BhaktiVed
Hanuman

Sarwashatrunjaya Hanumat Stotram

Stotram
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

శ్లో॥ శ్రీమంతం హనుమంతమాత్తరిపుభిద్భూభృత్తరుభ్రాజితం ।

వల్గద్వాలనిబద్ధవైరినిచయం చామీకరాద్రిప్రభమ్ ।

రోషాద్రక్తపిశంగనేత్రనలినం భ్రూభంగమంగస్ఫుర-

త్ప్రోద్యచ్చండమయూఖమండలముఖం దుఃఖాపహం దుఃఖినామ్ ॥

కౌపీనం కటిసూత్రమౌంజ్యజినయుగ్దేహం విదేహాత్మజా-

ప్రాణాధీశ పదారవింద నిహితస్వాంతం కృతాంతం ద్విషామ్ ।

ధ్యాత్వైవం సమరాంగణస్థిత మథానీయ స్వహృత్పంకజే ।

సంపూజ్యాఖిలపూజనోక్తవిధినా సంప్రార్థయేత్ప్రార్థితమ్ ॥

తా॥ ఇట్లు ధ్యాన మొనర్చి యీ క్రింద వ్రాయబడిన స్తోత్రము చేయవలెను.

హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమ |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 1 ||

మర్కటాధిప మార్తాండ మండల గ్రాస కారక|

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 2 ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |

లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 3 ||

రుద్రావతార సంసార దుఃఖ భారాపహారక |

లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 4 ||

శ్రీరామ చరణాంభోజ మధుపాయితమానస |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 5 ||

వాలీప్రమథనక్లాంత సుగ్రీవోన్మోచన ప్రభో |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 6 ||

సీతావిరహవీరాశగ్న (వారాశిభగ్న) సీతేశతారక |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 7 ||

రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 8 ||

గ్రస్తాశేష జగత్ స్వాస్థ్య రాక్షసాంబోధి మందర |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 9 ||

పుచ్ఛ గుచ్ఛ స్ఫురద్వీర జగద్దగ్థారిపత్తన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 10 ||

జగన్మనోదురుల్లంఘ్యా పారావార విలంఘన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 11 ||

స్మృతమాత్ర సమస్తేష్ట పూరక ప్రణతప్రియ |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 12 ||

రాత్రిం చరతమో రాత్రి కృంతనైక వికర్తన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 13 ||

జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప|

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 14 ||

భీమాదికమహాభీమ వీరావేశావతారక |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 15 ||

వైదేహీవిరహ క్లాంత రామరోపైక విగ్రహ |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 16 ||

వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 17 ||

అఖర్వ గర్వగంధర్వపర్వతోద్భేదన స్వర |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 18 ||

లక్ష్మణ ప్రాణ సంత్రాణ త్రాతతీక్ష్ణ కరాన్వయ |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 19 ||

రామాదివిప్రయోగార్తభరతాధ్యార్తి నాశన |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 20 ||

ద్రోణాచలసముత్ క్షేపసముత్ క్షిప్తారివైభవ |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 21 ||

సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |

లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 22 ||

ఇత్యేవమశ్వత్భతలోపవిష్టః

శత్రుంజయం నామ పఠేత్ స్వయం యః |

స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః

ప్రమోదతే మారుతజప్రసాదాత్ || 23 ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్తుతిస్తూ గానము చేసేది లేక ప్రశంసలతో కూడిన గానం (ప్రశంసా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

సర్వశత్రుంజయ హనుమత్ స్తోత్రం

పై విధముగ అశ్వత్థ వృక్షమూలమునఁ గూర్చుండి పై స్తోత్రమునెవడు పఠించునో వెంటనే వాని సమస్త శత్రువులు నశించుననియు హనుమత్ప్రసాదమువలన సంతోషముతో నుండుననియు తాత్పర్యము.

మరిన్ని స్తోత్రములు

Also read