BhaktiVed
Venkateswara

Neyyamulallo Nerello

SankirtanaAuthor: అన్నమాచార్య (Annamacharya)రాగం దేసాళం (annamacharya sankirtana no. 179)

This text is still being proofread.

నెయ్యములల్లో నేరేళ్ళో

వొయ్యన వూరెడి వువ్విళ్ళో

పల్లవి

పలచని చెమటల బాహుమూలముల

చెలమలలోనాఁ జెలువములే

థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి

దులిపేట నీళ్ళతుంపిళ్ళో

॥నెయ్యము॥

తొటతోటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ

చిటి పొటి యలుకల చిరునగవే

వటఫలంబు నీ వన్నెల మోవికి

గుటుకలలోనా గుక్కిళ్ళో

॥నెయ్యము॥

గగల వేంకటపతి కౌఁగిట

పరిమళములలో బచ్చనలు

మరునివింటి కమ్మనియంప విరుల-

గురితాఁ కులినుపగుగ్గిళ్ళో

॥నెయ్యము॥

No video for this text yet.Search on YouTube

Meaning and notes

నెయ్యములల్లో నేరేళ్ళో – అన్నమయ్య కీర్తనలు

దేసాళం

అవతారిక:

జానపదులు కోలాటములాడుతూ పాడే మధురమైన కీర్తన అన్నమాచార్యులవారి ద్వారా ఆస్వాదించండి. అల్లోనేరేడు పళ్ళవలె మధురములైన నెయ్యములు (స్నేహములు) ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళురు చున్నవి. ఇది ఆట ప్రధానమైన కీర్తన. బాహుమూలములలో పలచని చెమటల గురించి వర్ణించగలిగిన సత్తా అన్నమయ్యకు మాత్రమే వున్నదని వేరే చెప్పక్కరలేదు. ఇది సుగ్రాహ్యము అనుకోవడానికి వీలులేని కీర్తన. జాగ్రత్తగా చదివితేకాని అర్థంకాదు, మరి.

భావ వివరణ:

మా నెయ్యములు (స్నేహము) అల్లోనేరేడు పండ్లవలె మధురమైనవి. ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళూరెడ్డి మా అనుబంధం దినదిన ప్రవర్ధమానమవుగాక!

బాహుమూలములలో పరిఢవిల్లిన లే చిత్తడి చెమటల చెలమలలో అందములు అలంకార ప్రాయమైనవి. ఈ నృత్యమువలన చెమట ఇంకా అధికమై, థళథళమను (తళతళమని) మెరయు ముత్యములను చెరుగు సురటి (విసనకఱ్ఱ), దులిపేటి నీళ్ళతుంపరల వలె వున్నవి.

ఓ గరగరికల (నిర్మలుడవైన) వేంకటేశ్వరా! నీ కౌగిటిలో పరిమళములు వెదజల్లు మీ ఒంటిపై పూతలు ఒండొరులకు ఎలా వున్నాయంటే మన్మథుని వింటినుండి వెలువడిన కమ్మని పుష్పబాణములు కూడా గురిగా తాకునట్లు మీపై వేసిన ఇనుప గుగ్గిళ్ళవలెనున్నవి.

Also read