మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమత్ పంచరత్నం పఠించడం వల్ల మేధస్సు, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత, అనారోగ్యాల నుండి విముక్తి, తెలివి యొక్క పదును మరియు మెరుగైన వక్తృత్వం మరియు సంభాషణ నైపుణ్యాలు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ పంచరత్నం గురించి తెలుసుకుందాం.
Hanuman Pancharatnam Sthotram In Telugu – శ్రీ హనుమత్పంచరత్నం స్తోత్రం (తెలుగు)
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్,
సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || 1 ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ |
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || 2 ||
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్ |
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 ||
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః |
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ |
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 ||
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్ |
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతౌ హనుమత్పంచరత్నమ్ |