మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నారాయణోపనిషత్తు గురించి తెలుసుకుందాం.
నారాయణోపనిషత్తు
ఓం అథపురుషో వై నారాయణో కామయత, ప్రజాః సృజేయేతి, నారాయణా త్రాణో జాయతే, మన స్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రావః పృధివీ విశ్వస్య ధారిణీ, నారాయణా ద్రహ్మాజాయతే, నారాయణాద్రుద్రో జాయతే, నారాయణా దింద్రో జాయతే, నారాయణా త్ప్రజాపతిః ప్రజాయతే, నారాయణా ద్వాదశాదిత్యా రుద్రా వసవ స్సర్వాణి ఛందాంసి, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణా త్ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే, ఏత దృగ్వేదశిరో ధీతే.
సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు పరమేశ్వరుడైన నారాయణు డొక్కడే.’ అతడు సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు నారాయణు
ని శరీరం నుంచి సూక్ష్మరూపి అయిన హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆ తరువాత ఆకాశాది పంచ భూతాలు పుట్టినాయి. ఈ రకంగా నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు, ఏక దశ రుద్రులు, ద్వాద శాదిత్యులు, అష్ట వసువులు, సకల వేదాలు, ఉద్భవించాయి. ఒకటేమిటి చరా చర జగత్తంతా నారాయణుని నుంచే పుట్టింది. ఇవన్నీ అసలు నారాయణుని లోనే ఉన్నాయి. చివరకు నారాయణుని యందే లయమవు తున్నాయి. ఈ తత్వము ఋగ్వేదంలో చెప్పబడింది.
అథ నిత్యో నారాయణః, బ్రహ్మానారాయణ, శివశ్చ నారాయణః, శక్రశ్చ నారా యణః, ద్యావాపృధివ్యౌ చ నారాయణ: కాలళ్ళ నారాయణః, దివశ్చ నారాయణః ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేద సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః, న ద్వితీయో…స్తి కృశ్చిత్, య ఏవం వేద స విష్ణు రేవ భవతి స విష్ణురేవ భవతి, ఏత ద్యజుర్వేద శిరో ధీతే.
నారాయణుడే సత్యము, నిత్యము అయిన వాడు. నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే శివుడు, అతడే ఇంద్రుడు, భూమి, ఆకాశము, కాలము, ధశ దిశలు అంతా నారాయణుడే. ఊర్ధ్వ భాగాన ఉన్నది నారాయణుడే, అధో భాగాన ఉన్నది – నారాయణుడే, మధ్య భాగాన ఉన్నది నారాయణుడే, బాహ్యాంభ్యంత రములందంతటా ఉన్నది నారాయణుడే, భూత భవిష్యద్వర్తమానాలు నారా యణుడే. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వి కల్పుడు, పరిశుద్ధమైన వాడు, అద్వితీయుడు. అతన్ని వాక్కులతో నిర్వచించ లేము. నారాయణుడు తప్ప వేరెవ్వరూ లేరు. ఈ విషయం గ్రహించినవాడు కూడా నారాయణుడే అవుతాడు. ఈ విషయము యజుర్వేదంలో చెప్పబడింది.
ఓమి త్యగ్రే వ్యాహరేత్, నమ ఇతిపశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్, ఓమిత్యేకాక్షరమ్ నమఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాణి, ఏతద్వై నారాయణస్యాష్టా క్షరం పదమ్, యోహవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి, అనపబ్రు వస్సర్వ మాయు రేతి, విందతే ప్రాజాపత్యమ్, రాయస్పోషం గౌపత్యమ్, తతో.. మృతత్వ మశ్నుతే తతో. మృతత్వమశ్నుత ఇతి, ఏత త్సామవేద శిరో.. ధీతే.
ముందుగా ‘ఓం’ అనాలి. తరువాత ‘నమో’ అనాలి. ఆ తరువాత ‘నారాయణాయ’ అని చెప్పాలి. ఓం నమో నారాయణాయ అనేది ఎనిమి అక్షరాలు గల అష్టాక్షరీ మహామంత్రం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించిచేవాడు పూర్ణా యుష్కుడవుతాడు. ధనధాన్యలు పొందుతాడు. స్వర్గాన్ని పొందుతాడు. బ్రహ్మ పదవి పొందుతాడు. చివరకు అమృతత్వాన్ని కూడా పొందుతాడు అని సామవేదం లో చెప్పబడింది.
ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్, అకార ఉకారో మకార ఇతి, తానే కథా సమభవ తదేత దోమితి య ముక్త్వా ముచ్యతే యోగి జన్మసంసారబంధనాత్, ఓం నమోనారాయణాయేతి మంత్రోపాసకః, వైకుంఠభవనం గమిష్యతి, తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్తటిదాభమాత్రమ్, బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూధన ఇతి, సర్వభూతస్థ మేకం పై నారాయణం కారణపురుష మకారణం పరంబ్రహ్మోమ్, ఏతదధర్వశిరో ఒధీతే.
అకార, ఉకార, మకారములు కలిసి ‘ఓం’ అనే ప్రణవము అవుతున్నది. ఈ ప్రణవానికి అర్థం – ప్రత్యగాత్మ. ఓంకారాన్ని అర్థయుక్తంగా జపించేవాడు. జనన మరణాది సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. అష్టాక్షరీ మంత్రో పాసనచేసినవాడు వైకుంఠము చేరతాడు.
సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ హృదయ పద్మంలో ప్రకాశిస్తుంటాడు. పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు దేవకీ పుత్రుడు, మధుసూదనుడు. జీవ కోటి యందంతటా అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. అతడు సర్వవ్యాపి, ఈ జగత్తుకు కారణభూతుడు. తనకు వేరొక కారణము లేనివాడు. ఈ విషయము అధర్వ వేదంలో చెప్పబడింది.
ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి, సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి, తత్సాయంప్రాతరధీయానః అపావో భవతి, మాధ్యందిన మాది త్యాభి ముఖి. ఖో ధీయానః పంచమహాపాతకో 2 సపాతకా త్ప్రముచ్యతే, సర్వవే దపారాయణపుణ్యం లభతే, నారాయణసాయుజ్య మవాప్నోతి, శ్రీమన్నారాయణ సాయుజ్య మవాప్నోతి, య ఏవం వేద, ఇత్యుపనిషత్.
ఈ ఉపనిషత్తును ఉదయం పూట పారాయణ చేస్తే రాత్రి చేసిన పాపం నశించి పోతుంది. సాయంత్రం పారాయణ చేస్తే పగలు చేసిన పాపం నశిస్తుంది. మధ్యాహ్న కాలంలో సూర్యుని ఎదురుగా కూర్చుని ఈ ఉపనిషత్తు పారాయణ చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి.
నారాయణోపనిషత్తును పారాయణ చేస్తే నాలుగు వేదాలు పారాయణ చేసిన ఫలితము దక్కుతుంది. అంత్యకాలంలో నారాయణుని సాయుజ్యం లభిస్తుంది. ఈ రకంగా దీన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా సాయుజ్యం పొందుతాడు.
ఓం తత్ సత్
మరిన్ని పండుగలు: