మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విసప్తతితమః సర్గలో యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని సిధాశ్రమానికి తీసుకువెళతాడు. యజ్ఞం సమయంలో రాక్షసులు సుబాహు, మారీచు దాడి చేస్తారు. రాముడు సుబాహును వధించి, మారీచును దూరంగా తరిమేస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళతాడు.
|| గోదానమంగళమ్ ||
తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||
1
అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ |
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోఽస్తి కశ్చన ||
2
సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా |
రామలక్ష్మణయో రాజన్సీతా చోర్మిలయా సహ ||
3
వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ |
భ్రాతా యవీయాన్ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః ||
4
అస్య ధర్మాత్మనో రాజన్రూపేణాప్రతిమం భువి |
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే ||
5
భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః |
వరయేమ సుతే రాజంస్తయోరర్థే మహాత్మనోః ||
6
పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః |
లోకపాలోపమాః సర్వే దేవతుల్యపరాక్రమాః ||
7
ఉభయోరపి రాజేంద్ర సంబంధో హ్యనుబధ్యతామ్ |
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః ||
8
విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా |
జనకః ప్రాంజలిర్వాక్యమువాచ మునిపుంగవౌ ||
9
కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ |
సదృశం కులసంబంధం యదాజ్ఞాపయథః స్వయమ్ ||
10
ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే |
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ ||
11
ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే |
పాణీన్గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలాః ||
12
ఉత్తరే దివసే బ్రహ్మన్ఫల్గునీభ్యాం మనీషిణః |
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ||
13
ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః |
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ||
14
పరో ధర్మః కృతో మహ్యం శిష్యోఽస్మి భవతోః సదా |
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ ||
15
యథా దశరథస్యేయం తథాఽయోధ్యా పురీ మమ |
ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హథ ||
16
తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః |
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్ ||
17
యువామసంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ |
ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః ||
18
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్ |
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్ ||
19
తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా |
మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః ||
20
స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః |
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్ ||
21
గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః |
ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః ||
22
సువర్ణశృంగాః సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః |
గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః ||
23
విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునందనః |
దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః ||
24
స సుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||
25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విసప్తతితమః సర్గః ||
Balakanda Sarga 72 Meaning In Telugu
జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలా అన్నారు.
“ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది.
ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యుములు కలిగి ఉంటాయి.” అని పలికారు.
ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు.’ .” ఓ మునిశ్రేష్ఠులారా! మీ సంబంధములతో నేను నా
తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శ్రుతకీర్తి లను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నాతమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ నాలుగు వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను.
ఉత్తర ఫల్గునీ నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ నాలుగు వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి.” అని వినయంతో పలికాడు జనకుడు.
ఆమాటలు విన్న దశరథుడు ఇలాఅన్నాడు. “ఓ జనక మహారాజా! నీవు, నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు. ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనంద దాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళెదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింప జేస్తాను.” అని పలికాడు.
తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్లాడు. ఆరోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేసాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారులచేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు నాలుగులక్షల ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు.
(ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు)
శ్రీమద్రామాయణము
బాలకాండము, డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
బాలకాండ త్రిసప్తతితమః సర్గః (73) >>