BhaktiVed
Ram

Paramavivekulala Bandhuvulala

SankirtanaAuthor: అన్నమాచార్య (Annamacharya)రాగం ధన్నాసి (annamacharya sankirtana no. 475)
Script
Text size

Editorial review · Review recorded
Recorded review date (UTC)

The recorded review date is shown when available. Script conversion is not translation; traditional versions may differ.

పరమవివేకులాల బంధువులాల

తెరదీసి మాకు నిది తెలుపరో ॥పల్లవి॥

యేడు జానలమేనిలో నిందిరానాథుఁ డున్నాఁడు

వేడుకతో నతనిని వెదకరో

పూడిచి వున్నది మతిఁ బొందుగ వైకుంఠము

చూడరో ధ్యానముసేసి సోదించరో ॥పరమ ||

కొడిదెఁడు బయలిలో గోవిందుని నెలవఁట

చిడిముడితో నిట్టే చేరి పట్టరో

అడఁచి దాఁచివున్నది అందే బ్రహ్మానందము

విడువరో యీ ముడియ వెలయఁ జేపట్టరో ॥పరమ ||

వూని నల్లెఁడు నాలికలో నుండు శ్రీవేంకటేశుఁ-

డానుకొని బత్తితోడ నటు నిల్పరో

నానఁబెట్టివున్నది నామ కీర్తనములందు

తానకముగా నేపొద్దూఁ దలఁచుకోరో ॥పరమ ||

Meaning and notes

పరమవివేకులాల బంధువులాల – అన్నమయ్య కీర్తనలు

ధన్నాసి

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో సాటివారిని తమ మనస్సులలోని అజ్ఞానపు తెరలను తొలగించి శ్రీహరిని దర్శించమని వేడుకొంటున్నారు. ఇది కూడా తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన. భావ వివరణ చదివినవారికి ఈ సంగతి వెంటనే అర్థమవుతుంది. గోవిందునికి మీమనస్సులో నెలవుగా వుంచితే బ్రహ్మానందము దానంతట అదే సిద్ధిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుని నామసంకీర్తనము నాలికపై నుంటే, యే పొద్దునైనా ఆయననే తలుస్తుంటే… తప్పక ఒకనాటికి ఆ స్వామి దయకలుగుతుంది.

భావ వివరణ:

పరమవివేకులాల (విశిష్ఠమైన వివేకము గల జ్ఞానులారా!) బంధువులారా! మాకు తెరదీసి (వివేకము చూపి) ఇది (ఈసంగతిని) తెలియజేయండయ్యా!

ఏడు’జానలు’ పొడుగున్న ఈ శరీరంలో ఇందిరానాధుడైన శ్రీహరివున్నాడు. కాని ప్రయత్నించి వెదకకపోతే మాత్రం కనబడడు. వైకుంఠము అనేది వేరేయెక్కడో లేదు. మనస్సులో శ్రీహరి వున్నట్లే, వైకుంఠము కూడా మన మెదడులోనే పూడ్చివున్నది, దాగివున్నది). అది వూరకనే కనబడదు. ధ్యానముచేసి, పరిశోధించి వెతికి చూస్తేకాని కనుపించదు. అయ్యలారా! అట్లే సోధించరో!

నెలవు (వుండేచోటు) నిజంగా యెక్కడవున్నది? కొడు బయలులోనట (పుడిసిలిలో ఇమిడిన ఆకాశములో వున్నాడట. చిడిముడితో (తొట్రుబాటుతో కూడిన జాగ్రత్తతో) ఆయనను ఇట్టే పట్టరో (మీ వశము చేసికొనండి). అందే (ఆయనను వశపరచుకొనుటలోనే) బ్రహ్మానందము, అణచిదాచివున్నది (అణిగి దాగివున్నది). ఈ ముడియ (మాట)లో దాగి వున్న బ్రహ్మానందము విడువరో (బయట పెట్టండి). వెలయజేపట్టరో (బయటపడంగానే) మీలో భద్రపరచుకొనండి.

Also read