BhaktiVed
విష్ణువు

నారాయణుని శ్రీనామమిది

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)రాగం కేదారగౌళ (annamacharya sankirtana no. 73)

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

నారాయణుని శ్రీ నామమిది

కోరినవిచ్చీఁ గోవో మనసా

పల్లవి

శుకవరదుని సొంపుగఁ దలంచుటె

సకలభవ విజయము

అకలంకము మహాభయహరణ

మొకటి నొకటి వోహెూ మనసా

||నారా||

పక్షిగమన శుభము (పదము?) దలంచుటే

అభయభోగ విహారమ్ము

వక్షపు లక్ష్మీవరుసే (చే?) సిరులు

లక్షలు గోట్లొల్లవొ మనసా

||నారా||

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన

వేంకటాధిపు సేవించఁగదో

అంకెలకిన్నియునైన యీ (?)

మంకపు గాక నమ్మవో మనసా

||నారా||73

భావం / వివరణ

నారాయణుని శ్రీనామమిది – అన్నమయ్య కీర్తనలు

కేదారగౌళ

అవతారిక:

భావ వివరణ:

ఓ మనసా! శ్రీమన్నారాయణుని శ్రీనామము (మంగళప్రదమైన నామం ఇదే). హరీ! అను. ఇది నీవు కోరిన విచ్చీ (కోరికలు తీరుస్తుంది) కోవో (తీసికో…) కానీ ఆ నామాన్ని మాత్రం వదిలిపెట్టకు.

ఇవి కూడా చదవండి