Narayanuni Srinamamidi In Telugu – నారాయణుని శ్రీనామమిది

ఈ పోస్ట్ లో నారాయణుని శ్రీనామమిది కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నారాయణుని శ్రీనామమిది – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : నారాయణుని శ్రీనామమిది
సంఖ్య : 73
పుట : 410
రాగం: కేదారగౌళ

కేదారగౌళ

96 నారాయణుని శ్రీ నామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా

||పల్లవి||

శుకవరదుని సొంపుగఁ దలంచుటె
సకలభవ విజయము
అకలంకము మహాభయహరణ
మొకటి నొకటి వోహెూ మనసా

||నారా||

పక్షిగమన శుభము (పదము?) దలంచుటే
అభయభోగ విహారమ్ము
వక్షపు లక్ష్మీవరుసే (చే?) సిరులు
లక్షలు గోట్లొల్లవొ మనసా

||నారా||

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించఁగదో
అంకెలకిన్నియునైన యీ (?)
మంకపు గాక నమ్మవో మనసా

||నారా||73

అవతారిక:

తనమనసును హెచ్చరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. నారాయణుని శుభప్రదమైన నామము పలికితే చాలును. కోరినవిచ్చీగోవో అంటే కోరుకున్నవన్నీ ఇస్తాడు, స్వీకరించు అని అర్థం. కొన్ని మాటలకి నిఘంటువులలో కూడా సులభగ్రాహ్యమైన అర్థం దొరకదు. అది అట్లా అయ్యుంటుందని భావించాలి. “అంకెలకిన్నియునైన యీమంకపుగాక నమ్మవో మనసా” అంటున్నారు. అంటే యేమిటి? నీవశమయ్యేట్లుగా అన్నీ నీకు శ్రీహరే ఇస్తాడు. నీ మంకుతనము మాని ఆయనను నమ్మవే అని అర్థం. ఆయన హృదయవాసినియైన లక్ష్మీదేవి ఆయన ఇమ్మంటే లక్షలు, కోట్లు ఇస్తుంది. కానీ ఒల్లవో మనసా! నీవు అసలొప్పుకోవద్దు అంటున్నారు. | ఒప్పుకుంటే డబ్బుపిచ్చివాళ్ళవుతారు, మరి.

భావ వివరణ:

ఓ మనసా! శ్రీమన్నారాయణుని శ్రీనామము (మంగళప్రదమైన నామం ఇదే). హరీ! అను. ఇది నీవు కోరిన విచ్చీ (కోరికలు తీరుస్తుంది) కోవో (తీసికో…) కానీ ఆ నామాన్ని మాత్రం వదిలిపెట్టకు.

శుకమహర్షిని భాగవత బోధకునిగా చేసి అనుగ్రహించి తరింపజేసినది | శ్రీహరినామమే. ఆయనను సొంపుగా ధ్యానిస్తే సకల భవబంధాలు తొలగిపోతాయి. వాటిపై విజయము సాధించగలవు. ఆ శ్రీహరినామము అకలంకము (ఏ దోషమూ లేనిది). గొప్ప భయమును నివారించునది. | ఓహెూ! మనసా! అది ఒకటినొకటి (ఒకే యొక్కటి. అట్టిది ఇంకొకటి లేదు అని అర్థం.)

ఆ శ్రీహరి అలవాట్లు యేమిటో ఒకసారి గమనించండి. ఆయన పక్షిగమనుడు. అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతునిపై వెళ్ళేవాడు ఆయనే. క్షణాల మీద (తలచినదే తడవుగా) వచ్చి రక్షిస్తాడు. అభయప్రదాతయైన | శేషునిపై పవళిస్తాడు విహరిస్తాడు. ఆయన వక్షస్థలంపై సిరులరాణి శ్రీమహాలక్ష్మివుంటుంది. ఆయన సైగచేస్తే లక్షలు కోట్లు ఇస్తుందావిడ. కానీ ఓ వెళ్లి మనసా! వాటిని ఒల్లకే (ఆ లక్షలు కోట్లను అంగీకరించకే. చెడిపోతావు.

అవన్నీ అటుంచి ఈ మాట వినుము. నీకు ఈ ప్రాపంచిక తలపులు (కోర్కెలు) యెన్ని కలిగినా శ్రీవేంకటేశ్వరుని మాత్రము వదలిపెట్టకు. ఆయననే సేవించదో! అంకెలకిన్నియునైన యీ (నీ వశమయ్యేట్లుగా |ఆయన నీకెన్నియైనా ఈయగలడు. ఓ మనసా! మంకెపుగాక (మంకుతనమునకు పోక… అంటే… మొండిగా చెడిపోక) నమ్మవో (ఆయననే శరణు అని నమ్ముకో). తప్పక నీకు మేలు జరుగుతుంది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment