Sri Anjaneya Suprabhatam In Telugu – శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్

Sri Anjaneya Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం ఆంజనేయ స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్

అమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం
సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం
పటుతరఘనగాత్రం కుండలాలంకృతాంగం
రణజయకరవాలం రామదూతం నమామి ॥

అంజనా సుప్రజా వీర పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్పికం ॥
ఉత్తిష్టోత్తిష్ఠ హనుమన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రవిజాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥

శ్రీరామచంద్ర చరణాంబుజ మత్తభృంగ
శ్రీరామమంత్రజపశీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ హృదయతాపనివారమూర్తే
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ||

శ్రీ రామదివ్య చరితామృతపానలోల
శ్రీ రామకింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహోగ్రశౌర్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్యమూర్తే
సుగ్రీవ రాఘవసమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ ప్రియతనూజ సువర్ణదేహ శ్రీ
భాస్కరాత్మజ మనోంబుజచంచరీక
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ మారుత ప్రియతనూజ మహాబలాఢ్య
మైనాకవందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణవాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ |

పంచాననాస్య భవభీతిహరస్య రామ
పాదాబ్జ సేవనపరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియసుతస్య సువిగ్రహస్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ||

గంధర్వ యక్ష బుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వ వసురుద్ర సురర్షిసంఘాః
సంకీర్తయంతి తవ దివ్యసునామపంక్తిం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ గౌతమ చ్యవన తుంబుర నార దాత్రి
మైత్రేయ కృష్ణజనకాది మహర్షి సంఘాః
గాయంతి హర్షభరితా స్తవ దివ్యకీర్తిం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

భృంగావళీ చ మకరందరసం పిబే ద్వై
కూజం త్యుతార్ధమధురం చరణాయుధాశ్చ
దేవాలయే ఘన గభీర సుశంఖ ఘోషాః
నిర్యాంతి వీర హనుమం స్తవ సుప్రభాతమ్ ॥

పంపాసరోవర సుపుణ్య పవిత్ర తీర్థ
మాదాయ హేమకలశైశ్చ మహర్షిసంఘాః
తిష్ఠంతి శ్రీ చరణపంకజ సేవనార్థం
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

శ్రీ సూర్యపుత్రిప్రియనాథ మనోజ్ఞమూర్తే
వాతాత్మజాత కపివీర సుపింగళాక్ష
సంజీవరాయ రఘువీరసుభక్తవర్య
శ్రీ వీర ధీర హనుమన్ తవ సుప్రభాతమ్ ॥

మరిన్ని సుప్రభాతములు

Sri Mahalakshmi Ashtakam In Telugu | శ్రీ మహాలక్ష్మి అష్టకం

Sri Mahalakshmi Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtakam Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ||

నమస్తే గరుడారూఢ డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ |
సర్వపాపహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ |
మంత్రమూర్తే సదాదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

ఆద్యంత రహితే, దేవీ ఆదిశక్తి మ హేశ్వరీ |
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోసుతే ||

స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాహ రే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే ||

పద్మాసన స్థితే దేవీపరబ్రహ్మస్వరూపిణీ |
పరమేశీ జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

శ్వేతాంబర ధరే దేవీ నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భ క్తిమాన్నర: |
సర్వసిద్ధిమవాప్నోతిరాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్వం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితమ్ ||

త్రికాలం య: పఠేన్నిత్యం మహాశతృ వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా ||

మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నావరదా శుభా |
ఇత్యేంద్రకృత మహాలక్ష్మ్యష్టకస్తవం సంపూర్ణం ||

ఫలశ్రుతి:

సర్వసంకటనాశనము, ఇష్టకామ్యార్థ సిద్ధి, ఉద్యోగలాభం, రాజభోగం, సర్వపాపవినాశనము, అష్టయిశ్వర్య ప్రాప్తి.

మరిన్ని అష్టకములు:

Akshaya Tritiya Adhyatma Darshan In Telugu – అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము

Akshaya Tritiya Adhyatma Darshan

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము గురించి తెలుసుకుందాం.

Akshaya Tritiya Adhyatma Darshan Telugu

అక్షయ తృతీయ అధ్యాత్మ దర్శనము (వైశాఖ శుక్ల తృతీయాతిథి)

వైశాఖమాస శుక్లపక్ష తృతీయాతిథిని అక్షయ తృతీయ అనియు, ఆఖాతృతీయ అనియు, ఆఖాతీజ అనియు అందురు.

అక్షయ మనగా ఎన్నిటికి నశించనిది అని, సత్యమైనది. యేది సర్వదా సత్యమైనదో అదియే పరమాత్మ ఈశ్వరుడు, అక్షయ అఖండ సర్వవ్యాపకుడు. ఈ అక్షయ తృతీయాతిథి ఈశ్వరతిథి. ఈ అక్షయతిథి పరశురాముని జన్మదినమైన కారణమున “పరశురామతిథి” అనియు అందురు. పరశురాముడు మహాత్ములైన చిరంజీవుల లెక్కలోనికి వచ్చి వాడుగాన ఈ తిథిని చిరంజీవి తిథి అనియు అందురు. నాలుగు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర, కలియుగ) త్రేతాయుగ ప్రారంభము ఈ తిథి నుండే ప్రారంభమైనది. అందువలన ఈ తిథిని యుగాది తిథి యందురు.

బదరీనారాయణ దర్శన తిథి నాలుగు థామములలో నొకటైన బదరీనారాయణ దర్శనతిథియు నిదియే. భక్తులు ఈ దినమిచట త్యాగ దాన దక్షిణ, జప, తప హోమ హవన గంగాస్నానాది కార్యములు చేయుదురు. భగవానుని ప్రసాదమును భక్తులు భక్తితో గ్రహించెదరు.

అక్షయ తృతీయనాడు భక్తజనులు భగవానుని చరణ దర్శనమునకు బృందావనము వచ్చెదరు. ఇది “సత్యమేవజయతే” అను సందేశమిచ్చును. ఈ తిథియందు వివాహాది శుభకార్యములు చేయుదురు. అక్షయ గ్రంథమైన గీత అమర నిధివంటిది. దీనిని చదివినను వినినను, జీవితము సఫలమగును. అక్షయత్త్వము ప్రాప్తించును.

మరిన్ని పండుగలు:

Gautama Maharshi Katha In Telugu – గౌతమ మహర్షి కథ

Gautama Maharshi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

వివిధ పురాణాల లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతమ మహర్షి కథ.

గౌతమ మహర్షి కథ

ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులో నూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ట నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందరి నా పుత్రిక అహల్య.

ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనికి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.

మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధి వద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.

గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్ర తపస్సు చేసినాడు.

గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.

అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్ర విజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.

ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్ర వీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సర ముతో బాధ పడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!

గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము!

ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్పు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.

గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు ఆదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.

మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండిత మండలిచే ఆమోద ముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి.

“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథిపై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరిపై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు.

గంగాదేవి కోరిక పై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరినది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఈ ప్రపంచానికి ఆధారమైన నాలుగు పుణ్యస్తంభాలు: భూతదయ నిరహంకారం పరోపకారం ఇంద్రియ నిగ్రహమ్. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శపురుషుడు. బ్రహ్మదేవుని పరీక్షలో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని మనకు చూపినాడు. క్షామము నుండి ప్రాణులను కాపాడి తన దయ పరోపకార బుద్ధి చూపినాడు. సకల ధర్మరహస్యాలు తెలిసినా పండితుల వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్త విధానము తెలుసుకొని తన వినయవైభవాన్ని చాటినాడు.
  2. ప్రకృతిని క్షోభించకుండా మానవకళ్యాణము సాధించే విజ్ఞానము భారతీయులది. గౌతముడు భౌతిక విజ్ఞానానికి దైవికశక్తిని జోడించి ప్రజాశ్రేయస్సును కల్పించాడు.
  3. అహల్యాగౌతములు అసామాన్యమైన అతిథిసేవ చేసి మనకు మార్గదర్శకులైనారు. వారు రోజూ పరి కూరలు మొదలైనవి పండించి పండి ఆర్తులకు వడ్డించేవారు.
  4. కృతఘ్నతకు మించిన పాపములేదని పరమశివుడు చెప్పాడు. అట్టి వారి పాపానికి నిష్కృతిలేదని మనకు చెప్పాడు పరమేశ్వరుడు. కావున మనము ఎల్లప్పుడు కృతజ్ఞులమై ఉండాలి.
  5. ఈర్ష అసూయ మత్సరము మానవునిచే ఎట్టి దారుణపాపకృత్యాన్నైనా చేయిస్తాయి. కాబట్టి మనను ఈర్షకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Anjaneya Sahasranama Stotram In Telugu – శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్

Sri Anjaneya Sahasranama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

శ్రీ హనుమత్సహస్ర నామ స్తోత్రం

ఓం అన్యశ్రీ హనుమత్సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య | సదాశివఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా | ఓం క్లీం ఇతి బీజం | నమః ఇతి కీలకం! స్వాహేతిశక్తిః సమస్త పురుషార్ధ సిద్ధ్యర్ధే జపే వినియోగః

॥ ధ్యానం॥

శ్లో॥ ప్రదీప్త స్వర్ణవర్ణాభం బాలార్కారుణలోచనం
స్వర్ణమేరు విశాలాంగం శతసూర్య సమప్రభం ॥
రక్తాంబరధరాసీనం సుగ్రీవాదియుతం తథా |
గోప్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం ||

శ్లో॥ పుచ్ఛవన్తం కపీశం తం మహారుద్రం భయంకరం |
జ్ఞానముద్రాలద్భాహుం సర్వాలంకార భూషితం ॥
ధ్యానస్య ధారణాదేవ విఘ్నాన్ముక్త స్సదా నరః |
త్రిషులోకేషు విఖ్యాత స్సర్వత్ర విజయీ భవేత్ ॥
శ్రీం ఓంకారనమోరూప మోం నమో రూపపాలకః |
ఓంకార మయ ఓంకార ఓంకారాత్మా సనాతనః ॥
బ్రహ్మ బ్రహ్మమయో బ్రహ్మజ్ఞానీ బ్రహ్మ స్వరూపవిత్ |
కపీశ ః కపినాథశ్చ కపినాథ స్యపాలకః
కపినాథః ప్రియః కాలః కపినాథస్య ఘాతకః |
కపినాథ శ్శోకహర్తా కపీభర్తా కపీశ్వరః : ।
కపిజీవనదాతాచ కపిమూర్తిః కపిర్రుతః ।
కాలాత్మ కాలరూపీచ కాలకాలస్తు కాలభుక్ ॥
కాలజ్ఞానీ కాలకర్తా కాలహానిః కలానిధిః ।
కలానిధి ప్రియః కర్తా కలానిధిసమప్రభః ॥
కలాపీ కలాపాతాచ కీశత్రాతా కిశాంపతిః |
కమలాపతిప్రియః కాకస్వరఘ్నః కులపాలకః
కులభర్తా కులత్రాతా కులాచారపరాయణః ।
కాశ్యపాహ్లాదకః కాకధ్వంసీ కర్మకృతాంపతిః ॥
కృష్ణఃకృష్ణస్తుతి కృష్ణః కృష్ణరూపో మమాత్మవాన్ !
కృష్ణవేత్తా కృష్ణభర్తా కపీనః క్రోధవా న్కపిః ॥

శ్లో॥ కాలారాతిః కుబేరశ్చ కుబేర వనపాలకః !
కుబేరధనదాతాచ కౌసల్యానందజీవనః ॥
కౌసలేక ప్రియః కేతుః కపాలీ కామపాలకః |
కారుణ్యః కరుణారూపః కరుణానిధి విగ్రహః ॥
కారుణ్య కర్తా దాతాచ కపిః కావ్యః కృతాంతకః |
కూర్మః కూర్మపతిః కూర్మభర్త కూర్మాస్య ప్రేమవాన్ ॥
కుక్కుటః కక్కుటాహ్వానః కుంజపః కమలాననః |
కుబ్జరః కలభః కేకినాధజి త్కల్పజీవనః ॥
కల్పాభవానీ కల్పాన్తత్రాతా కల్పవిబోధకః |
కలభః కలహస్తశ్చ కన్పః కంపపతి స్తథా ||

శ్లో॥ కర్మఫలప్రదః కర్మా కమనీయః కలాపవాన్
కమలాసనస్య బంధశ్చ కమలాసన పూజకః ||
కమలాసన సేవీచ కమలాసనమానితః ।
కమలాసన ప్రియః కంబుః కంబుకఠోపి కామధుక్ ॥
కింజల్క రూపీ కింజల్కః కింజల్కా వినివాసకః |
ఖగనాథప్రియః ఖడ్డీ ఖగనాథః ప్రహారకః ॥
ఖగనాథ సుపూజ్యశ్చ ఖగనాధ ప్రభోదకః ।
ఖగనాథ సుపూజ్యశ్చ ఖరధ్వంసీ ఖరాంతకః ॥
ఖరారి ప్రియబంధుశ్చ ఖరారీ జీవన స్సదా |
ఖడ్గహస్తఃకడ్గధనః ఖడ్గమానీ చ ఖడ్గపః ||
ఖంజరీట ప్రియః ఖంజః ఖర్జీ త్రాతా ఖమూర్తిమాన్ |
ఖేచరః ఖేచర త్రాతా ఖేచరాత్మా ఖరారిజిత్ ॥
ఖజ్జారీటపతిః పూజ్యః ఖఞరీటేవ చంచలః |
ఖద్యోతబంధుః ఖద్యోతః ఖద్యోతనప్రియ స్సదా ॥
గరుత్మాన్ గరుడో గోప్యో గరుత్మద్గన్గర్వహారకః
గర్విష్ణో గర్వహర్తా చ గర్వహా గర్వనాశకః ॥
గర్వో గుణ ప్రియో గౌణో గుణసేవీ గుణాన్వితః |
గుణత్రాతా గుణరతో గుణవత ప్రియో గుణీ ॥
గణేశో గణపాతాచ గణరూపో గణప్రియః |
గంభీరో థ గుణాకారో గరిమా గరిమ ప్రదః ॥
గణ రక్షో గణ హరో గణదో గణసేవితిః |
గణేశో గవయత్రాతా గర్జిత స్సగణాధిపః ॥
గంధమాదన హర్తాచ గంధమాదన పూజకః |

శ్లో॥ గంధమాదన సేవీచ గంధమాదన రూపధృక్ |
గురుర్గురు ప్రియో గౌరో గురుసేవ్యో గురూన్నతః ॥
గురుగీతాపరో గీతా గీత విద్యా గురు ద్గురుః !
గీత ప్రియో గీత రతో గీతజ్ఞో గీతవానపి ।
గాయత్ర్యా జాపకో గోష్ఠా గోష్ఠ దేవో థ గోష్ఠవః
గోపాలో గోపదో గోష్ఠా గోపీ వల్లభ వత్సలః |
గోపీజన ప్రియో బంథో గన్దపో గన్దపూజకః ॥
గోష్పదీకృతవారీ గోవిన్ద గోపబన్ధకః ।
గోవర్ధనధరో గర్వో గోవర్ధన ప్రపూజకః ॥
గంధర్వో గంధర్వరతో గంధర్వానందనందితః ।
గనో గదాధరో గుప్తో గదా యో గుహ్య దేశ్వరః ॥
గిరిజాపూజకో గీశ్చ గీర్వాణి గోప్పతి స్తథా |
గిరి ర్గిరిప్రియో గర్వో గర్భపో గర్భవాసకః |
గభస్తి గ్రాసకో గ్రాసో గ్రాసదాతా గ్రహేస్వరః
గ్రహేగ్రహేశపో గ్రాహో గ్రాహదోషవినాశనః ॥
గ్రహారూఢా గ్రహపతిర్గ్రహణో గ్రహణాధిపః |
గోలోగవ్యో గవేష్యశ్చ గవాక్షో మోక్షదాయకః॥
గణోగమ్యో గణే దాతా గరుడధ్వజవల్లభః |
గేహో గేహప్రదో గమ్యో గీతాగానపరాయణః |
గహ్వరో గహ్వరత్రాణో గర్గాశ్రయ ప్రదః |
గర్గప్రియో గర్గరతో గౌతమో గౌతమ ప్రదః ॥

Sri Anjaneya Sahasranamalu

శ్లో॥ గంగాస్నాయీ గయానాథో గయాపిండ ప్రదాయకః |
గౌతమీ తీర్ధచారీచ గౌతమీ తీర్థపూజకః
గగణేంద్రో గణత్రాతా గ్రంథదో గ్రంథకారకః ।
ఘనాజ్ఞో ఘతకో ఘోరో ఘోర రూపీ ఘన ప్రదః ॥
ఘోరదంష్ట్రా ఘోరఘాతీ ఘనేతరః ।
ఘోరరాక్షస ఘాతీచ ఘోరరూపీ ఘ దర్పహా ॥
ఘర్మో ఘర్మప్రదశ్చైవ ఘర్మరూపీ ఘనాఘనః ।
ఘనధ్వనిరతో ఘంటావాద్య ప్రియ ఘృణాకరః॥
మౌఘో ఘనస్వనో ఘూర్లో మూర్జితోపి వనాలయం |
జకారో జప్రదో జన్త చంద్రికామోద మోదకః ॥
చంద్రరూప శ్చంద్రవంద్య శ్చంద్రాత్మా చంద్రపూజక : ।
చంద్రప్రేమ శ్చంద్రబింబ శ్చామరప్రియ చంచలః ||
చంద్రవక్త్రశ్చకోరాక్ష శ్చంద్రనేత్ర శ్చతుర్భుజః
చంచలాత్మా చర శ్చామీ చల తంజనలోచనః ||
చిద్రూప శ్ఛిన్న పానశ్చ చలచ్చిత్త చిదార్చితః |
చిదానంద శ్చిత శ్చైత్ర శ్చైత్ర వంశస్య పాలకః ||
ఛత్ర శ్చత్ర ప్రద శ్ఛత్రీ ఛత్రరూపీ చిదంఛదః ।
చలహా ఛలద శ్చిత్ర చ్ఛిన్న ఘాతీ క్షపాకరః ॥
ఛద్మరూపీ చద్మహారీ ఛరీ ఛలతరు స్తథా |
ఛాయాకరద్యుతి శ్చంద శ్చంద విద్యా వినోదకః ॥
ఛిన్నానాతి శ్చిన్న పాప శ్చందవారణవాహకః |
ఛన్ద శ్ఛత్రహన శ్ఛిప్రశ్చవన శ్చన్మయః శ్చమీ
క్షమాగారః క్షమాబన్దః క్షపాపతి ప్రపూజకః |
ఛలాఘాతీ ఛిద్రహారీ ఛిద్రాన్వేషణ పాలకః ॥

శ్లో॥ జనో జనార్థనో జేతా జితారి ర్జితసంగరః |
జితమృత్యు ర్జరాతీతో జనార్థన ప్రియో జయః ||
జయ జయకర్తా జయపాతా జయ ప్రియః |
జితేంద్రియో జితారాతి ర్జితేంద్రియ ప్రియో జయీ ||
జగదానందదాతా చ జగదానందకారకః |
జగద్వంద్యో జగజ్జీవో జగతా ముపకారకః ॥
జగద్ధాతా జగద్ధారీ జగద్భీజో జగత్పితా |
జగత్పత్తిప్రియో జిష్ణు ర్జిష్ణుజి జిష్ణురక్షకః ॥
జిష్ణువంద్యో జిష్ణుపూజ్యో జిష్ణుమూర్తి విభూషితః ।
జిష్ణుప్రియో జిష్ణురతో జిష్ణులోకాభివాసకః ॥
జయో జయ ప్రియో జాయో జాయకో జయజాడ్యహా |
జయ ప్రియో జనానన్డో జనదో జనజీవనః ॥
జయానన్డో జయా పుష్పవల్లభో జయపూజకః |
జాడ్యహర్తా జాడ్యదాతా జాడ్యకర్తా జడ ప్రియః ॥
జగన్నేతా జగన్నాథో జగదీశో జనేశ్వరః ||
జగన్మంగళదో జీవో జగత్పావనపావనః ॥
జగత్రాణో జగత్రాణో జానకీపతివత్సలః |
జానకీపతి పూజ్యశ్చ జానకీ పతిసేవకః |
జానకీశోకహారీ చ జానకీదుఃఖ భంజనః ।
యజుర్వేదో యజుర్వక్తా యజుఃపాఠప్రియ ప్రతీ ॥
జిష్ణుర్జిష్ణురతో జిష్ణుధాతా జిష్ణువినాశనః ।
జిష్ణు హా జిష్ణుపాతా తు జిష్ణురాక్షస ఘాతకః ॥

శ్లో॥ జతీనా మగ్రగణ్యశ్చ జతీనాం వరదాయకః |
ఝుంఝురో ఝూర్జనవహో ఝఝవాత నిషేవితః ॥
ఝల్లీరవస్వనో ఇన్తో ఇవర్ణో ఇదః
టకారాది ష్టకారాన్త ష్టవర్ణ ష్టప్రపూజకః ॥
టిట్టిభ ష్టిట్టిభరత ష్టిట్టిభ ప్రియవత్సలః |
రకారవర్ణ నిలయ ష్టకారార్ణ వనాసితః ॥
ఠకార వీరనిరత ష్టకార ప్రియదర్శకః |
డమరుధ్వనిరతో ఢంకో ఢంకిణీ ప్రాణహారకః |
ఢాకినీవర్గదాతాచ ఢాకినీభయనాశనః |
డిండిమధ్వనీ కర్తాచ ఢింభో ఢింభాతరేతరః ॥
ఢక్కా ఢక్కానవో ఢక్కా వాద్య ఢక్కా మహోత్సవః |
ఇంతో నా ణ వర్ణశ్చణ సేవ్యో ణ ప్రపూజకః |
తంత్రీ తంత్ర ప్రియస్తల్పస్తంత్రజి తంత్రవాహకః ।
తంత్రపూజ్య స్తంత్రరత స్తంత్రవిద్యా విశారదః ॥
తంత్రమంత్ర జయీ తంత్రధారక స్తంత్రవాహకః |
తంత్ర వేత్తా తంత్రకర్తా తంత్రయంత్ర వర ప్రదః ॥
తంత్రదస్తంత్రదాతా చ తంత్రవ సంత్రదాయకః |
తత్వదాతా చ తత్వజ్ఞ స్తత్వ ప్రకాశకః ||
తంద్రాచ తపనస్తల్ప స్తలాతలనివాసకః ।
తప స్తపప్రియ స్తాప స్త్రయస్తాపీ తపఃపతిః ॥
తపస్వీ చ తపోజ్ఞాతా తపతా ముపకారకః |
తపాస్తపోవ్రత స్తాపీ తావిద స్తాపహారకః ॥

శ్లో॥ తపస్సిద్ధి స్తపో బుద్ధి స్తపోనిధి స్తపభ్రుః ।
తీర్ధ స్తీర్థళత స్తీవ్ర స్తీర్ధవాసీతు తీర్థదః ॥
తీర్థవ స్తీర్థకృ తీర్థస్వీమీ తీర్థవిరోధకః ।
తీర్థసేవీ తీర్ధపతి స్తీర్థ వ్రతపరాయణః ॥
త్రిదోషాహా త్రినేత్రశ్చ త్రినేత్రప్రియ పాలకః ।
త్రినేత్రప్రియ దాసశ్చ త్రినేత్రప్రియ పూజికః
త్రివిక్రమ స్త్రిపాదూర్ధ్వ స్తరణి స్తారణి న్తమః ।
తమోరూపీ తమో ధ్వంసీ తమస స్తమఘాతకః ||
తమోదృ క్తామస సప్త స్త మోమాలీ తమోన్తకః ।
తమోహృ త్తమకృత్తా మ్ర స్తాయౌషధిగుణ ప్రదః ॥
తైజస స్తేజసాం మూర్తి స్తేజసః ప్రతిపాలకః |
తరుణ స్తర్క విద్యా చ తర్క శాస్త్ర విశారదః ||
తిమిఙ్గల స్తత్వకర్తా తత్వదాతా చ త త్త్వవిత్ |
తత్త్వదర్శీత త్వగామీ తత్వభు క్తత్వవాహనః ॥
త్రిదివం త్రివేశశ్చ త్రికాలశ్చ తమిస్రహా|
స్థాణు స్థాణు ప్రియః స్థాణు సర్వతోఽ పి చ వాసకః ||
దయాసింధు ర్దయారూపో దయానిధి ర్దయాపరః |
దయామూర్తి ర్థయాదాతా దయాదాన పరాయణః ॥
దేవేశో దేవదో దేవో దేవరాజాధిపాలకః |
దీనబంధు ర్దీనదాతా దీనోద్ధరణ దివ్యదృక్ ॥
దివ్య దేహో దివ్య రూపో దివ్యాసన నివాసకః |
దీర్ఘకేశో దీర్ఘపుచో దీర్ఘసూత్రోపి దీర్ఘభుక్ |

శ్లో॥ దీర్ఘదర్శీ దూరదర్శీ దీర్ఘబాహుస్తు దీర్ఘపః ।
దానవారి ర్డరిద్రారి రైతారి ర్దస్యుభంజనః ॥
దంష్ట్రీ దండీ దండధరో దండ్యో దండ ప్రదాయకః |
దామోదర ప్రియో దత్తాత్రేయ పూజకతత్పరః ||
ధర్వీ దలపతి ర్దద్రు దన్ ద్రురోగవినాశకః |
ధర్మోధర్మాధిపో ధర్మీ ధర్మశాస్త్ర పరాయణః ॥
థర్మాత్మా ధర్మనేతాచ, ధర్మధు ధర్మధారకః ।
ధర్మధ్వజో ధర్మమూర్తి ర్ధర్మరాజస్య త్రాసకః ॥
ధాతా ధ్యేయో ధనో ధన్యో ధనదో ధనపో ధనీ ।
ధనద త్రాణకర్తాచ ధనపప్రతిపాలకః ||
ధరణీధరప్రియో ధన్వీ ధనుష్యా స్థానధారకః ।
ధన్యీ శవత్సలో ధీరో ధాతా మోద ప్రదాయకః॥
ధాత్రేశ వరదాతా చ ధాత్రేశ ప్రతిపూజక: |
ధాత్రాత్మా చ ధరోనాధో ధరానాథ ప్రబోధకః ॥
ధర్మిష్టో ధర్మకేతుశ్చ ధవళో ధవళప్రియః |
ధవళాబలవాసీ చ ధేనుదో ధేనుపో ధనీ ॥
ధ్వని రూపో ధ్వని ప్రాణో ధ్వనిధర్మ ప్రభోధకః |
ధర్మాధ్యక్షో ధ్వజో ధూమ్రో ధాతురో ధీవిరోధకః |
నారాయణో నరో నేతా నదీశో నరవానరః
నదీసంక్రమణో నాట్యో నాట్యవేత్తా నటప్రియః ॥

శ్లో॥ నారాయణాత్మకో నందీనందీభృంగీ గణాధిపః |
నందికేశ్వర వర్మా చ నందికేశ్వర పూజకః ॥
నరసింహో నటీ నర్మీ నఖయుద్ధ విశారదః ||
నఖాయుధో నలోనీలో నల నీల ప్రమోదకః ॥
నవద్వారపురాధారో నవద్వార పురాతనః |
నరనాయణస్తుత్యో నఖనాథ మహేశ్వరః ॥
నఖ దంష్ట్రాయుధో నిత్యో నిరాకారో నిరంజనః ।
నిష్కళంకో నిరవద్యో నిర్మలొ నిర్మమో నగః ॥
నగర గ్రామపాలశ్చ నిరంతర నగారిపః |
నాగకన్యా భయధ్వంసీ నాగారిప్రియ నాగరః ॥
పీతాంబరః పద్మనాభం: పుండరీకాక్ష పావనః |
పద్మాక్షః పద్మవక్త్రశ్చ పద్మాసన ప్రపూజకః ॥
పద్మమాలీ పద్మపరః పద్మపూజన తత్పరః |
పద్మపాణిః పద్మపాదః పుండరీకాక్ష పావనః ॥
పావనః పవనాత్మ చ పవనీత్మజ పాపహా |
పరః పరతరః పద్మః పరమః పరమాత్మకః ॥
పీతాంబర ప్రియః ప్రేమ ప్రేమదః ప్రేమపాలకః ।
ప్రౌఢః ప్రౌఢతరః ప్రేతోదోషహా ప్రేతనాశకః ॥
ప్రభంజనాన్వయః పంచ పంచాక్షర మనుప్రియః |
పన్నగారి ప్రతాపీచ | ప్రసన్న పరదోషహా
పరాభిచారశమనః పరసైన్య వినాశకః |
ప్రతివాది ముఖస్తంభః పురాధారః పురారినుత్ ॥

శ్లో॥ పరాజితః పరబ్రహ్మా పరాత్పర పరాపరః |
పాతాళగః పురాణా శ్చ పురాతన ప్లవంగమః ॥
పురాణ పురుషః పూజ్యః పురుషార్థ ప్రపూరకః |
ప్లవంగేశ పలాశోపి పృధుకః పథివీపతిః ||
పుణ్యశీలః పుణ్యరాశిః పుణ్మాత్మా పుణ్యపాలకః |
పుణ్య కీర్తిః పుణ్యగీతిః ప్రాణదః ప్రాణపోషకః ॥
ప్రవీణశ్చ ప్రసన్నశ్చ పార్థధ్వజని వాసకః ।
పింగకేశః పింగరోమా ప్రణవః పింగలప్రణః ||
పరాశరః పాపహర్తా పిప్పలా శ్రయసిద్ధిదః ।
పుణ్యశ్లోక పురాతీతః ప్రధమః పురుషః పుమాన్ ॥
పురాధరశ్చ ప్రత్యక్షః పరమేష్ఠీ పితామహః ||
పుల్లారవిందవదనః పుల్లత్కమలలోచనః ॥
ఫూత్కారః ఫూత్కరః పూశ్చ పూదమంత్రపరాయణః |
స్ఫటికాద్రినివాసీ చ ఫుల్లేందీవరలోచనః ॥
వాయురూపీ వాయుసుతో వాయ్వాత్మా వామనాశకః |
వనో వనచరో బాలో బాలత్రాతా తు బాలకః ॥
విశ్వేశో విశ్వనాథశ్చ విశ్వాత్మా విశ్వపాలకః ||
విశ్వదాతా విశ్వకర్తా విశ్వవేత్తా విశాంపతిః ॥
విమలో విమల జ్ఞానో విమలానంద దాయకః |
విమలోత్పలవక్తశ్చ విమలాత్మా విలాసకృత్ ॥
బిందుమాధవ పూజశ్చ బిందుమాధవసేవకః |
బీజో థ వార్యదో బీజమారీ బీజప్రదో విభుః ॥

శ్లో॥ విజయో బీజకర్తా చ విభూతి ర్భూతిదాయకః।
విశ్వవంద్యో విశ్వగమ్యో విశ్వహర్తా విరాడ్తనుః ॥
తులకార హతారాతి ర్వసుదేవో వనప్రదః |
బ్రహ్మాపుచ్ఛో బ్రహ్మాపరో వానరో వానరేశ్వరః ॥
బలిబంధనకృ ద్విశ్వతేజా విశ్వప్రతిష్ఠితః |
విభోక్తా చ వాసుదేవో వీరవీరో వసుంధరః ॥
వనమాలీ వనధ్వంసీ వారుణో వైష్ణవో బలీ |
విభీషణ ప్రియో విష్ణుసేవీ వాయుగతి ర్విధుః ॥
విపద్మా వాయువంశశ్చ వేదవేదాంగ పారగః |
బ్రహ్మత్తను ర్బృహత్పాదో బృహత్కాయో బృహద్యశాః ||
బృహత్రాసో బృహద్భాహుర్బృహన్మూర్తిర్బృహత్సుతిః |
బృహద్ధను ర్భుహంజ్ఞంఘో బృహత్కామో బృహత్కరః|
బృహద్గతి ర్బృహత్పుచ్ఛో బృహల్లోక ఫలప్రదః |
బృహత్సేవ్యో బృమచ్ఛక్తి ర్బృహద్విద్యా విశారదః ॥
బృహల్లోకరతో విద్యా విద్యాదాతా విదిక్పతిః |
విగ్రహా విగ్రహరతో వ్యాధినాశీ చ వ్యాధిదః ||
విశిష్ణో బలదాతా చ విఘ్ననాశో వినాయకః ।
వారాహో వసుధానాధో భగవాన్భవభంజనః ||
భాగ్యదో భయకార్తచ భగో భృగుపతిప్రియః |
భవ్యో భక్తో భరద్వాజో భవాబ్ధి భయనాశకః ||
మాధవో మధురానాధో మేఘనాధో మహామునిః ।
మాయాపతి ర్మనస్వీ చ మాయాతీతో మహోత్సుకః ॥

Sri Anjaneya Sahasranama Stotralu

శ్లో॥ మైనాక వందితామోదో మనోవేగీ మహేశ్వరః |
మాయానిర్జిత రక్తాశ్చ మాయానిర్జిత విష్టపః ॥
మాయా శ్రయశ్చ నిలయో మాయావిధ్వంసకో మయః |
మనోయమపరో యామ్యో యమదుఃఖ నివారణః ||
యమునాతీరవాసీ చ యమునాతీర్థచారణః
రామో రామ ప్రియో రమ్యో రాఘవో రఘునందనః ॥
రామప్రపూజకో రుద్రో రుద్రసేవీ రమాపతిః |
రావణారీ రమానాధో వత్సలో రఘుపుంగవః ॥
రక్షోఘ్నో రామదూతాశ్చ రామేష్టో రాక్షసాంతకః |
రామభక్తా రామరూపో రాజరాజో రణోత్సుకః |
లంకావిధ్వంసకో లంకాపతి ఘాతీ లతా ప్రియః |
లక్ష్మీనాథ ప్రియో లక్ష్మీనారాయణాత్మకపాలకః ॥
లశణాబ్ధి హేలకశ్చ లంకేశ గృహభంజనః |
బ్రహ్మాస్వరూపీ బ్రహ్మాత్మా బ్రహ్మాజ్ఞో బ్రహ్మాపాలకః
బ్రహ్మావాదీ చ విక్షేత్రం విస్వబీజం చ విశ్వదృట్ |
విశ్వంభరో విశ్వమూర్తిర్విశ్వాకారో థ విశ్వదృత్ |
విశ్వాత్మా విశచ సేవ్యో థ విశ్వో విశ్వేశ్వరో విధుః ॥
శుక్తః శుక్తప్రదః శుక్రః శుక్తాత్మా చ శుభ ప్రదః ॥
శర్వరీపతి శూరశ్చ శరభశ్చ శ్రుతిశ్రవాః |
శాకంభరీ శక్తిధరః శత్రుఘ్న శ్శరణప్రదః ॥
శంకర శ్శాంతిద శ్శాంతః శివ శూలీ శివార్చితః ॥
శ్రీ రామరూప శ్రీవాసః శ్రీ పదః శ్రీ కర శ్శుచిః ॥

శ్లో॥ శ్రీశఃశ్రీదఃశ్రీకర శ్చ శ్రీకాంత ప్రియ శ్రీనిధిః
షోడశ స్వర సంయుక్తః షోడశాత్మా ప్రియంకరః ॥
షడంగ స్తోత్ర నిరతః షడానన ప్రపూజకః |
షట్చాస్త్రవేత్తా షడ్భాహుః షట్స్వరూపః షడూర్మిపః ॥
సనాతన స్సత్యరూపః సత్యలోక ప్రభోధకః |
సత్మాత్మా సత్మదాతా చ సత్యవ్రత పరాయణః ॥
సౌమ్యః సౌమ్యప్రదః సౌమ్యా దక్సౌమ్యః సౌమ్యపాలకః
సుగ్రీవాదియుత స్సర్వః సంసారభయ నాశనః ॥
సూత్రాత్మా సూక్ష సంధశ్చ స్థూలః సర్వగతిః పుమాన్ |
సురభి స్సాగర సేతుః సత్య సత్యపరాక్రమః |
సత్యగర్భః సత్యసేతుః సిద్ధిస్తుసత్య గోచరః |
సత్యవాదీ సుకర్మా చ సదానందైక ఈశ్వరః ॥
సిద్ధిః సాధ్యః సుసిద్ధశ్చ సంకల్ప స్సిద్ధి హేతుకః |
సప్తపాతాళ చరణః సప్తర్షి గణవందితః ॥
సప్తాబ్దిలంఘనో వీరః సప్తద్వీపోరుమండలః |
సప్తాంగ రాజ్య సుఖదః సప్తమాతృనిషేవితః ॥
సప్తచ్ఛంద్రో విధిః సప్తపాతాళ సంశ్రయః |
సంకర్షణ స్సహస్రీస్యః సహస్రాక్షః సహస్రపాత్ |
హనుమాన్ హర్షదాతా చ హరో హరి ర్హరీశ్వరః |
క్షుద్రరాక్షస ఘాతీ చ క్షుద్దనః క్షాంతి దాయకః ॥

శ్లో॥ ఆనాదీశొ హ్యానంతశ్చ ఆనందోధ్యాత్మ బోధకః ॥
ఇంద్ర ఈశోత్తమ శ్చైవ ఉన్మత్త ఋషి ఋద్ధిదః ||
తృవర్ణో తృవదో పేత ఐశ్వర్య ఔషధీ ప్రియః |
ఔషధ శ్చాంశుమాంశ్చైవ అకార స్సర్వకారణః ॥
ఇత్యేక ద్రామదూతస్య నామ్నాం చైవ సహస్రకం |
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం శ్రద్ధయాన్వితః ॥
పఠనా త్పారనాద్వాపి సర్వసిద్ధిర్భవే త్రియే |
మోక్షార్థీలభతే మోక్షం కామార్థీ కామ మాప్నుయాత్ ॥
విద్యార్థీ లభతే విద్యాం వేద వ్యాకరణాదికం |
ఇచ్ఛా కామస్తు కామాదీన్ ధర్మార్థీ ధర్మమక్షయం ॥
పుత్రార్థీలభతే పుత్రం చిరాయుస్సహితం పుమాన్ ।
క్షేత్రం బహు సస్యం స్యాద్గవశ్చ బహుదుగ్ధదాః ॥
దుస్స్వప్నం చ నృభిర్దృష్టం మస్వప్న ముపజాయతే |
దుఃభౌఘో నశ్యతే తస్య సంపత్తి ర్వర్థతే చిరం ॥
వస్తుచతుర్విధం తస్య భవత్యేవ నసంశయః |
అశ్వత్థమూలే జపతాం నాస్తి వైరికృతం భయం ॥
త్రికాల పఠనాతస్య సిద్ధిప్యా త్కరసంస్థితా ।
అర్థరాత్రే పఠే ధృత్వా కంఠ దేవే నర శ్శుచిః ॥
దశావర్తం న్మర్త్యః సర్వా న్కామా నవాప్నుయాత్ ।
నివాస్తే భౌమే న్యగ్రోధమూలే స్థిత్వా విచక్షణః ॥

శ్లో॥ దశావర్తం పఠేన్మర్యః సార్వభౌమ ప్రజాయతే |
ఆర్కమూలేర్క వారేతు యోమధ్యాహ్నే శుచిర్జపేత్ ॥
చిరయు స్స ముఖీ పుత్రీ విజయీ జాయతే క్షణాత్ ।
బ్రాహ్మేముహూర్తే చోత్థాయ ప్రత్యహం చ పఠేన్నరః ॥
యం యం కామయతే కామం లభతే త న్న సంశయః |
సంగ్రామే సన్నివిష్టానాం వైరి విద్రావనం పరం ॥
ఢాకినీ భూత ప్రేతాది గ్రహపీడాహరం తథా |
జ్వరాపస్మార శమనం యక్ష ప్లీహాది వారణం||
సర్వసౌఖ్య ప్రదం స్తోత్రం సర్వసిద్ధి ప్రదం తథా |
సర్వా న్కామా నవాప్నోతి వాయుపుత్ర ప్రసాదతః ||

ఫలశ్రుతి

ఈవిధముగ రామభక్తుడగు హనుమంతుని నామ సహస్రమును రెండు సార్లు గాని, మూడు సార్లు గాని ప్రతిదినము శ్రద్ధతో పఠించువారలకును, పఠింపచేయు వారలకును, సర్వకార్యములు సిద్ధించును. దేవీ! మోక్షార్ధి పైసహస్రనామములను బరించినయెడల మోక్షమును బొందును. కాముకుడు తన కోరికను దీర్చుకొనును. విద్యార్థిగనున్న వాడు హనుమత్సహస్రనామ పారాయణముచే విద్యలను పొందును. మనస్సులో వాంఛలు గలవాడు పఠించుటచే వాంఛాసిద్ధి నొందును. ధర్మార్థియగునతడు పఠించుటచే అక్షయమైన ధర్మమును పొందును. పుత్రాగ్ని యగువాడు పఠించినచో పుత్రప్రాప్తి గలవాడగును. క్షేత్రకాముడు క్షేత్రమును, పశుకాముడు పశువులను బొందును. సహస్రనామ పఠనముచే దుస్స్వప్నములు నశించును. మణియు సమస్త దుఃఖములు తొలగును. సకల సంపదలు వృద్ధినొందును. అశ్వత్థ మూలమునందు గూర్చుండి పై సహస్రనామములను బరించువారలకు శత్రుక్షయమగును. శత్రుభయము నొసగును. త్రికాలముల యందు బఠించువారలకు కార్యసిద్ధి కరతలామలకమై యుండును.

రవివారమున రాత్రి మధ్యభాగమున దశావర్తముగ పఠించినచో సర్వార్ధసిద్ధిని బొందును. మంగళవారమున తెల్లవారు సమయమున పఠించినచో సార్వభౌముడగును. ఆదివారము జిల్లేడు చెట్టు మొదట నుండి పై సహస్ర నామములను పఠించినచో దీర్ఘాయుష్మంతుడును, పుత్రవంతుడును జయముగలవాడు నగును. బ్రాహ్మీముహూర్తమున లేచి దీనిని పఠించిన వారలకు సమస్తమయిన యభీష్టములు సిద్ధించును. యుద్ధము చేయుచున్న వారలు పఠించినచో శత్రువులు పారిపోవుదురు. మరియు గ్రహబాధలు తొలగును. సహస్రనామ పారాయణము వలన జ్వరాపస్మార పాండుక్షయాది సర్వరోగములు నివారణమగును. ఇంతియే కాక హనుమదను గ్రహములు సర్వసౌఖ్యములు గలుగును. సర్వము సిద్ధించును. సర్వ కామములు ఫలించును.

మరిన్ని స్తోత్రములు

Dadhichi Maharishi Katha In Telugu – దధీచి మహర్షి కథ

Dadhichi Maharishi Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ పద్మ పురాణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దధీచి మహర్షి నీతికథ.

దధీచి మహర్షి కథ

పూర్వం పరా త్వష్ట అనే దంపతులుండే వారు. ఎంతకాలం గడచినా వారికి సంతానం కలగలేదు. ఆమె పుత్రప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుని ధ్యానంచేసింది. వేయి సంవత్సరముల పరాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె “పరమశివా! శూరుడు శస్త్రాస్త్రాలకు చంపబడని వాడు విప్రదానవ రూపధరుడు అయిన పుత్రుని ప్రసాదించు” అని కోరినది.

పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృత్రుడనే పుత్రుడు కల్గినాడు. స్వయంగా శుక్రాచార్యులవారే ఆ వృత్రునికి విద్యాబోధచేసినాడు. వరప్రభావంతో గురుకృపతో మహాతేజసంపన్నుడైనాడు వృత్రుడు. కాని అతనిలో బలగర్వం ఎక్కువయ్యింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు! అమిత బలవంతుడైన వృత్రుడు దేవాధిపతి అయిన ఇంద్రుడు 3000 యేండ్లు యుద్ధం చేశారు. చివరికి వృత్రుడు విజయం పొందాడు. పరాజితుడైన శచీపతి బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మాఱగా వృత్రుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు

“యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. నేనూ అక్కడి వెళ్ళాలి. దారిచెప్పండి”. శుక్రుడిలా బదులిచ్చాడు “రాక్షసనాథా! నీవు బ్రహ్మలోకానికి పోలేవు. తృప్తికి మించిన సంపద లేదు. త్రిలోకాధిపత్యంతో సంతృప్తిపడు”. “ఇంద్రుడున్నంత వరకూ నాకు సుఖంలేదు. వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది? నాకెందుకు లేదు” అని వృత్రుడన్నాడు. “పూర్వం పవిత్రమైన నైమిశారణ్యంలో ౧౦౦౦ సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్టతో తపస్సు చేశాడు. అంతటి తపశ్శాలి కనక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రునికి శంకరుని అనుగ్రహం వలన కలిగింది” అని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృత్రుడు నైమిశారణ్యం చేరి తపస్సు ఆరంభించాడు.

దుష్టుడైన వృత్రుని సంహారమునకు శ్రీకారం చుట్టిన మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు “సురేశ్వరా! పరమేశ్వరుని వర ప్రభావం వలన వృత్రుడు శస్త్రాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నదీ తీరంలో పరమనిష్ఠతో దధీచి మహర్షి తపమాచరిస్తునాడు. నూరుమూరల ప్రమాణంలో ఉన్న ఆ మహనీయుని వెన్నెముక ప్రజ్రముకంటే రెండు రెట్లు పటిష్టమైనది. ఆ దయాళువును లోకహితార్థము తన అస్థిని ఈయమని ప్రార్థించండి”. నారాయణుని అనుజ్ఞ తీసుకుని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీతీరంలో ఉన్న మహర్షిశిరోమణి వద్దకు వెళ్ళాడు.

దధీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు పూర్వ వృత్తాంతమంతయు తెలిపి ఇలా అన్నాడు “మహానుభావా! వృత్రుని ఆగడాలు మితిమీఱుతున్నాయి. అతని సంహరించకపోతే విబుధ (పండిత) వినాశం తప్పదు. దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి”.

ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దధీచి మహర్షి మహదానందంతో పొంగిపోయాడు. లోక హితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలిసినది ఏమున్నదన్నాడు. యోగశక్తితో శరీరత్యాగం చేశాడు! దధీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమితుడైన వేల్పుదొర దధీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోకభీకరుడైన వృత్ర సంహారం చేశాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. మహనీయులు పరోపకారార్ధము తమ శరీరమును కూడా త్యాగం చేయడానికి వెనకాడరు. అడగంగానే మహదానందంతో ఇంద్రునికి తన అస్థిని ఇచ్చి దధీచి మహర్షి మహకు మార్గదర్శి అయినాడు.
  2. గర్వం అహంకారం వినాశ హేతువులు. బలగర్వంతో హుంకరిచిన వృత్రుడు ఎంతో వరబలం ఉండికూడా మత్సరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైనాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dharmavyadhuni Katha In Telugu ధర్మవ్యాధుని కథ

Dharmavyadhuni Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మవ్యాధుని కథ. 

ధర్మవ్యాధుని కథ – Dharmavyadha Story In Telugu

పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.

ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.

ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. “తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
  2. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
  3. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
  4. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Veerabrahma Suprabhatam In Telugu – శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్

Sri Veerabrahma Suprabhatam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్ ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం శ్రీ వీరబ్రహ్మ స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్

శ్రీ వీర బ్రహ్మ యోగీశ ! ప్రాతస్సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ జగదాచార్య! కర్తవ్యం లోక పాలనమ్.

టీక. శ్రీ వీరబ్రహ్మయోగీశ వీరబ్రహ్మమను పేరుగల ఓ యోగీశ్వరుఁడా, ప్రాతస్సం ధ్యా = ప్రాతస్సంధ్యాకాలము, ప్రవర్తతే = జరుగుచున్నది, జగదాచార్య = ఓ జగద్గురూ ! లోకపాలనం = లోకరక్షణము, కర్తవ్యం = చేయదగినది, కనుక) ఉత్తిష్ఠ = లెమ్ము. (మేల్కొన వలసినది.)

తా. జగద్గురుడవగు నో వీర బ్రహ్మ యోగీశ్వరా ! ప్రాతస్సంధ్య జరుగుచున్నది గావున, లోకరక్షణ కార్యార్థమై నీవు మేల్కొనవలసినది.

ఉత్తి పోత్తిష్ఠ వీరేశ! ఉత్తిష్ఠ సమతావిభో!
ఉత్తిష్ఠ వేద వేదాన ధర్మ మర్మ ప్రచారక !

టీక. వీ రేశ = ఓ వీ రేశ్వరస్వామి, ఉత్తిష్ఠ- ఉత్తిష్ఠ = లే లెమ్ము. (శ్రీఘ్ర ముగా మేల్కాంచుము) సమతావిభో – సమభావములకు ప్రభుడ వైన వాడా! ఉత్తిష్ఠ = లెమ్ము, వేద వేదాన ధర్మ మర్మ ప్రచారక: వేదముల యొక్కయు, ఉపనిషత్తుల యొక్కయు ధర్మ రహస్యములను ప్రచారము చేయువాడా! ఉత్తిష్ట = లెమ్ము.

తా. సమతా సిద్ధాంతమునకు ప్రభుడవైన ఓ వీరేశ్వరస్వామీ! మేల్కాంచుము. వేదోపనిషత్తుల ధర్మరహస్యములను ప్రచారము చేసిన ప్రభూ! మేల్కాంచుము.

ఉత్తిష్ఠ లోకజననీ గోవిందాంబా మనోహర!
ఉత్తిష్ఠాశ్రిత మందార విశ్వరక్షా విధిం కురు !

టీక. లోకజననీ గోవిందాంబా మనోహర=లోకమాతృస్వరూపిణి యైన గోవిందమ్మకు భర్తవైన వీర బ్రహ్మ గురూ! ఉత్తిష్ఠ = లెమ్మో. ఆశ్రిత మందార = ఆశ్రయించినవారికి కల్పవృక్షమువంటి వాడా! ఉ ఉత్తిష్ఠ = లెమ్ము. విశ్వరక్షావిధిం = విశ్వపాలన కార్యమును, కురు = చేయుము.

తా. జగన్మాతయగు గోవిందమ్మకు భర్తవుతు, ఆశ్రయించిన వారి వాంఛలను దీర్చుటకు కల్పవృక్షమైన వాడవును నగు ఓ స్వామీ! శీఘ్రమే మేల్కాంచి లోకరక్షణ కార్యము నొనర్పుము.

మాత స్సరుస్త జగతాం మహనీయ వీర
బ్రహ్మేశ్వరప్రణయిని ! ప్రణతార్థదాత్రి!
శ్రీ కందిమల్లయ పురీశ్వరి ! లోకవంద్యే !
శ్రీ వీరయోగి దయితే! తవ సుప్రభాతమ్.

టీక. సమస్తజగతాం = ఎల్ల లోకములకును, మాతః = – అమ్మవును, నీయ వీరబ్రహ్మేశ్వర ప్రణయిని మహాత్ముడగు వీర బ్రహ్మమునకు ప్రియురాలవునూ, ప్రణత ఆరదాత్రి నమస్కరించినవారలకు ఫల ములనిచ్చు దానవును, శ్రీ కందిమల్లయ పురీ ఈశ్వరి = మంగళకరమగు కందిమల్లయపురమున నివసించి పాలించుదానవును, లోకవంద్యే = లోకములచే నమస్కరింపదగినదానవును, శ్రీ వీరయోగి దయితే = శ్రీ వీరబ్రహ్మయోగి పత్నినగు నో తల్లీ ! తవ నీకు, సుప్రభాతం= శుభోదయము. (అగుగాక)

తా. సమస్త లోకములకు తల్లివీ, వీర బ్రహ్మేశ్వరుని ప్రేమను చూఱగొన్న దానవూ, నమస్కరించువారలకు సత్ఫలముల నిచ్చుదానవూ, కందిమల్లయపురమున నివసించి పాలించు దానవూ, లోకములచే నమస్కరింపబడు దానవూ, వీర బ్రహ్మగురుని పత్నివీ అగు నీకు సుప్రభాత మగుగాక.

సుప్రభాతం భవే దేవి ! తవ నీ రేజలోచనే!
గోవిందాం బాస్వరూపిణ్యా జగన్మాతు ర్జగచ్ఛియై.

శ్రీక. నీ రేజిలోచనే = తామరలవంటి కన్నులుగల, దేవి = ఓ దేవతా, గోవిందాంబా స్వరూపిణ్యాః = గోవిందమ్మరూపముననున్న, జగత్ మాతు ః = లోక జనని వైన, తవ జ నీకు, జగత్ శ్రియై = లోకముల శ్రేయస్సుకొఱకు, సుప్రభాతం = శుభోదయము, భవేత్ =అగుగాక.

తా. తామర పూలవంటి కన్నులుగల ఓ దేవీ! గోవిందాంబా స్వరూపమునుదాల్చిన లోక జననివగు నీకు లోకములకు శుభము కలుగుటకొఱకై సుప్రభాత మగుగాక.

