Satyanarayana Vrata 5th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 5th Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – పంచమోధ్యాయః

మునులారా! మీకు మరియొక కథ వినిపించెదను. వినుడు. పూర్వము తుంగద్వజుడను రాజుండెను. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుచు ధర్మముగా పాలించుచుండెను. ఒకప్పుడాతడు వేటకు వెళ్ళి అనేక మృగములను జంపి, అలసి ఒక మారేడు చెట్టు క్రింద విశ్రాంతికై ఆగి, ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి కూడ ఆ సమీపమునకు వెళ్ళక తాను రాజునను గర్వముతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యము చేసెను. వ్రతము పూర్తైన తరువాత ఆ గోపాలురు ప్రసాదము దెచ్చి రాజు నెదుట ఉంచి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడ ప్రసాదమును స్వీకరించిరి. రాజు అహంకారముతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళిపోయెను. అందువల్ల రాజునకు నూరుమంది కొడుకులును, ధనధాన్యములను, ఐశ్వర్యములను నశించి చాల దుఃఖములు కలిగెను. సత్యదేవుని ప్రసాదమును తిరస్కరించి వచ్చినాను గనుక, ఆయన కోపము వల్లనే నాకీ యనర్ధము కలిగినది. ఆ గొల్లలు సత్యదేవుని పూజించినచోటుకే మరల వెళ్ళి నేనును ఆ దేవునారాధించెదను. అని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలురు ఉన్నచోటు వెదుకుకొనుచు వెళ్ళెను. రాజు గోపాలురును జూచి మీరు జేసిన వ్రతమేదో చెప్పుడని యడిగి, వారితో గలసి భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చెసెను. సత్యదేవుని అనుగ్రహము వలన మరల ధనదాన్యాధిక సంపదలను పుత్రులను పొంది రాజ్య సుఖములనుభవించి, చివరకు సత్యలోకమును బొందెను. పరమోత్తమమైన యీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారును, ఎవరైనా చేయచుండ చూచువరైనను, కథను విన్నవరైనను, సత్యనారాయణ స్వామి యనుగ్రహము వలన ధనధాన్యాది సంపదలను, పుత్రపౌత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వసౌఖ్యాలను అనుభవించి పరమున మోక్షము నొందుదురు. ఈ వ్రతమును భక్తిశ్రద్దలతో చేసినచో, దరిద్రుడు దనవంతుడగును. బందింపబడినవాడు విముక్తుడగును. బయటి శత్రువుల వలనగాని, అంతశ్శత్రువులైన కామక్రోధాధుల వలన గాని, జనన మరణరూపమైన సంసారము వలన గాని, భయమందినవాడు ఆ భయమునుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నియు లభించుటచే ఆనందించి, చివరకు సత్యలోకమునకు చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా మానవులను సర్వదుఃఖములనుండియు విముక్తులను జేయగల్గిన ప్రభావముగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, ఆచరించి ఫలమును బొందినవారి కథలను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగములో, సమస్త దుఃఖములు తొలుగుటకును, సర్వసౌఖ్యములు కలుగుటకును, తుదకు మోక్షము నిచ్చుటకును ఈ సత్యనారాయణ వ్రతమును మించినది ఏదియు లేదు. కలియుగమున కొందరు దేవుని సత్యమూర్తియనియు, కొందరు సితేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచెదరు. ఎవ్వరే పేరుతో బిలిచినను పలికెడి దయామయుడైన ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చెడివాడై కలియుగమున వ్రతరూపుడై ప్రకాశించుచుండును. వ్రతము చేయుచున్నప్పుడు చూచినను, వ్రతకథను విన్నను, సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన సర్వపాపములును నశించును.

తి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే పంచమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము సమాప్తము.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Satyanarayana Vrata 4th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Satyanarayana Vrata 4th Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – చతుర్థోధ్యాయః –

తరువాత సాధువు శుభశకునములు చూచి, విప్రులకు దానధర్మములు చేసి ప్రయాణం సాగించెను. సాదువు కొంతదూరము ప్రయాణించెను. సత్యదేవునికి సాధువును పరీక్షించు కోరిక గలిగి, సన్యాసి వేషముతో వచ్చి సాధూ! నీ పడవలలో నున్నదేమి? అని యడిగెను. ఆ వైశ్యులు ధనమదముగలవారై, అడిగిన ఆ సన్యాసిని జూచి, పరిహసించి, ఇందులో నున్నదేమైన అపహరించుటకు చూచుచున్నావా? ఇందులో మాత్రమేమున్నది? ఆకులు తీగలు తప్ప? అని చెప్పిరి. సన్యాసి రూపుడైన ఆ దేవుడతని మాటలు విని ‘తథాస్తు’ అని పలికి కొంతదూరములో నది యొడ్డుననే నిలుచుండెను. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలు ఆకులలములతో నిండియుండుట చూచి ఆశ్చర్య పడి, దుఃఖముతో మూర్చపోయెను.తెలివి వచ్చిన తరువాత ధనములు అట్లయినందుకు చాల విచారించెను. అప్పుడల్లుడు సాదువును జూచి, మహాత్ముడైన సన్యాసిని పరిహసించినాము. అతడు కోపముతో శపించి పోయినాడు. ఆయనయే మరల మనలను రక్షింపగలడు. ఆయనను శరణు వేడినచో మన కోరికలు తీరును అని చెప్పెను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు బోయి భక్తితో నమస్కరించి వినయవిధేయతలతో ఇట్లనెను. స్వామీ ! అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము. అని పదే పదే మ్రొక్కుచు ఏడ్చెను. గోలున ఏడ్చుచున్న సాదువును జూచి స్వామి, ఏడువవద్దు. నీవు నా పూజ చేయుదునని ప్రతిజ్ఞ చేసి, అశ్రద్ధ చేత మరచినావు. దుష్టబుద్దీ! నా శాపము చేత నీ కీ కష్టాలు కలుగుచున్నవని యిప్పటికైనా గ్రహించితివా? అనెను. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, ఓ పుండరిక నేత్రా ! బ్రహ్మాదిదేవతలే నీ మాయను దాటలేక సతమతమగుచున్నారు. నీ గుణములను రూపమును తెలిసికొనలేకున్నారు. మానవమాత్రుడను, అజ్ఞానిని. ఆపైన, అనీ మాయలో చిక్కుకొని, నీ అనుగ్రహమునకు దూరమైనవాడను. నిన్ను నేనెట్లు తెలిసికొనగలను? నా యపరాధమును క్షమింపుము. నిన్నెప్పుడును మరువక నా శక్తి కొలది నిన్ను పుజించెదను. శరణాగతుడైన నన్ను అనుగ్రహించి, నాధనములు నాకిచ్చి రక్షింపుము. అని ప్రార్థించెను. భక్తితో సాధువు చేసిన స్తోత్రమునుకు స్వామి సంతోషించి అతడు కోరిన వరమిచ్చి అక్కడనే అదృశ్యుడయ్యెను. సాదువు నావ దగ్గరకు వచ్చి అది ధనములతోను , వస్తువులతోను నిండి యుండుట చూచి, సత్యదేవుని దయవలన నా కొరిక తిరనదనుచు, పరివారముతో గలసి స్వామిని పూజించి తన నగరమునకు ప్రయాణము సాగించెను.

సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచున్న అల్లుని జూచి, అల్లుడా ! చూచితివా? రత్నపురమునకు జేరినాము. అనుచు తమ రాకను తెలియజేయుటకై ఇంటికొక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు బోయి సాధువు భార్యను జూచి నమస్క రించి, ‘అమ్మా! మన షావుకారుగారు అల్లునితోను, బందుమిత్రులతోను మన నగరమునకు వచ్చినారని’ చెప్పెను. దూత చెప్పినమాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతమును త్వరగా పూర్తిచేసి కుమార్తె తో ఇట్లనెను. నేను వెళ్ళుచున్నాను. నీవు కూడ త్వరగా నీతండ్రిని, భర్తను జూచుటకు రమ్ము. అనగా, తల్లిమాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుట మరచి భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్ళలో ముంచివేసెను. తీరమందున్న జనులందురును పరమదుఃఖముతోనున్న కళావతిని జూచి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగిపోయినందుకు ఆశ్చర్యమును గూడ పొందిరి. కళావతి దుఃఖితురాలైన కుమార్తెను జూచి దుఃఖించుచు భర్తతో ఇట్లనెను. మన అల్లుడు పడవతో ఇట్లేల మునిగిపోయినాడు? ఇది ఏ దేవుని మాయవల్ల జరిగినది ? అని పలుకుచు కుమార్తెను ఒడిలోనికి దీసుకొని దుఃఖించెను కళావతీ తన భర్త అట్లు మునిగిపోయినందుకు విచారించుచు, అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్దపడెను. తన కుమార్తె అవస్థ జూచి సాధువు చాల విచారించెను. అక్కడివారు కూడా బాదపడిరి. అప్పుడు సాధువు ‘ఇది యంతయు సత్యదేవుని మాయయై యుండును. స్వామి నన్ననుగ్రహించినచో నా వైభవము కొలది సత్యదేవ వ్రతము చేసెదనని చెప్పుచు ఆ దేవునికి అనేక సాష్టాంగనమస్కారములు చేసెను. సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ‘ఇట్లు చెప్పెను. ఓ సాధూ ! నీ కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చుకొనకుండ భర్తను జూచుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరల జీవించును. ఆకాశమునుండి వినవచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని త్వరగా తిరిగివచ్చి నీటిపై తేలుచున్న పడవలోని భర్తను జూచి సంతోషపడెను. అప్పుడామె తండ్రితో, తండ్రీ ! మన యింటికి పోవుదుము. ఇంక ఆలస్యమెందుకు ? అనెను. కుమార్తె మాటలు విని సాదువు సంతోషపడి,తన వారందరితో గలసి ఆ నదీతీరమునందే సత్యనారాయణ వ్రతము చేసి, తరువాత తన యింటికి చేరెను. ప్రతి పూర్ణిమనాడును ప్రతి సూర్య సంక్రమణనాడును సత్యనారాయణ వ్రతము యధావిధిగా చేయుచు ఆ సాధువు ఇహలోకమున సమస్త్రైశ్వర్యములు అనుభవించి చివరికి సత్యదేవుని సన్నిదానము చేరెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే చతుర్థోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం

Satyanarayana Vrata 3rd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయోధ్యాయః 

మరల సూతుడిట్లు చెప్పసాగెను. మునులారా ! ఇంకొక కథను జెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజుండెను. అతడు సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు బోయి దైవదర్శనము చేసి, బ్రాహ్మణులుకు ధనమును ఇచ్చెడివాడు. అతని భార్య సౌందర్యవతి, సాధ్వి. ఆమెతో గలిసి రాజొకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతమాచరించెను. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు, అనేక వస్తువులతోను, ధనముతోను నిండిన నావను ఒడ్డున నిల్పి, వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగెను. ఓ మహారాజా ! ఇంత భక్తిశ్రద్ధలతో మీరు చేయుచున్న యీ వ్రతమేమి? దయచేసి నాకు వివరింపుడు. వినవలెననియున్నది. సాధువిట్లడగగా ఆ రాజు, ‘ఓ సాధూ ! పుత్రసంతానము కావలెనను కోరికతో నేను మా బందుమిత్రులను బిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను, అని చెప్పెను. రాజు మాటలు విని సాధువు, మహారాజా ! నాకును సంతానము లేదు. ఈ వ్రతము వలన సంతానము కలుగుచున్నచో నేనును దీని నాచరించెద ననెను. తరువాత సాధువు వర్తకము పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సంతానప్రదమైన యీ సత్యదేవుని గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినచో ఆ వ్రతము చేసెదనని పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మప్రవృత్తి గలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతియై సత్యదేవుని అనుగ్రహమువలన పదవ నెలలో ఒక బాలికను గనెను. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుచుండగా తల్లిదండ్రులామెకు కళావతి అని పేరు పెట్టిరి. ఆ సమయములో లీలావతి భర్తను జూచి, సంతానము గలిగినచో వ్రతము చేయుదమంటిరిగదా ! పుత్రిక కలిగినది కదా! ఇంకను వ్రతము మాట తలపెట్టరేమి? అని అడిగెను. అందుకు భర్త, లీలావతీ ! మన అమ్మాయి వివాహములో వ్రతము తప్పక చేయుదును. అని యామెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు బోయెను. కళావతి తండ్రి యింటిలో పెరుగుచుండెను.

అట్లు యుక్తవయసు వచ్చిన కుమార్తెను జూచి సాధువు తన మిత్రులతో ఆలోచించి, వరుని వెదుకుటకై దూతను పంపెను. వర్తకునిచే పంపబడిన ఆ దూత కాంచనగరమునకు బోయి, అక్కడ యొగ్యుడైన వైశ్యబాలకుని జూచి పెండ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యబాలును జూచి సాధువు తన కుమార్తె నిచ్చి పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి వేడుకలలో బడి సత్యదేవుని వ్రతము సంగతి మరిచిపోయెను. అందుచే ఆ స్వామి చాలా కోపించెను. తరువాత కొంతకాలమునకు వ్యాపారమునందు దక్షతగల ఆ సాధువు అల్లునితో గలిసి వాణిజ్యమునకై బయలుదేరెను. అతడు నౌకలలో సముద్రతీరమున నున్న రత్నసానుపురమును జేరుకొని అక్కడ అల్లునితో గూడి వ్యాపారము సాగించుచుండెను. తరువాత వ్యాపారమునకై వారిద్దరును చంద్రకేతు మహారాజు నగరమునకు బోయిరి. అంతటి, వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసి మరచి పోయిన ఆ సాధువును జూచి, స్వామి కోపించి, దారుణము, కఠినము అయిన మహాదుఃఖ మతనికి కలుగుగాక యని శపించెను.

ఆనాడే రాజ దనాగారములో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకొని పారిపోవుచుండెను. రాజభటులు తరుముచుండగా వాడీ వర్తకులున్నవైపు పరుగెత్తెను. ఆ దొంగ, తన్ను తరుముకొని వచ్చుచున్న రాజభటులను జూచి భయపడి దనమును వర్తకులముందు గుమ్మరించి పారిపోయెను. రాజభటులక్కడికి వచ్చి, రాజదనముతో ఎదుట కనబడుచున్న ఆ వర్తకులను బందించి రాజునొద్దకు తీసుకొనిపోయిరి. ఆ భటులు సంతోషముతో వీరిని దీసుకొనిపోయి, మహారాజా ! ఇద్దరు దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ చేయనక్కరలేదనచు, కారాగారమున బందింపుడనెను. వారు వర్తకులను కారాగృహమున బందించిరి. సత్యదేవుని మాయచేత వర్తకులెంత మొరపెట్టుకున్నను వారి మాటలెవ్వరును పట్టించుకొనలేదు. రాజు వారి ధనమును తన ధనాగారమున చేర్పించెను.

ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడ కష్టాలపాలయ్యెను. ఇంటిలోని ధనమునంతను దొంగ లపహరించిరి. లీలావతి మనోవ్యథచే రొగగ్రస్తురాలయ్యెను. తినుటకు తిండి దొరకక ఇంటికి దిరిగి బిచ్చమెత్తుకొనసాగెను. కుమార్తెయైన కళావతి కూడ బిచ్చమెత్తుటకు పోసాగెను. ఒకనాడు సాయంకాలం వేళ, కళావతి ఒక బ్రాహ్మణునింటికి మాధవకబళమునకు బోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి, కథయంతయు విని, తమకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకొనెను. స్వామి ప్రసాదమును గూడ పుచ్చుకొని కళావతి, రాత్రి ప్రొద్దు పోయి యింటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లనెను. అమ్మాయీ ! ఇంత రాత్రి వరకు ఎక్కడనుంటివి? నీ మనస్సులో ఏమున్నది? అని యడిగెను. వెంటనే కళావతి, అమ్మా! నేనొక బ్రాహ్మణుని యింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచుచు ఉండిపోయితిని. ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చునట గదా ! అనెను. ఆ మాటవిని సాధుభార్య, తామా వ్రతము చేయకపోవుటచేతనే ఇట్టి దురవస్థ కలిగినదని గ్రహించి, వ్రతము చేయుటకు సంకల్పించి, ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వ్రతాంతమునందు, స్వామీ !
నా భర్తయును అల్లుడును సుఖముగా తిరిగి యింటికి చేరునట్లు అనుగ్రహింపుము. వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించెను. లీలావతి చెసిన యా వ్రతముచే సంతోషించబడిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనమును వారికిచ్చి పంపుము. లేనిచో నిన్ను సమూలముగా నాశనము చేసెదనని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు ఉదయమున రాజు సభలో తనకు వచ్చిన కలను చెప్పి, ఆ వర్తకులను చెరసాలనుండి విడిపించి తెండని భటుల కాజ్ఞాపించగా వారట్లే ఆ వైశ్యులను సభలోనికి దెచ్చి రాజా ! వైశ్యులిద్దరిని తెచ్చినామని విన్నవించిరి.

ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజుకు నమస్కరించి వెనుకటి సంగతులు తలచుకొనుచు ఏమియు పలుకలేక నిలుచుచుండిరి. రాజప్పుడా వైశ్యులను జూచి ఆదరముతో, వర్తకులారా ! మీకీ కష్టము దైవ వశమున కలిగినది. ఇప్పుడా భయములేదని ఓదార్చి, వారి సంకెళ్ళను తీయించి క్షౌరము మున్నగు అలంకారములు జేయించెను. (మండనం ముండనం పుంసాం = పురుషులకు క్షౌరము అలంకారము.) వస్త్రాద్యలంకారములనిచ్చి, మంచి మాటలతో వారిని సంతోషపరచవలెను. ఇది వరకు వారివద్దనుండి తీసికొన్న ద్రవ్యమును రెట్టింపు ద్రవ్యమిచ్చి, ‘ఓ సాదూ! ఇంక మీ యింటికేగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలు దేరిరి’.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే తృతీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం

Satyanarayana Vrata 2nd Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – ద్వితీయోధ్యాయః

శ్లో // అధాన్యత్సంప్రవక్ష్యామి కృతం యేన పురాద్విజాః,
కశ్చిత్కాశీపురేమ్యేహ్యా సీద్విప్రోతి నిర్ధనః
క్షుత్తృ డ్భ్యాం వ్యాకులో భూత్వా నిత్యాంబభ్రామ్ భూతలే //

సూతుడు మరల ఇలా చెప్పుచున్నాడు. మునులారా ! పూర్వమీ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను వినుడు. కాశీనగరమున అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్యము ఆకలిదప్పులతో అలమటించుచు తిరుగుచుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి, దుఃఖపడుచున్న బ్రాహ్మణుని జూచి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము దరించి వచ్చి, ‘ఓ విప్రుడా ! ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేమి? నీ కథనంతను జెప్పుము. వినవలెనని యున్నది’ అనెను. విప్రుడిట్లు చెప్పెను. ఓ మహానుభావా ! నేనొక బ్రాహ్మణుడను. అతి దరిద్రుడను. బిక్ష కొరకు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు యమ నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్ధించెను.

అంత వృద్ధబ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడా ! సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది. అది చేసినవారికి సర్వదుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతము చేయు మనుచు దాని విధానమును భోధించి అంతర్థానము చెందెను. ఆ బ్రాహ్మణుడు, రేపే నేనా వృద్ధబ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసెదనని సంకల్పించి, దానినే తలచుకొనుచు రాత్రి నిద్దురగూడ పోలేదు. అతడు ప్రొద్దున్నే లేచి, ఈ రోజున సత్యదేవుని వ్రతము చేసెదనని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరెను. ఆ రోజున స్వామి దయవలన అతనికి చాల ద్రవ్యము లభించెను. బంధువులను గూడ పిలిచి, దానితో అతడు సత్యనారాయణ వ్రతము చేసెను. ఆ వ్రతము యొక్క ప్రభావము చేత అతడు దారిద్ర్యము మున్నగు సర్వ దుఃఖములనుండి విముక్తుడై, సమస్త సంపదలతో తులతూగెను. అది మొదలుగా అతడు ప్రతిమాసమునందు ఈ వ్రతమును ఆచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షము నొందెను. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో, అతని సర్వదుఃఖములును నశించును. సూతుడు, మునులారా ! మీరడిగిన కథ చెప్పినాను. ఇంకేమి చెప్పమందురు ? అని యడిగెను. శౌనకాది ఋషులు, మహాత్మా ! ఆ బ్రాహ్మణుని వలన తెలిసికొని యెవ్వడీ వ్రతమాచరించెనో చెప్పుము. మాకు వినవలెనని యున్నది అని యడిగిరి. సూతుడిట్లు చెప్పనారంబించెను. మునులారా! ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవము కొలది బందువులను బిలిచికొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడి కొక కట్టెలమ్ము కొనువాడువచ్చి కట్టెల మోపు బయట దింపి విప్రుని ఇంటికి వచ్చెను.

అతడు చాల దప్పిక గలవాడై యుండియు ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూచి, తుదకు ఆయనకును దేవునుకును నమస్కరించి, మహానుభావా ! నీవు చేసిన పూజయేమి? దీనివలన కలుగు ఫలమేమి ? వివరముగా జెప్పమని యడిగెను. బ్రాహ్మణుడిట్లు చెప్పెను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధనధాన్యములు, సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును గూర్చి తెలుసుకొని మంచి నీరు త్రాగి, ప్రసాదమును స్వీకరించి తన యూరికి బోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెల మోపును రేపు అమ్మెదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని వ్రతము చేసెదను, అనుకొని మరనాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరములో ధనికులుండు ఇండ్లవైపు వెళ్ళెను. అతడానాడు స్వామి యనుగ్రహముచే కట్టెలమ్మి రెట్టింపు లాభము నొందెను. దానికి సంతోషించి, అరటిపండ్లు, పంచదార, ఆవునేయి, ఆవు పాలు, శేరుంబావు గోధుమనూక, పూజాద్రవ్యములు అన్నియు దీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి, బందువులునందరిని బిలిచి సత్యదేవుని వ్రతమును యథాశక్తిగా చేసెను. ఆ వ్రతము చేసిన ప్రభావముచే అతడు ధనములతోను, పుత్రులతోను సర్వసమృద్ధిగలవాడై యీ లోకమున సౌఖ్యములననుభవించి చివరికి సత్యలోకమును పొందెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Satyanarayana Swamy Vrata Katha First Part In Telugu – వ్రత కథ ప్రథమ అధ్యాయం

Satyanarayana Vrata 1st Story In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

సత్యనారాయణ వ్రత కథ – ప్రథమోధ్యాయః

శ్లో//ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే //

శ్రీమంతమైన నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు, తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్తయైన సూతునికి మర్యాదలు చేసి, యిట్లడిగిరి. పౌరాణిక శేఖరా ! మానవులు కోటిన ఇహలోక, పరలోకములందలి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును ? ఏ తపము చేసిన లభించును ? అదంతయు మాకు చెప్పుము. అని కోరగా సూతుడిట్లనెను. మునులారా ! మీరడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీమన్నారాయణు నడిగెను.ఆయన నారదునకు చెప్పిన దానినే మీకు చెప్పెదను, వినుడు.ఒకానొకప్పుడు నారదమహాముని లోకములను అనుగ్రహించు కోరిక గలవాడై వివిధ లోకములు దిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ, తాము చేసిన కర్మములచే నానాదుఃఖములనుభవించుచు, అనేక జన్మములెత్తుచున్న జనములనుజూచి, ఏ యపాయముచే వీరి దుఃఖములు తొలగు నని చింతించి, సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెడలను. అక్కడ, తెల్లని శరీరకాంతి గలవాడును, నాలుగు భుజములు ప్రథమ అధ్యాయం గలవాడును, శంఖము – చక్రము – గద – పద్మము వనమాల వీనిచే అలంకరింపబడినవాడును అగు శ్రీమన్నారయణుని జూచి స్తుతించుట ఆరంభించెను. “మాటలకును మనస్సునకును అందని రూపముగలవాడవును, సృష్టి స్థితి లయములు చేయు అనంతశక్తి గలవాడవును, పుట్టుట – పెరుగుట – నశించుట లేనివాడవును, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడవే అయినను సృష్టి వ్యవహారములో త్రిగుణములు గలవాడవును, అన్నింటికి మొదటివాడవును, భక్తుల బాధలు తీర్చువాడవును అగు నీకు నమస్కారము” నారదుని యీ స్తోత్రమును విని విష్ణువు నారదమునీ తో నిట్లనెను. నారదమునీ ! నీవిక్కడి కేల వచ్చితివి? నీ మన్సులో నేమి కోరిక యున్నది? చెప్పుము. నీవడిగిన వన్నియు వివరింతును. అని నారదుడిట్లనెను. స్వామీ ! భూలోకమున జనులందరును చాల దుఃఖము లనుభవించున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు.అనేక పాపములు చేసి ఆ పాప ఫలములనుభవించుచున్నారు. తేలికయైన ఉపాయము చేత వారి పాపములన్నియు నశించు మార్గమును దయచేసి ఉపదేశింపుము. అని అడుగగా భగవానుడిట్లనెను, నారదా! లోకములోనివారు సుఖపడవలెనను మంచిబుద్ధితో నీవడిగిన విషయము చాల బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభోపాయమును జెప్పెదను, వినుము.

భూలోకమందును, స్వర్గలోకమందును గూడ దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రత మొక్కటి కలదు. నీయందలి వాత్సల్యము చే చెప్పుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానముగా ఆచరించినవాడు ఈ లోకమున సమస్త సౌఖ్యముల ననుభవించి ఆపైన ముక్తి నొందును. అని చెప్పగా స్వామీ ! ఆ వ్రతవిదానమేమి? ఆ వ్రత మట్లు చేసినచో ఫలమేమి? పూర్వ మెవ్వరైన చేసి ఫలము నొందినారా? ఆ వ్రతమెప్పుడు చెయవలెను? ఇవ్వన్నియు వివరముగా జెప్పుమని యడిగెను. భగవానుడిట్లు చెప్పెను. వ్రతవిష్టత ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. ఈవ్రతము ఏప్పుడు చేయాలిమాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను. .ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను. బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్దలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోను బంధువులతోను గూడి వ్రతము చేయవలెను. అరటిపండ్లు, ఆవునేయి, ఆవుపాలు, శేరంబావు గోధుమనూక, గోధుమనూక లేనిచో వరినూక, పంచదార వీనినన్నిటిని కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను.

బంధువులతో గూడి సత్యనారాయణ వ్రతకథను విని, బ్రాహ్మణులకు దక్షిణతాంబూలములిచ్చి, వారికిని బంధువులకును భోజనములు పెట్టి స్వామి ప్రసాదమును స్వీకరించి, స్వామికి నృత్యగీతాది మహారాజోపచారములర్పించి తానును భుజింపవలెను. నదీతీరమున ఇట్లు వ్రతము చేసి, స్వామిని స్మరించుచు స్వగృహమునకు చేరవలెను.

ఇట్లు సాంగముగ భక్తి శ్రద్ధలతో వ్రతము చేసినవారికి కోరినవి సిద్ధించును. విశేషించి, కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదియే సులభమైన ఉపాయము. దీనిని మించినదేదియు లేదు. అని శ్రీమన్నారయణుడు, నారదున కుపదేశించెనని సూతుడు శౌనకాది మహామునులకు జెప్పెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Vinayaka Chavithi Vratha Katha In Telugu – వినాయక చవితి వ్రత క‌థ‌

Vinayaka Chavithi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. హిందువులు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పుడు, విఘ్నాలు లేకుండా, ఆటంకాల లేకుండా జరగాలని వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక చవితి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Pooja Lo Chadavalsina Vrata Katha

వినాయకోత్పత్తి

Vinayaka Chavithi Vratham

కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపిం చింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వ రాదని చెప్పి లోపలకు వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి, లోపలికి వెళ్లాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

విఘ్నేశాధిపత్యం

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని డు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడు కున్నాడు. వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫల దాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.

చంద్రుని పరహాసం

Chandruni Parahasam

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకా యలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పంచి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్నిచేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజ విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతిచెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్ర ప్రదే “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల పొందురుగాక” అని శపించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞంచేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులకు మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపముదక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్ని దేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.

దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరు నికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపమువల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహించుకోవా”లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు”అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలం గడచెను.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతిం చాడు. మాటల సందర్భంగా స్వామీ ! సాయంకాలమయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో”అని అనుకున్నాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపా దించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాదచేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏఆప్తునకైన నెవ్వరు ఇవ్వరనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివిని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అను కున్నాడు. దానినిబాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.

Samantakopakhyana

అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్నవ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసు కున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవా! ఆర్తజనపోషా! భక్తరక్షా నిన్ను శ్రీరామ చంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరు కొమ్మనగా, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం జేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీకోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అదిమొదలు మీనామ స్మరణచేయుచూ అనేకయుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇకజీవితేచ్చలేదు. నాఅపరాధములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలాఅన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటువచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తనకుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్య మునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు.

సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నిందమోపి దోషము నకు పాల్పడితి”నని విచారించి మణిసహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగిఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్త మున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాప నింద బాపుకొంటిరి మాకేమిగతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకువెళ్ళి ప్రతిసంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో వున్నారు.

సర్వేజనాః సుఖినోభవంతు.

మరిన్ని వ్రతాలు:

Sri Vinayaka Vrata Katha In Telugu – శ్రీ వినాయక వ్రత కథ

Sri Vinayaka Vrata Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Vrata Katha In Telugu

శ్రీ వినాయక వ్రత కథ

(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.)
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి.

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశార ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనము లను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి,సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ని దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటు వంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానంచేసి, నిత్య కర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మనుచేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ, పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదు లను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజచేయాలి. విప్రులకు దక్షిణతాంబూ లాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదంవలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమ మైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతంచేయడం వల్లనే శ్యమంతకమణితోపాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తనభవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి.. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకు డగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవ చ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వర మును ఇవ్వరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.

మరిన్ని వ్రతాలు:

Sri Katyayani Devi Vratha Katha In Telugu – శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

Sri Katyayani Devi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. వామన పురాణం ప్రకారం, మహిషాసుర అనే రాక్షసుడిపై వారి కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు దేవతల మిశ్రమ శక్తుల నుండి ఆమె సృష్టించబడింది . కాత్యాయన ఋషి యొక్క ఆశ్రమంలో కిరణాలు స్ఫటికీకరించబడ్డాయి , అతను దానికి సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమెను కాత్యాయని లేదా “కాత్యాయన కుమార్తె” అని కూడా పిలుస్తారు. కాళికా పురాణం వంటి గ్రంథాలలో , ఆమెను మొదట పూజించినది ఋషి కాత్యయన అని పేర్కొనబడింది, అందుకే ఆమె కాత్యాయని అని పిలువబడింది . ఏది ఏమైనప్పటికీ, ఆమె దుర్గా యొక్క ప్రదర్శన లేదా స్వరూపం మరియు నవరాత్రి పండుగ యొక్క ఆరవ రోజున పూజించబడుతుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కాత్యాయని దేవి వ్రత  కథ గురించి తెలుసుకుందాం…

Sri Katyayani Devi Vratha Katha in Telugu

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి. అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగామోనరించెను గదా! ఆ విధముగా, జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనా? లేక సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెన? ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి ఓ మునులారా! మీ సందేహమును తప్పక పోగొట్టేడను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను. సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా ఉంది కృతయుగము అంటాయి గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము అయ్యెను. సతి దేవి, ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఏదులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రెమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను. ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని. కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను. అందుకే నీను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.

ఆ మాటలు విన్న సతి ఓ నాదా! మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమి? సీతకోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి నమ్మశక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా? అని పల్కెను. వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము. నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించదలచి “నేను సీతగా మారిపోవలేయునని” తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను. అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివా? నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును. అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు. అని పలికి అదృశ్యమయ్యెను.

శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి? అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది. నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను.

ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను. ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.

దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు చేరి చేతులు జోడించి “ఓ అగ్ని దేవా! నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కళంక మొందిన ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము”. అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను.

ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను . ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిధ్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో “ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థకనాముడు కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు. ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విన్దురో వారికి కుజదోష పరిహారముఅగును”. అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.

హిమవంతుడు ఒక పర్వత రాజు. అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే “కాత్యాయని” అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే “పార్వతి” అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను . మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మిపతలము గావించి వెడలిపోయెను.

పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవో పేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను.

శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో “ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని. తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను. వెంటనే శివుడు ఆమెతో “ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని. ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే నేనునూ అందు భాగాస్వాములమైతిమి. “కాత్యాయని వ్రతము” అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు. అని పలికెను. ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను. అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను.

వ్రత విధానము:

వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును. ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును. మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను. ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

మరిన్ని వ్రతాలు:

Varalakshmi Vratha Katha In Telugu | వరలక్ష్మీ వ్రత కథ

Varalakshmi Vratha Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్ట మైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత కథ మీకోసం…

వ్రత పూర్వ వృత్తాంతం

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మీ వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు.ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురి వాదనలూ విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు. దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్టు రోగం ప్రాప్తించేటట్లు శపించింది… చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాపవిమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మీ వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమార స్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు. ఇది స్థూలంగా వరలక్ష్మీ వ్రతం పూర్వ చరిత్ర.

శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మునులరా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి” అని అడిగింది. అందుకా త్రినేత్రుడు “దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలి.” అని చెప్పాడు. అప్పుడు పార్వతీ దేవి “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. “కాత్యాయనీ! పూర్వకాలంలో మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆపట్టణంలో చారుమతి అనే ఒక బ్రహ్మణ స్త్రీ ఉండేది. అమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాత: కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాత:కాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారించింది. “ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని” చెప్పి అంతర్థానమైంది. చారుమతి చాలా సంతోషించింది. “హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలను పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది.” అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహనికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపం పై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో “సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకన్నారు. (శక్తి కొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును జేయవచ్చును. అట్లు చేసినచో సర్వసౌభాగ్యములును కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు, చదువువారలకు వరలక్ష్మీ వ్రత ప్రసాదము వలన సకల సుఖములు
కలుగును.

మరిన్ని వ్రతాలు:

Varalakshmi Vratham Pooja Vidhanam In Telugu – శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

Varalakshmi Vratham Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాం…

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. కొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లల చేత పెద్ద ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దగ్గరవుండి శ్రద్ధగా చేయిస్తూ వుంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకి అనువైనవే అయినా, ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసే పూజ వల్ల విశేషమైన ఫలితాలను పొందటం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకుని, స్త్రీలు నూతన వస్త్రాలు ధరించి ఈ పూజలు చేసుకొంటారు.

వ్రతం చేయు విధానం

ఇంటికి తూర్పుదిశలో పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ మంటపాన్ని రంగవల్లులతో అలంకరించి, ఒకకొత్త తువ్వాలుపై బియ్యం పరచి దాని మధ్యలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. లేత మర్రిచిగుళ్ళు, లేత మామిడి ఆకులు వంటి పంచ పల్లవాలతో అలంకరించిన కలశంపై కొబ్బరికాయ, దానిపై రవికల గుడ్డ కాని కొత్త చీరకాని పెట్టి అమ్మవారి రూపాన్ని మనోహరంగా తయారు చేసుకోవాలి. బంగారు నగలతోటి ఆ రూపాన్ని అలంకరించడం యిల్లాళ్ళ సరదా. ఈ విధంగా తయారు చేసుకున్న వరలక్ష్మీదేవిని శ్రీసూక్త విధానంగా ధ్యానం, ఆవాహనం, అర్ఘ్య పాద్యాదులు, స్నానం, ధూపదీపాదుల వంటి షోడశోపచారములతో అర్చించాలి. సబ్రాహ్మణులైన ఋత్విక్కుల ఆధ్వర్యంలో గృహములోని ఆడవారంతా సమూహంగా నిర్వహించుకునే ప్రత్యేక పూజ ఇది. అష్టోత్తర శతనామాలతో పువ్వులతో, కుంకుమతో అమ్మవారిని అర్పించాలి. తొమ్మిది సూత్రములతో (పోచలతో) మధ్యలో పువ్వులు చేర్చి కట్టుకునే తోరాన్ని వామహస్తానికి ధరించాలి. 12 రకాల పిండివంటలు ఒక్కొక్కటి 12 చొప్పున పూజ చేసిన బ్రాహ్మణునకు వాయినం ఇవ్వాలి. దక్షిణ తాంబూలాది సత్కారములతో ఋత్వికులని తృప్తిపరచడం ఒక ముఖ్యమైన కార్యక్రమం.

వరలక్ష్మీ వ్రత ఫలితాలు

ఈ వరలక్ష్మీ పూజలో మరొక ప్రత్యేకత వ్రతకథ. పూజ ఎంత ముఖ్యమో, వ్రతకథని చదువుకోవటం అంతే ముఖ్యం. ఆ తల్లి కరుణాకటాక్ష ప్రభావాన్ని తెలియజేసే ఈ కథని పాటరూపంగా పాడుకోవడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ అలా ఆడవారంతా కలిసి భక్తి శ్రద్దలతో పాట పాడుతూ వుంటే చాలా వినసొంపుగా వుంటుంది. బ్రాహ్మణాశీర్వాదం తరువాత బంధుమిత్రాదులతో అందరూ ప్రసాదం తీసుకోవటం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం సువాసినులను పేరంటానికి పిలిచి, ఎంతో సంతోషంగా వారిని సత్కరించి పంపడం కూడా పూజా సాంప్రదాయంలోని భాగమే. చాతుర్వర్ణాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ దేవిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని, కుటుంబ సుఖసౌఖ్యాలను వరంగా పొందటం ఈ పూజలోని ముఖ్యఉద్దేశం.

శ్రీ ఆదిలక్ష్మీదేవిని కామేశ్వరీ దేవి రూపంలో కూడా కొలవటం ఆనవాయితీ. కొన్ని కుటుంబాలలో కామేశ్వరీ దేవి కులదేవత. ఆ కుటుంబంలోని ఆడవారు అంతా కలసి సమిష్టిగా ఇష్ట కామేశ్వరీ వ్రతం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంవల్ల కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగావుండేలా, అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థిస్తారు. ప్రాణశక్తిని వృద్ధి చేసుకుని తద్వారా శారీరక మానసిక అనారోగ్యాలను తగ్గించుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. ఔషధ సేవనాన్ని ఈ రకంగా బాగా తగ్గించుకోవచ్చు. ప్రాణశక్తిని పెంచమని ఆదిలక్ష్మి అమ్మ వారిని ప్రార్థించి శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుంటే తప్పక ఆరోగ్యం చక్కబడుతుంది దేనికైనా నమ్మకం ముఖ్యం.

సాధారణంగా అనారోగ్యం రాగానే విరివిగా మందులు వాడేయటం మనకి అలవాటయిపోయింది. ఆ మందుల దుష్ప్రభావ ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవటం జరుగుతోంది. ఏ మందులు వాడనక్కరలేకుండా ఆ ఆదిలక్ష్మీ దేవి కృపవల్ల ప్రాణశక్తిని పెంపొందింప జేసుకుని పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకు ఒక మార్గం. పూజా విధా నంలో భాగంగా ఆ ఆదిలక్ష్మీ మాత అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించటం ఇందువల్ల ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ నామావళిలోని నామాలన్నీ మనపూర్వీకులు ఎంతో సాధనచేసి కనుగొన్నవి. ప్రతినామమూ ఎంతో ప్రభావపూరిత మైనది. ఆదిలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని భక్తుల సౌకర్యార్ధం ఈ పుస్తకంలో చేర్చటం జరిగింది. నిత్యపూజలు చేసుకునే సౌకర్యం, అవకాశంలేని వారు కోసం బీజాక్షర జపం చేసుకుంటే తక్షణఫలితాలు కలుగుతాయి.

మరిన్ని వ్రతాలు: