BhaktiVed
వేంకటేశ్వరుడు

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు

సంకీర్తనరచన: అన్నమాచార్య (Annamacharya)రాగం లలిత (annamacharya sankirtana no. 6)
లిపి
అక్షర పరిమాణం

ఈ పాఠానికి సంపాదకీయ సమీక్ష అవసరం.

మూలం మరియు సంపాదకీయ సమీక్ష · సమీక్ష అవసరం
మూలం
bhaktived.com, https://bhaktived.com/ataditada-vennalantata-dongilinadu/
మూల వివరాలు
post id 1985, modified 2024-05-21; category keerthanalu; imported 2026-10-16 with the owner's approval

అందుబాటులో ఉన్న మూల వివరాలు, సమీక్ష తేదీ ఇక్కడ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

అతఁడితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు

యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

పల్లవి

యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము

పూతకిచన్ను దాగి పొదలినాఁడు

యీతఁడా వసుదేవుని యింటలో నిధానము

చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు

||అత||

మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా

కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను

పాటించి పెంచే యశోదపాలి భాగ్య మీతఁడా

వాటమై గొల్లెతలను వలపించినాఁడు.

||అత||

ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా

జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను

మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితఁడా

తగి రామకృష్ణావతార మందె నిప్పుడు

||అత||

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

భావం / వివరణ

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు – అన్నమయ్య కీర్తనలు

లలిత

అవతారిక:

భావ వివరణ:

ఆహా! యేమిటీవింత!! అతడు (ఆదిదేవుడైన పరమాత్మ) ఇతడా (ఈ బాలుడా). వీడు వెన్నలనన్నింటినీ రేపల్లెలో దొంగిలించినాడు. ఏతులకు (ఉద్ధతితో) తమ పెరటిలో బహుకాలమునుంచివున్న రెండు మద్ది చెట్లను ఇల తోసినాడు (నేలపై పడతోసినాడు).

ఈతడు ఆ దేవకీదేవి గర్భవాసము నుండి జన్మించిన ఇంద్రనీల మాణిక్యము. మానవకాంతగా వచ్చిన పూతన అనే రాక్షసి చనుబ్రాలు తాగి పొదలినాడు (వర్ధిల్లినాడు). ఈతడు ఆ వసుదేవుని ఇంట వెలసిన నిధానము (పాతర వంటి నిధి). తన మేనమామయైన కంసుని చేతనే (ప్రాణాలతో) పుట్టచెండుసేసినాడు (బంతి ఆట ఆడుకొన్నాడు).

ఇవి కూడా చదవండి