పూజోచిత ప్రసవ పత్ర సమృద్ధ హస్తా
భక్తా స్తపో విభవ సంభృత హృష్ట చిత్తాః,
ప్రాప్తా స్వదంగణ మభంగుర మంగళాఢ్యం
శ్రీవీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్

టీక. పూజా, ఉచిత, ప్రసవ, పత్ర, సమృద్ధ, హస్తాః = పూజించుటకు తగీన పుష్పముల చేత పత్రముల చేత నిండిన చేతులు గలవారును; తపస్,, విభవ, సంభృత, హృష్ట, చిత్తాః = తపస్సంపద చేత భరింపఁబడినట్టియు సంతసించినట్టియు మనస్సులు గలవారును, అగు భక్తాః భక్తులు, అభంగుర, మంగళ, అఢ్యం = శాశ్వతములైన శుభములతో నిండిన, (శాశ్వతసుఖమనఁగా మోక్షమని యర్థము) త్వత్, అంగణం = మీ ఆలయపు ముంగిలి ప్రదేశమును, ప్రాప్తాః = చేరుకొన్నారు; శ్రీవీర దేశికవిభో ! = వీరబ్రహ్మమను పేరుగల గురుస్వామి ! తవ = నీకు, సుప్రభాతమ్ = సుప్రభాతము అగుగాక.

తా. ఓ వీర బ్రహ్మ గురూ! చిరకాలము తపస్సు చేసిన వారును, సంతోషముతో గూడిన మనస్సులు గలవారును అగు నీభక్తులు పూజించుటకు దగినట్టి పూలను పత్రములను తీసికొని శాశ్వతములైన శుభములకు నివాసమైన నీ ఆలయప్రాంగణమును జేరుకొన్నారు. కాన నీకు సుప్రభాత మగుగాక !

ఆదాయ రమ్య సలిలాశయ పద్మగంధాన్
త్వత్సేననాయ నితరా మతికౌతు కేన,
ప్రాభాత మందపవనాః పరిత శ్చరన్తి
గోవిందమా హృదయవల్లభ ! సుప్రభాతమ్.

హృదయవల్లభ = గోవిందమ్మ గారికి మనోనాథుఁ డైనవాఁడా! ప్రాభాత మందపపనాః = ఉదయకాలపు మెల్లని గాడ్పలు ; రమ్యసలిలాశయ పద్మగంధాజ్= అందమైన కొలకుల లోని పద్మములయందలి సువాసనలను; నితరాం = మిక్కిలిగా ; ఆదాయ = తీసికొని; అతికాతు కేన= ఎక్కువ కుతూహలముతో; త్వత్ సేవనాయ= నీ సేవకొరకై ; పరితః = అంతట; చరన్తి= సంచారము గావించుచున్నవి. సుప్రభాతమ్ = నీకు సుప్రభాత మగుగాక.

తా. ఓ గోవిందమా ప్రాణవల్లభ ! ఉదయ కాలమున మెల్లగా వీచెను వాయువులు సరస్సులలోని తామరపూల సువాస నల నెక్కువగా గ్రహించి నీసేవ చేయవలయుననెడి కుతూహలముతో అంతట సంచరించుచున్నవి. ఆ మంద మారుతముల ననుభవించుటకై నీవు మేల్కొందువుగాక!

ఈషత్ప్రఫుల్ల సరసీజ రసప్రమత్తాః
పుష్పందయా స్సహచరీ సహితా స్సుమంద్రం,
ప్రత్యూషయోగ్య పరమార్థ విబోధ గేయం
గాయన్తి కక్కయగురో! తవ సుప్రభాతమ్.

టీక. కక్క యగురో = కక్కయ్యకు గురుడవైనవాడా! ఈషత్ప్రఫుల్ల సర సీజ రస ప్రమత్తాః = కొలదిపాటిగా విప్పారిన తామర పూలలోని మకరందముచేత మరించినట్టి; పుష్పందయాః = తుమ్మెదల ; సహ చరీ సహితాః = ప్రియురాండ్రతో గూడుకొనిన వై; సుమంద్రమ్= గంభీరము గా; ప్రత్యూషయోగ్య పరమార్థ విబోధ గేయమ్=ప్రాతః కాలమున పాడదగినదియు శ్రద్ధమగు నర్థముతోఁ గూడినడియు నగు మేలుకొలుపుపాటను; గాయని = పాడుచున్న వికి తవ – నీకు ; సుప్రభాతమ్ =శుభోదయము అగుగాక!

తా. కక్కయ్యకు తత్త్వబోధ చేసిన గురుమూర్తీ ! కొద్దిగా వికసించిన పద్మములలోని తేనెను ద్రావి మదించిన తుమ్మెదలు తమ భార్యలతో గూడినవై ఉత్కృష్టార్థ ముతో నిండిన మేలుకొలుపును గంభీరముగా పాడు చున్నవి. నీకు సుప్రభాత మగుగాక !

వీణాద్యనేక సుమనోహర వాద్యవర్దేశి
ప్రౌఢప్రబంధ రచనా పటవఃక వీద్రాః,
నిర్మాయ తే సుచరితం కలిదోషనాశం
గాయన్తి విశ్వగురురా టవ సుప్రభాతమ్.

టీక. విశ్వగురురాట్ = ఓ లోకగురు మహారాజా! ప్రౌఢ, ప్రబంధ, రచనా, పటవః = ప్రౌఢములైన కావ్యములను వ్రాయుటలో సమర్థు లైన; కవీంద్రాః = కవిశ్రేష్ఠులు; కలిదోష నాళమ్ = కలియుగము నందలి పాపములను నశింపఁజేయునట్టిదైన; తే= నీయొక్క ; సుచరి తమ్ = సచ్చరిత్రమునః; నిర్మాయ = సృష్టించి; (వ్రాసి) వీణావ్య సేక, సుమనోహర, వాద్యవర్ధేః = వీణ మొదలైన పెక్కు మనోహర వాద్యములచేత; గాయన్తి = పాడుచున్నారు; తవ= నీకు, సుప్ర భాతమ్ = సుప్రభాత మగుగాక !

తా. ప్రౌఢములైన కావ్యములను వ్రాయుటలో నేర్పరులైన కవీశ్వరులు కలిదోషములను నశింప జేయునట్టిదైన నీ సచ్చరిత్రమును వ్రాసి వీణ మొదలగు వాద్యములను తోడుచేసికొని గానము చేయుచున్నారు. ఓ విశ్వ గురుమూర్తీ! నీకు సుప్రభాత మగుగాక !

బ్రహ్మాచ్యుతాభవ సురేశ్వర లోక బంధు
మూర్త్యాత్మక స్త్వ మితి కేచి దుదాహరన్తి;
మూర్తిత్రయీ రుచిరరూప ఇతీహ
కేచిత్ గాయన్తి దేశికవిభో! తవ సుప్రభాతమ్.

టీక. దేశికవిభో = గురుప్రభూ ! ఇహ=ఈలోకమున; కేచిత్= కొందఱు; బ్రహ్మ… మూర్త్యాత్మక ః. బ్రహ్మ = బ్రహ్మ; అచ్యుత : విష్ణువు; అభవ = శివుఁడు; సురేశ్వర = ఇంద్రుఁడు; లోకబంధు = సూర్యుఁడు ఆస; మూర్తి ఆత్మకః = పంచమూర్తుల స్వరూపుఁడవు; ఇతి = అని; ఉదాహరన్తి= చెప్పుచున్నారు; కేచిత్ = నటిం దఱు; మూర్తిత్రయీ, రుచింరూపః = బ్రహ్మ విష్ణువు శివుఁడు ఆను త్రిమూర్తులయొక్క మనోహరస్వరూపుడవు; ఇతి = అని; గాయన్తి=గానము చేయుచున్నారు; తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాత మగుగాక !

తా. ఓ గురుప్రభూ ! ఈలోకమున పెద్దలగు కొందఱు నిన్ను సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహకర్తలగు బ్రహ్మ, విష్ణువు, శివుఁడు, ఇద్రుఁడు, సూర్యుఁడు అను పంచ మూర్తుల సమష్టి స్వరూపునిగా పేర్కొనుచున్నారు. మఱికొందఱు బ్రహ్మ, విష్ణు, శివు లను మువ్వురు మూర్తుల సమష్ట్యవతారముగ భావించుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక ! కేచి ద్వదన్తి పరిపూర్ణ హరిస్వరూపం గోపాలనాశ్రిత జనావన ముఖ్యకార్యైః బ్రహ్మావతార మితి శిల్ప గురుత్వ హేతోః కేచి దువన్తి గురురా టన సుప్రభాతమ్.

టీక. గురురాట్ = ఓగురుమహారాజా! కేచిత్ = కొందఱు; గోపాలన, గాయుట ఆశ్రితులను అశ్రితజనావన, ముఖ్యకార్యైః = అవులను రక్షించుట మన్నగు కార్యముల చేత; పరిపూర్ణ హరిస్వరూపం = పరి పూర్ణమగు విష్ణ్వవతారమని, వదన్తి – చెప్పుచున్నారు; కేచిత్ = మఱిగొందఱు;శిల్ప గురుత్వ హేతో ః = శిల్పములకు గురుఁడ వైన కారణ ముస; బ్రహ్మావతారమితి = బ్రహ్మదేవుని యవతారమని; బ్రువన్తి= చెప్పుచున్నారు; తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాతముఅగుగాక!

తా. ఓగురుమహారాజా! కొందఱు పండితులు నీవు విష్ణుమూర్తి చేసిన గోపాలనము ఆశ్రితజన రక్షణము మున్నగు స్థితి ప్రధాన కార్యములను చేసినందువలన నిన్ను విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణావతారమని చెప్పుచున్నారు. సృష్టి శిల్పము నొనర్చిన బ్రహ్మవలె నీవును అయో, దారు, తామ్ర, శిలా, స్వర్ణమయములగు పంచశిల్పములను నెర పినందువలన బ్రహ్మ దేవుని యవతారమని చెప్పుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాతమగు గాక.

వివ : వీరగురుడు పంచశిల్పములను స్వయము గా చేసి, వానిని సమాజతారకములుగా ప్రోత్సహించినాడన్న విష యము నిచ్చట స్మరింపవలయును.

Sri Veerabrahma Suprabhatamu

ఏత న్మహాంధ్ర ధరణీకృత పుణ్య కాన్యై
రుద్భూత దివ్య మహిమాఢ్య శివావతారం,
ఆచక్ష తే పరమతత్త్వవిదో భవన్తు
శ్రీ బ్రహ్మ దేశికవిభో! తవ సుప్రభాతమ్.

టీక. శ్రీ బ్రహ్మదేశికవిభో = ఓ బ్రహ్మ గురూత్తమా! పరమకత్వ శ్రీ విదః = శ్రేష్ఠమగు తత్వము నెఱింగిన పెద్దలు; భవనం = నిన్ను; ఏతత్, మహార్ద్ర, ధరణీకృత, పుణ్యకార్యైః = ఈవిశాలా ర్ధ్రభూమి చేత చేయఁబడిన పుణ్య కార్యముల చేత; ఉద్భూత, దివ్య, మహిమాఢ్య, శివావతారం = పుట్టినట్టియు దివ్యమహిమలతో నిండినట్టియు శివుని యవతారమని; ఆచత తే= చెప్పుచున్నారు;6వ= నీకు; సుప్రభాతమ్= సుప్రభాత మగుగాక !

తా. ఓ బ్రహ్మగురువర్యా! తత్వవేత్తలగు పెద్దలు నిన్ను గొప్పదగు ఈ తెలుగు దేశము చేసికొన్న పుణ్య ములవలన ఆవిర్భవించిన దివ్యమహిమలుగల శంకరావతారమని చెప్పుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !

వివ: వీరబ్రహ్మము శైవకుటుంబము వారగు పాపఘ్ని మఠాధిపతులవద్ద పెరుగుట, అల్లాడుపల్లెలో వీరభద్రస్వామిని ప్రతిష్ఠించి నిజగురువుగా ఉపాసించుట మొదలగు దివ్యలీలలు ఇచ్చట అనుసంధింప దగినవి.

బ్రహ్మాచ్యుతాభవ ముఖాఖల దేవతాంశ
భ్రాజిష్ణు మేవ కలయే గురురా ద్భవస్త్రం,
నానామనోజ్ఞ మహనీయ గుణాలయ త్వాత్
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.

టీక. గురురాట్ = ఓ గురుమహా రాజా! భవన్తమ్ = నిన్ను; మనోజ్ఞ, మహనీయ, గుణాలయత్వాత్ = పలువిధములైన మనో హర మహత్తర గుణములకు నిలయుఁడవైనందున, బ్రహ్మా….. భ్రాజిష్ణుమేవ. బ్రహ్మా = బ్రహ్మదేవుడు; అచ్యుత = విష్ణువు; అభవ= శివుఁడు; ముఖ = మొదలైన; అఖిల దేవతాంశ = = సమస్త దేవతాశ ములచేత; భ్రాజిష్ణుమ్ ఏవ = ప్రకాశించువానిని గా నే; కలయే= తెలిసికొనుచున్నాను; శ్రీవీరదేశికవిభో = ఓ వీరబ్రహ్మ గురుమూర్తీ ! తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాతము అగుగాక!

తా. ఓ గురుమహారాజు! బ్రహ్మాది సర్వ దేవతలకు నుండునట్టి కొనియాడదగిన మహనీయగుణములు పెక్కులు నీలో నుండుటచేత నిన్ను బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు సర్వ దేవతలయొక్క అంశములను పొంది ప్రకాశించు సర్వ దేవమయునిగా భావించుచున్నాను. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !

వివ: వీరగురుడు ఒక్క సత్పదార్థమే పలు నామ రూపములచే ప్రకాశించినదని బోధించినాడుగాన, ఆయనను సర్వదేవమయునిగా భావించుట సముచితము.

గోవిందమా హృదయ తామర సాబ్జబంధో!
సిద్ధిపనేవిత పదాబ్జ! దయైక సింధో !
ఏతే పరన్తి చరితం తవ సూరిముఖ్యాః
శ్రీకందిమల్లయ పురీశ్వర! సుప్రభాతమ్.

టీక. గోవిందమా, హృదయ, తామరసాబ్జ, బంధో= గోవిందాంబ యొక్క హృదయపద్మమును వికసింపఁజేయుటకు సూర్యునివంటివాడవును; సిద్ధ, ఉపసేవిత, పద, అబ్జ = సిద్దప్పయను శిష్యుని చేత సేవింపబడిన పాదపద్మములు గలవాఁడవును; దయా, ఏక సింధో = దయకు సముద్రుఁ డవును అగు; శ్రీ కందిమల్లయ పురీశ్వర = కందిమల్లయ పల్లెయను గ్రామమున నివసించు ప్రభూ! ఏతే = ఈ; సూరిముఖ్యాః = పండిత శ్రేష్ఠులు; తవ = నీయొక్క; చరితం = – చరిత్రమును; పఠన్తి = చదువు చున్నారు; నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగు గాక!

తా. ఉత్తమ గృహస్థాశ్రమ నిర్వహణము చేతను, లోకోద్ధ రణ కార్యముల చేతను, భార్యయగు గోవిందమ్మను సంతోష పెట్టువాఁడవును, శిష్యుఁడుగు సిద్దప్ప చేత సేవింపఁబడు వాడవును, దయానిధివినీ అగు నో కందిమల్లయపురమున వసించు వీర బ్రహ్మగురూ! ఇచ్చటకు విచ్చేసిన పండితులు నీచరిత్రమును చదువుచున్నారయ్యా! నీవు మేల్కొందువు గాక!

యా త్వన్నిరంతర నివాస విశేష హేతోః
శ్రీ కందిమల్లయపద ప్రకటా కుపిల్లీ
బ్రహ్మస్థలాహ్వయ మగా ద్భువి లోకనాథ !
శ్రీ బ్రహ్మ దేశిక విభో ! తవ సుప్రభాతమ్.

టీక. లోకనాథ = ఓ లోకేశ్వరుఁడా! భువి = భూమియందు శ్రీకంది మల్లయపద ప్రకటా = కందిమల్లయ పదము చేత ప్రసిద్ధమయిన థూ = ఏ; కుపల్లీ = కుగ్రామము; త్వత్, నిరంతర, నివాస, విశేష హేతోః = నీయొక్క నిరంతర నివాసమను గొప్ప కారణమువలన, బ్రహ్మస్థల, అహ్వయమ్ = బ్రహ్మక్షేత్రమను పేరును; అగాత్ = పొందినదో; శ్రీ బ్రహ్మ దేశిక విభో = బ్రహ్మగురుత్తమా! తవ = అట్టి నీకు; సుప్రభాతమ్ శుభోదయము అగుగాక!

తా. లో కేశ్వరుడవగు నో వీర బ్రహ్మగురూ ! నీవు గృహస్థుఁడవై ఎల్లప్పుడును కాపుర ముండుటవలన కందిమల్లయపల్లె యను కుగ్రామము బ్రహ్మక్షేత్రమను ప్రసిద్ధిని భూమి పై కీ ర్తనీయమైనది. కందిమల్లయపల్లె కట్టి సుప్రసిద్ధి జెంది చేకూర్చిన నీకు సుప్రభాత మగుగాక!

అన్నాజయాఖ్య నిజశిష్య వరో పదిష్టు
భావ్యర్థ బంధుర మహత్తర శాస్త్రవక్తః !
గాయన్తి తేఁద్భుత విభూతి లసచ్చరిత్రం
లోకా స్సదా మునివిభో ! తవ సుప్రభాతమ్.

టీక. అన్నా జయా …… వక్త్రః అన్నాజయాఖ్య = అన్నాజయ్య యను ‘పేరుగల; నిజశివ్యవర = సొంతశిష్యునికి, ఉపఠిష్టు = ఉపదేశింప బడిన; భావి అర్థబధుర = భవిష్య ద్విషయములతో నిండిన, మహ త్తర శాస్త్ర పక్తః = గొప్పకాలజ్ఞానమను శాస్త్రమును చెప్పినవాడా! లోకాః = లోకములు, తే=నీయొక్క, అద్భుత, విభూతి, లస చ్చరిత్రమ్ = ఆశ్చర్యకరములగు, అణిమాది విభూతులు కలదైయొప్పు చరిత్రమును; సదా = ఎల్లప్పుడు; గాయన్తి = గానము చేయుచున్నవి; మునివిభో = ఓ మునీంద్రా! తవ= నీకు; సుప్రభాతమ్ = సుప్ర భాతము అగుగాక.

తా. ఓమ:నీశ్వరా! నీవు బనగాన పల్లెలో అన్నా జయ్య యను శిష్యునికి రాబోవు సంగతులతో గూడిన గొప్పదై న కాల జ్ఞానము నుప జేశించినాడవు. జీవితములో ఆశ్చర్యకరము లగు పెక్కు మహిమలను బ్రదర్శించినావు. లోకములు మహిమాఢ్య రుగు నిట్టి నీసచ్చరిత్రమును గానము చేయు చున్నవి. నీకు సుప్రభాత మగు గాక.

స్త్రీ శూద్ర భేద మపహాయ గుణైక దృష్ట్యా
రెడ్డ్యన్వవాయ భవ వేంకట రెడ్డి పత్న్యాః
మంత్రోపదేశ సహితం మహితాత్మ తత్త్వ
ముక్తం త్వయా మునివిభో! తవ సుప్రభాతమ్.

టీక. మునివిభో – ఓ మునీశ్వరా! త్వయా = నీ చేత; స్త్రీ శూద్ర భేదవ్ = వీరు స్త్రీలు, వీరశూద్రులు అనుభేదము; ఆపహాయ =వదలి; గుణ, ఏకదృష్ట్యా= గుణములయందలి ముఖ్యదృష్టితో; రెడ్డి, ఆన్వవాయ భవ, వేంకట రెడ్డిపత్న్యాః = రెడ్డి వంశమున బుట్టిన వేంకట రెడ్డి భార్య యగు ఆచ్చమ్మగారికి; మంత్ర, ఉపదేశ, సహితం – మహామంత్రోప దేశముతో గూడిన; మహిత, ఆత్మతత్వం కొనియాడఁదగిన ఆత్మ రహస్యము (ఆత్మజ్ఞానమన్నమాట) ఉక్తం= చెప్పబడినది; తవ= నీకు; సుప్రభాతమ్=శుభోదయమగుగాక!

తా. ఓబ్రహ్మమునీ,ద్రా! నీవు వీరు స్త్రీలు, వీరుశూద్రులు అను భేదమును పాటింపక గుణములకు మాత్రమే ప్రాధాన్య మిచ్చి బనగాన పల్లెలో రెడ్డి వంశమున బుట్టిన వేంకట రెడ్డిగారి భార్యయగు అచ్చమాంబకు మంత్రోప దేశము చేసి జన్మతారకమగు ఆత్మతత్వమును గూడ బోధించితివి. ఇంత విశాలదృష్టిగల నీకు సుప్రభాత మగుగాక!

గోవిందయాది సుత సిద్ధవముఖ్య శిప్యై
ర్విస్తార్యమాణ మహితాశయ మాననీయ!
త్వదర్శితాని సుపధాని విశాల విశ్వ
సంతారకాని మునిరా టన సుప్రభాతమ్.

టీక. మునిరాట్ = ఓ మునీశ్వరా; గోవిందయాది, సుతీ, సిద్ధప, ముఖ్య, శిస్యైః = గోవిందయ్య మొదలగు కుమారుల చేతను, సిద్దప్ప మొదలగు శిష్యుల చేతను; విస్తార్యమాణ, మహిత, ఆశయ, మాననీయపిస్త రింప జేయఁబడుచున్న గొప్ప భావములచేత పూజింపఁదగినవాఁడా! త్వద్దర్శి తాని = నీ చేఁజూపఁబడిన; సుపథాని= మంచి మార్గములు; విశాల, విశ్వ, సంతారకాని విశాలమగు లోకమును తరింపఁజేయం నట్టివి; తవ = అట్టి నీకు; సుప్రభాతమ్ = శుభోదయ మగుగాక!

తా. ఓ వీర బ్రహ్మమునీంద్రా ! గోవిందయ్య, పోతులూరయ్య మొదలగు కుమారులచేతను, అన్నాజయ్య, సిద్దప్ప మొదలగు శిష్యులచేతను జగత్కల్యాణకరములయిన నీ భావములు ప్రచారము చేయఁబడినవి. లోక శ్రేయమునకు నీవు చూపిన మార్గములు ఒక్క భారతదేశమునే గాక, సమస్త ప్రపంచమునుగూడ తరింపఁ జేయునట్టివి. (నీసదుప దేశములకు దేశకాలములు ప్రతిబంధకములు కావని తాత్పర్యము) అట్టి నీకు సుప్రభాత మగుగాక !

విప్రోజయ మేష ధరణీపతి రేష వైశ్య
ళ్ళూద్రోయ మంత్యజ ఇతి స్వసుతః పరో
జయమ్ భేదం విహాయ గుణ గౌరవ బద్ధ బుద్ధి
సంవర్తసేన్మ గురురాటవ సుప్రభాతమ్.

టీక. త్వం = నీవు, ఆయం=వీడు,విప్రః = బ్రాహ్మణుడు, ఏవః – ఇతడు, ధరణీపతిః = రాజు, ఏవః = ఇతఁడు. వైశ్యః=కోమటి, ఆయం= వీడు, శూద్రః = శూద్రుఁడు, (వీడు) అంత్యజ = చండాలుఁడు; ఆయం = వీడు, స్వసుతః = సొంత కొడుకు, (వీడు) పరః = ఇతరుఁడు ఇతి = అని, భేదం = భేదమును, విహాయ- వీడి, గుణగౌరవ బద్ద బుద్ధిః= గుణముల యొక్క గౌరవమునందే బంధింపఁబడిన బుద్ధిగల వాఁడవై, వర్తసేస్మ = ప్రవర్తించినాఁడవుకదా!, గురురాట్ = ఓ గురురాజా! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయము అగుగాక.

తా. కులభేదములచే కూలిపోవు లోకమున నీ వవతరించి వీఁడు బ్రాహ్మణుఁడు, వీడు క్షత్రియుఁడు, ఇతఁడు వైశ్యుఁడు ఇతఁడు శూద్రుఁడు, ఇతఁడు చండాలుఁడు, వీడు నా కొడుకు, ఇతఁ డింకొకడు అను భేదమును వదలి సద్గుణ ములకు మాత్రమే ప్రాధాన్య మొసగి, అన్ని తరగతుల వారిని మన్నించినావు. ఇట్టి గురుమహారాజవగు నీకు సుప్రభాత మగుగాక!

కక్కయ్యనామక మతి ప్రవిమూఢబుద్ధిమ్
భార్యాం విచార్య మణిపూరక ముఖ్య పట్కమ్,
అన్వేషయ న్త మకరోః శ్వపచం కృతార్థం
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.

టీక. శ్రీ వీర దేశిక విభో! = ఓ వీర గురూత్తమా ! భార్యాం = ‘పెండ్ల మును; విచార్య =కత్తితో చీల్చి; మణిపూరక ముఖ్యషట్కం = మణి పూరకము మాన్ను గాగల షట్చక్రములను; ఆన్వేషయ న్తమ్ = వెదకు చున్నవాఁడును; అతిప్రవిమూఢబుద్ధిం గాఢముగు నజ్ఞానముతోఁ గూడిన బుద్ధిగలవాఁడును నగు; కక్కయ్య నామకం = కక్కడను పేరుగల శ్వపచం = కుక్క మాంసము తినునట్టి మాదిగ వానిని; కృతార్థం = తత్త్వోపదేశము చేత ధన్యునిగా; ఆకరోః = చేసితివి; తవ = నీకు; సుప్రభాతమ్ = మేలుకొలుపు ఆగుగాక!

టీక. ఓ వీర బ్రహ్మగురూ ! నీవు చేయు షట్చక్ర రహస్య బోధలను బుద్ధిమాండ్యము చేత అర్థము చేసికొనఁజాలక భార్యాశరీరమున వానిని వెదకఁదలచి, ఆమెకు కత్తితో కోసిచూచి నిష్ఫలుఁడైన కక్కడను మాదిగవానికి తత్వ బోధ చేసి వాని భార్యను బ్రతికించి కృతార్థునొనరించితివి. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !

Sri Veerabrahma Suprabhatamulu

నానా మతో క్త వివిధార్థ విభిన్న సత్యా
న్యాలోచ్య న్యాలో చ్య సంయమపరీత విశాలబుద్ధ్యా
తత్త్వం భవే ద్భహుముఖీన మితి త్వయోక్త్రమ్
శ్రీ బ్రహ్మ దేశికవిభో! తవ సుప్రభాతమ్.

టీక. శ్రీ బ్రహ్మ దేశికవిభో = ఓ బ్రహ్మగురూత్తమా! నానా, మత్తోక్త, వివిధార్థ, విభిన్న సత్యాని పెక్కు మతములయందు చెప్పబడిన పలు ప్రయోజనములు గల వేఱు వేఱు సత్యములను; సంయము, పరీత, విశాల బుద్ధ్యా= సంయమ జ్ఞానముతో గూడిన విశాలమగు బుద్ధితో; ఆలోచ్య=సమాలోచించి; తత్త్వమ్ = మూలతత్త్వమనునది; బహుముఖీ నమ్ = అ నేక ముఖములు గల దై; భవేత్ = ఉండును. ఇతి = అని; త్వయా=నీ చేత; ఈ క్తమ్ – చెప్పబడినది; తవ= నీకు; సుప్రభాతమ్= శుభోదయ మగు గాక.

తా. ఓవీర బ్రహ్మ గురూ! నీవు ధ్యాన ధారణా సమాధులను మూడింటి సమష్టియైన సంయమమును అనుష్ఠించి, మహ త్తరమగు ప్రాతిభజ్ఞానమును సంపాదించిన మహాయోగీశ్వ రుడవు. అన్ని మతములును పలు ప్రయోజనములుగల వివిధ సత్యములను చాటుచున్నవి. పరిపూర్ణజ్ఞానము లేని వారు అవి వేఱు వే అని భావించి కలహించుచున్నారు. ఇట్టి స్థితిలో సమ్యగ్ జ్ఞానము నార్జించిన విశాల బుద్ధితో నానామతసత్యముల నర్థము చేసికొని తత్త్వమనునది బహు ముఖములు గలదై విరాజిల్లుచుండుననియు, ఒక ముఖ మును మాత్ర మెఱింగినవాడు మఱియొక ముఖమును అసత్యమనరాదనియు, లోకమునకు నీవు చాటియున్నావు. ఇట్టి సంపూర్ణ జ్ఞానఖనివగు ( సర్వజ్ఞుడవు) నీకు సుప్రభాతమగుగాక!

గోవిందయాఖ్యగణకం ధరణీసు రేశం
చండాలవర్గ భవ కక్కయ భక్తముఖ్యం,
త్వం వీక్షనే స్మ కరుణాసమయైన దృష్ట్యా
శ్రీ బ్రహ్మ దేశిక విభో! తవ సుప్రభాతమ్.

టీక. శ్రీ బ్రహ్మ దేశికవిభో = ఓ వీర బ్రహ్మ గురూత్తమా! త్వమ్ = నీవు; = ధరణీసు రేశమ్ =బ్రాహ్మణ శ్రేష్ఠుఁడయిన, గోవిందయాఖ్యగణక మ్= గోవిందయ్య యను “పేరుగల గ్రామకరణమును; చండాలన్న, భవ, కక్కడో, భక్త, ముఖ్యమ్ = అంత్య వర్ణమునఁబుట్టిన కక్కఁడను భక్త శ్రేష్ఠుని; కరుణాసమయా = కారుణ్యము చేత సమానమైనా; దృష్ట్యా, | దృష్టితోడ నే; వీక్షసేస్మ = చూచినాఁడవు; తవ సుప్రభాతమ్= సుప్రభాతము అగుగాక !

తా. ఓ బ్రహ్మదేవ ! నీవు బ్రాహ్మణుఁడైన కరణము గోవిందయ్యను, మాదిగవాఁడైన కక్కయభక్తుని పక్ష పాతము లేక సమానమగు దయాదృష్టితోడనే చూచి తత్త్వార్థము నుపదేశించినావు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !

“ముస్లిం” మతానుచర మూఢ ధరాధినాథాన్
హిందూమతః పరమ ఇక్యభిమన్య మానాన్,
ఉద్బోధ్య సాధిత మ హెూ ! మతసామరస్యమ్
దేవ ! త్వయా మునివిభో ! తవ సుప్రభాతమ్.

టీక. దేవ = ఓ దేవ! ముస్లింపు తాను చర, మూఢ, ధరాధినాథాన్ = మతము వారైన జ్ఞానహీనులగు నవాబులను; మహమ్మదీయ హిందూమతః = హిందూమతమే; పరమః = శ్రేష్ఠ మైనది; ఇతి = అభిమానించువారైన హిందువులను; అని, అభిమన్యమానాన్ ఉద్బోధ్య = ప్రబోధించి; మతసామరస్యమ్ = ఉభయమతముల కైక మత్యము; సాధికమ్ = సాధింపఁబడినది; ఆహో = ఆశ్చర్య; మునివిభో ! = మునీశ్వరుఁడా ! తవ = నీకు; సుప్రభాతమ్ = సుప భాతము అగుగాక !

తా. మహమ్మదీయమతమే గొప్పదను మూఢవిశ్వాసముగల తురక నవాబులను, హిందూమతమే శ్రేష్ఠమనుకొని పిట్టి వీరు హైందవులను సద్బోధలచే ప్రబోధించి, ఉభయ మతములకు నీవు సామరస్యమును సంపాదించినావు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక.

అష్టాంగయోగ పదవీ మధిరుహ్య బాఢ
మధ్యాత్మయోగ మనుశాసయత స్త వేయం,
రీతి ర్ముముక్షుషు మహత్తర యోగశక్తిం
జ్ఞానం తనోతి మునిరా టవ సుప్రభాతమ్.

టీక. మునిరాట్ = ఓ మునీశ్వరా! అష్టాంగయోగ పదవీమ్ = : అష్టాంగయోగ మార్గమును; అధిరుహ్య – ఆరోహించి; ఆధ్యాత్మయోగం = జ్ఞానయో గమును; బాధం = మిక్కిలిగా; అనుశాసయతః = బోధించునటువంటి; తవ = నీయొక్క; ఇయం = ఈ; రీతిః = పద్ధతి; ముముక్షుషు= మోక్షము బడయఁ గోరువారియందు; (సాధకులయందు) మహత్తర యోగశక్తిమ్ = గొప్పదగు యోగశక్తిని; జ్ఞానం = సుజ్ఞానమును;, తనోతి = విస్తరింపఁ జేయుచున్నది; తవ = నీకు; సుప్రభారమ్ = సుప్రభాతము అగుగాక.

ఓ వీర బ్రహ్మమునీంద్రా ! అష్టాంగయోగము నాచరణలో’ బెట్టి, బ్రహ్మా త్మైక్యజ్ఞానమును శిష్యసమూహమున కుప దేశించునట్టి నీమార్గము ముముక్షువులగు సాధకులలో గొప్ప యోగ సామర్థ్యమును, జ్ఞానశక్తిని పెంపొందించు చున్నది. అనేకులగు గురువులు యోగశక్తిలేని వాచా మాత్రజ్ఞాను లైయుండ నీవువారికి భిన్నముగా యోగమును, జ్ఞానమును కలిపి శిష్యులకు బోధించి వారి ననుభవజ్ఞాన సంపన్నులనుగా జేసినాఁడవు. ఇట్టినీకు సుప్రభాత మగుగాక ..

వేదాన్త వేద్య ! మహనీయ గుణాలవాల!
ధ్యానైకగమ్య ! పురుషోత్తమ! భవ్యశీల !
యోగీశ్వ రేడ్య ! సమతామిత దివ్యకీర్తే !
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.

వేదాస్త వేద్య ! = వేదాన్తములగు నుపనిషత్తుల చే నెఱుఁగఁదగిన వాడవును; మహనీయగుణ, ఆలవాల = భజింపఁదగిన గుణములకు నిల “యుఁడవును; ధ్యాన, ఏక, గమ్య = ధ్యానమను ముఖ్య సాధనముచేత నే పొందఁదగినవాఁడవును; పురుషఉత్త మ = పురుషులలో శ్రేష్ఠుడవును; (పరమాత్మరూపుడవును) భవ్యశీల = మంచిస్వభావము గలవాడవును; యోగీశ్వర, ఈడ్య = యోగీంద్రులచే స్తుతింపఁదగినవాడవును; సమతౌ, ఆమిక, దివ్యకీర్తే! = సమత్వము చేత గల్గిన మితిలేని శ్రేష్ఠు మగు కీర్తి గలవాడవును ఆగు; శ్రీ వీర దేశిక విభో ఓ వీరబ్రహ్మ గురూ! తవ = నీకు; సుత్రభాతమ్ = సుప్రభాతము అగుగాక.

తా. ఉపనిషద్వాక్యములచే నెఱుఁగఁ దగినవాడవుకు, పూజనీ యగుణములుగలవాఁడవుకు, ధ్యానమార్గముచేఁ బొందఁ దగినవాడవుకు, పురుషులలో శ్రేష్ఠుఁడవుకు, హృదయ మనుపురమున వసించుపరమాత్ముఁడవును, యోగ్యముగు నడవడిగలవాఁడవును, యోగీశ్వరులచే నుతింపఁబడు వాడవును, సమతాయోగ ప్రచారముచేత గొప్ప కీర్తి నార్జించినవాడవును నగు వీర గురూత్తమా! నీకు సుప్రభాత మగుగాక.

ఏవం విధాతిమధురార్థ గభీర సత్యం
శ్రీ బ్రహ్మ దేశిక విభో ర్వర సుప్రభాతమ్,
యే భక్తి పూర్ణహృదయా నిరతం పఠన్తి
తేషాం భవే దిహ పరత్ర చ శర్మ ముక్తిః,

టీక. ఏవంవిధ, అతిమధుర, అర్థ, గభీర, సత్యమ్ = ఈవిధమైన మధురార్థ ములు, గంభీరసత్యములు కల; శ్రీ బ్రహ్మ దేశికవిభోః = శ్రీ వీర బ్రహ్మగురునాధునియొక్క; వర సుప్రభాతమ్ = శ్రేష్ఠమగు నుప్ర ‘భాతమును; యే = ఎవరు; భక్తి పూర్ణ హృదయాః = భక్తి తో నిండిన హృదయములు గలవారై ; నిరతమ్ = ఎల్లప్పుడు; పఠన్తి = చదువు చుందురో; తేషామ్ = అట్టివారికి; ఇహ = ఈలోకమున; పరత్ర = పరలోకమున; శర్మ = సౌఖ్యము; ముక్తిః, చ = అంత్యకా కాలము న మోక్షమును; భవేత్ = కలుగును.

తా. ఈ విధమైన మధురార్థములతోడను, గంభీరమైన సత్య ములతోడను కూడిన వీర బ్రహ్మేశ్వరస్వామి సుప్రభాత మును భక్తి భరిత చిత్తులై పఠించువారికి ఇహపరలోకములందు సౌఖ్యమును, అంత్య కాలమున మోక్షమును సంప్రాప్త మగును.

శ్రీ  వీరబ్రహ్మ సుప్రభాతమ్ సమాప్తమ్

మరిన్ని సుప్రభాతములు

Nachiketuni Pitrubhakti In Telugu – నచికేతుని పితృభక్తి

Nachiketuni Pitrubhakti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

కఠోపనిషత్తు లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నచికేతుని పితృభక్తి నీతికథ.

నచికేతుని పితృభక్తి

పూర్వం వాజస్రవసుడను సత్పురుషుడుండేవాడు. గౌతమవంశజాతుడైన అతనికి గౌతముడు, ఔద్దాలకుడు మరియి ఆరుణి అను పేరులు కూడా కలవు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు యాగాంత్యములో తమ సర్వస్వమునూ దానము చేయవలెను! వాజస్రవసుడు కూడా తనకున్నదందా దానంచేయసాగినాడు.

భారతీయులకు పశువృక్షములు ముఖ్యమైన సంపదలు. అందునా గోసంపద అతి ముఖ్యమైనది. మణిమరకతాలకంటే హిరణ్యరజితాదులకంటే గొప్పది గోసంపద. కావున వాజస్రవుడు ఋత్విజులకు గోదానాలు చేయసాగినాడు. వాజస్రవసునకు మహాబుద్ధిశాలి గుణోన్నతుడు పితృభక్తి పరాయణుడగు నచికేతుడను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైనా సకల ధర్మశాస్త్రాలు బాగా అభ్యసించినాడు. నచికేతుని దృష్టి తన తండ్రియిచ్చే గోవుల మీద పడినది. తండ్రి దానమిచ్చే గోవులు చాలమటుకు ముసలివి పండ్లులేనివి పాలిచ్చుటకు ప్రసవించుటకు శక్తిలేనివి అని కనుగొన్నాడు. మిక్కిలి దుఃఖమును చెంది నచికేతుడిలా అనుకున్నాడు

“శాస్త్రాలు “ఎవడైతే నిస్సారమైన గోవులను దానంచేస్తాడో వాడికి సద్గతులుండవు” అని ఘోషిస్తున్నాయి. అయ్యో! మహనీయుడైన మా తండ్రిగారు విశ్వజిత్ వంటి విశిష్టమైన యజ్ఞము చేసియూ ఈ తామస దానము వలన పూర్ణఫలమును పొందకుండుట పాడిగాదు” అని పలువిధాల ఆవేదనపడి చివరి నిమిషములోనైనా తండ్రిగారికి హితం చేద్దామని తలచి ఇలా అన్నాడు.

“తండ్రీ! ఈ యజ్ఞములో నీకున్నవన్నీ దానము చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తావు”? అని అడిగినాడు. బాలచేష్ట అనుకుని బదులివ్వలేదు వాజస్రవసుడు. నచికేతుడు మళ్ళీ “నన్నెరికిస్తావు నాన్నా”? అని అడిగినాడు. “సహనావవతు …” మొదలైన శాంతిమంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు సహనం వహించాడు. తండ్రికి మహాపుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలని దృఢనిశ్చయంతో ఉన్న నచికేతుడు మూడవమాఱు అదే ప్రశ్నవేశాడు. సహనమును కోల్పోయి వాజస్రవసుడు “నిన్ను యమునికిస్తాను” అని అన్నాడు!

“అయ్యో! కోపముతో నేనెంతమాటన్నాను? ఆహా! తన కోపమే తన శత్రువు అను సూక్తిని చిన్నప్పటినుంచి వింటూవచ్చినా ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి ఎంత తప్పుచేశాను!” అని బాధపడ్డాడు వాజస్రవసుడు. నిచికేతుడు తన మదిలో “దానమిచ్చేటప్పుడు గ్రహీతకు అక్కరకు వచ్చే వస్తువును ఇవ్వాలి. నావంటి సామాన్యుడు ధర్మప్రభువైన యమునికి ఏమి అక్కరకు రాగలను? అయిననూ పితృవాక్యపాలనమే తనయుల ధర్మం” అనుకొని చింతిస్తున్న తండ్రిని చూచి “తండ్రీ! విచారించవలదు. మన పూర్వీకులందఱూ సత్యనిష్ఠాగరిష్ఠులు అన్నమాటను ఎన్నడూ జవదాటి ఎఱుగనివారు. సత్యమే ఈ చరాచర సృష్టికి ఆధారము. సత్యభ్రష్టుడైన వానికి నరకము తప్పకదా! తండ్రీ! నీవాడిన మాటను నేను సత్యముచేసెదను. నాకై విచారించకుము.

పైరు మొలచి పండి ఆపై ఎలా జీర్ణమవుతుందో అదే విధముగా పాంచభౌతిక శరీరము పుట్టి పెరిగి మరల ఆ పంచభూతముల లోనే లీనమగును కదా! కావున ఈ శరీరము శాశ్వతము కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక విచారించక యముని వద్దకు పోవుటకు ఆజ్ఞనొసంగుము”. ఇలా తన అమృతవాక్కులతో సుధావర్షమును కురిపించినాడు నచికేతుడు. ఎలాగైతే దశరథ మహారాజు మహాదుఃఖముతో దాశరథిని కానలకు పంపినాడో అలా వాజస్రవసుడు నచికేతుని యముని వద్దకు పంపినాడు.

ఆ యమపురమునకు దారి అతిదుర్గమనైనది. ఎంతో పుణ్యశీలులు కూడా సులభముగా దాటలేని వైతరణీనదిని నచికేతుడు తన సత్యసంధత్వ పితృభక్తి ప్రభావములచే సునాయాసముగా దాటి యమపురిని చేరినాడు. యమధర్మరాజు నగరములో లేరని తెలుసుకుని ద్వారము వద్ద నిరీక్షించినాడు. మూడురోజులు అన్నపానీయాదులు లేకుండా ఆ పసివాడు కాలునికై నిరీక్షించినాడు. మూడురోజులకు ధర్ముడు వచ్చినాడు. మహాతేజస్సుతో అగ్నివలె వెలిగిపోతున్న నచికేతుని చూచి

“అయ్యో! తెలియకనే నావలన ఎంత అపరాధము జరిగినది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మము జరిగినదే! ఇంటివారిచే తప్పు జరిగినా ఆ తప్పుకు బాధ్యుడు అజమానియే కదా! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో వాడి ఇష్టపూర్తులు పుత్రులు మొదలైన సంపదలు నశిస్తాయి కదా! నిప్పుని తెలిసి తాకినా తెలియక తాకినా కాలకమానదు. అటులే తెలిసిచేసినా తెలియక చేసినా తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మకార్యానికి ఫలతము నాకు రాకమానదు. ఇప్పటికైనా ఆ అతిథునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించెదను” అని నిశ్చయించి యముడు నచికేతుని వద్దకు వెళ్ళి “ఓ బ్రహ్మన్! అభ్యాగతః స్వయం విష్ణుః. కావున చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవునితో సమానుడని తెలిసికూడా నిన్ను మూడు దినములు నిరీక్షింపచేసినాను. నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్టు ఆశీర్వదించు. మూడురోజులు నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తముగా నీకు మూడు వరాలు ఇస్తాను. కోరుకో” అని అన్నాడు.

వంశదీపకుడైన నచికేతుడిలా కోరినాడు “ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనారహితుడు శాంతచిత్తుడు అగునట్టు ఆశీర్వదించు. నేను ఇంటికి చేరిన తరువాత ఆయన నాపై కోపమును విడుచు నట్లు ఆశీర్వదించు. నాకు అగ్నివిద్యను ఉపదేశించు” అని కోరినాడు. యముడు ఆ వరములను ప్రసాదించి మూడవ వరము కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు “స్వామి! ఆత్మ శాశ్వతమని కొందఱు కాదని మరి కొందఱు అంటున్నారు. ఈ సందేహము తీరునట్లుగా నాకు అతిరహస్యమైన బ్రహ్మవిద్యను ఉపదేశించుము”.

ఆత్మవిద్యను యోగ్యతార్హతలున్న వానికే బోధించాలి. అనర్హునకు బోధించిన ఆతనికి సమాజమునకు హానికరం అని ఎఱిగిన యమధర్మరాజు నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడోకాదో అని పరీక్షచేసినాడు. “ఈ విద్యనేర్చుకొనుట చాలా కష్టము. ఇంకేదైనా కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు సిరిసంపదలు ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలనేవైనా కోరుకో తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇస్తాను. దీర్ఘాయువు చిరంజీవంత్వము కోరుకొనుము ప్రసాదించెదను. కానీ ఆత్మవిద్యను కోరవద్దు” అని ప్రలోభ పెట్టినాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు ఐహికార్థాలను తృణప్రాయముగా ఎంచి ఆత్మవిద్య నేర్చుటకు ఉత్సుకతను చూపించినాడు. నచికేతుని పట్టుదల చూచి సంతోషించి ప్రలోభాలకు లొంగని అతడు అర్హుడని నిశ్చియించి ఆత్మవిద్యను నేర్పినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. దానమిచ్చే సమయములో మనవద్దనున్నవానిలో మంచివి గ్రహీతకు ఉపకరించేవి ఇవ్వాలని నచికేతుడు మనకు బోధించినాడు. ఇదే ఉత్తమ దానము యొక్క లక్షణము.
  2. పితృవాక్యపాలనము తనయుల ప్రథమ కర్తవ్యము. అంతేకాక తండ్రి అడుగకుండానే తండ్రికి హితవు (ప్రియము కాదు) చేయాలని తపించేవాడు ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మపితామహుడు, నచికేతుడు ఈ త్రోవకు చెందినవారు. నిచికేతుడు తండ్రికి పూర్ణదాన ఫలం ఇప్పిద్దామని దృఢసంకల్పము చేసినాడు. తండ్రి అన్నమాటను సత్యంచేయుటకు తన ప్రాణాలనే తృణప్రాయముగా ఎంచి యమపురికి బయలుదేరినాడు. ఇట్టి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శప్రాయులు.
  3. కోపము ఒక్క నిమిషములో మనచేత ఎంత తప్పునైనా చేయిస్తుంది. వాజస్రవసుడు సహనం వహించక “యమునికిస్తాను” అని తరువాత పశ్చాత్తాపపడినాడు. కాబట్టి మనము ఎల్లప్పుడు శాంత చిత్తముతో ఉండాలి.
  4. “అభ్యాగతః స్వయం విష్ణుః” అన్న సూక్తిని మనకు చూపించినాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చినదే అని ఎంతో బాధ పడ్డాడు. దిక్పాలకుడు అయికూడా “నన్ను క్షమించు” అని ఒక పసిబాలునితో అన్నాడు!
  5. ఎన్నో విషయాలు తెలిసినా నచికేతుడు “నావంటి సామాన్యుడు యమునికేమి అక్కర”? అని అనుకొని తన వినయవైభవాన్ని మనకు చూపినాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Varalakshmi Vratham Pooja Vidhanam In Telugu – శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

Varalakshmi Vratham Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాం…

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. కొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లల చేత పెద్ద ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దగ్గరవుండి శ్రద్ధగా చేయిస్తూ వుంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకి అనువైనవే అయినా, ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసే పూజ వల్ల విశేషమైన ఫలితాలను పొందటం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకుని, స్త్రీలు నూతన వస్త్రాలు ధరించి ఈ పూజలు చేసుకొంటారు.

వ్రతం చేయు విధానం

ఇంటికి తూర్పుదిశలో పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ మంటపాన్ని రంగవల్లులతో అలంకరించి, ఒకకొత్త తువ్వాలుపై బియ్యం పరచి దాని మధ్యలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. లేత మర్రిచిగుళ్ళు, లేత మామిడి ఆకులు వంటి పంచ పల్లవాలతో అలంకరించిన కలశంపై కొబ్బరికాయ, దానిపై రవికల గుడ్డ కాని కొత్త చీరకాని పెట్టి అమ్మవారి రూపాన్ని మనోహరంగా తయారు చేసుకోవాలి. బంగారు నగలతోటి ఆ రూపాన్ని అలంకరించడం యిల్లాళ్ళ సరదా. ఈ విధంగా తయారు చేసుకున్న వరలక్ష్మీదేవిని శ్రీసూక్త విధానంగా ధ్యానం, ఆవాహనం, అర్ఘ్య పాద్యాదులు, స్నానం, ధూపదీపాదుల వంటి షోడశోపచారములతో అర్చించాలి. సబ్రాహ్మణులైన ఋత్విక్కుల ఆధ్వర్యంలో గృహములోని ఆడవారంతా సమూహంగా నిర్వహించుకునే ప్రత్యేక పూజ ఇది. అష్టోత్తర శతనామాలతో పువ్వులతో, కుంకుమతో అమ్మవారిని అర్పించాలి. తొమ్మిది సూత్రములతో (పోచలతో) మధ్యలో పువ్వులు చేర్చి కట్టుకునే తోరాన్ని వామహస్తానికి ధరించాలి. 12 రకాల పిండివంటలు ఒక్కొక్కటి 12 చొప్పున పూజ చేసిన బ్రాహ్మణునకు వాయినం ఇవ్వాలి. దక్షిణ తాంబూలాది సత్కారములతో ఋత్వికులని తృప్తిపరచడం ఒక ముఖ్యమైన కార్యక్రమం.

వరలక్ష్మీ వ్రత ఫలితాలు

ఈ వరలక్ష్మీ పూజలో మరొక ప్రత్యేకత వ్రతకథ. పూజ ఎంత ముఖ్యమో, వ్రతకథని చదువుకోవటం అంతే ముఖ్యం. ఆ తల్లి కరుణాకటాక్ష ప్రభావాన్ని తెలియజేసే ఈ కథని పాటరూపంగా పాడుకోవడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ అలా ఆడవారంతా కలిసి భక్తి శ్రద్దలతో పాట పాడుతూ వుంటే చాలా వినసొంపుగా వుంటుంది. బ్రాహ్మణాశీర్వాదం తరువాత బంధుమిత్రాదులతో అందరూ ప్రసాదం తీసుకోవటం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం సువాసినులను పేరంటానికి పిలిచి, ఎంతో సంతోషంగా వారిని సత్కరించి పంపడం కూడా పూజా సాంప్రదాయంలోని భాగమే. చాతుర్వర్ణాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ దేవిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని, కుటుంబ సుఖసౌఖ్యాలను వరంగా పొందటం ఈ పూజలోని ముఖ్యఉద్దేశం.

శ్రీ ఆదిలక్ష్మీదేవిని కామేశ్వరీ దేవి రూపంలో కూడా కొలవటం ఆనవాయితీ. కొన్ని కుటుంబాలలో కామేశ్వరీ దేవి కులదేవత. ఆ కుటుంబంలోని ఆడవారు అంతా కలసి సమిష్టిగా ఇష్ట కామేశ్వరీ వ్రతం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంవల్ల కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగావుండేలా, అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థిస్తారు. ప్రాణశక్తిని వృద్ధి చేసుకుని తద్వారా శారీరక మానసిక అనారోగ్యాలను తగ్గించుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. ఔషధ సేవనాన్ని ఈ రకంగా బాగా తగ్గించుకోవచ్చు. ప్రాణశక్తిని పెంచమని ఆదిలక్ష్మి అమ్మ వారిని ప్రార్థించి శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుంటే తప్పక ఆరోగ్యం చక్కబడుతుంది దేనికైనా నమ్మకం ముఖ్యం.

సాధారణంగా అనారోగ్యం రాగానే విరివిగా మందులు వాడేయటం మనకి అలవాటయిపోయింది. ఆ మందుల దుష్ప్రభావ ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవటం జరుగుతోంది. ఏ మందులు వాడనక్కరలేకుండా ఆ ఆదిలక్ష్మీ దేవి కృపవల్ల ప్రాణశక్తిని పెంపొందింప జేసుకుని పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకు ఒక మార్గం. పూజా విధా నంలో భాగంగా ఆ ఆదిలక్ష్మీ మాత అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించటం ఇందువల్ల ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ నామావళిలోని నామాలన్నీ మనపూర్వీకులు ఎంతో సాధనచేసి కనుగొన్నవి. ప్రతినామమూ ఎంతో ప్రభావపూరిత మైనది. ఆదిలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని భక్తుల సౌకర్యార్ధం ఈ పుస్తకంలో చేర్చటం జరిగింది. నిత్యపూజలు చేసుకునే సౌకర్యం, అవకాశంలేని వారు కోసం బీజాక్షర జపం చేసుకుంటే తక్షణఫలితాలు కలుగుతాయి.

మరిన్ని వ్రతాలు: