మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు భుజంగప్రయాతాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Krishna Bhujanga Prayata Ashtakam Telugu
భుజంగప్రయాతాష్టకమ్
సదా గోపికామండలే రాజమానం లసన్నృత్యబంధాదిలీలానిదానమ్,
గలద్దర్పకందర్పశోభాభిధానం భజే నందసూనుం సదానందరూపమ్.
1
వ్రజ స్త్రీ జనానందసందోహసక్తం సుధావర్షివంశీ నినాదానురక్తమ్,
త్రిభంగాకృతి స్వీకృత స్వీయభక్తం భజే నందసూనుం సదానందరూపమ్.
2
స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం పరిత్యక్తగేహాదిదా సైకగమ్యమ్,
విమానస్థితా శేష దేవాదినమ్యం భజే నందసూనుం సదానందరూపమ్.
3
స్వలీలారసానందదుగోదమగ్నం ప్రియస్వామినీబాహుకంరైక లగ్నమ్,
రసాత్మైకరూపావబోధం త్రిభంగం భజే నందసూనుం సదానందరూపమ్.
4
రసామోద సంపాదకం మందహాసం కృతాభీరనారీ విహారైకరూపమ్,
ప్రకాశీకృత స్వీయ నానావిలాసం భజే నందసూనుం సదానందరూపమ్.
5
జితానంగసర్వాంగశోభాభిరామం క్షపాపూరితస్వామినీ బృందకాయమ్,
నిజాధీనతావర్తిరామాతివామం భజే నందసూనుం సదానందరూపమ్.
6
స్వసంగీకృతానంతగోపాల బాలం వృతస్వీయగోపీమనోవృత్తిపాలమ్,
కృతానందచౌర్యాదిలీలారసాలం భజే నందసూనుం సదానందరూపమ్.
7
ధృతాద్రీశగోవర్ధనాధారహస్తం పరిత్రాతగోగోపగోపీ సమస్తమ్,
సురాధీశసర్వాదిదేవప్రశస్తం భజేనందసూనుం సదానందరూపమ్.
8
ఇతి శ్రీహరిరాయాచార్యవిరచితం భుజంగ ప్రయాతాష్టకమ్.
మరిన్ని అష్టకములు