Lampugubba Gollethala Lanja Kamda Ni In Telugu – లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
సంఖ్య : 127
పుట : 92
రాగం : ఆహిరి

ఆహిరి

29 లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి!

||పల్లవి||

చెప్పరానివేడుకల సిగ్గులనే నిన్నాళ్లు
ఉప్పతిల్లుం గోరికల నుంటిం గాని
ఇప్పు డింతనిలువలే నేమిసేతు నీచిత్త
మెప్పుడు గాని రాదో యెట్లరా వోరి

||లంపు||

చిల్లర సింగారాలు చెలులు సేయఁగ నేను
వొల్లనని యిన్నాళ్లు నుంటిం గాని
మల్లెపూవువంటి నన్ను మాసినచీరతోడ
నిల్లు వెళ్లకుండఁ జేసి తెట్లరా వోరి!

||లంపు||

కమ్మనిపానుపున నీకౌఁగిటిలో నిన్నాళ్లు
ఉమ్మగింపుమేనితో నుంటిం గాని
దిమ్మరిసేఁతలతోడి తిరువేంకటేశ! నీ
యెమ్మె లింకా మానలే వెట్లరా వోరి.

||లంపు||

అవతారిక:

జానపద బాణీలో సాగే గొల్లెతల సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. అతిశయించిన మమకారంతో నాయిక నిందిస్తుంటుంది, చనువుగా. అన్నమయ్య కాలంలో జానపదులు వాడిన కొన్ని మాటలు నేటి నిఘంటువులలో లభించుటలేదు. ఉదాహరణకి “లంపు గుబ్బ గొల్లెత” “లంపు” అంటే “దొంగమేత”, “గుబ్బలు” అంటే స్తనములు. దీనికి సమన్వయమెట్లా సాధ్యం. 600 ఏళ్ళక్రితం జానపదుల వాడుక భాషలో “లంబము” అనే మాటను “లంపు” అనేవారేమో. ఆ మాటకు దీర్ఘమైన లేక పొడవాటి అని అర్థం. అదండీ సంగతి ‘లంజకాడు’ అంటే ‘విటుడు’ అని ప్రతిపదార్థ వివరణ కావాలనే త్యజించుట క్షంతవ్యము.

భావ వివరణ:

ఓరీ!! (ఔరా!) లంపు గుబ్బ గొల్లెతల (ఉన్నత స్తన గిరులున్న గొల్ల భామల) లంజకాడ! (విటుడా!) నీ ఇంపులెల్లా (నీకు వేటిమీద మోజుయెక్కువో) వెదకంబట్టె (తెలిసిపోయింది) యెట్టరా? (ఇట్లా అయితే ఎట్లాగునరా!)

ఓరీ!! చెప్పశక్యంకాని కోరికలు ఉప్పతిల్లినా (చెలరేగినా) నేను సిగ్గుచే చితికియున్నాను. కాని ఇప్పుడింక నిలువరింపనసాధ్యమై పోవుచున్నది. నేనేమి సేయ గలనురా? నీకు నాపై మనస్సెప్పుడు పుడుతుందో చెప్పలేం. ఇట్లా అయితే యెట్టారా? (యెలాగునరా!)

ఓరీ!! నా చెలికత్తెలు ఇంతకాలమూ నేను నీ కంటికి నదురుగా వుండాలని యేవేవో చిల్లర సింగారాలు (సామాన్యమైన అలంకరణులు) చేసేవారు. నేను కూడా వాటిని వొల్లనని (వద్దని) తిరస్కరించేదాన్ని. కానీ నీకోసం పడిగాపులు కాసీ కాసీ, మల్లెపూవువంటి నన్ను మాసిన చీరెతో ఇంటికి అంటిపెట్టుకొని పోయేట్లు చేశావు కదరా! ఇట్లా అయితే యెరా?

ఓరీ! నీ కమ్మని పాన్పుపై (మధురమైన శయ్యపై) నీ సందిట, వుమ్మగింపుమేనితో (తెళ్ళు దేహంతో వున్నాను. కానీ ఓ తిరుమల నాయకా! నీ దిమ్మర సేతల (మత్తులో ముంచే నీ చిలిపి సేతలతో) నీ యెమ్మెలు మానవు (విలాసవంతమైన సయ్యాటలను వదలవు). నీతో యెట్టారా?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment