Aranya Kanda Sarga 75 In Telugu – అరణ్యకాండ పంచసప్తతితమః సర్గః

అరణ్యకాండ పంచసప్తతితమః సర్గః అరణ్యకాండ లోని ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో వాసం ఉంటున్నారు. ఆ సమయంలో శూర్పణఖ రాముడిని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు తాను సీతకు అంకితమై ఉన్నానని, ఆమెకు తగినవాడు లక్ష్మణుడని చెప్పి, ఆమెను లక్ష్మణుడి వద్దకు పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరిస్తాడు. శూర్పణఖ తన అసలు రూపంలోకి మారి సీతను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. క్షణంలోనే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవిని కత్తితో కోసివేస్తాడు. శూర్పణఖ రక్తమోడుతూ లంకకు పారిపోతుంది.

పంపాదర్శనమ్

దివం తు తస్యాం యాతాయాం శబర్యాం స్వేన తేజసా |
లక్ష్మణేన సహ భ్రాత్రా చింతయామాస రాఘవః || ౧ ||

స చింతయిత్వా ధర్మాత్మా ప్రభావం తం మహాత్మనామ్ |
హితకారిణమేకాగ్రం లక్ష్మణం రాఘవోఽబ్రవీత్ || ౨ ||

దృష్టోఽయమాశ్రమః సౌమ్య బహ్వాశ్చర్యః కృతాత్మనామ్ |
విశ్వస్తమృగశార్దూలో నానావిహగసేవితః || ౩ ||

సప్తానాం చ సముద్రాణామేషు తీర్థేషు లక్ష్మణ |
ఉపస్పృష్టం చ విధివత్పితరశ్చాపి తర్పితాః || ౪ ||

ప్రనష్టమశుభం తత్తత్కల్యాణం సముపస్థితమ్ |
తేన తత్త్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి || ౫ ||

హృదయే హి నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి |
తదాగచ్ఛ గమిష్యావః పంపాం తాం ప్రియదర్శనామ్ || ౬ ||

ఋశ్యమూకో గిరిర్యత్ర నాతిదూరే ప్రకాశతే |
యస్మిన్ వసతి ధర్మాత్మా సుగ్రీవోఽంశుమతః సుతః || ౭ ||

నిత్యం వాలిభయాత్ త్రస్తశ్చతుర్భిః సహ వానరైః |
అభిత్వరే చ తం ద్రష్టుం సుగ్రీవం వానరర్షభమ్ || ౮ ||

తదధీనం హి మే సౌమ్య సీతాయాః పరిమార్గణమ్ |
ఏవం బ్రువాణం తం ధీరం రామం సౌమిత్రిరబ్రవీత్ || ౯ ||

గచ్ఛావస్త్వరితం తత్ర మమాపి త్వరతే మనః |
ఆశ్రమాత్తు తతస్తస్మాన్నిష్క్రమ్య స విశాం పతిః || ౧౦ ||

ఆజగామ తతః పంపాం లక్ష్మణేన సహప్రభుః |
స దదర్శ తతః పుణ్యాముదారజనసేవితామ్ || ౧౧ ||

నానాద్రుమలతాకీర్ణాం పంపాం పానీయవాహినీమ్ |
పద్మైః సౌగంధికైస్తామ్రాం శుక్లాం కుముదమండలైః || ౧౨ ||

నీలాం కువలయోద్ఘాటైర్బహువర్ణాం కుథామివ |
స తామాసాద్య వై రామౌ దూరాదుదకవాహినీమ్ || ౧౩ ||

మతంగసరసం నామ హ్రదం సమవగాహత |
అరవిందోత్పలవతీం పద్మసౌగంధికాయుతామ్ || ౧౪ ||

పుష్పితామ్రవణోపేతాం బర్హిణోద్ఘుష్టనాదితామ్ |
తిలకైర్బీజపూరైశ్చ ధవైః శుక్లద్రుమైస్తథా || ౧౫ ||

పుష్పితైః కరవీరైశ్చ పున్నాగైశ్చ సుపుష్పితైః |
మాలతీకుందగుల్మైశ్చ భాండీరైర్నిచులైస్తథా || ౧౬ ||

అశోకైః సప్తపర్ణైశ్చ కేతకైరతిముక్తకైః |
అన్యైశ్చ వివిధైర్వృక్షైః ప్రమదామివ భూషితామ్ || ౧౭ ||

సమీక్షమాణౌ పుష్పాఢ్యం సర్వతో విపులద్రుమమ్ |
కోయష్టికైశ్చార్జునకైః శతపత్త్రైశ్చ కీరకైః || ౧౮ ||

ఏతైశ్చాన్యైశ్చ విహగైర్నాదితం తు వనం మహత్ |
తతో జగ్మతురవ్యగ్రౌ రాఘవౌ సుసమాహితౌ || ౧౯ ||

తద్వనం చైవ సరసః పశ్యంతౌ శకునైర్యుతమ్ |
స దదర్శ తతః పంపాం శీతవారినిధిం శుభామ్ || ౨౦ ||

ప్రహృష్టనానాశకునాం పాదపైరుపశోభితామ్ |
స రామో వివిధాన్ వృక్షాన్ సరాంసి వివిధాని చ || ౨౧ ||

పశ్యన్ కామాభిసంతప్తో జగామ పరమం హ్రదమ్ |
పుష్పితోపవనోపేతాం సాలచంపకశోభితామ్ || ౨౨ ||

షట్పదౌఘసమావిష్టాం శ్రీమతీమతులప్రభామ్ |
[* రమ్యో పవనసంబాధారమ్య సంపీడితోదకమ్ | *]
స్ఫటికోపమతోయాఢ్యాం శ్లక్ష్ణవాలుకసంయుతామ్ || ౨౩ ||

స తాం దృష్ట్వా పునః పంపాం పద్మసౌగంధికైర్యుతామ్ |
ఇత్యువాచ తదా వాక్యం లక్ష్మణం సత్యవిక్రమః || ౨౪ ||

అస్యాస్తీరే తు పూర్వోక్తః పర్వతో ధాతుమండితః |
ఋశ్యమూక ఇతి ఖ్యాతః పుణ్యః పుష్పితపాదపః || ౨౫ ||

హరేరృక్షరజోనామ్నః పుత్రస్తస్య మహాత్మనః |
అధ్యాస్తే తం మహావీర్యః సుగ్రీవ ఇతి విశ్రుతః || ౨౬ ||

సుగ్రీవమభిగచ్ఛ త్వం వానరేంద్రం నరర్షభ |
ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్యవిక్రమమ్ || ౨౭ ||

రాజ్యభ్రష్టేన దీనేన తస్యామాసక్తచేతసా |
కథం మయా వినా శక్యం సీతాం లక్ష్మణ జీవితుమ్ || ౨౮ ||

ఇత్యేవముక్త్వా మదనాభిపిడితః
స లక్ష్మణం వాక్యమనన్యచేతసమ్ |
వివేశ పంపాం నలీనీం మనోహరాం
రఘూత్తమః శోకవిషాదయంత్రితః || ౨౯ ||

తతో మహద్వర్త్మ సుదూరసంక్రమః
క్రమేణ గత్వా ప్రతికూలధన్వనమ్ |
దదర్శ పంపాం శుభదర్శకాననా-
-మనేకనానావిధపక్షిజాలకామ్ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః || ౭౫ ||

Aranya Kanda Sarga 75 Meaning In Telugu

శబరి తన భౌతిక శరీరమును విడిచి ఉత్తమలోకములు పొందిన తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! మనము ఆశ్చర్యకరమైన ఈ వనమును చూచినాము. ఏడు సముద్రములు కలిసిన ఈ తీర్థములలో స్నానము చేసాము. మన పితరులకు జలతర్పణములు విడిచాము. మనకు ఉన్న అశుభములు అన్నీ తొలగిపోయాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు పంపాసరస్సు దగ్గర ఉన్న ఋష్యమూక పర్వతమునకు పోవుదము. వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలెనని అతనితో మైత్రిచేసుకొనవలెనని నాకు చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమము సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది” అని అన్నాడురాముడు.

“అలాగే అన్నయ్యా! మనము తొందరగా ఋష్యమూక పర్వతము వద్దకు పోవుదము.” అని అన్నాడు లక్ష్మణుడు. తరువాత రామలక్ష్మణులు పంపాసరోవరతీరమునకు చేరుకున్నారు. ఆ పంపాసరోవరము చాలా మనోహరంగా ఉంది. ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి. ఆ సరోవరము పక్కనే ఉన్న మతంగ సరస్సు లో రాముడు స్నానం చేసాడు. తరువాత రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు. దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతమును చూచారు.

“లక్ష్మణా! అదే ఋష్యమూక పర్వతము దాని మీదనే ఋక్షరజస్సు అనే వానరుని కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. లక్ష్మణా! నీవు సుగ్రీవుని వద్దకు పోయి మన రాక గురించి చెప్పు. నీకు తెలుసు కదా! నేను రాజ్యమును, నా భార్య సీతను పోగొట్టుకొని అపారమైన దుఃఖములో ఉన్నాను. నీవు వెళ్లి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదిఐదవ సర్గ సంపూర్ణము.
అరణ్యకాండ సర్వం సంపూర్ణం.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Leave a Comment