Appadaina Hariyekke Nadivo Teru In Telugu – అప్పడైన హరియెక్కె నదివో తేరు

అప్పడైన హరియెక్కె నదివో తేరు - అన్నమయ్య కీర్తనలు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అప్పడైన హరియెక్కె నదివో తేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అప్పడైన హరియెక్కె నదివో తేరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : అప్పడైన హరియెక్కె నదివో తేరు
సంఖ్య : 35
పుట : 24
రాగం : పాడి

పాడి

17 అప్పఁడైనహరి యెక్కె నదివో తేరు
యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు

||పల్లవి||

సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు
భ్రమయ జరాసంధుపై ఁ బరపెఁ దేరు
తిమురుచు రుక్మకువై ఁ దిరుగఁ దోలెఁ దేరు
ప్రమదాన సృగాలునిపై ఁ దోలెఁ దేరు

||అప్పఁ||

కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు
బమ్మరపో దంతవక్త్రుపైఁ దోలెఁ దేరు
దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁ దోలినతేరు
దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు

||అప్పఁ||

మీఱి హంసడిచికులమీఁదఁ దోలినట్టితేరు
తూఱి సంధిమాటలకుఁ దోలినతేరు
ఆఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చూఱలుగొన నెక్కెను శోభనపు తేరు

||అప్పఁ|| 35

అవతారిక:

శ్రీవేంకటేశ్వరుని తేరు (రథము) తిరుమల తిరువీధులగుండా వూరేగిపోతున్నది. పరవశించిన అన్నమాచార్యులవారు ఆ హరి యేయే సందర్భాలలో నాలుగు అశ్వముల పూన్చి తను తోలే రథమునేకాక పరులు తోలే రథములను కూడా యెప్పుడెక్కాడో పునశ్చరణ చేసికొంటున్నారు ఈ కీర్తన ద్వారా. పురాణవాఙ్మయము బాగాపరిచయంవుంటేకాని ఈ ప్రయత్నం సిద్ధించదు. సృగాలుడు అనేవాడు నక్క రూపంలోవుండే రాక్షసుడు (నరకాసురుడేమో!!) ఇవన్నీ అటువంచి “హంసడిచికుల మీదన్ తోలినట్టితేరు” అన్న చరణంలో నాకేమీ పాలుపోలేదు. స్వామి తనశత్రువుపై యుద్ధానికి రథం పై వెళ్ళాడని తెలుస్తూనే వున్నది. హంస అంటే శివుడు లేక విష్ణుడు. ఆయనపై ఆయనే యుద్ధానికి వెళ్ళడు కదా! కాబట్టి ఆ మాటకు అర్థం శివభక్తుడైన బాణాసురుడని భావించాను. ఇక చదవండి. నేనూ బ్రహ్మెత్సవాలలోనే దీన్ని వివరిస్తున్నాను.

భావ వివరణ:

అదిగో ఈ విశ్వమునకంతటికీ అప్పడు (తండ్రి) అయిన శ్రీహరి, తేరు యెక్కెను (రథము) పైయెక్కినాడు. ఇప్పుడు ఈ తిరుమల తిరువీధులలో ఈ రథము పోతున్నది. కనుల పండువుగా చూచి తరించండి.

ఒకప్పుడు ఈ సర్వేశ్వరుడు తన తేరును సముద్రాలమీద తోలినాడు. (అర్జునునికి తన ఆదినారాయణుని రూపం చూపాలని తన రథముపై శ్రీకృష్ణుడు వైకుంఠం తీసికొని వెళ్ళాడు). జరాసంధుడు భ్రమించి మతిపోగొట్టుకునేట్లు రథం తోలాడీయన. (వాడి అక్షౌహిణీ సైన్యమూ నశించేది). తిమురుచు (ఉద్రేకముతో) రుక్మకుపై (రుక్మిపై తిరగబడితోలిన రథము ఇదే (రుక్మిణీ స్వయంవరంలో). ప్రమదాన (సంతోషముతో) సృగాలునిపై (నక్కరూపంలో వున్నరాక్షసునిపై) తోలిన రథము ఇదే (బహుశా నరకాసురుడు అయివుండవచ్చు).

అక్రూరుడు తీసికొనిరాగా కమ్మి (విజృంభించి) కంసునిపై దండెత్తిన తేరు ఇదే, (ఈ రథముపైననే అక్రూరునికి శ్రీకృష్ణుడు భగవంతుడని అర్థమైంది). దంతవక్త్రుడు భ్రమచెంది నిస్తేజుడగునట్లు శ్రీకృష్ణుడు తోలిన రథము ఇదే, (శ్రీహరిద్వారపాలకుడైన విజయుడే వీడై పుట్టాడు). ఈ రథముపైననే శ్రీకృష్ణుడు దుమ్మురేగునట్లు సాల్వునితో యుద్ధం చేశాడు. (అంబను కాదన్నదీ సాల్వుడే). రుక్మిణీ కళ్యాణము సందర్భంగా రుక్మిణితోలిన రథం ఇదే, (శ్రీకృష్ణుడు శిశుపాలుని చిత్తుచేశాడీ రథంపైనుండే)

మీఱి (విజృంభించి) శివుడు రక్షణగా వచ్చిన బాణుని శ్రీకృష్ణుడు ఓడించినదీ రథముపైననే (ఉషాపరిణయం దీని తరువాతనే జరిగింది). సంధిమాటలు తూఱి (విఫలమై) భారతయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణపరమాత్మ, పార్ధసారధియైనదీ రథముపైననే (భగవద్గీతకు వేదిక ఈ రథమే). నేడు శ్రీవేంకటేశ్వరుడు, అలమేల్మంగను ఆరడిన్ (మించి) కూడ, చూఱలుగొని (ఆదరణపొంది) ఎక్కిన శోభనపు తేరు (కళ్యాణప్రదమైన రథము) ఇదే. (చూచి తరించండి).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Pasulu Gacheti Kola Pasapujela In Telugu – పసులు గాచేటి కోల పసపుజేల

పసులు గాచేటి కోల పసపుజేల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో పసులు గాచేటి కోల పసపుజేల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

పసులు గాచేటి కోల పసపుజేల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : పసులు గాచేటి కోల పసపుజేల
సంఖ్య : 96
పుట: 66
రాగం: ముఖారి

ముఖారి

84 పసులు గాచేటి కోల పసపుఁ జేల
పొసఁగ నీకింతయేల బుద్ధుల గోల

|| పల్లవి||

కట్టిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి
చుట్టిన పించెపుఁబాగ చుంగుల సోగ
ఇట్టి సింగారము సేయ నింత నీకుఁ బ్రియమాయ
వెట్టి నీచేఁతల మాయ విట్టలరాయ

||పసులు||

పేయలఁ బిలుచుకూఁత పిల్లఁగోవి బలుమోఁత
సేయరాని గొల్లెతల సిగ్గులచేఁత
ఆయెడలఁ దలపోఁత యమున లోపలి యీఁత
వేయరాని మోపులాయ విట్టలరాయ

||పసులు||

కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ.

||పసులు||

అవతారిక:

విఠల దేవుని విట్టలరాయా అని సంభోదిస్తూ గొప్ప జానపదకీర్తన చెబుతున్నారు అన్నమయ్య. ఇటువంటి కీర్తన నాస్వాదించినప్పటికీ దీని ప్రత్యేకత యేమంటే చాలా మాటలు యధాతధంగా నిఘంటువులలో దొరకవు. “పసపు జేల” అంటే ఏమిటి? పసుపురంగు చేలము అని అర్థం చేసికోవాలి, అంటే పీతాంబరుడైన కృష్ణుడు, దూడలను కాచే ఈ విట్టలరాయుడు వింతకూతవేసి ఆ దూడల్ని తన దగ్గరకు పిలుస్తాడట. ఎంతని చెప్పను? గొప్ప వర్ణన. మీరే రుచి చూడండి.

భావ వివరణ:

ఈ విట్టలరాయడు (విఠలుడు) యెలావున్నాడంటే ఈతడు పసుపుజేల (పీతాంబరము) కట్టిన శ్రీకృష్ణుడు ఇతని చేతిలో పసులుగాచే కోల (ముల్లుకఱ్ఱ) వుంటుంది. స్వామీ! పొసగ (అతిశయించుటకు) నీకింత బుద్ధుల గోల యెందుకయ్యా!

ఇతడు తన బుత్తి (భోజనము) చిక్కములో (చిన్న వుట్టిలో) కట్టి తెచ్చుకొన్నాడు. గచ్చకాయలు తిత్తి (గచ్చకాయరంగులో వుండె తన వుంగరాల జుట్టును కుచ్చులుగా కట్టుకొన్నాడు. చుట్టిన తలపాగలో నెమలిపింఛము గుచ్చి అలంకరించుకొన్నాడు. ఇటువంటి సింగారము నీకు ఇంత ప్రియమా విట్టలరాయా! నీచేతలు యెంతవెట్టి (పనికిమాలిన) వో చెబుతాను, వినవయ్యా!

ఈ విట్టలరాయుడు తన ఆవు పేయలను (దూడలను) ఒక వింతయైన ‘కూత’తో పిలిచి ఒకచోట చేరుస్తాడు. అతని పిల్లఁగోవి (మురళి) బలు మోత (పెద్ద ధ్వని చేస్తుంది). అతడు గొల్లెతలతో చేయరాని సిగ్గుల చేతలు చేస్తాడు. ఆపైన యమునాతటిలో అతని లీలలు తలపోతలు వేయరాని మోపులు (ఆరోపణలకు) దారితీశాయి.

కొంకులేని (ఏమాత్రమూ జంకులేని) అతని పొలయాట (రాసలీల) కూరిములలో తేట (ప్రణయమాధుర్యపు తేట). అంకెల బాలులతోటి (తన ఈడు గొల్ల బాలురతో) నిత్యమూ ఆటపాటలతో కాలక్షేపం చేస్తాడు. ఈ వేంకటాద్రి నీడలోని విట్టలరాయా! నీ పొలుపైన సొమ్ము (ఒప్పయిన ఆభరణం) యేమిటో తెలుసునా స్వామీ? నీ పొంకపు తుత్తురుకొమ్ము (నీ అందమైన తూతూ ధ్వనిచేసే శృంగనాదము). దానినే కొందరు “కొమ్ముబూర” అంటారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shinneka Teve Seluvuni Ta In Telugu – శిన్నెక తేవే శెలువుని తా

శిన్నెక తేవే శెలువుని తా – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో శిన్నెక తేవే శెలువుని తా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శిన్నెక తేవే శెలువుని తా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: శిన్నెక తేవే శెలువుని తా
సంఖ్య : 268
పుట: 183
రాగం: మేచబౌళి

మేచబౌళి

83 శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా

||పల్లవి||

మూటల్ మాటల్ మూరల్ బారల్
బాటల్ సదివే బాపలు తా
వేటల్ వీపుల్ వేలుపు గుడుపుల్
తేటలు మరగిన దేవుని తా

||శిన్నెక||

వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్లిటి సుద్దుల్తా
పోకులు లోకుల్ పొగడఁగ మనిపెడి
కేకిగరుల తల కిష్టుని తా

||శిన్నెక||

బగ్గుల్ నగ్గుల్ బావుల్ సొరె (ర?) గా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా

||శిన్నెక||

అవతారిక:

జానపదుల బాణీలో కొనసాగే అన్నమాచార్యులవారి కీర్తననాస్వాదించండి. ఒక గోపిక ఇంకొక గోపికను శిన్నెక అనిపిలిచి తన చెలికాడైన ‘కిష్టుని’ (కృష్ణుని) తీసికొని రమ్మని వేడుకొంటున్నది. వాడు వెన్నల నారగించేవెన్నుడట. ఆతనిని తెమ్మంటున్నది. ఈ కీర్తనలో తా అని ప్రతిచరణం ముగిసినందువలన ‘తా’ అనునది తాళము కోసం తాలద్యోతకమని తోచుచున్నది. చరణములలో కొన్ని మాటలు ధ్వని ప్రధానమైనవి. కావున చిందేసే ఆటకు ప్రత్యేకించినవే. కీర్తన ప్రతిపదార్థం అసంభవమని నా భావన.

భావ వివరణ:

ఓ శిన్నెకా! (చిన్నక్కా!) శెలువుని (చెలికాడైన ఈ శ్రీకృష్ణుని) తేవే (నాయెదుటకు తీసికొనిరావే). ఈతడెవరో తెలియునా? చిన్నప్పుడు ఇంటింటా వెన్నదొంగతనం చేసి, చవిగొన్న (రుచి మరిగిన) వెన్నడు (శ్రీకృష్ణుడు).

ఈ అల్లరి పిడుగుకు ఆనాడు, మాటలు మూటలుగా వుండేవి. అవి బారులు, మూరలు (బారెడు మూరెడు మాటలు… అంటే… పెద్దగా ఆరిందలా మాట్లాడేవాడు.) బాటలు సదివే బాపలు తా (వేదపండితులమని విఱ్ఱవీగే బ్రాహ్మణులకు హితోపదేశము చేశాడు.) వేలుపు కుడుపులు (దేవతల కివ్వవలసిన నైవేద్యము) ఇవ్వలేదని అలిగిన దేవేంద్రుడి దేవతల వీపులు సాపుచేసి వేటాడినాడట. ఎందుకంటే ఈయన తేటలు మరిగిన దేవుని తా (ప్రసన్నత అతిశయించిన దేవదేవుడట).

ఈ చరణానికి అన్నమయ్య భావన సులభగ్రాహ్యము కాదు. నా భావన నా స్ఫురణయే..)

తొల్లిటి సోకపు సుద్దులు (దేవతల తొలినాటి కష్టములు) తొలగించుటకు కేకిగరులతల కిష్టుడు (నెమలి పింఛమును తలపై ధరించిన శ్రీకృష్ణుడు, లోకులు పొగడగ పోకులు (లీలలు) ప్రదర్శించాడు.

దుర్మార్గులు పెట్టు అంతరాయములు పోయి వెఱపగు తాపసుల (భీతిల్లిన మునుల) దగ్గరయై ప్రశాంతముగానున్నారు. దివ్యాభరణములు ధరించిన శ్రీవేంకటేశ్వరుడు భక్తుల సిగ్గులు బాపెడి పరమపురుషుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Ramayya Edlu In Telugu – రామయ్య ఎడ్లు

Ramayya Edlu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

పెద్దలు చెప్పిన నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రామయ్య ఎడ్లు నీతికథ.

రామయ్య ఎడ్లు

రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డలవలె కంటికి తెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్త్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పఱుగెత్తగలిగేవి! వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య ముఱిసిపోయేవాడు.

ఇలా ఉండగా ఒక రోజు రామయ్య వృషభాలను కొందఱు దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకొన్న రామయ్య దుఃఖాని కి అంతులేదు. పాపం! సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. “రామా! నేనేమి పాపంచేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా? (ఉండదు)”

ఇలా పరిపరి విధాల వగచి రామయ్య రక్షకభటులతో దొంగలు తన ఎడ్లను ఎత్తుకుపోయిన విషయం చెప్పాడు. తనుకూడా వారితో కలిసి దొంగలను వెదుక సాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పాఱిపోవడం రామయ్య రక్షకభటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షకభటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండిని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షకభటులు.

ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్ళే తన నాగౌరుగిట్టలను వాళ్ళు వెళ్ళే గుఱ్ఱబ్బండి అందుకోవడమేవిటి? అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుఱ్ఱాలతో ఓడిపోవటం ఇష్టంలేక పొయిన రామయ్య “ఆ ముక్కుత్రాటిని రెండు సార్లు లాగండిరా”! అని ఆ దొంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్ళే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్ది సేపటిలోనే కను మఱుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షకభటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షకభటులతో ఇలా అన్నాడు మహౌదార్యముగల రామయ్య

“అయ్యా! నా గిట్టలు ఎప్పుడూ పఱుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్ఠలే నాకు ముఖ్యం. నాకు దొఱికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా! అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షకభటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. మనకు ఆచార్యతుల్యుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Anna Maataki Kattubadina Arjunudu In Telugu – అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు

anna mataku kattubadina arjunudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు నీతికథ.

అన్న మాటకి కట్టుబడిన అర్జునుడు

పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్క యేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిస్తామని నిశ్చయించుకున్నారు.

ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హెూమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్పుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించి నారదుడు వారికి విధించిన నియమభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులైన ఆ దొంగలను శిక్షించి విపుని హెూమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.

తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విపుని హెూమధేనువును అపహరించిన ఆ దొంగల ను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశాపు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?

అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Shiva Stotram In Telugu – శ్రీ శివస్తోత్రమ్

శ్రీ శివస్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Shiva Stotram Lyrics Telugu

శ్రీ శివస్తోత్రమ్

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే।
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే॥

1

భూత భేతాళ జుష్టాయ మహా భోగోపతీ (వీ)తినే।
భీమాట్టహాస వక్రాయ కపర్ది స్థాణవే నమః॥

2

పూష దంత వినాశాయ భగనేత్ర భిదే నమః।
భవిష్య ద్వృషభచిహ్నాయ మహా భూత పతే నమః॥

3

భవిష్య త్రిపురాంతాయ తథాంధక వినాశినే।
కైలాస వరవాసాయ కరిభిత్ కృత్తినివాసినే ॥

4

వికరాళోర్ధ్య కేశాయ భైరవాయ నమో నమః।
అగ్నిజ్వాలా కరాళాయ శశి మౌళిభృ(కృ)తే నమః॥

5

భవిష్య త్కృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే।
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే॥

6

కృత కంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే।
ప్రచండ దండ హస్తాయ బడబాగ్ని ముఖాయ చ॥

7

వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః।
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ॥

8

విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ।
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః॥

9

ఏవం దేవై సుృతశ్శంభు రుగ్రధన్వా సనాతనః।
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే॥

10

ఇతి శ్రీవరాహపుణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 21-30

Sri Ramadasu Keerthanalu 21-30 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

21. అసావేరి చాపుతాళం

పల్లవి : రామచంద్రులు నాపైచలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ
కటకటవినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మములు నెటులుండునోగద ధర్మమే నీకుండునమ్మ

||రామచంద్రుడు||

దినదినము మీచుట్టు దీనతతో దిరుగ దిక్కెవ్వరిక నోయమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ

॥ రామచంద్రుడు||

కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమిటుండెను
కన్నడచేసెదవా నీ కన్నుల వైభవంబు విన్నవింపగదమ్మ
నీ కన్న దిక్కెవ్వరోయమ్మ

||రామచంద్రుడు||

దశరథాత్మజుడెంతో దయాశాలియనుకొంటి ధర్మహీనుడేయమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడట రామదాసుని
ఏలరాడట రవికులాంబుధి సోముడితడట

॥రామచంద్రుడు||

22. బిళహరి చాపుతాళం

పల్లవి : రావయ్యా భద్రాచలరామ శ్రీరామ
రార రమణీయ జగదభిరామ లలామా
కేవలభక్తి విలసిలు భావముదెలిసి దేవుడవైతే

॥రావయ్యా||

ప్రొద్దు ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లిపుడు
ప్రొద్దు మీరగాను భజన చేసెదను
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చుము
ముద్దులు గులుకుచు మునుపటివలె నిటు

||రావయ్యా||

నన్ను గన్న తండ్రి నా మదిలోన
నీకన్న నితరముల గొలిచెదనా
శ్రీకరదివ్య ప్రభాకర కులరత్నా
శరత్పూర్ణ సుధాకర తేజా

॥రావయ్యా॥

అంజలి జేసెద నరమరలేక
అమిత కటాక్షము నాపైని పూని
ముజ్జగములకు ముదమిడు పదముల
గజ్జెలు గలగల ఘల్లుఘల్లు మన

॥రావయ్యా॥

దోషము నెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో తీరె
మోసము గలిగిన దాసపోషకుడవై

॥రావయ్యా॥

23. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : వినరయ్య తానీషాగారు మా మనవి చేకొనరయ్య మహారాజ మీరు

||వినరయ్య||

దినదినమును వారియింట విప్రవరుల సంతర్పణం
విందులవంట చేసేది సర్కారులంట
ఋజువు చేస్తాము సర్కారులను బంపువెంట

||వినరయ్య||

దండికాపులు బలిసిరందుచేసి చేసెడు తంటాలు నేమనుకొందు
ఆరులక్షల పైకమందునిలచి సర్కారునకు రాకపోయెనందు

॥వినరయ్య॥

బొక్కసములు పాడాయె దేవాలయములు బహుచక్కనాయె
తక్తాధికారులు మీరు తహసీలు చేసెడి గోపన్నగారు

॥వినరయ్య||

చాలతంటాలు జేసినారు తానీషాపైకమంత కొల్లగొట్టుచున్నారు
రామచంద్రుని నమ్మినారు శ్రీ భద్రాద్రిపురమందు దాగియున్నారు

||వినరయ్య||

జాగుసేయక యిక మీరె వారిని రప్పింప దెలియనతని కార్బారు

||వినరయ్య||

24. గౌళీపంతు ఆదితాళం

పల్లవి : శ్రీరామ నీ నామమెంత రుచిరా
ఓరామా నీ నామ మేమి రుచిరా
కరిరాజా ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీనామ మేమి రుచిరా

||శ్రీరామ||

గోవిందు నేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

||శ్రీరామ||

విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవుల మందాం మందాం

||శ్రీరామ||

రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరం దూరం

||శ్రీరామ||

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మాం నమ్మాం

||శ్రీరామ||

మాధవ నామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం

||శ్రీరామ||

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొకజోలంటే మౌనాం మౌనాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మన ముందాం ముందాం

||శ్రీరామ||

25. సావేరి ఆదితాళం

పల్లవి : సీతారామస్వామీ నేజేసిన నేరమేమి
ఖ్యాతిగ నీపదకంజ యుగళమునే
ప్రీతిగ దలపగ భేదమెంచితినా

॥సీతా॥

రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సరిగ బంగారు శాలువ పాగాలుంగీల్ నడికట్లడిగితినా
చెంగట భూసురపుంగవు లెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
మువ్వలు గొలుసులు ముత్యపుసరములు అంగనలకు నిన్నడిగితినా

॥సీతా॥

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటంబడిగితినా
కోమలమగు మెడలో పుష్పదామములిమ్మని యడిగితినా
మోమాటము పడకుండగ నీదగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని

||సీతా॥

తరచున నీ పదముల నమరిన సరిగజ్జెల నిను నేనడిగితినా
కరుణారస ముప్పొంగ గజతురగము లిమ్మని నేనడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పై గొప్పగ నేనడిగితినా
స్మరసుందరవర సంరక్షణ ధనమిమ్మని నిన్నడిగితినా

||సీతా॥

ప్రశస్త భద్రాధీశుడవని ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథ సుతనీచేత ధరించిన దానకంకణం బడిగితినా
విశదముగా నీమేలిమి మొలనూల్ వేడుకతో నిన్నడిగితినా
ఏలుము భూమిని కుచ్చల నేలకు నెక్కువగా నిన్నడిగితినా

||సీతా॥

26. వరాళి రూపతాళం

పల్లవి : అడుగుదాటి కదలనియ్యను
నాకభయమియ్యక నిన్నువిడువను
గడియ గడియ తిరిగి తిరిగి యడిగితిని వేసరగ వచ్చెను
గడువు దప్పినను నిక బహుదుడుకుతనములు చేయుదునిను

||అడుగు||

కుదురుగ గూర్చుండనియ్యను నీకు కోపమొచ్చిన భయపడను
మరల నెరిగియునింక నీ మొగమాటమేమియు లేదుగద నా
హృదయకమలమునందు నీ మృదుపదములను బంధించి వేయుదు
రేపు మాపని జరిపితే నే నాపుపెసెడి వాడగాను
ప్రాపు నీవనినమ్మి గొలిచిన పావముల నెడబాపి దయతో
తేవతేవక నీదుమోమిటు చూపకుండిన నోర్వసుమ్మి

॥అడుగు||

పతితపావన బిరుదు లేదా నన్ను పరిపాలన చేయరాదా
ప్రతిదినంబును దేవనిను భూపతినటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను వేడుకొనినను విడువ నిన్ను

||అడుగు||

రాక్షసాంతక సీతారమణాసారసాక్ష సద్గుణ భక్తాభరణ
యీక్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివెనను
సాక్షిబెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతునిన్ను

॥అడుగు||

భూరిభద్రాచల నివాసరామ భుజగశయన భక్తపోషా
కూరిమిగ నినువిడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రిరాఘవ
రామదాసుండనెడి నామము మారుపేరున బిలువు నన్ను

||అడుగు||

27. బేగడ ఆదితాళం

పల్లవి : అని యిట్లురామదాసు డనుకొనుచు సీతారాములకడ కేగెను
పనిబూనిభక్తవత్సల రామచంద్ర నా మనవి చేకొమ్మనెను

||అనియిట్లు||

వినవయ్య నీకు నేవిన్న వింతనొక్క ఘనకార్య మీవేళను
అనువొందనెల్ల రాజ్యము గొనియాడ పాపసముగ వేనోళ్ళను

||అనియిట్లు||

దానపోషణ బిరుదాంక సజ్జనులను గాసి నొందగ జేతురా
ఏసీమనైన దినేశవంశజలిట్లు మోసము చేయుదురా

||అనియిట్లు||

కరి మొరలిడనాడు త్వరగను నేగి మకరినుంచికరిగావవే
పరమపావన రామ చెరసాలనున్న భూసురునేలరక్షింతివో

||అనియిట్లు||

అతిపాపియైన యజామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రాద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా

||అనియిట్లు||

భద్రగిరీశుడ భక్తులపాలిట పారిజాతంబనుచు
భద్రాత్ముడై యున్న వాడు రామదాసు పాలించెదవనుచు

||అనియిట్లు||

28. ధన్యాసి చాపు తాళం

పల్లవి : అబ్బబ్బా రామ నామమది
సారము లేని సంసారసార మిదే రామనామం
పారద్రోలు మున్నూట ఇరువది భవరోగములన్ని
చేరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదూత కొట్టెడి నామం

||అబ్బబ్బా||

దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువును రెండనుచు తుదిని తారక నామం

||అబ్బబ్బా||

ముక్కంటిసతికి శాశ్వత కీర్తినిచ్చె రామనామం
ఎక్కువైన వాల్మీకి ఋషికి యెప్పుడనుష్ఠానం
ఒక్కసారి రామాయన్న ఓం భూస్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులన్న మోక్షమునకు

||అబ్బబ్బా||

దగ్గర రాముడు మన్మథుడు దవ్వులనుండు
దుష్కర్మలు గొబ్బున మోహపాశముల తెగగోయు నామం
మబ్బుదూరి కొండవంటి మొయిలు ముట్టిన పాపములనే
మినుగురువలె గాల్చును రామనామం

||అబ్బబ్బా||

కామక్రోధలోభమోహ గర్వమడచు రామనామం
స్వామి భద్రాధీశుని నద్దతి నామం
నీమముతో బిలిచిన నితగ మోక్షపదవి నామం
రామదాసు నేలిన శ్రీరామ నామం

||అబ్బబ్బా||

29. వరాళి రూపకతాళం

పల్లవి : అయ్యయ్యూచెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడలేదుగదా
రామయ్య జన్మాలు ఎన్నెన్నో గలవయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమ చందాన బ్రోచేవో రామయ్య

వనజనాభుని మాయతెలియకనే వెట్టివగల బొందుచు నుంటిగా కొన్నాళ్ళు
మునుపుజేసిన పుణ్యపాప సంఘములచే మునిగితేలుచుంటిగా కొన్నాళ్ళు
యెనుబడినాలుగులక్ష యోనులందెల్ల వేసరక పుట్టితిని కొన్నాళ్ళు
అనయమున నరకమనుభవించి స్వర్గమంతట జొచ్చితిగ ఓరామ

||అయ్యయ్యో||

ఆలంబనము లేక నాకాశమందున నలసటనొందితిరా కొన్నాళ్ళు
మేలు తెలియగ మిన్నులోపల జిక్కుమినుగక నుంటిగద కొన్నాళ్ళు
ఈలాగుతావచ్చి మేఘమధ్యమునందు నిడుమలపడుచుంటిగా కొన్నాళ్ళు
జాలినొంది సూర్యకిరణములలో జొచ్చి చలనము నొందితిగ కొన్నాళ్ళు

||అయ్యయ్యో ॥

ఓ రామయ్య వర్షములో జిక్కి వసుమతిమీదనే వర్తించు చుంటిగద కొన్నాళ్ళు
వరుసశేషసస్యగతమైన ధాన్యమును వదలి వర్తించితిగదకొన్నాళ్ళు
వరశరుని తేజస్సువల్ల నారీతనువల్ల నోరీగర్భనరకమునబడి యుంటిగ ఓ రామ

||అయ్యయ్యో||

త్రిప్పుడు తిత్తిలోబడి దినము ప్రవర్తిల్లు చుంటిగద కొన్నాళ్ళు
అప్పుడు మాతల్లి యుప్పుపులుపు దిననంగలార్చుచుండ కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బదులు వెళుదునని ఎదురుచూచుచుంటిగ కొన్నాళ్ళు
చెప్పరానియట్టి ద్వారములోనుండి జననమునొందితి ఓరామ

||అయ్యయ్యో!|

పొరలుచు దురగాధపొత్తిలో నలిగిరనుచుచు పోనుంటిగద కొన్నాళ్ళు
పెరుగుచు బాల్యావస్థల దినముల పరుగులాడుచుంటి గదకొన్నాళ్ళు
తరుణంతోగూడి మదమత్సరముల కన్నెరుగనైతిగద కొన్నాళ్ళు
తరువాత దారాపుత్రాది మోహములదవిలి వర్తించిగద ఓ రామా

||అయ్యయ్యో||

తలయుతెల్లనై దంతములూడి వణకుచు అడిబడుచుంటిగద కొన్నాళ్ళు
తలుపుదగ్గరచేరి బనిబిక్షుకులనైతి తగిలి దిట్టుచునుంటిగద కొన్నాళ్ళు
పిలిచినదాని పెండ్లాము బిడ్డలచేత నిడుమలబడుచుంటిగద కొన్నాళ్ళు
బలముదీరి కండ్లు పొరలుగప్పి పరుల బ్రతిమాలు చుంటిగద ఓ రామా

||అయ్యయ్యో||

ఆచట మృతినొందియలయుచు యమునిచే నానాబాధ లొంగద కొన్నాళ్ళు
వింతగా నీరీతిపుట్టుచుగిట్టుచు బాధలుపడుచుంటిగద కొన్నాళ్ళు
కంజనయన భద్రాచలపతివగు నిన్ను గనరకతిరిగితిని గదకొన్నాళ్ళు
వింతగనే రామదాసుడనైతి నికనెట్లు బ్రోచెదవో ఓ రామా

||అయ్యయ్యో||

30. అసావేరి ఆదితాళం

పల్లవి : అయ్యయ్యో నే నేరనైతిని
అదినారాయణడని దెలియనైతిని
వెయ్యారుజన్మాల వెతలజెందితిగాని
చయ్యన సద్గతి సాధింపలేనైతిని

॥అయ్యయ్యో॥

మోసమే మదితలచి యుందు
ఆశపాశముల తగిలి నే యుందు
ఆశాపాశములన నరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి

|॥అయ్యయ్యో॥

మూడు మేలని నమ్మి యుంటి
నిరుమూఢ శత్రులగూడి యుంటి
మూటి రెంటి మార్చి మూటికెక్కువయైన
కూటస్థు పొడగని కూడలేనైతి

||అయ్యయ్యో||

బంధకములు ద్రుంచి నేను
భద్రగిరి రాఘవుతోను గలిసి నే
సదయుడయి నెలకొన్న శ్రీరామదాసుని
స్థిరముగ చేపట్టి పోషించుమననైతి

॥అయ్యయ్యో॥

మరిన్ని కీర్తనలు:

  1. అసావేరి రూపకతాళం
  2. నాదనామక్రియ ఆదితాళం
  3. కాంభోజి చాపుతాళం
  4. ఆనందభైరవి ఏకతాళం
  5. వరాళి రూపకతాళం
  6. కల్యాణి చాపుతాళం
  7. వరాళి రూపకతాళం
  8. ఆనందభైరవి చాపుతాళం
  9. వరాళి చాపుతాళం
  10. బిలహరి ఆదితాళం

Sai Baba Mantra Pushpam In Telugu – సాయి మంత్రపుష్పం

Sai Baba Mantra Pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం  అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

సాయి మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.
సహస్ర శీర్షం దేవం – విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్.
విశ్వమే వేదం పురుష – స్తద్విశ్వ ముపజీవతి,
పతిం విశ్వ స్యాత్మే శ్వరగ్ం శాశ్వతగ్ం శివ మచ్యుతం,
నారాయణః పరో జ్యోతి – రాత్మా నారాయణః పరః,
నారాయణః పరం బ్రహ్మ – తత్త్వం నారాయణః పరః,
నారాయణః పరో ధ్యాతా – ధ్యానం నారాయణః పరః,
యచ్చ కించి జ్జగ త్సర్వం దృశ్యతేశ్రయతే 2 పివా,
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః,
అనంత మవ్యయం కవిగ్ం – సముద్రేతం విశ్వశంభువం,
పద్మకోశప్రతీకాశగ్ం – హృదయం చాప్యధోముఖం,
అధో నిష్ట్యాం వితస్త్యాంతే – నాభ్యా ముపరి తిష్ఠతి,
జ్వాలామాలాకులంభాతి – విశ్వ స్యాయతనం మహత్,
సంతతగ్ం శిలాభిస్తు – లంబత్యాకోశసన్నిభం,
త స్యాంతే సుషిరగ్ం సూక్ష్మం – తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితం,
తస్య మధ్యే మహానగ్ని – ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః,
సో గ్రభు గ్వభజ న్తిష్ఠ – న్నాహార మజరః కవిః,
తిర్య గూర్ధ్వ మధ శ్శాయీ రశ్మయ స్తస్య సన్తతా,
సంతాపయతి స్వం దేహ – మాపాదతలమస్తకః,
తస్య మధ్యే వహ్ని శిఖా -అణాయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతో యదమధ్యస్థా – విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ తన్వీ – పీతా భాస్వత్యణూపమా,
తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః.
స బ్రహ్మ స శివ స్సహరి స్సేంద్ర – స్సోక్షరః పరమ స్స్వరాట్.
అపాం పుష్పమ్
యోపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
చంద్రమా వా అపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి
య ఏవం వేద
యో పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అగ్ని ర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యో గ్నే రాయతనంవేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యే పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
వాయుర్వా అపా మాయాతనం, ఆయతనవాన్ భవతి
యో వాయో రాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యో పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
అసౌ వై తప న్నపామాయతనం, ఆయతనవాన్ భవతి
యో ముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అముష్య తపత ఆయతనం, ఆయతనవాన్ భవతి

య ఏవం వేద
యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి
యః పర్జన్య స్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై పర్జన్య స్యాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద
యోప్సు నావం ప్రతిష్ఠితం వేద, ప్రత్యేవ తిష్ఠతి,
ఇమే లోకా అప్సు ప్రతిష్ఠితాః త దేషాం భ్యుక్తా,
కిం త ద్విష్ణో ర్బల మాహుః కా దీప్తిః కిం పరాయణం,
ఏ కో యద్ధార య దేవః రేజతీ రోదసీ ఉభే,
వాతా ద్విష్ణో ర్బల మాహుః అక్షర దీప్తి రుచ్యతే,
ప్రతిపదా ధారయ దేవః – య ద్విష్ణో రేక ముత్తమమ్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వైశ్రవణాయ కుర్మహే,
సమే కామాన్ కామకామయ మహ్యం,
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ – మహారాజాయ నమః.
ఓం తద్భహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా,
ఓం త్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః,
అంత శ్చరతి భూతేషు – గుహాయాం విశ్వమూర్తిషు,
త్వం యజ్ఞస్త్వం వషట్కార – స్వ మింద్ర స్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః, త్వం త దాప అపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువ రోమ్.
ఈశాన స్సర్వవిద్యానా – మీశ్వర స్సర్వభూతానాం. – బ్రహ్మాధిపతి
రహ్మణో2 ధిపతి – రహ్మా శివో మే అస్తు సదాశివోమ్.
తద్విష్ణోః పరమం పదగ్ధం – సదా పశ్యంతి సూరయః,
దివీవ చక్షు రాతతం – త ద్విప్రాసో విపన్యవో,
జాగృవాంస స్సమింధతే – విష్ణో ర్య త్పరమం పదమ్.
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ – పురుషం కృష్ణపింగళం
ఊర్ధ్వ రేతం విరూపాక్షం – విశ్వరూపాయ వై నమోనమః,
నారాయణాయ విద్మహే – వాసుదేవాయ ధీమహి,
తన్నో విష్ణుః ప్రచోదయాత్.
ఆకాశా త్పతితం తోయం – యథా గచ్ఛతి సాగరం,
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి. ఇతి మంత్రపుష్పమ్
పరివార సహిత శ్రీసాయినాధ పరబ్రహ్మణే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమామ్ కృపయాదేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఏతత్ఫలం శ్రీ సాయినాధ సమర్పణమస్తు
(చేతిలో ఉదకము వదలవలయును)
శ్రీ సాయినాధ దేవతా ప్రసాదం శిరసాగృష్ణమి.

మరిన్ని:

Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu | శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి

Sri Mahalakshmi Ashtottara Sathanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి

 

  • ఓం ప్రకృత్యై నమః |
  • ఓం వికృత్యై నమః |
  • ఓం విద్యాయై నమః |
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః |
  • ఓం శ్రద్ధాయై నమః |
  • ఓం విభూత్యై నమః |
  • ఓం సురభ్యై నమః |
  • ఓం పరమాత్మికాయై నమః |
  • ఓం వాచే నమః |
  • ఓం పద్మాలయాయై నమః |
  • ఓం పద్మాయై నమః |
  • ఓం శుచయే నమః |
  • ఓం స్వాహాయై నమః |
  • ఓం స్వధాయై నమః |
  • ఓం సుధాయై నమః |
  • ఓం ధన్యాయై నమః |
  • ఓం హిరణ్మయ్యె నమః |
  • ఓం లక్ష్మ్యై నమః |
  • ఓం నిత్యపుష్టాయై నమః |
  • ఓం విభావర్యై నమః |
  • ఓం అదిత్యై నమః |
  • ఓం దిత్యై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం వసుధాయై నమః |
  • ఓం వసుధారిణ్యై నమః |
  • ఓం కమలాయై నమః |
  • ఓం కాంతాయై నమః |
  • ఓం క్షమాయై నమః | [కామాక్ష్యై]
  • ఓం క్షీరోదసంభవాయై నమః | [క్రోధసంభవాయై]
  • ఓం అనుగ్రహపరాయై నమః |
  • ఓం బుద్ధయే నమః |
  • ఓం అనఘాయై నమః |
  • ఓం హరివల్లభాయై నమః |
  • ఓం అశోకాయై నమః |
  • ఓం అమృతాయై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం లోకశోకవినాశిన్యై నమః |
  • ఓం ధర్మనిలయాయై నమః |
  • ఓం కరుణాయై నమః |
  • ఓం లోకమాత్రే నమః |
  • ఓం పద్మప్రియాయై నమః |
  • ఓం పద్మహస్తాయై నమః |
  • ఓం పద్మాక్ష్యై నమః |
  • ఓం పద్మసుందర్యై నమః |
  • ఓం పద్మోద్భవాయై నమః |
  • ఓం పద్మముఖ్యై నమః |
  • ఓం పద్మనాభప్రియాయై నమః |
  • ఓం రమాయై నమః |
  • ఓం పద్మమాలాధరాయై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం పద్మిన్యై నమః |
  • ఓం పద్మగంధిన్యై నమః |
  • ఓం పుణ్యగంధాయై నమః |
  • ఓం సుప్రసన్నాయై నమః |
  • ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
  • ఓం ప్రభాయై నమః |
  • ఓం చంద్రవదనాయై నమః |
  • ఓం చంద్రాయై నమః |
  • ఓం చంద్రసహోదర్యై నమః |
  • ఓం చతుర్భుజాయై నమః |
  • ఓం చంద్రరూపాయై నమః |
  • ఓం ఇందిరాయై నమః |
  • ఓం ఇందుశీతలాయై నమః |
  • ఓం ఆహ్లాదజనన్యై నమః |
  • ఓం పుస్ట్యై నమః |
  • ఓం శివాయై నమః |
  • ఓం శివకర్యై నమః |
  • ఓం సత్యై నమః |
  • ఓం విమలాయై నమః |
  • ఓం విశ్వజనన్యె నమః |
  • ఓం తుస్ట్యై నమః |
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
  • ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
  • ఓం శాంతాయై నమః |
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
  • ఓం శ్రియై నమః |
  • ఓం భాస్కర్యై నమః |
  • ఓం బిల్వనిలయాయై నమః |
  • ఓం వరారోహాయై నమః |
  • ఓం యశస్విన్యై నమః |
  • ఓం వసుంధరాయై నమః |
  • ఓం ఉదారాంగాయై నమః |
  • ఓం హరిణ్యై నమః |
  • ఓం హేమమాలిన్యై నమః |
  • ఓం ధనధాన్యకర్యై నమః |
  • ఓం సిద్ధయే నమః |
  • ఓం స్త్రైణసౌమ్యాయై నమః |
  • ఓం శుభప్రదాయై నమః |
  • ఓం నృపవేశ్మగతానందాయై నమః |
  • ఓం వరలక్ష్మ్యై నమః |
  • ఓం వసుప్రదాయై నమః |
  • ఓం శుభాయై నమః |
  • ఓం హిరణ్యప్రాకారాయై నమః |
  • ఓం సముద్రతనయాయై నమః |
  • ఓం జయాయై నమః |
  • ఓం మంగళా దేవ్యె నమః |
  • ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
  • ఓం విష్ణుపత్న్యై నమః |
  • ఓం ప్రసన్నాక్ష్యై నమః |
  • ఓం నారాయణసమాశ్రితాయై నమః |
  • ఓం దారిద్య్రధ్వంసిన్యై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
  • ఓం నవదుర్గాయై నమః |
  • ఓం మహాకాల్యె నమః |
  • ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
  • ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
  • ఓం భువనేశ్వర్యై నమః |

మరిన్ని అష్టోత్తరలు:

Krishna Ashtakam In Telugu – కృష్ణాష్టకమ్

Krishna Ashtakam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు కృష్ణాష్టకమ్ గురించి తెలుసుకుందాం…

Krishna Ashtakam Lyrics Telugu

కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్,
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.

1

అతసీపుష్పసంకాశం, హారనూపురశోభితమ్,
రత్నకంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుమ్.

2

కుటిలాలకసంయుక్తం, పూర్ణచంద్రనిభాననమ్,
విలసత్కుండలధరం, కృష్ణం వందే జగద్గురుమ్.

3

మందారగంధసంయుక్తం, చారుహాసం చతుర్భుజమ్
బర్హిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్.

4

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం, నీలజీమూతసన్నిభమ్,
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్.

5

రుక్మిణీకేళిసంయుక్తం, పీతాంబరసుశోభితమ్,
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్.

6

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్,
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురుమ్.

7

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్,
శంఖచక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురుమ్.

8

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం, స్మరణేన వినశ్యతి.

ఇతి శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్

మరిన్ని అష్టకములు