BhaktiVed
శివుడు

ఉమా మహేశ్వర స్తోత్రం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశిష్టవపుర్ధరాభ్యామ్ |

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం

నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |

నారాయణేనార్చితపాదుకాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ట్వింద్రసుపూజితాభ్యామ్ |

విభూతిపాటీరవిలేపనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం

జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |

జంభారిముఖ్యైరభివందితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం

పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |

ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యామతిసుందరాభ్యా

మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |

అశేషలోకైకహితంకరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం

కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |

కైలాసశైలస్థితదేవతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యామశుభాపహాభ్యా

మశేషలోకైకవిశేషితాభ్యామ్ |

అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం

రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |

రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం

జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |

జనార్దనాభోద్భవపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం

బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |

శోభావతీశాంతవతీశ్వరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |

సమస్తదేవాసురపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం

భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |

స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే

శతాయురాంతే శివలోకమేతి ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్ |

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఉమా మహేశ్వర స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Uma Maheshwara Sthotram In Telugu Lyrics

ఉమా మహేశ్వర స్తోత్రం

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

మరిన్ని స్తోత్రములు:

ఇవి కూడా చదవండి