద్యానంతరం ఐదు వత్తులతో ఆరతి యివ్వాలి.)

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఘేఉని పంచాకరతీ కరూబాబాన్సీ ఆరతీ
సాయీసీ ఆరతీ కరూబాబాన్నీ ఆరతీ
ఉఠా ఉఠాహో బాన్ ధవ ఓవాళూ హరమాధవ
సాయీరామాధవ ఓవాళూ హరమాధవ
కరూనియాస్థిరమన పాహుగంభీరహేధ్యానా
సాయీచే హేధ్యానా పాహుగంభీర హేధ్యానా
కృష్ణ నాథా దత్తసాయీ జడో చిత్తతురే పాయీ
చిత్త (దత్త) బాబాసాయీ జడోచిత్తతుఝ పాయీ
ఆరతి సాయిబాబా సౌఖ్యదాతారజీవా
చరణారజతాలి ద్యావాదాసావిసావ
భక్తాంవిసావ ఆరతిసాయిబాబా
జాళునియ అనంగస్వస్వరూపిరాహేదంగ
ముముక్ష జనదాని నిజడోళా శ్రీరంగ
డో శ్రీరంగ ఆరతి సాయిబాబా
జయమనీ జైసాభావ తయతైసాను భావ
దావిసిదయాఘనా ఐసీతుఝహిమావ
తుఝహిమా ఆరతి సాయిబాబా
తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యాధా
అగాధ తవకరణీమార్గదావిసి అనాధా
దావిసి అనాథా ఆరతిసాయిబాబా
కలియుగి అవతార సగుణ పరబ్రహ్మ సచార
అవతార్ణఝాలాసే స్వామిదత్తాదిగంబర
దత్తాదిగంబర ఆరతి సాయిబాబా
ఆరాదివసా గురువారీ భక్తకరీతి వారీ
ప్రభుపద పహావయా భవభయ
నివారిభయానివారి ఆరతిసాయిబాబా
మాఝా నిజద్రవ్య రేవ తవ చరణరజసేవా
మాగణే హేచి ఆతాతుహ్మా దేవాదిదేవా
దేవాదిదేవా ఆరతిసాయిబాబా
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవేమాధవాయ సంబాళ ఆపుళీభాక
ఆపుళీభాకఆరతి సాయిబాబా
సౌఖ్య దాతారజీవచరణ రజతాలీ
ద్యావాదాసావిసావా భక్తాం విసావా ఆరతి సాయిబాబా
జయదేవ జయదేవ దత్తా అవదూత ఓ సాయి అవదూత
జోడుని కరతవ చరణీఠేవితోమాథా జయదేవ జయదేవ
అవతరసీతూ యేతా ధర్మాన్ తే గ్లానీ
నాస్తికానాహీతూ లావిసి నిజభజనీ
దావిసినానాలీలా అసంఖ్య రూపానీ
హరిసీ దేవాన్ చేతూ సంకట దినరజనీ
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీ ఠేవితోమాధా జయదేవ జయదేవ
యవ్వనస్వరూపీ ఏక్యా దర్శనత్యాది ధలే
సంశయ నిరసునియా తద్వైతాఘాలవిలే
గోపిచందా మందాత్వానీ చీ ఉద్దరిలే
మోమిన వంశీ జన్ముని లోకా తారియలే
జయదేవ జయదేవ దత్త అవదూతా ఓ సాయీ అవదూత
జోడుని కరతవ చరణీ ఠేవితో మాథా జయదేవ జయదేవ
భేదతత్త్వ హిందూ యవనాన్ చాకాహీ
దావాయాసిఝాలాపునరపినరదేహి
పాహసి ప్రేమానేన్తూ హిందుయవనాహి
దావిసి ఆత్మత్వానే వ్యాపక సాయీ
జయదేవ జయదేవ దత్తా అవదూత ఓ సాయీ అవదూత
జోడు నికర తవ చరణి ఠేవితోమాధా జయదేవ జయదేవ
దేవసాయినాథా త్వత్పదనత హ్వానే
పరమాయామోహిత జనమోచన ఝణిహ్వానే
తత్కృపయా సకలాన్ చే సంకటనిరసావే
దేశిల తరిదేత్వదృశ కృష్ణానేగానే
జయదేవ జయదేవ దత్తా అవదూతా ఓ సాయి అవదూతా
జోడుని కరతవ చరణి ఠేవితో మాథా జయదేవ జయదేవ
శిరిడి మారే పండరిపుర సాయిబాబారమావర
బాబారమావర- సాయిబాబారమావర
శుద్దభక్తిచంద్ర భావ భావపుండలీకజాగా
పుండలీక జాగా – భావపుండలీకజాగా
యహోయాహో అవఘే జన- కరూబాబాన్సీవందన
సాయిసీవందన కరూబాబాన్సీ వందన
గణూహ్మణే బాబాసాయీ – దావపావమాఝ ఆఈ
పావమారే ఆఈ – దావపావమారే ఆఈ
ఘాలీన లోటాంగణ వంటిన చరణ
డోల్యానిపాహీనరూపతురే
ప్రేమే ఆలింగన ఆనందేపూజిన్
భావే ఓవాళిన హ్మణేనామా
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బందుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ
కాయేన వాచా మనసేంద్రియేర్వా
బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణా యేతి సమర్పయామి
అచ్యుతంకేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే
హరేరామ హరేరామ రామరామ హరేహరే |
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే |
శ్రీ గురుదేవదత్త
హరిః ఓం యజ్ఞేనయజ్ఞమయజంత దేవాస్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమాన: సచంత
యత్ర పూర్వేసాద్యా స్సంతిదేవా
ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం పై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజయనమః
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్రం రాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా సార్వభౌమ సార్వా యుషాన్
తాదాపదార్దాత్ పృథిమైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళతి తదప్యేష శ్లోకోబిగీతో మరుతః
పరివేష్టారో మరుత్త స్యావసన్ గృహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి.
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై
అనంతా తులాతే కసిరే స్తవావే
అనంతాతులాతే కసిరే నమావే
అనంతా ముఖాచా శిణే శేష గాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

1

స్మరావే మనీత్వత్పదా నిత్యభావే
ఉరావే తరీభక్తి సారీ స్వభావే
తరావేజగా తారునీ మాయతాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

2

వసేజో సదా దావయా సంతలీలా
దిసే ఆజ్ఞ లోకాపరీ జో జనాలా
పరీ అంతరీజ్ఞాన కైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

3

భరాలాధలా జన్మహా మానవాచా
నరాసార్థకా సాధనీభూతసాచా
ధరూసాయీ ప్రేమా గళాయాఅహంతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

4

ధరావే కరీసాన అల్పజ్ఞబాలా
కరావే ఆహ్మాధన్య చుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాన ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

5

సురాదీక జ్యాంచ్యా పదా వందితాతీ
సుకాదీక జాతే సమానత్వదేతీ
ప్రయాగాదితీర్థే పదీ నమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

