BhaktiVed
Venkateswara

Anganalala Manache Nadinchukonegani

SankirtanaAuthor: అన్నమాచార్య (Annamacharya)రాగం శంకరాభరణం (annamacharya sankirtana no. 454)
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

అంగనలాల మనచే నాడించుకొనెగాని

పల్లవి:

అంగనలాల మనచే నాడించుకొనెగాని |

సంగతెఱిగిననెరజాణ డితడే ||

చరణం 1:

వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని |

తడయక పురుషోత్తము డితడే |

బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని |

వెడలించె నమృతము విష్ణుడితడే //అంగనలాల//

చరణం 2:

పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని|

నలువంక లక్ష్మీనాథు డితడే |

చలికి గోవరివానివరుస బావాయగాని |

పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే //అంగనలాల//

చరణం 3:

యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని |

తక్కకవెదకేపరతత్త్వ మితడే |

మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని |

తక్కక వేదముచెప్పేదైవమీతడే //అంగనలాల//

Meaning and notes

అంగనలాల మనచే నాడించుకొనెగాని – అన్నమయ్య కీర్తనలు

శంకరాభరణం

అవతారిక:

“ఓ అంగనలారా! ఈ పిల్లాడు ఇట్లా మనచేత ఆడింపబడుతున్నాడు కాని అసలు సంగతి తెలుసుకొంటే ఇతడే గొప్ప నెరజాణమ్మా!” అని ఆలాపిస్తున్నారు మన అన్నమాచార్యులవారు. ఇందులో వున్న ప్రహేళికలు (చిక్కు ప్రశ్నలు) జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించి భావవివరణతో సరిజూసుకోండి. ఇదొక ‘క్విజ్ ప్రోగ్రాం’ అన్నమాట. తినబోయేముందు ఇది రుచి చూడండి… పులిగూడు దిన్నవాడెవడు? వాని పొందొక్కటే సేనుగాని. అంటే యేమిటి? ఆలోచించండి. ఎక్కడో గొల్లసతులకు ఇంటిమగడయ్యిం దెవరు? చలికిఁ గోవరివాడెవడు? అనుకున్నంత తేలికకాదు అని తెలుసుకోండి, మరి.

భావ వివరణ:

ఓ అంగనలారా (రమణుల్లారా!) ఈనాడు ఈయన మన చేత ఆడించబడుతున్నాడు. కాని, సంగతెరిగిన (అసలు విషయం తెలుసుకొంటే) ఇతడే గొప్ప నెరజాణ (అన్నీ తెలిసిన చతురుడు).

ఈయన పులిగూడుతిన్నవాని పొందొక్కటే చేశాడు (భిక్షాటన చేసి ఆ భిక్ష భుజించేవాని స్నేహం చేసేవాడు)… అంటే (పరమశివుని మిత్రుడైన శ్రీహరి). అయినా ఈయన భిక్ష యెత్తడండీ. ఎందుకంటే అప్లైశ్వర్యములున్న లక్ష్మీదేవికి మగడండీ ఈయన. ఈయన చలికిన్ కోవరి వాని బావ. అంటే చల్లదనాన్నిచ్చే చంద్రునికి బావగారు అయిన శ్రీకాంతుడు. అంతేకాదు దేవతలందరికీ ప్రాణబంధువు.

ఎక్కడో రేపల్లెలో వున్న గొల్లపడుచులకి “ఇంటి మగడు” ఒకే ఇంటిపేరుండేట్లు చేసిన మగడు. యోగులందరూ తక్కక (వెనుదీయక) వెదకే పరతత్వము (పరబ్రహ్మ) ఇతడే. ఇవన్నీ అటుంచి శ్రీవేంకటాద్రి మీద వెలసి మమ్మల్ని యేలే దేవుడు ఈయనే. కానీ వేదాలన్నీ శ్లాఘించే పరాత్మరుడు కూడా ఈ దేవుడే.

Also read