BhaktiVed
Hanuman

Sarwashatrunjaya Hanumat Stotram

Stotram

This text is still being proofread.

శ్లో॥ శ్రీమంతం హనుమంతమాత్తరిపుభిద్భూభృత్తరుభ్రాజితం ।

వల్గద్వాలనిబద్ధవైరినిచయం చామీకరాద్రిప్రభమ్ ।

రోషాద్రక్తపిశంగనేత్రనలినం భ్రూభంగమంగస్ఫుర-

త్ప్రోద్యచ్చండమయూఖమండలముఖం దుఃఖాపహం దుఃఖినామ్ ॥

కౌపీనం కటిసూత్రమౌంజ్యజినయుగ్దేహం విదేహాత్మజా-

ప్రాణాధీశ పదారవింద నిహితస్వాంతం కృతాంతం ద్విషామ్ ।

ధ్యాత్వైవం సమరాంగణస్థిత మథానీయ స్వహృత్పంకజే ।

సంపూజ్యాఖిలపూజనోక్తవిధినా సంప్రార్థయేత్ప్రార్థితమ్ ॥

తా॥ ఇట్లు ధ్యాన మొనర్చి యీ క్రింద వ్రాయబడిన స్తోత్రము చేయవలెను.

శ్లో॥ హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

మర్కటాధిప మార్తాండమండలగ్రాసకారక ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

రుద్రావతార సంసార దుఃఖభారాపహారక ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

శ్రీరామచరణాంభోజ మధుపాయితమానస ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

వాలికాలరదక్లాంత సుగ్రీవోన్మోచనప్రభో ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

సీతావిరహవారీశ మగ్నసీతేశతారక ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమానజగద్వన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

జగన్మనోదురుల్లంఘ్య పారావారవిలంఘన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

శ్లో॥ స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

రాత్రించరచమూరాశికర్తనైకవికర్తన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

భీమాదిక మహావీర వీరావేశావతారక ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ॥

ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

రామాది విప్రయోగార్త భరతాద్యార్తి నాశన ।

లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ॥

శ్లో॥ ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః

శత్రుంజయం నామ పఠేత్స్వయం యః ।

స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః

ప్రమోదతే మారుతజప్రసాదాత్ ॥

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్తుతిస్తూ గానము చేసేది లేక ప్రశంసలతో కూడిన గానం (ప్రశంసా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చుండి పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.

మరిన్ని స్తోత్రములు

Also read