6

తుఝ్యా జ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపి మిళాలీ
కరీరాసక్రీడా సవే కృష్ణనాథా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా

7

తులామాగతో మాగణే ఏకద్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీరాజ హతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా

8

ఐసా యేఈబా ! సాయి దిగంబరా
అక్షయరూప అవతార | సర్వహివ్యాపక తూ
శృతిసారా అనసూయాత్రికుమారా (బాబాయే) మహరాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొల్హాపురభిక్షేసీ
నిర్మలనది తుంగా జలప్రాసీ నిద్రాహురదేశీ
ఐసా యే యీబా
ఝళీలోంబతేసే వామకరీ త్రిశూల ఢమరూధారి
భక్తావరదసదా సుఖకారీదేశీల ముక్తీచారీ
ఐసా యే యీబా
పాయిపాదుకా జపమాలా కమండలూమృగఛాలా
ధారణకరిశీబా నాగజటాముకుట శోభతోమాధా
ఐసా యే యీబా
తత్పర తుఝ్యాయా జేడ్యానీ అక్షయత్వాంచేసదవీ
లక్ష్మీవాసకరీ దినరజనీ రక్షసిసంకట వారుని
ఐసా యే యీబా
యాపరిధ్యాన తుఝ గురురాయా దృశ్య కరీనయనాయా
పూర్ణానంద సుఖీహీకాయా
లావిసిహరి గుణగాయా ఐసాయేయీబా
సాయి దిగంబరా అక్షయ రూప అవతారా
సర్వహివ్యాపకతూశృతిసారా అనసూయాత్రి
కుమారా మహరాజే (బాబాయే) యీబా
సదాసత్వరూపం చిదానందకందం
జగత్సంభవ స్థాన సంహారహేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

1

భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యమ్
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణంత్వాం
నమామీశ్వరమ్ సద్గురుం సాయినాథమ్

2

భవాంభోది మగ్నార్థి తానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియణాం
సముద్దారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

3

సదానింబవృక్షస్య మూలాధివాసాత్
సుదాస్రావిణంతిక్తమస్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికమ్ సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

4

సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్ద్భావబుద్దా సపర్యాది సేవామ్
నృణాంకుర్వతాంభుక్తి ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

5

అనేకా శృతా తర్క్యలీలా విలాసై:
సమా విఘృతేశాన భాస్వత్ప్రభావమ్
అహంభావహేనమ్ ప్రసన్నాత్మ భావమ్
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

6

సతాంవిక్రమారామమేవాభిరామమ్
సదాసజ్ఞనై సంస్తుతం సన్నమద్భి:
జనామోదదం భక్త భద్ర ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

7

అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవానతీర్థమ్
భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్

8

శ్రీసాయీశ కృపానిదే ఖిలనృణాం సర్వార్థసిద్ధిప్రద
యుష్మత్పాదరణ: ప్రభావమతులం ధాతాపివక్తా అక్షమ:
సద్భక్తాశ్మరణం కృతాంజలిపుటః సంప్రాప్తితో స్మిన్ ప్రభో
శ్రీమత్సాయిపరేశ పాద కమలానాన్యచ్ఛరణ్యంమమ

9

సాయి రూప ధరరాఘోత్తమం
భక్తకామ విబుధ ద్రుమంప్రభుమ్
మాయయోపహత చిత్త శుద్ధయే
చింతయామ్యహే మ్మహర్నిశం ముదా

10

శరత్సుధాంశు ప్రతిమంప్రకాశం
కృపాత ప్రతంవసాయినాథ
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయతాప మపాకరోతు

11

ఉపాసనాదైవత సాయినాథ
స్మవైర్మ యోపాసని నాస్తువంతమ్
రామేన్మనోమే తవపాదయుగ్మే
భృంగో యదాబే మకరందలుబ్ధ:

12

అనేకజన్మార్జితపాప సంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయీశ సద్గురోదయానిథే

13

శ్రీ సాయినాథ చరణామృతపూర్ణచిత్తా
తత్పాద సేవనరతా సృత తంచ భక్త్యా
సంసార జన్యదురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి

14

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోనరస్తన్మనాసదా
సద్గురో: సాయినాథస్యకృపాపాత్రం భవేద్భవమ్

15

కరచరణకృతం వాక్కాయజం కర్మజంవా
శ్రవణనయనజంవామానసంవా పరాథమ్
విదితమవిదితం వాసర్వమేతత్ క్షమస్వ
జయజయ కరుణార్ధే శ్రీ ప్రభోసాయినాథ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్కజై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Sri Sai Kakad Aarti In Telugu – శ్రీ సాయి కాకడ ఆరతి

Sri Sai Kakad Aarti In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని “హారతి” లేదా “ఆరతి” అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి కాకడ ఆరతి గురించి తెలుసుకుందాం…

Sri Sai Kakad Aarti Lyrics Telugu

శ్రీ సాయి కాకడ ఆరతి

(ఉదయం గం॥ 5-15 ని॥లకు దీపము, అగరవత్తులు వెలిగించి వెన్న నివేదన చేసి ఐదు వత్తులతో హారతి యివ్వాలి)

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.

1. జోడూ నియాకరచరణి ఠేవిలామాథా
పరిసావీ వినంతీ మాఝ పండరీనాథా

1

అసోనసో భావాఆలో- తూఝియాఠాయా
కృపాదృష్టిపాహే మజకడే సద్గురూరాయా

2

అఖండిత అసావేఐసే- వాటతేపాయీ
సాండునీ సంకోచ్గావ్ – థోడాసాదేయీ

3

తుకాహ్మణే దేవామారీ వేడీవాకుడీ
నామే భవపాశ్ హాతి – ఆపుల్యాతోడీ

4

2. ఉఠాపాండురంగా ఆతా ప్రభాత సమయో పాతలా |
వైష్ణవాంచా మేళా గరుడ-పారీ దాటలా॥

1

గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా|
సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్

2

శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యా కోటీ
త్రిశూలఢమరూ ఘుఉని ఉభా గిరిజేచాపతీ

3

కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ
పాఠీమాగే ఉభీడోలా లావునియాజనీ

4

3. ఉఠా ఉఠా శ్రీసాయినాథగురుచరణకమల దావా
ఆధివ్యాది భవతాప వారునీ తారా జడజీవా

1

గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా
పరిహీ అజ్ఞానాసీ తమచీ భులవియోగమాయా

2

శక్తిన అహ్మాయత్కించిత్ హీ తిజలాసారాయా
తుహ్మీచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా

3

భో సాయినాథ్ మహరాజ్ భవ తిమిరనాశకరవీ
అజ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ

4

తీవర్ణితాభా గలే బహువదనిశేష విధికవీ
సకృపహోఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా

5

ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురుచరణకమల దావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
భక్తమనీసద్భావ ధరునికే తుహ్మాఅనుసరలే
ద్యాయాస్తవతే దర్శనతుమచే ద్వారి ఉబేరేలే

6

ద్యానస్థా తుహ్మాస పాహునీ మన అముచేఘాలే
పరితద్వచనామృత ప్రాశాయా ఆతుర తేఝాలే

7

ఉఘడునీ నేత్రకమలా దీనబంధూరమాకాంతా
పాహిబాకృపాదృష్టి బాలకాజసీ మాతా

8

రంజవీమధురవాణీ హరితావ్ సాయినాథా
అహ్మిచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా

9

సహనకరిశిలె ఐకువిద్యావీ భేట్ కృష్ణదావా

10

ఉఠా ఉఠా శ్రీసాయినాథ్ గురుచరణకమల దావా
ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా

4. ఉఠా పాండురంగా ఆతా దర్శనద్యాసకళా
ఝాలా అరుణోదయాసరలీ- నిద్రేచెవేళా

1

సంతసాధూమునీ అవఘే ఝాలేతీగోళా
సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా

2

రంగమండపే మహాద్వారీ ఝాలీసేదాటీ
మనఉ తావీళరూప పహావయాదృష్టి

3

రాయీరఖుమాబాయి తుహ్మాయే ఊద్యాదయా
శేజే హాలవునీ జాగే కరాదేవరాయా

4

గరూడ హనుమంత ఉభే పాహతీవాట్
స్వర్గీచే సురవరఘే ఉని ఆలేభోభాట్

5

ఝాలే ముక్త ద్వారా లాభ్ ఝాలారోకడా
విష్ణుదాస్ నామ ఉభా ఘే ఉనికాక

6

5. ఘేఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ
ఉఠాఉఠాహో బాంధవ ఓవాళూ హరమాధవ
కరూనియా స్థిరామన పాహుగంభీరాహేధ్యాన
కృష్ణనాథా దత్తసాయీ జడో చిత్త తురేపాయీ
కాకడ ఆరతీ కరీతో ! సాయినాథ దేవా
చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాకలఘు సేవా

।।కా।।

6. కామక్రోధమదమత్సర ఆటుని కాకడాకేలా
వైరాగ్యాచే తూక్కాడునీ మీతో బిజవీలా
సాయినాథగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా
తద్వృత్తి జాళునీ గురునే ప్రకాశపాడిలా
ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉనిబాలకలఘ సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాథ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకలఘసేవా
భూ ఖేచర వ్యాపూనీ అవఘే హృత్కమలీరాహసీ
తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ
రాహునియేధే అన్యస్త్రహి తూ భక్తాస్తవధావసీ
నిరసుని యా సంకటాదాసా అనుభవ దావీసీ
నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాథ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా
త్వదృశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే
సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీ ఆలే ।
ప్రాశుని తద్వచనామృత అముచేదేహబాన్ హరఫలే
సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే
కృపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
కాకడా ఆరతీకరీతో సాయినాథ దేవా
చిన్మయ రూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
భక్తీచియా పోటీబోద్ కాకడ జ్యోతీ
పంచప్రాణజీవే భావే ఓవాళూ ఆరతీ
ఓవాళూ ఆరతీమాఝ్యా పండరీనాథా మాఝ్యా సాయినాథా
దోనీ కరజోడునిచరణీ ఠేవిలామాథా
కాయమహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ
కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ
మయూరపించ చామరేడాళితి సాయీంచ ఠాయి
తుకాహ్మణే దీపఘే ఉని ఉన్మనీతశోభా
విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా
ఉఠాసాదుసంతసాదా ఆపులాలే హితా
జాఈలాఈల్ హానరదేహ మగకైచా భగవంత

1

ఉఠోనియా పహటేబాబా ఉభా అసేవీటే
చరణతయాంచేగోమటీ అమృత దృష్టీ అవలోకా

2

ఉరాహోవేగేసీచలా జ ఊరా ఉళాసీ
జలతిలపాతకాన్ చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా

3

జాగేకరారుక్మిణీవరా దేవ అహేనిజసురాన్
వేగేలింబలోణ్ కరా- దృష్టి హో ఈల్ తయాసీ
దారీబాజంత్రీ వాజతీ డోలు డమామే గర్జతీ
హోతసేకాకడారతి మఝ్యా సద్గురు రాయచీ
సింహనాథ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ
కేశవరాజ విఠేవరీ నామాచరణ వందితో
సాయినాథ గురుమారే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై
దత్తరాజ గురుమాఝ ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
సాయినాథ గురుమారే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ
స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ
హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్థనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

1

తమా నిరసి భానుహాగురుహి నాసి అఙ్ఞానతా
పరంతుగురు చీకరీ నరవిహీకదీ సామ్యతా
పునాతిమిర జన్మఘే గురుకృపేని అఙ్ఞాననా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

2

రవి ప్రగటహో ఉని త్వరితఘాల వీ ఆలసా
తసాగురుహిసోడవీ సకల దుష్కృతీ లాలసా
హరోని అభిమానహీ జడవి తత్పదీభావనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

3

గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాంచీ ఉణీ
ని మగ్ ఏ ఇతీ కవని యా ఉగీపాహూణి
తుఝచ ఉపమాతులాబరవిశోభతేసజ్జనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

4

సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసాకడే
అజాతరిపు సద్గురో అఖిల పాతకా భంజనా
సమర్ధ గురుసాయినాథ పుర వీ మనోవాసనా

5

అహాసుసమయాసియా గురు ఉఠోనియా బైసలే
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే
ఆసాసుహిత కారియా జగతికోణిహీ అన్యనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

6

అసేబహుతశాహణా పరినజ్యాగురూఁచీకృపా
నతతృ్వహిత త్యాకళేకరితసే రికామ్యా గపా
జరీగురుపదాధరనీ సుదృడ భక్తినేతోమనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

7

గురోవినతి మీకరీ హృదయ మందిరీ యాబసా
సమస్త జగ్ హే గురుస్వరూపచి ఠసోమానసా
గడోసతత సత్కృతీయతిహిదే జగత్పావనా
సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా

8

11. ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్థితీ ప్రభాతి
త్యాఁచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమీనిత్యశాంతి
ఐసే హేసాయినాధేకథునీ సుచవిలే జేవియాబాలకాశీ
తేవిత్యాకృష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై

12. సాయిరహమ్ నజర్ కరనా బచ్చోంకాపాలన్ కరనా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోంకాపాలన్ కరనా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
దాసగణూకహే అబ్క్యాబోలూ థక్యీమేరీరసనా
దాసగణూకహే అబ్క్యాబోలూ థక్యీమేరీరసనా
సాయిరహమ్ నజర్ కరనాబచ్చోంకాపాలన్ కరనా
సాయిరహమ్ నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
రామ్ నజర్ కరో, అబ్మెరేసాయీ
తుమబీన నహిముఝ మాబాల్బాయీ రామ్ నజర్ కరో
మై అందాహూ బందా తుహ్మారా – మై అందాహూ బందా తుహ్మారా
మైనాజానూ, మైనాజానూ-మైనాజానూ-అల్లాఇలాహి
రామ నజర్ కరో రామ్ నజర్ కరో అబ్ మేరా సాయీ
తుమబీన నహిముఝ మాబాషా భాయీ – రామ్ నజర్ కరో
రామ నజర్ కరో రామ్ నజర్ కరో
ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా
సాథీ ఆఖిర్ కా సాథీ ఆఖిర్ఆ-సాదీకాఖిర్ కా కియానకోయీ
రామ్ నజర్ కరో రామ్ నజర్ కరో అభ్ మోరే సాయీ
తుమబిన నహి ముఝ మాబాప్ భాయీ
రామ నజర్ కరో రామ్ నజర్ కరో
అప్నేమనే దాకా జాడూగనూహై
అప్నేమస్జిదాకా జాడూగనూ హై
మాలిక్ హమారే మాలిక్ హమారే
మాలిక్ హమారే తుమ్ బాబాసాయీ
రామ్నజర్కరో రామ్నజర్ కరో అబ్మే నేసాయీ
తుమబిన నహి ముఝ మాబాప్ భాయీ
రాహమ్ నజర్ కరో రహమ్నజర్ కరో

14. తుజకాయదేఉ సావళ్య మీభాయాతరియో
తుజకాయదేఉ సద్గురు మీభాయాతరియో
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
ఉచ్చిష్ఠ తులాదేణేహి గోష్ట నాబరి యో
ఉచ్చిష్ఠ తులాదేణేహి గోష్ట నాబరి
తూ జగన్నాథ్ తుజచే కశీరేభాకరి
తూ జగన్నాథ్ తుజచే కశీరేభాకరి
నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా
మధ్యాహ్నరాత్రి ఉలటోనిగే లిపి ఆతా అణచిత్తా
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరియో
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరి
అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి-అణతీల్ భక్త నైవేద్యహి నానాపరీ
తుజకాయదేఉ మీభాయా తరియో
తుజకాయ సద్గురు మీభాయా తరీ
మీదుబళి బటిక నామ్యాచి జాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యాచి జాణ శ్రీహరీ
శ్రీసద్గురు బాబాసాయీ హో – శ్రీ సద్గురు బాబాసాయీ
తుజవాచుని అశ్రయనాహీబూతలీ- తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా-మీపాపిపతితధీమంతా
తారణేమలా గురునాథా ఝడకరీ-తారణేమలా సాయినాథా ఝడకరీ
తూశాంతిక్షమేచామేరూ తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ వీచేతారు గురువరా
తుమి భవార్ణ వీచేతారు గురువరా
గురువరామజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లవలాహీ
మీబుడతో భవభయడోహే ఉద్దరా
మీబుడతో భవభయడోహీ ఉద్దరా
శ్రీసద్గురు బాబాసాయీ హో – శ్రీ సద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ
తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై
రాజుధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహరాజ్
(పుష్పములు చల్లవలెను)
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై

మరిన్ని పోస్ట్లు:

Satyanarayana Vrata 5th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 5th Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – పంచమోధ్యాయః

మునులారా! మీకు మరియొక కథ వినిపించెదను. వినుడు. పూర్వము తుంగద్వజుడను రాజుండెను. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుచు ధర్మముగా పాలించుచుండెను. ఒకప్పుడాతడు వేటకు వెళ్ళి అనేక మృగములను జంపి, అలసి ఒక మారేడు చెట్టు క్రింద విశ్రాంతికై ఆగి, ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి కూడ ఆ సమీపమునకు వెళ్ళక తాను రాజునను గర్వముతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యము చేసెను. వ్రతము పూర్తైన తరువాత ఆ గోపాలురు ప్రసాదము దెచ్చి రాజు నెదుట ఉంచి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడ ప్రసాదమును స్వీకరించిరి. రాజు అహంకారముతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళిపోయెను. అందువల్ల రాజునకు నూరుమంది కొడుకులును, ధనధాన్యములను, ఐశ్వర్యములను నశించి చాల దుఃఖములు కలిగెను. సత్యదేవుని ప్రసాదమును తిరస్కరించి వచ్చినాను గనుక, ఆయన కోపము వల్లనే నాకీ యనర్ధము కలిగినది. ఆ గొల్లలు సత్యదేవుని పూజించినచోటుకే మరల వెళ్ళి నేనును ఆ దేవునారాధించెదను. అని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలురు ఉన్నచోటు వెదుకుకొనుచు వెళ్ళెను. రాజు గోపాలురును జూచి మీరు జేసిన వ్రతమేదో చెప్పుడని యడిగి, వారితో గలసి భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చెసెను. సత్యదేవుని అనుగ్రహము వలన మరల ధనదాన్యాధిక సంపదలను పుత్రులను పొంది రాజ్య సుఖములనుభవించి, చివరకు సత్యలోకమును బొందెను. పరమోత్తమమైన యీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారును, ఎవరైనా చేయచుండ చూచువరైనను, కథను విన్నవరైనను, సత్యనారాయణ స్వామి యనుగ్రహము వలన ధనధాన్యాది సంపదలను, పుత్రపౌత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వసౌఖ్యాలను అనుభవించి పరమున మోక్షము నొందుదురు. ఈ వ్రతమును భక్తిశ్రద్దలతో చేసినచో, దరిద్రుడు దనవంతుడగును. బందింపబడినవాడు విముక్తుడగును. బయటి శత్రువుల వలనగాని, అంతశ్శత్రువులైన కామక్రోధాధుల వలన గాని, జనన మరణరూపమైన సంసారము వలన గాని, భయమందినవాడు ఆ భయమునుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నియు లభించుటచే ఆనందించి, చివరకు సత్యలోకమునకు చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా మానవులను సర్వదుఃఖములనుండియు విముక్తులను జేయగల్గిన ప్రభావముగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, ఆచరించి ఫలమును బొందినవారి కథలను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగములో, సమస్త దుఃఖములు తొలుగుటకును, సర్వసౌఖ్యములు కలుగుటకును, తుదకు మోక్షము నిచ్చుటకును ఈ సత్యనారాయణ వ్రతమును మించినది ఏదియు లేదు. కలియుగమున కొందరు దేవుని సత్యమూర్తియనియు, కొందరు సితేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచెదరు. ఎవ్వరే పేరుతో బిలిచినను పలికెడి దయామయుడైన ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చెడివాడై కలియుగమున వ్రతరూపుడై ప్రకాశించుచుండును. వ్రతము చేయుచున్నప్పుడు చూచినను, వ్రతకథను విన్నను, సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన సర్వపాపములును నశించును.

తి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే పంచమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము సమాప్తము.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Naraduni Upadesam Vinandi In Telugu – నారదుని ఉపదేశం వినండి

Naraduni Upadesam Vinandi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నారదుని ఉపదేశం వినండి నీతికథ.

నారదుని ఉపదేశం వినండి:

(నారదుడి పేరు వినే సరికి చాలామంది ఫకాలున నవ్వుతారు. ఆయన విదూషకుడనీ, కలహ ప్రియుడనీ ఈ అభిప్రాయానికి కారణం యిటీవలి కాలపు నాటకాలు, సినిమాలు మాత్రమే. భారత, భాగవత, రామాయణాలలో కనిపించే నారదుడు దేవముని, భక్తి తత్త్వవేత్త, మహాజ్ఞాని. అటువంటి మహామహునికి విదూ షక రూపం కల్పించిన పుణ్యాత్ములకు నమస్కారం.)

మహాభారతంలో నారద మహర్షి దర్శనం మొదటిసారి సభా పర్వంలో లభిస్తుంది.

ఇంద్ర ప్రస్థంలో ధర్మరాజు మయసభా భవనంలో సింహాసనం మీద ఉండగా ఆ ఉత్సవం చూడడానికి వచ్చాడు నారదుడు.

ఆ మునీంద్రునికి ఎదురేగి స్వాగతం యిచ్చి, అసనంచూపి, అతిథి మర్యాదలు జరిపాడు, పాండవాగ్రజుడు.

అప్పుడా మునీంద్రుడు ఆనందంతో ఆశీర్వదించి:
‘ధర్మనందనా ! నిన్ను సింహాసనంమీద చూడడం సంతోషంగా ఉంది. అయితే యింతకు పూర్వం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నీ తండ్రి తాతలందరూ ఏ విధానాలు అవలంబించారో ఆ మార్గాలను విడనాడ కుండా ఉంటున్నావా? నీ రాజ్యంలో ప్రజలందరినీ సమానదృష్టితో చూసుకుంటున్నావా ? ధనలోభానికి లొంగి కొందరిని ప్రేమతోనూ, మరికొందరిని ద్వేషంతోనూ చూడడం లేదుకదా! ఆదిచాలా అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు రాజుకే ముప్పు తెస్తుంది.

ఏ మానవుడయినా, ఉదయంపూట ధర్మకార్యాలు కొనసాగించాలి. మధ్యాహ్న సమయాల్లో ధన సంపాదన మార్గాలు ఆలోచించాలి. రాత్రి పూట కామభోగాలు అనుభవించాలి.

ఈ విధంగా సామాన్యులు నడవాలంటే మహారాజు వారికి మార్గ దర్శకంగా ఉండాలి.

ధనం ఉన్నదే-అది ఎక్కువయితే దురభ్యాసాలకు దారితీస్తుంది. దానికి లొంగుతున్నామంటే సర్వనాశనమే.

పగటిపూట నిద్రపోవడం, రాత్రి వేళల మేలుకొని ఉండడం అనారోగ్య కారణం.

మన మంత్రులు, కార్యనిర్వహణ పక్షులూ, నిర్మల మనస్కులూ, కుశాగ్ర బుద్ధులూ, నిస్స్వార్థ జీవనులూ అయి ఉండాలి సుమా !

ఉద్యోగాలు
వ్యక్తుల విద్య, వివేకంతో పాటు వారి శీల స్వభావాలు పరిశీలించి వారిని తగిన ఉద్యోగాలలో నిరమించాలి.

అధములకూ, మధ్యములకూ ఉన్నత పదవులు ఇచ్చి, ఉత్తము లను దిగువ శ్రేణిలో ఉంచరాదు. అందువల్ల పెద్ద పదవులలో ఎక్కిం చిన వారికి బాధ్యతలు తెలియవు. క్రిందికి దిగిన వారు అవమాన భారంతో ఉండి పాలనా యంత్రాంగాన్ని పాడుచేస్తారు.

మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అవి క్రింది వారిమీద విడిచిపెడితే వారు మనలను లోకువ చేసి మరీ క్రిందికి దింపుతారు.

నీ సేవలోని వారికి ఎప్పటి కప్పుడు జీతభత్యాలు సకాలంలో అందకపోతే వారు తిరుగుబాటు తెస్తారు. మన రక్షణకోసం, త్యాగాలు చేసే వారి పోషణ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అలా దేశ ప్రజా రక్షణ కార్యంలో ప్రాణాలు బలిపెట్టినవా రుంటారు. వారి కుటుంబ పోషణ అంతా మనమే భరించాలి.

అలా చెయ్యకపోతే మళ్ళీ ఏ సేనాపతీ మన కోసం సాహసించడు. దేశ రక్షణ పాడయిపోతుంది. కనక పేనలోని వారి పోషణ ప్రధాన కర్త వ్యం.

మరొక ముఖ్యాంశం.
మన కొలువులో ఎందరో ఉద్యోగులుంటారు. వారిలో కొందరే మేధావులు. వీరు తమ ప్రతిభతో మనకు పేరు ప్రతిష్ఠలు తెస్తారు. అటు వంటి వారికి పెద్ద పెద్ద పదవులు యిస్తూండాలి. అంతే కాని అలాగే ఉంచితే వారి ఉత్సాహం పన్నగిల్లుతుంది. దానివల్ల రాజ్యానికి ముప్పు, అపఖ్యాతి.

అలానే దేశంలో అద్భుత సాహస కార్యాలు చేసేవారూ, మహా విద్వాంసులూ ఉంటారు. వారిని ఘనంగా సన్మానించాలి. విద్యా వంతులూ, ప్రతిభాసంపన్నులూ అయినవారు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు.

అటువంటి వాళ్ళు దేశానికి అలంకారం. అందుచేత వారి పోషణ భారం ప్రభుత్వమే వహించాలి.

దేశానికి రెండు రకాల ప్రమాదాలుంటాయి. అందులో మొదటిది గాలివానలూ, అగ్ని ప్రమాదాలూ, వరదలూ; వీటివల్ల కరువూ కాటకాలూ వస్తాయి. ఇవి ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు..

రెండవ రక –
దేశంలో సంస్కారం లేని మూఢులు పెరుగుతుంటారు. వారిలో పశుత్వం ఎక్కువ ఉంటుంది. రాజు బలవంతుడై ధీశాలిగా ఉంటే ఈ మూఢులు మూల మూలల్లో బ్రతుకుతారు. అలాకాక ప్రభువు కూడా మూఢుడైతే వీరు ప్రజలను హింసించి దోచుకు తినేస్తారు. ఒక్కోసారి రాజుకే ధన లోభం పుడితే రాజు పేరుమీద వీరే దోపిడి ఆరంభిస్తారు. అందుచేత అధికారంలోకి వచ్చేవాడు ఈ మూర్ఖుల సంఖ్య పెరగకుండా చూడాలి. చూడనివాడు పదవికి నీళ్ళు వదులుకోవాలి. పైగా నేరాలు చేసేవారిని ఎప్పటికప్పుడు కఠినంగా దండించకపోతే దేశంలో దొంగ తనాలూ, దొమ్మీలూ, హత్యలూ పెరిగిపోతాయి. ఏ సమయంలోనూ ద్రోహులను దండించకుండా విడువరాదు. విద్రోహుల మీద కనికరం చూపడం కంటే తెలివితక్కువ పని లేదని నువ్వూ వినే ఉంటావు ధర్మ నందనా.

దేశ ప్రజలకు అగ్ని ప్రమాదాల బాధ రాకుండా రాజు కాపాడాలి. అలానే వారి ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలూ, చక్కని మంచి నీరు దొరికే ఏర్పాట్లు ప్రభువే చెయ్యాలి.

దేశంలో వికలాంగులూ, ఆనాథులూ ఉంటారు. వీరం వరి రక్షణ, పోషణలూ ప్రభువే చూడాలి.

చివరగా ప్రజలనుంచి పన్నులు వసూలు చేసే వారిని సరయిన వారినే వెయ్యాలి. మంచి గంధపు చెట్లను కట్టెల కోసం పొడిచే మూర్ఖుల వలె పన్నులు పిండరాదు. పూలమాల కట్టేవాడు పూల తీగ కందకుండా పూలు కోసుకునేటట్లు మనం పన్నులు వసూలు చేసుకోవాలి.

దేశ దేశాల నుంచి మన దేశానికి వ్యాపారంకోసం వర్తకులు వస్తారు. వారిని పీడించి అధికంగా పన్నులు గుంజితే వారు మళ్ళీరారు. అలాకాక వారు పన్నులు ఎగగొట్టకుండా కూడా జాగ్రత్త పడాలి సుమా!

దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శుచిగా వండిన ఆహారం మితంగా తీసుకోవాలి. దేహారోగ్యంతోపాటే మనస్సుకూడా నిర్మలంగా ఉండా అంటే అనుభవ సంపన్నులయిన విద్వాంసులతో, సత్పురుషులతో రోజూ కొంత సేపు సత్కాలక్షేపాలు చెయ్యాలి.

ధర్మనందనా ! ఇవన్నీ నీకు తెలుసు. అయినా చెప్పడం మా విధి అన్నాడు వారదుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyanarayana Vrata 4th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Satyanarayana Vrata 4th Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – చతుర్థోధ్యాయః –

తరువాత సాధువు శుభశకునములు చూచి, విప్రులకు దానధర్మములు చేసి ప్రయాణం సాగించెను. సాదువు కొంతదూరము ప్రయాణించెను. సత్యదేవునికి సాధువును పరీక్షించు కోరిక గలిగి, సన్యాసి వేషముతో వచ్చి సాధూ! నీ పడవలలో నున్నదేమి? అని యడిగెను. ఆ వైశ్యులు ధనమదముగలవారై, అడిగిన ఆ సన్యాసిని జూచి, పరిహసించి, ఇందులో నున్నదేమైన అపహరించుటకు చూచుచున్నావా? ఇందులో మాత్రమేమున్నది? ఆకులు తీగలు తప్ప? అని చెప్పిరి. సన్యాసి రూపుడైన ఆ దేవుడతని మాటలు విని ‘తథాస్తు’ అని పలికి కొంతదూరములో నది యొడ్డుననే నిలుచుండెను. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలు ఆకులలములతో నిండియుండుట చూచి ఆశ్చర్య పడి, దుఃఖముతో మూర్చపోయెను.తెలివి వచ్చిన తరువాత ధనములు అట్లయినందుకు చాల విచారించెను. అప్పుడల్లుడు సాదువును జూచి, మహాత్ముడైన సన్యాసిని పరిహసించినాము. అతడు కోపముతో శపించి పోయినాడు. ఆయనయే మరల మనలను రక్షింపగలడు. ఆయనను శరణు వేడినచో మన కోరికలు తీరును అని చెప్పెను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు బోయి భక్తితో నమస్కరించి వినయవిధేయతలతో ఇట్లనెను. స్వామీ ! అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము. అని పదే పదే మ్రొక్కుచు ఏడ్చెను. గోలున ఏడ్చుచున్న సాదువును జూచి స్వామి, ఏడువవద్దు. నీవు నా పూజ చేయుదునని ప్రతిజ్ఞ చేసి, అశ్రద్ధ చేత మరచినావు. దుష్టబుద్దీ! నా శాపము చేత నీ కీ కష్టాలు కలుగుచున్నవని యిప్పటికైనా గ్రహించితివా? అనెను. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, ఓ పుండరిక నేత్రా ! బ్రహ్మాదిదేవతలే నీ మాయను దాటలేక సతమతమగుచున్నారు. నీ గుణములను రూపమును తెలిసికొనలేకున్నారు. మానవమాత్రుడను, అజ్ఞానిని. ఆపైన, అనీ మాయలో చిక్కుకొని, నీ అనుగ్రహమునకు దూరమైనవాడను. నిన్ను నేనెట్లు తెలిసికొనగలను? నా యపరాధమును క్షమింపుము. నిన్నెప్పుడును మరువక నా శక్తి కొలది నిన్ను పుజించెదను. శరణాగతుడైన నన్ను అనుగ్రహించి, నాధనములు నాకిచ్చి రక్షింపుము. అని ప్రార్థించెను. భక్తితో సాధువు చేసిన స్తోత్రమునుకు స్వామి సంతోషించి అతడు కోరిన వరమిచ్చి అక్కడనే అదృశ్యుడయ్యెను. సాదువు నావ దగ్గరకు వచ్చి అది ధనములతోను , వస్తువులతోను నిండి యుండుట చూచి, సత్యదేవుని దయవలన నా కొరిక తిరనదనుచు, పరివారముతో గలసి స్వామిని పూజించి తన నగరమునకు ప్రయాణము సాగించెను.

సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచున్న అల్లుని జూచి, అల్లుడా ! చూచితివా? రత్నపురమునకు జేరినాము. అనుచు తమ రాకను తెలియజేయుటకై ఇంటికొక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు బోయి సాధువు భార్యను జూచి నమస్క రించి, ‘అమ్మా! మన షావుకారుగారు అల్లునితోను, బందుమిత్రులతోను మన నగరమునకు వచ్చినారని’ చెప్పెను. దూత చెప్పినమాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతమును త్వరగా పూర్తిచేసి కుమార్తె తో ఇట్లనెను. నేను వెళ్ళుచున్నాను. నీవు కూడ త్వరగా నీతండ్రిని, భర్తను జూచుటకు రమ్ము. అనగా, తల్లిమాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుట మరచి భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్ళలో ముంచివేసెను. తీరమందున్న జనులందురును పరమదుఃఖముతోనున్న కళావతిని జూచి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగిపోయినందుకు ఆశ్చర్యమును గూడ పొందిరి. కళావతి దుఃఖితురాలైన కుమార్తెను జూచి దుఃఖించుచు భర్తతో ఇట్లనెను. మన అల్లుడు పడవతో ఇట్లేల మునిగిపోయినాడు? ఇది ఏ దేవుని మాయవల్ల జరిగినది ? అని పలుకుచు కుమార్తెను ఒడిలోనికి దీసుకొని దుఃఖించెను కళావతీ తన భర్త అట్లు మునిగిపోయినందుకు విచారించుచు, అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్దపడెను. తన కుమార్తె అవస్థ జూచి సాధువు చాల విచారించెను. అక్కడివారు కూడా బాదపడిరి. అప్పుడు సాధువు ‘ఇది యంతయు సత్యదేవుని మాయయై యుండును. స్వామి నన్ననుగ్రహించినచో నా వైభవము కొలది సత్యదేవ వ్రతము చేసెదనని చెప్పుచు ఆ దేవునికి అనేక సాష్టాంగనమస్కారములు చేసెను. సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ‘ఇట్లు చెప్పెను. ఓ సాధూ ! నీ కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చుకొనకుండ భర్తను జూచుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరల జీవించును. ఆకాశమునుండి వినవచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని త్వరగా తిరిగివచ్చి నీటిపై తేలుచున్న పడవలోని భర్తను జూచి సంతోషపడెను. అప్పుడామె తండ్రితో, తండ్రీ ! మన యింటికి పోవుదుము. ఇంక ఆలస్యమెందుకు ? అనెను. కుమార్తె మాటలు విని సాదువు సంతోషపడి,తన వారందరితో గలసి ఆ నదీతీరమునందే సత్యనారాయణ వ్రతము చేసి, తరువాత తన యింటికి చేరెను. ప్రతి పూర్ణిమనాడును ప్రతి సూర్య సంక్రమణనాడును సత్యనారాయణ వ్రతము యధావిధిగా చేయుచు ఆ సాధువు ఇహలోకమున సమస్త్రైశ్వర్యములు అనుభవించి చివరికి సత్యదేవుని సన్నిదానము చేరెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే చతుర్థోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయోధ్యాయః 

మరల సూతుడిట్లు చెప్పసాగెను. మునులారా ! ఇంకొక కథను జెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజుండెను. అతడు సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు బోయి దైవదర్శనము చేసి, బ్రాహ్మణులుకు ధనమును ఇచ్చెడివాడు. అతని భార్య సౌందర్యవతి, సాధ్వి. ఆమెతో గలిసి రాజొకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతమాచరించెను. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు, అనేక వస్తువులతోను, ధనముతోను నిండిన నావను ఒడ్డున నిల్పి, వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగెను. ఓ మహారాజా ! ఇంత భక్తిశ్రద్ధలతో మీరు చేయుచున్న యీ వ్రతమేమి? దయచేసి నాకు వివరింపుడు. వినవలెననియున్నది. సాధువిట్లడగగా ఆ రాజు, ‘ఓ సాధూ ! పుత్రసంతానము కావలెనను కోరికతో నేను మా బందుమిత్రులను బిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను, అని చెప్పెను. రాజు మాటలు విని సాధువు, మహారాజా ! నాకును సంతానము లేదు. ఈ వ్రతము వలన సంతానము కలుగుచున్నచో నేనును దీని నాచరించెద ననెను. తరువాత సాధువు వర్తకము పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సంతానప్రదమైన యీ సత్యదేవుని గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినచో ఆ వ్రతము చేసెదనని పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మప్రవృత్తి గలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతియై సత్యదేవుని అనుగ్రహమువలన పదవ నెలలో ఒక బాలికను గనెను. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుచుండగా తల్లిదండ్రులామెకు కళావతి అని పేరు పెట్టిరి. ఆ సమయములో లీలావతి భర్తను జూచి, సంతానము గలిగినచో వ్రతము చేయుదమంటిరిగదా ! పుత్రిక కలిగినది కదా! ఇంకను వ్రతము మాట తలపెట్టరేమి? అని అడిగెను. అందుకు భర్త, లీలావతీ ! మన అమ్మాయి వివాహములో వ్రతము తప్పక చేయుదును. అని యామెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు బోయెను. కళావతి తండ్రి యింటిలో పెరుగుచుండెను.

అట్లు యుక్తవయసు వచ్చిన కుమార్తెను జూచి సాధువు తన మిత్రులతో ఆలోచించి, వరుని వెదుకుటకై దూతను పంపెను. వర్తకునిచే పంపబడిన ఆ దూత కాంచనగరమునకు బోయి, అక్కడ యొగ్యుడైన వైశ్యబాలకుని జూచి పెండ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యబాలును జూచి సాధువు తన కుమార్తె నిచ్చి పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి వేడుకలలో బడి సత్యదేవుని వ్రతము సంగతి మరిచిపోయెను. అందుచే ఆ స్వామి చాలా కోపించెను. తరువాత కొంతకాలమునకు వ్యాపారమునందు దక్షతగల ఆ సాధువు అల్లునితో గలిసి వాణిజ్యమునకై బయలుదేరెను. అతడు నౌకలలో సముద్రతీరమున నున్న రత్నసానుపురమును జేరుకొని అక్కడ అల్లునితో గూడి వ్యాపారము సాగించుచుండెను. తరువాత వ్యాపారమునకై వారిద్దరును చంద్రకేతు మహారాజు నగరమునకు బోయిరి. అంతటి, వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసి మరచి పోయిన ఆ సాధువును జూచి, స్వామి కోపించి, దారుణము, కఠినము అయిన మహాదుఃఖ మతనికి కలుగుగాక యని శపించెను.

ఆనాడే రాజ దనాగారములో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకొని పారిపోవుచుండెను. రాజభటులు తరుముచుండగా వాడీ వర్తకులున్నవైపు పరుగెత్తెను. ఆ దొంగ, తన్ను తరుముకొని వచ్చుచున్న రాజభటులను జూచి భయపడి దనమును వర్తకులముందు గుమ్మరించి పారిపోయెను. రాజభటులక్కడికి వచ్చి, రాజదనముతో ఎదుట కనబడుచున్న ఆ వర్తకులను బందించి రాజునొద్దకు తీసుకొనిపోయిరి. ఆ భటులు సంతోషముతో వీరిని దీసుకొనిపోయి, మహారాజా ! ఇద్దరు దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ చేయనక్కరలేదనచు, కారాగారమున బందింపుడనెను. వారు వర్తకులను కారాగృహమున బందించిరి. సత్యదేవుని మాయచేత వర్తకులెంత మొరపెట్టుకున్నను వారి మాటలెవ్వరును పట్టించుకొనలేదు. రాజు వారి ధనమును తన ధనాగారమున చేర్పించెను.

ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడ కష్టాలపాలయ్యెను. ఇంటిలోని ధనమునంతను దొంగ లపహరించిరి. లీలావతి మనోవ్యథచే రొగగ్రస్తురాలయ్యెను. తినుటకు తిండి దొరకక ఇంటికి దిరిగి బిచ్చమెత్తుకొనసాగెను. కుమార్తెయైన కళావతి కూడ బిచ్చమెత్తుటకు పోసాగెను. ఒకనాడు సాయంకాలం వేళ, కళావతి ఒక బ్రాహ్మణునింటికి మాధవకబళమునకు బోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి, కథయంతయు విని, తమకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకొనెను. స్వామి ప్రసాదమును గూడ పుచ్చుకొని కళావతి, రాత్రి ప్రొద్దు పోయి యింటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లనెను. అమ్మాయీ ! ఇంత రాత్రి వరకు ఎక్కడనుంటివి? నీ మనస్సులో ఏమున్నది? అని యడిగెను. వెంటనే కళావతి, అమ్మా! నేనొక బ్రాహ్మణుని యింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచుచు ఉండిపోయితిని. ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చునట గదా ! అనెను. ఆ మాటవిని సాధుభార్య, తామా వ్రతము చేయకపోవుటచేతనే ఇట్టి దురవస్థ కలిగినదని గ్రహించి, వ్రతము చేయుటకు సంకల్పించి, ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వ్రతాంతమునందు, స్వామీ !
నా భర్తయును అల్లుడును సుఖముగా తిరిగి యింటికి చేరునట్లు అనుగ్రహింపుము. వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించెను. లీలావతి చెసిన యా వ్రతముచే సంతోషించబడిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనమును వారికిచ్చి పంపుము. లేనిచో నిన్ను సమూలముగా నాశనము చేసెదనని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు ఉదయమున రాజు సభలో తనకు వచ్చిన కలను చెప్పి, ఆ వర్తకులను చెరసాలనుండి విడిపించి తెండని భటుల కాజ్ఞాపించగా వారట్లే ఆ వైశ్యులను సభలోనికి దెచ్చి రాజా ! వైశ్యులిద్దరిని తెచ్చినామని విన్నవించిరి.

ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజుకు నమస్కరించి వెనుకటి సంగతులు తలచుకొనుచు ఏమియు పలుకలేక నిలుచుచుండిరి. రాజప్పుడా వైశ్యులను జూచి ఆదరముతో, వర్తకులారా ! మీకీ కష్టము దైవ వశమున కలిగినది. ఇప్పుడా భయములేదని ఓదార్చి, వారి సంకెళ్ళను తీయించి క్షౌరము మున్నగు అలంకారములు జేయించెను. (మండనం ముండనం పుంసాం = పురుషులకు క్షౌరము అలంకారము.) వస్త్రాద్యలంకారములనిచ్చి, మంచి మాటలతో వారిని సంతోషపరచవలెను. ఇది వరకు వారివద్దనుండి తీసికొన్న ద్రవ్యమును రెట్టింపు ద్రవ్యమిచ్చి, ‘ఓ సాదూ! ఇంక మీ యింటికేగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలు దేరిరి’.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే తృతీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – ద్వితీయోధ్యాయః

శ్లో // అధాన్యత్సంప్రవక్ష్యామి కృతం యేన పురాద్విజాః,
కశ్చిత్కాశీపురేమ్యేహ్యా సీద్విప్రోతి నిర్ధనః
క్షుత్తృ డ్భ్యాం వ్యాకులో భూత్వా నిత్యాంబభ్రామ్ భూతలే //

సూతుడు మరల ఇలా చెప్పుచున్నాడు. మునులారా ! పూర్వమీ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను వినుడు. కాశీనగరమున అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్యము ఆకలిదప్పులతో అలమటించుచు తిరుగుచుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి, దుఃఖపడుచున్న బ్రాహ్మణుని జూచి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము దరించి వచ్చి, ‘ఓ విప్రుడా ! ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేమి? నీ కథనంతను జెప్పుము. వినవలెనని యున్నది’ అనెను. విప్రుడిట్లు చెప్పెను. ఓ మహానుభావా ! నేనొక బ్రాహ్మణుడను. అతి దరిద్రుడను. బిక్ష కొరకు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు యమ నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్ధించెను.

అంత వృద్ధబ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడా ! సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది. అది చేసినవారికి సర్వదుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతము చేయు మనుచు దాని విధానమును భోధించి అంతర్థానము చెందెను. ఆ బ్రాహ్మణుడు, రేపే నేనా వృద్ధబ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసెదనని సంకల్పించి, దానినే తలచుకొనుచు రాత్రి నిద్దురగూడ పోలేదు. అతడు ప్రొద్దున్నే లేచి, ఈ రోజున సత్యదేవుని వ్రతము చేసెదనని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరెను. ఆ రోజున స్వామి దయవలన అతనికి చాల ద్రవ్యము లభించెను. బంధువులను గూడ పిలిచి, దానితో అతడు సత్యనారాయణ వ్రతము చేసెను. ఆ వ్రతము యొక్క ప్రభావము చేత అతడు దారిద్ర్యము మున్నగు సర్వ దుఃఖములనుండి విముక్తుడై, సమస్త సంపదలతో తులతూగెను. అది మొదలుగా అతడు ప్రతిమాసమునందు ఈ వ్రతమును ఆచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షము నొందెను. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో, అతని సర్వదుఃఖములును నశించును. సూతుడు, మునులారా ! మీరడిగిన కథ చెప్పినాను. ఇంకేమి చెప్పమందురు ? అని యడిగెను. శౌనకాది ఋషులు, మహాత్మా ! ఆ బ్రాహ్మణుని వలన తెలిసికొని యెవ్వడీ వ్రతమాచరించెనో చెప్పుము. మాకు వినవలెనని యున్నది అని యడిగిరి. సూతుడిట్లు చెప్పనారంబించెను. మునులారా! ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవము కొలది బందువులను బిలిచికొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడి కొక కట్టెలమ్ము కొనువాడువచ్చి కట్టెల మోపు బయట దింపి విప్రుని ఇంటికి వచ్చెను.

అతడు చాల దప్పిక గలవాడై యుండియు ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూచి, తుదకు ఆయనకును దేవునుకును నమస్కరించి, మహానుభావా ! నీవు చేసిన పూజయేమి? దీనివలన కలుగు ఫలమేమి ? వివరముగా జెప్పమని యడిగెను. బ్రాహ్మణుడిట్లు చెప్పెను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధనధాన్యములు, సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును గూర్చి తెలుసుకొని మంచి నీరు త్రాగి, ప్రసాదమును స్వీకరించి తన యూరికి బోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెల మోపును రేపు అమ్మెదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని వ్రతము చేసెదను, అనుకొని మరనాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరములో ధనికులుండు ఇండ్లవైపు వెళ్ళెను. అతడానాడు స్వామి యనుగ్రహముచే కట్టెలమ్మి రెట్టింపు లాభము నొందెను. దానికి సంతోషించి, అరటిపండ్లు, పంచదార, ఆవునేయి, ఆవు పాలు, శేరుంబావు గోధుమనూక, పూజాద్రవ్యములు అన్నియు దీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి, బందువులునందరిని బిలిచి సత్యదేవుని వ్రతమును యథాశక్తిగా చేసెను. ఆ వ్రతము చేసిన ప్రభావముచే అతడు ధనములతోను, పుత్రులతోను సర్వసమృద్ధిగలవాడై యీ లోకమున సౌఖ్యములననుభవించి చివరికి సత్యలోకమును పొందెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం