Gowri Devi Pooja Vidhanam In Telugu- శ్రీ గౌరి దేవి పూజ

Gowri Devi Pooja Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజలు హిందూ మతంలో ఆరాధన, ప్రార్థన, మరియు ధార్మిక అనుబంధానికి ముఖ్యమైన భాగం. పూజలు దేవతలకు, దేవుళ్లకు, మరియు ఇతర ఆధ్యాత్మిక శక్తులకు ఆరాధన చూపడానికి, వారి ఆశీర్వాదాలు పొందడానికి చేస్తారు. పూజల ద్వారా మనసుకు శాంతి, ఆనందం, మరియు అనుభూతిని పొందవచ్చు. గౌరి పూజా హిందూ మతంలో ముఖ్యమైన పూజా. ఇది ముఖ్యంగా ఆడవారు వారి కుటుంబ సంక్షేమం కోసం మరియు భర్తల దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. గౌరి దేవి పూజ, ముఖ్యంగా గౌరి హబ్బా లేదా గౌరిహబ్బా అని కూడా పిలుస్తారు, ఇది గణేష్ చతుర్థికి ముందు రోజు జరుపుకుంటారు. గౌరి దేవి పూజా, పరమ శివుడి భార్య అయిన గౌరి దేవిని ఆరాధించడం ద్వారా ప్రారంభమవుతుంది. గౌరి దేవి శక్తి మరియు కాంతి స్ఫూర్తిని సూచిస్తుంది. ఆమెను ఆరాధించడం వల్ల జీవితంలో శుభం, ఆనందం మరియు శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ గౌరి దేవి పూజ గురించి తెలుసుకుందాం.

శ్రీ గౌరి దేవి పూజ

ప్రాణ ప్రతిష్ఠా

హ్రాం హ్రీం క్రోం యం రం లం సం శం షం హం సః
మంగళ గౌరీదేవతా స్థిరా భవతు – సుప్రసన్నా భవతు – వరదా భవతు – అనుచు గౌరీదేవిని ప్రతిష్ఠించి ఈ క్రింది విధముగా జెప్పుచూ నమస్కారము చేయవలెను.

దీపారాధనమ్

శ్లో॥ దీపస్త్వం బ్రహ్మరూపో సి – జ్యోతిషాం ప్రభు రవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ – సర్వాన్ కామాంశ్చ దేహి మే ||
దీపదేవతాభ్యోనమః – అని దీపమును పువ్వులతో పూజించవలెను. తరువాత పరిశుద్ధహృదయముతో పుష్పములు తీసికొని మ్రొక్కుచు శ్రీ మంగళగౌరీ దేవిని ఈ విధముగా ధ్యానించవలెను.

శ్లో॥ సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరి కాం
సమందహాసితేక్షణాం – సశరచాపపాశాంకుశాం |
అశేషజనమోహినీ – మరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం – జపవిధౌ స్మరే దంబికామ్ ॥

కల్లోలోల్ల సితామృతాబ్దిల హరీ – మధ్యే విరాజన్మణి
ద్వీపే కల్పకవాటికాపరివృతే – కాదంబవాట్యుజ్జ్యలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభా -మధ్యే విమూనోత్తమే
చింతారత్నవినిర్మితం జనని! తే – సింహాసనం భావయే॥

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్నఖచితసింహాసనం సమర్పయామి అని వినుతించి శ్రీ మంగళగౌరికి సింహాసనము నొసంగినట్లు భావన చేసి పువ్వుల నుంచవలెను.

ఆవాహనమ్

ఆగచ్ఛ సర్వదేవేశి। సర్వకార్యార్థసిద్ధయే।
సర్వసిద్ధిప్రదే! దేవి। సర్వపాపప్రణాశిని.
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః ఆవాహనం సమర్పయామి.

పాద్యమ్

గంగాదిసలిలై ర్యుకై – సుగన్దేన సువాసితం!
పాద్యం గృహాణ సుశ్రోణి – రుద్రపత్ని! నమోస్తుతే ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః పుష్పముతో చల్లవలెను.
అర్ఘ్యం సమర్పయామి కలశ జలమును

అర్ఘ్యమ్

భాగీరథ్యాదిసలిలం – నానాతీర్థసమన్వితం
కర్పూరగంధసంయుక్త మర్థ్యం తుభ్యం దదా మ్యహమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – అర్ఘ్యం సమర్పయామి- అని కలశ జలమును పుష్పముతో చల్లవలెను.

ఆచమనమ్

హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆచమనం సమర్పయామి.

అని కలశములోని జలమును దేవి ఆచమనమును చేయుట కనుకొని, పుష్పముతో అందించవల యును.

మధుపర్కమ్

స్వర్ణపాత్రే సమానీతం – దధిఖండమధుపుతం
మధుపర్కం గృహాణేదం – మయా దత్తం సరేశ్వరి ॥

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – మధుపర్కం సమర్పయామి. మధుపర్కమును సమర్పించవలెను. (పాలు, తేనె కలిపిన ద్రవ్యము)

పంచామృతమ్

క్షీరం దధ్యాజ్యమధురా – శర్క రాఫల సంయుతం
స్నానం స్వీకురు దేవేశి। సర్గస్థిత్యంతరూపిణి॥
హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః – పంచామృతస్నానం సమర్పయామి.

స్నానమ్

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి. పువ్వుతో నీరు జల్లవలెను.

వస్త్రమ్

సర్వదే! సర్వదా గౌరి! సర్వాభరణ భూషితే !
పీతాంబరద్వయ మిదం గృహాణ పరమేశ్వరి.

హ్రీం శ్రీం మంగళగౌర్యై నమః – కంచుకం సమర్పయామి – అని రవికె, వస్త్రము మున్నగునవి సమర్పించి పువ్వులు చల్లి నమస్కరించవలెను.

హ్రీం శ్రీం మంగళగౌర్యైనమః ఉత్తరీయం సమర్పయామి – ఉత్తరీయమును సమర్పించవలెను.

గన్దం

గన్దం మనోహరం దివ్యం – దివ్యం – ఘనసారసమన్వితం
తుభ్యం భవాని ! దాస్వామి – చోత్తమం చానులేపనమ్ ||
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః – చల్లని గంధం సమర్పయామి గంధమును గౌరీదేవిపై చిందించవలెను.

అక్షతలు

అక్షతాన్ శుభవర్ణాభాన్ – హరిద్రాద్యై స్సుసంయుతాన్
కాత్యాయని ! గృహాణ త్వం – సర్వదేవనమస్కృతే.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయైనమః – అక్షతాన్ సమర్పయామి.

మరిన్ని పూజలు:

Sri Dattatreya Shodasopachara Pooja In Telugu – శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజ

Sri Dattatreya Shodasopachara Pooja In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజా విధానం గురించి తెలుసుకుందాం…

Sri Dattatreya Shodasopachara Pooja Vidhanam

శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజ విధానము

ధ్యానమ్:

(ఓం) గురుర్ర్బహ్మా గురుర్విష్టుర్గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమః ॥

1. ఆవాహనము:

ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిమ్ ।
సర్వధర్మపరం నిత్యం పూర్ణానందకవిగ్రహమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆవాహయామి.

2. ఆననము:

కల్పద్రుమూలే మణివేదిమధ్యే, సింహాసనం స్వర్ణమయం సురత్నమ్ ।
విచిత్రవస్త్రాన్విత మచ్యుత ప్రభో, గృహాణ లక్ష్మీధరణీసమన్విత ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి.

3. పాద్యము (పాదములు కడుగుట):

గంగాజలం సమానీతం సుగంధద్రవ్యసంయుతమ్ ।
పాద్యం గృహాణ భో స్వామిన్ ! తీర్థపాద దయాకర॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః పాదయోః పాద్యం సమర్పయామి.

4. అర్ఘ్యము (చేతులు కడుగుట):

ధర్మస్వరూప ధర్మజ్ఞ ! తులసీదామ భూషణ ।
కంబుగ్రీవ మయా దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

5. ఆచమనము (గొంతు తడుపుకొనుట):

జ్ఞానవైరాగ్యసంపన్న భవరోగైక భేషజ ।
గృహాణ త్వం మయా దత్త మిదమాచమనీయకమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి.

6. స్నానము:

గంగాదిపుణ్యసలిలైర్మయా నీతైశుస్మభావహైః ।
స్నాపయిష్యామ్యహమ్ భక్త్యా ప్రసన్నో భవ సద్గురో ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి.

7. వస్త్రము:

స్వర్ణాంచలం చిత్రవిచిత్రశోభితం కౌశేయయుగ్మం పరికల్పితం మయా ।
దామోదర ప్రావరణం గృహాణ మాయాచల ప్రాకృతదివ్యరూప ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

8. గంధము:

కస్తూరికా చన్దన కర్దమాని కాశ్మీర సంయోజిత గంధసారైః ।
విలేపనం స్వీకురు దేవదేవ ! శ్రీభూమి వక్షోజ విలేపనార్హమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః హస్తయోః గంధం ధారయామి,

9. యజ్ఞోపవీతము:

తన్తుం తన్వన్ మయా భక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితమ్ ॥
దాస్యామి ధారణార్థం వై గృహాణ బ్రహ్మవిద్వర ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం
ఆచమనీయం సమర్పయామి.

10. పుష్పములు:

కల్హారైశ్చంపకైర్జాజీ పున్నాగైర్మల్లికాదిభిః ।
మన్హరైః పూజయిష్యామి స్వీకుర్వాచార్యసత్తమ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః పుష్పైః పూజయామి.

అథాంగపూజ:

ఓం తీర్థపాదాయ నమః – పాదౌ పూజయామి
ఓం బలాయ నమః – జజ్ఞే పూజయామి
ఓం ఆధారభూతాయ నమః – జానునీ పూజయామి
ఓం విశ్వపూజితాయ నమః – ఊరూ పూజయామి
ఓం జితేంద్రియాయ నమః – గుహ్యం పూజయామి
ఓం స్థితప్రజ్ఞాయ నమః – కటిం పూజయామి
ఓం మితాసనాయ నమః – ఉదరం పూజయామి
ఓం విశాల వక్షసే నమః – వక్షఃస్థలం పూజయామి
ఓం శుద్ధహృదయాయ నమః – హృదయం పూజయామి
ఓం శిష్య వత్సలాయ నమః – స్తనౌ పూజయామి
ఓం ఆత్మోద్ధారకాయ నమః – భుజౌ పూజయామి
ఓం దానహస్తాయ నమః – హస్తా పూజయామి
ఓం కంబుకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం ప్రసన్నవదనాయ నమః – ముఖం పూజయామి
ఓం మృదుభాషణాయ నమః – జిహ్వాం పూజయామి
ఓం కరుణాజలనిధయే నమః – నేత్రే పూజయామి
ఓం శాస్త్రానుసారిణే నమః – కర్ణా పూజయామి
ఓం సర్వజ్ఞాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

11. ధూపము:

వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైస్సుసంయుతమ్ ।
ఆగ్నేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ॥

12. దీపము:

జ్ఞానజ్యోతిస్వరూపస్త్వ మాత్మజ్ఞానప్రదాయక ॥
మృతవరా కృతం దీపం దాస్యామి స్వీకురు ప్రభో ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః దీపం దర్శయామి.

13. నైవేద్యము:

సత్యం చిత్తేన పరిషించామి । అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా ।

శ్లో ॥ పక్వాన్నం పంచభక్ష్యాణి గోఘృతం సూపసంయుతమ్ ।
లేహ్యం పేయం తథా చోష్యం స్వీకురు ప్రాణవల్లభ॥

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తప్రక్షాళనం సమర్పయామి । పాదప్రక్షాళనం సమర్పయామి । శుద్ధ మనీయం సమర్పయామి ।

14. తాంబూలము:

పూగీఫలై స్సకర్పూరై ర్నాగవల్లీదళై ర్యుతమ్ ।
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి.

15. నీరాజనము:

నీరాజనమిదం జ్ఞాన దీపక సద్గుణాకర ।
పూర్వ మనోవాం స్వీకురు భజనప్రియ ॥
మంగళం జ్ఞానసంపన్న మంగళం సుజనప్రియ ।
మంగళం జగదుద్ధార మంగళం దేశికోత్తమ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి.

16. మస్త్రపుష్పము:

శ్రద్ధా భక్త్యా హ్యక్షతైశ్చ హృత్పద్మసహితం గురో ।
మయార్పితం మస్త్రపుష్పం స్వీకురు శిష్యవత్సల ॥

నమః ప్రసన్నవదన నమః కారుణ్యసాగర ।
నమః కర్మఫలత్యాగిన్ నమః పాపనికృంతన ॥

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటీ యుగధారిణే నమః ॥

శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః సప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

త్వమేవ మాతా చ పితా చ త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥

శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఛత్ర మాచ్ఛాదయామి – చామరం వీజయామి – నృత్యం దర్శయామి – ఆందోళికానారోహయామి – అశ్వానారోహయామి – గజానారోహయామి సమస్త రాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి ।

మరిన్ని పూజా విధానాలు:

Go Pooja Phalitamulu In Telugu – గో పూజా ఫలితములు

Go Pooja Phalitamulu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా ఫలితములు గురించి తెలుసుకుందాం…

Gomata Pooja Phalithalu In Telugu

గో పూజా ఫలితములు

  1. గో ప్రదక్షిణము భూ ప్రదక్షిణముతో సమానము.
  2. ఆవు కుడి ప్రక్కను బ్రహ్మ ఉండును. అచట పూజించినవారికి సంతానము కలుగును.
  3. గోవు కొమ్ములకు ఎడమప్రక్క విష్ణువు ఉండును. కాన ఆ తావును పూజించిన వారికి జ్ఞానమోక్షములు లభించును.
  4. ఆవు కొమ్ముల చివరిభాగములో మూడు కోట్లు ఏబదిలక్షల తీర్థములు వుండును. వాటిపై చల్లిన నీటిని త్రాగిననూ, శిరస్సున, చల్లుకొనినూ త్రివేణీ సంగమ స్నానఫలము లభించును.
  5. ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు వుండును. కావున మల్లె పూవులతో పూజించి నచో కాశీవిశ్వేశ్వరుని పూజించిన ఫలితము కలుగును.
  6. గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యస్వామి వసిం చును. ఆ భాగమును పూజించినవారికి చెవి పోటురాదు. సంతాననష్టము వుండదు.
  7. ఆవుచెవియందు అశ్వనీదేవతలు ఉంటారు. ఆ ప్రదేశములను పూజించినచో అసాధ్య రోగములు నివారింపబడును.
  8. ఆవు కన్నులలో సూర్యచంద్రులు వుంటారు. వానిని పూజించినవారికి అజ్ఞానమనే చీకటినశించి జ్ఞానకాంతియు, సకల సంపదలు కలుగును.
  9. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండును. దానిని పూజించినచో సంతానము కలుగును.
  10. ఆవు హుంకారమునందు సరస్వతి వుండును. దానిని పూజించినచో విద్య లభించును.
  11. ఆవు గండస్థలముల (చెక్కిళ్ళు) యందు కుడి భాగమున యముడు, ఎడమభాగమున ధర్మ దేవతయు వుందురు. దానిని పూజించినచో యమబాధలు వుండవు. ధర్మపరులకు లభించే పుణ్యలోకము ప్రాప్తించి, జ్ఞానవృద్ధి యగును.
  12. ఆవు పెదవులయందు ప్రాతఃసంధ్యాది దేవతలు ఉందురు. దానిని పూజించినచో సంధ్యా సమయంలో కావించిన పాపములు తొలగును.
  13. ఆవు కంఠమునందు ఇంద్రుడు వుండును. దానిని పూజించినవారికి ఇంద్రియ పాటవము కలుగును. సంతానాభివృద్ధి యగును. పక్షవా తాది రోగములు రావు.
  14. ఆవు వక్షస్థలము నందు సాధ్యదేవతలు వుం దురు. ఆ భాగమును పూజించినవారికి సాధింపరాని కార్యములు ఉండవు.
  15. ఆవు నాలుగుపాదములలోను నాలుగు పురు షార్ధములు వుండును. ఆ నాల్గింటిని పూజించినవారికి ధర్మార్ధకామమోక్షములు సిద్ధించును.
  16. ఆవు గిట్టలచివరి భాగమున నాగులు వుందురు. ఆ ప్రదేశమున పూజించినవారికి గంధర్వలోకములు లభించును.
  17. ఆవు గిట్టలనందు గంధర్వులు వుందురు. అచట పూజించినవారికి నాగలోకము సిద్ధిం చును. ఈ భూమియందు నాగభయము వుండదు.
  18. ఆవుగిట్టల ప్రక్క భాగములందు దేవవేశ్యలు ఉందురు. అచట పూజించినవారికి అప్సరో లోకము సిద్ధించును.

మరిన్నిపూజా విధానాలు:

Pooja | పూజ

Pooja

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Pooja | పూజ

పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ క్రింది లింకుల ఆధారంగా పూజ గురించి తెలుసుకుందాం…

Gomatha Pooja Vidhanam In Telugu – గోమాత పూజా విధానం

Gomatha Pooja Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గోమాత పూజా విధానం గురించి తెలుసుకుందాం…

Gomatha Pooja Vidhanam In Telugu Pdf

గోమాత పూజా విధానం

గో – ప్రార్ధన

నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయచ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః
కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ |
గవాం ప్రశస్యతేవీర, సర్వపాపహరం శివమ్ ||
ఘృతక్షీర ప్రదాగావో ఘృతయోన్యో ఘృతోద్భవాః |
ఘృతనద్యోఘృతావర్తా స్తామేసంతు సదాగృహే ||
సుృతంమే హృదయేనిత్యం ఘృతంనాభ్యాం ప్రతిష్ఠితం |
ఘృతంసర్వేషు గాత్రేషు ఘృతంమేమనసిస్థితమ్
గావోమమాగ్రతో నిత్యంగావః పృష్ఠత ఏవ చ |
గావోమేసర్వత శైవగవాంమధ్యేవసామ్యహమ్ ||
ఇత్యాచమ్య జపేత్సాయంప్రాతశ్చపురుష స్సదా |
యదహ్నాత్కురుతేపాపం తస్మాత్ స పరిముచ్యతే ||

ఆచమ్య :

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అనుచు మూడుసార్లు జలపానము చేయవలయును.)
(గోకర్ణమువలె చేతిని ముడచి మినపగింజ మునుగ నంత నీరుచేతిలోపోసికొని గ్రహించవలయును.)
ఓం గోవిందాయ నమః (అనుచు ఎడమచేతిని కుడిఅరచేతితోను)
ఓంవిష్ణవేనమః (అనుచుకుడి అరచేతినిఎడమఅరచేతితోను కడుగవలయును.)
ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటనవ్రేలితో పై పెదవిని తడిచేతితోతాకి)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వ్రేలితో పై పెదవిని)
ఓం వామనాయ నమః (అనుచుశిరమున నుదకము చల్లుకొనవలయును)
ఓం శ్రీధరాయ నమః (అనుచుశిరమున జలము చల్లుకొనవలయును.)
ఓం హృషీకేశాయనమః (అనుచుఎడమచేతిపైనను)
ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండుపాదములపైనను)
ఓం దామోదరాయ నమః (అనుచు శిరముపైనను నీరు చల్లుకొనవలయును.)
ఓం సంకర్షణాయ నమః (అన్నివ్రేళ్ళు ముడిచి వ్రేళ్ళమొదళ్ళతో గడ్డమును తాకవలయును.
ఓంవాసుదేవాయనమః (ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (కుడిముక్కును అంగుష్ఠ తర్జనులతో తాకవలయును.)
ఓం అనిరుద్ధాయనమః (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (కుడికన్నును అంగుష్ఠానామికలతో తాకవలయును.)
ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమచెవిని)
ఓం నారసింహాయ నమః (కుడిచెవిని అంగుష్ఠానామికలతో తాకవలయును)
ఓం అచ్యుతాయై నమః (అనుచు అంగుష్ఠ కనిష్ఠికలతోతాకవలయును.)
ఓం జనార్దనాయ నమః (అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయనమః(శిరమును కరాగ్రముతో తాకవలయును.)
ఓం హరయే నమః (ఎడమ బాహుమూలమును)
ఓం కృష్ణయేనమః (బాహుమూలములను వ్రేళ్ళుముడిచి తాకవలెను. తరువాత భూతోచ్ఛాటనము గావింపవలెను.)

భూతోచ్ఛాటనము

శ్లో॥ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అక్షతలు వెనుకకు చల్లుకొనవలయును.)

ప్రాణాయామము

ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
(చూపుడువేలు, చిటికినవేలు విడిచి మిగిలిన మూడువేళ్ళతో ముక్కు మూసుకొని ఒక్కనిమిషం ఆగిమెల్లగావ్రేళ్ళు వదలి గాలిని విడిచిపెట్టవలెను.) మంత్ర మును ముక్కునుపట్టుకొని ముమ్మారు జపించిన ప్రాణాయామము చేసినట్లుగును)

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పర మేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః | ద్వితీయపరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే | కలి యుగే ప్రథమపాదే | జంబూద్వీపే | భరతవర్షే భరతఖండే అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవ త్సరే…ఆయనే….ఋతౌ… మాసే… పక్షే.. తిధౌ… వాసరే… శుభ నక్షత్రే… శుభయోగే..శుభకరణ… ఏవంగుణ విశేషణ విశిష్టా యాం…శుభతిధౌ… శ్రీమాన్ గోత్రః నామధేయ ధర్మపత్నీ సమేతః శ్రీమతః గోత్రస్య.. నామధేయస్య… ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం | క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్య ఐశ్వ ర్యాభి వృద్ధ్యర్థం। ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమదీర్ఘ సౌమాంగళ్య ప్రాప్యర్థం సకల భాగ్య ప్యర్థం పుత్రపౌత్రాభి వృద్ధ్యర్ధం గోదేవతా ముద్దిశ్య దేవ దేవతాపూజంకరిషే || (అక్షతలు ఉదకము పళ్ళెరములో వదలవలయును.)

తదంగ కలశపూజాం కరిష్యే

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రఃస్సమాశ్రితః |
మూలే తత్రస్థితో బ్రహ్మామధ్యే మాతృగణాస్మృతాః॥
శ్లో॥ కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదో౨ ధ యజుర్వేదః స్సామవేదో హ్యధర్వణః ||
శ్లో॥ అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ ||
శ్లో॥ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
ఆయాంతు శ్రీదేవీ పూజార్థం దురితక్షయ కారకాః ||
(కలశోదకేన, దేవంఆత్మానం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య అని కలశోదకమునుదేవతమీద, తనమీద, పూజాద్రవ్యములమీద చల్లవలెను.)

గణపతిపూజ

అదౌ నిర్విఘ్నపరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే॥ (నీరువదలిపెట్టవలయును)
గణానాంత్వా గణపతిగ్ం హవామహే |
కవిం కవీనాం ఉపమశ్ర వస్త మమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశ్శృణ్వన్ ఊతిభిః సీదసాదనమ్|| (అక్షతలుంచవలెను)
శ్రీమహాగణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి ధ్యాయామి నవరత్నఖచితసింహాసనం సమర్పయామి (అక్షతలుంచవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి (నీరుచల్లవలెను)

అపోహిష్టామయోభువః తానూర్ణేదధాతన । మహేరణాయ చక్షసే । యోవశ్శి వతమో రసస్తస్యభాజయతే హనః | ఉశతీరివమాతరః తస్మాఅరంగమామవో యస్యక్షయాయ ఉన్వధ । ఆపోజనయధాచనః || శ్రీమహాగణాధిపతయేనమః శుద్దోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్ప యామి. అభివస్తాను వసన్యరుషాభిదేయాః నురుషూః॥ పూజమా। అభిచంద్రాభర్తవే నోహరిణ్య ధ్యస్వాన్ రధినో దేవసోమ॥ శ్రీమహా గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
(ప్రత్తిచేసి వస్త్రంగాని యజ్ఞోపవీతంగానివేయవలె)

యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్రియం ప్రతిముంచశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
శ్రీమహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధద్వారాం దురాం ధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
శ్రీ ఈశ్వరీగ్ం సర్వభూతానాం తా మిహోపాహ్వయే శ్రియం॥
శ్రీమహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి.
ఆయనేతే పరాయణే దుర్వారోహంతుపుష్పిణీః
హ్రదాశ్చపుండరీకాణిసముద్రస్యగృహాఇమే
శ్రీమహాగణాధిపతయేనమఃపుష్పాణి పూజయామి

మరిన్ని పూజా విధానాలు:

Sri Sai Deeksha Vidhanam In Telugu – శ్రీ సాయి దీక్షా విధానము

Sri Sai Deeksha Vidhanam In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి దీక్షా విధానము గురించి తెలుసుకుందాం…

Sri Sai Deeksha Or Sai Mala Vidhanam

శ్రీ సాయి దీక్షా విధానము

మానవునికి శాంతి సౌఖ్యములను సమకూర్చేది భక్తి. ఆ సాయినాథుని కృపాకటాక్షములు ఎల్లవేళల తోడుండాలని చేసే ప్రయత్నమే శ్రీ సాయిదీక్ష. ఈ దీక్షను శ్రీ సాయి పుట్టిన రోజగు శ్రీరామ నవమికి ముందు, శ్రీ సద్గురుని గురు పౌర్ణిమగు ఆషాఢ పౌర్ణిమకు ముందు, శ్రీ సాయి పుణ్యతిథి యగు విజయదశమికి ముందు, శ్రీ దత్త జయంతి యగు మార్గశిర పౌర్ణిమకు ముందు మండలము, అర్ధ మండలము, సప్తాహంగా వీలును బట్టి స్వీకరించవచ్చును.

దీక్షకు అవసరమగు వస్తువులు:

రెండు మాలలు. ఒకటి ధారణమాల, రెండవది జపమాల. మాలలలో తులసీ, రుద్రాక్ష, స్పటిక, రక్త చందన రకాలున్నాయి. వీటిలో తులసీమాల శ్రేష్ఠము. తెలుపు రంగు దీక్షా వస్త్రములు, అలంకరణ కొరకు గంధము, విభూతి, కుంకుమ, పూజ కొరకు పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరవత్తులు, గంధము, కర్పూరం, కలకండ (కడి చక్కెర), పన్నీరు, పీచుతో కూడిన నారికేళం, ఊదు, విభూతి చూర్ణం, ప్రమిదలు, గంట, ఏక మరియు పంచ హారతులు, ఉదాని, వత్తులు, మంచి నూనె, సాయి బాబా విగ్రహం లేదా బాబా, గణపతి, దత్తాత్రేయుల చిత్రపటాలు.

మాలాధారణ విధానము:

మాలాధారణ రోజు ఉదయమే తలంటు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీక్షా దుస్తులు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది సాయి కాకడహారతికి (ఉ॥ 5-15 ని॥) ముందుగా ఆలయాన్ని చేరి కాకడ హారతి అనంతరం గురు స్వామి లేదా పూజారి చేత మాలధారణ చేయవలెను. తరువాత తాను నివసించు ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసుకొని సాయి విగ్రహం, చిత్ర పటాలు, గురుస్వామి ఇచ్చిన నారికేళం ఉంచి నిత్యం పూజించాలి.

దీక్షా నియమాలు:

  1. వ్రతి రోజు నూర్యోదయం కన్నా ముందు మరియు సూర్యాస్త మయం తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
  2. స్నానానంతరం దీక్షా వస్త్రధారణ కాగానే గంధం, కుంకుమ, విభూతి ధరించాలి.
  3. పీఠం వద్ద శుభ్ర పరచి సాయినాథునికి అభిషేకము చేసి దీపారాధన అనంతరం అష్టోత్తరంతో కూడిన అర్చన గావించి ధూపం చూపించి కలకండ నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి యిచ్చి మంత్ర పుష్ప సాష్టాంగ నమస్కారాలతో వూజ నాచరించవలెను.
  4. మధ్యాహ్నం 12 గం॥లకు మహా నైవేధ్యం చూపి పంచ హారతులతో మధ్యాహ్న హారతి సాయికి ఇచ్చి అనంతరం భోజనం చేయాలి. ఆహారం సాత్వికమై ఉండాలి.
  5. సూర్యాస్తమయం అనంతరం స్నానాది కార్యక్రమాలు జరిపిన తరువాత ఏక హారతితో ప్రదోష పూజ (సంధ్యా హారతి) ను, రాత్రి 10 గం॥లకు శేజారతి నివ్వాలి.
  6. దీక్షా సాధకుడు ప్రతి రోజు ఒకే పూట భోజనం చేసి రాత్రికి పాలు, ఫలములు మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. నిరంతరం సాయి నామం జపిస్తు గురు స్వామి ఉపదేశించిన మంత్రమును ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు స్మరించాలి.
  7. తను నిర్వర్తించే వృత్తులను నిర్వర్తిస్తు వీలైన సమయంలో సాయి జీవిత చరితము సాయి లీలామృతము నిత్య పారాయణము చేయాలి.
  8. భూత దయను కలిగి వుండి, ప్రతి జీవిలో సాయిని దర్శించాలి.
  9. ఇతరులను సాయిరాం అని గాని, సాయి శరణం అని గాని సంబోధించాలి.
  10. ప్రతి స్త్రీలోను తల్లిని చూడవలెను.
  11. వీలును బట్టి ఆలయ దర్శనం చేయాలి. దైవ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
  12. తీసుకొనే ప్రసాదము భోజనం పరిశుభ్ర స్థలంలో ఒకే సారి తీసుకోవాలి.
  13. ఆర్థిక పరిస్థితిని బట్టి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి.

దీక్షలో చేయకూడనివి:

  1. తెలుపు దుస్తులు తప్ప ఇతర రంగు దుస్తులు ధరించకూడదు.
  2. క్షౌరము చేయకూడదు, గోళ్ళు తీయకూడదు.
  3. క్రీములు, నూనెలు, సబ్బులు వాడకూడదు.
  4. విలాసాలకు, హాస్యానికి, రాజకీయ విషయములకు దూరంగా వుండాలి. (న్యూస్ పేపర్ చదవకూడదు. టి.వి, సినిమాలు చూడకూడదు)
  5. ధూమపానం, మద్యపానం, మాంసాహారమును విడిచిపెట్టాలి.
  6. పాదరక్షలు ధరించకూడదు.

దీక్షావిరమణ :

దీక్ష పూర్తయిన మరుసటి రోజు ఉదయం పీఠం వద్ద పూజా కార్యక్రమాలు జరిపి పీఠంను కదిలించి పీఠంపై గల నారికేళమును తీసుకొని దానితో స్వామి వారి పూజా వస్తువులు, నైవేద్యంతో శ్రీ సాయిబాబా మందిరమును చేరి గురు స్వామి లేదా పూజారి చే దీక్షా విరమణ చేయాలి. శాంతిని చేకూర్చు శ్రీ సాయిబాబా దీక్షను కుల మత భేదాలు లేకుండా స్వీకరించిన కార్యసిద్ధి తప్పక జరుగును.

మరిన్ని పోస్ట్లు:

Sri Varasiddhi Vinayaka Pranapratistha In Telugu – శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట

Shri Varasiddhi Vinayaka Pranapratistha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.

Sri Varasiddhi Vinayaka Pranapratistha

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట

(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః

శ్లో|| స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం |
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు |

ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదో భవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)

షోడశోపచార పూజ:

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ |
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ||
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాఙ్కుశధరం దేవం ధ్యాయేత్సద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యాయామి ||
(వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ ||
ఆవాహయామి
(మరల అక్షతలు వేయాలి)

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం ||
ఆసనం సమర్పయామి ||
(అక్షతలు లేదా పూలు వేయాలి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం
మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||
ఆర్ఘ్యం సమర్పయామి ||
(ఉద్ధరిణతో నీరును స్వామికి చూపించి ప్రక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక |
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
పాద్యం సమర్పయామి ||
(మరల కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి.)

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక |
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
పాద్యం సమర్పయామి ||
(మరల కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి.)

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత |
గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ||
ఆచమనీయం సమర్పయామి ||
(కొంచెంనీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం |
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ||
మధుపర్కం సమర్పయామి||
(స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.)

స్నానం:

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ||
పంచామృత స్నానం సమర్పయామి ||
(ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామివిగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయకొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః |
స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే ||
శుద్దోదక స్నానం సమర్పయామి||
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||
వస్త్రయుగ్మం సమర్పయామి ||
(స్వామికివస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్ల యితే పత్తికిపసుపు,కుంకుమరాసి దానినివస్త్రంగా ఇవ్వవచ్చు)

రాజితం బహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం |
గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ||
యజ్ఞోపవీతం సమర్పయామి ||
(యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ||
గంధాన్ సమర్పయామి ||
(కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే ||
అక్షతాన్ సమర్పయామి ||
(స్వామికి అక్షతలు సమర్పించాలి)

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ |
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే ||
పుష్పాణి పూజయామి ||
(స్వామిని పూలతో పూజించాలి)

అధాంగపూజ:

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగపూజాం కరిష్యే.
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

అథ ఏకవింశతి పత్రపూజ:

(ఒక్కొక్క నామంచదువుతూ బ్రాకెట్లో పేర్కొన్నపత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి.)

ఓం సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి (గరిక)
ఓం హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి (రేగు)
ఓం గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి (తులసీ)
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుకాంత)
ఓం వటవేనమః – దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

మరిన్ని పూజా విధానాలు: 

Sri Vinayaka Pooja Vidhanam In Telugu – శ్రీ వినాయక పూజా విధానము

Sri Vinayaka Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.

Sri Ganapathi Pooja Vidhanam

శ్రీ వినాయక పూజా విధానము

ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి.

ప్రార్థన:

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ||
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ||

శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ |
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి ||
సుముహూర్తోస్తు ||

లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవ |
శ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాంత
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపతః |
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః |
అష్టావష్టా చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి |
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్థ సిద్ధ్యర్థం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః ||

(నమస్కరించుకుని ఆచమనము ప్రాణాయామము చేసి ఈవిధంగా సంకల్పము చెప్పుకోవాలి)

సంకల్పం:

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యః శుభేశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య…ప్రదేశే… (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి.) మధ్యప్రదేశే శోభనగృహే సమస్త బ్రాహ్మణ హరి హర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.. నామసంవత్సరే… దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిధౌ… వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్…గోత్రోద్భవస్య…. నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థయిర్య విజయా యురారోగ్యైశ్వరాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాఞ్ఛాఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోప శాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశో పచార పూజాం కరిష్యే. (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి.) అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే | తదంగ కలశపూజాం కరిష్యే ||

కలశ పూజ:

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
కలశస్యముఖే విష్ణుః కణేరుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా ॥
ఋగ్వేదో2ధ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశామ్బు సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మనవద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లుపెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్యపద్ధతిలో తిప్పాలి.)

శ్లో॥ గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి,
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమ మీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.

విఘ్నేశ్వర పూజ:

గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం || శ్రీమహాగణాధిపతయే నమః ||
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)

ధ్యానం:

శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అనే శ్లోకం చదువుతూ పూవులూ, అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాలచెంత వుంచాలి. పూజను దేవుని పాదాలవద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు.)

ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్దరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని పళ్లెం లేదా పాత్రలో వేయాలి.

పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యంపెట్టి షోడశోప చారపూజచేయాలి. యధాభాగం గుడం నివేదయామి || శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో సుప్రీతో, వరదోభవతు॥ గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణమి అంటూ పూజచేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి. మరలా ఆచమనంచేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి. అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.

మరిన్ని పూజా విధానాలు మీ అందరి కోసం:

Sri Raghavendra Swamy Japa Vidhanam In Telugu | శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

Sri Raghavendra Swami Japa Vidhanam

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Sri Raghavendra Swamy Japa Vidhanam Telugu

పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము, పూజ గురించి తెలుసుకుందాం…

శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

ఓం అస్య శ్రీరాఘ వేంద్రాష్టాక్షరీ మహామంత్రస్య అప్పణాచార్యః ఋషిః గాయత్రీ ఛందః, శ్రీరాఘ వేంద్ర గుర్వ స్తర్గత శ్రీమూలరామచజ్ఞో దేవతా, ఓం బీజం, శ్రీం శక్తి ః, రాఘవేంద్రాయ నమః కీలకమ్, శ్రీరాఘవేంద్రప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః.

ఓం అంగుష్ఠాభ్యాం నమః
శ్రీం తర్జనీభ్యాం నమః,
రాఘ వేంద్రాయ మధ్యమాభ్యాం నమః ||

నమః అనామికాభ్యాంనమః
ఇతిక నిష్ఠికాభ్యాంనమః
శ్రీరాఘ వేంద్రాయ కరతలకరపృష్టాభ్యాం నమః ||

ఇతికరన్న్యాసః
అథ అంగన్న్యాసః ;
శ్రీం హృదయాయ నమః
“రాఘ వేంద్రాయ శిరసే స్వాహా నమః ||

శిఖాయై వషట్
శ్రీం కవచాయ హుమ్
రాఘవేంద్రాయ నేత్రాభ్యాం వౌషట్
నమః అస్త్రాయ ఫట్
ఇతి దిగ్బంధః ||

ధ్యానమ్

తప్త కాంచన సంకాశ మక్షమాలాం కమణ్డలుమ్
దోర్భ్యాం దధానం కాషాయవసనం రామమానసమ్
యోగీన్ద్రతీర్థ వంద్యాఘ్రం తులసీదామభూషితమ్
జ్ఞానభ క్తి తపః పూర్ణం ధ్యాయేత్సర్వార్థసిద్ధయే.

పుటము బెట్టిన పసిడివంటి దేహకాంతి కలవాడును, ఒక చేత జపమాలను, వేఱక చేతక మండలువును దాల్చి కాషాయ వస్త్రములను ధరించి యున్నవాడును, సదా శ్రీరామపర బ్రహ్మ మందు మనస్సును నిల్పినవాడును, తులసీదళమాలలను ధరించిన వాడును, యోగీంద్రతీర్థాదులచే పాదాభివందనములను బొందు వాడును, భ క్తి జ్ఞానతపసాదులచే పరిపూర్ణు డైనవాడును నగు శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామిని సకలార్థసిద్ధికొఱకు ధ్యానించెదను.

శ్రీవారిమంత్రమునకు అధిదేవతాపర మగు అర్థముగూడ స్ఫురించును. ఓం = ఓంకారస్వరూపుడును; శ్రీ = లక్ష్మీ స్వరూపురా లగుసీతతో గూడినవాడును, రాఘవేంద్రాయ = రఘువంశమందు శ్రేష్ఠు డగు రామచంద్రునకు, నమః = నమస్కారము.
“ఓం శ్రీ రాఘ వేంద్రాయ నమః”

షోడశోపచార పూజ
పదునాఱు ఉపచారములచే శ్రీవారిని పూజింపవలెను.

1. ధ్యానము, 2. ఆవాహనము, 3. అసనసమర్ప ణము, 4. పాద సమర్పణము, 5. 6. ఆచమన సమర్పణము, 7. మధుపర్క సమర్పణము, 8. అను లేపనసమర్పణము, 9. స్నానము సమర్పణము, 10. వస్త్ర సమర్పణము, 11. యజ్ఞోపవీతసమర్పణము, 12. ఆభరణ సమర్పణము, 13. గంధసమర్పణము, 14. అక్షతసమర్ప ణము, 15. పుష్పమాలా సమర్పణము, 16. ధూపదీప సమర్పణము.

తదనంతరము ఈ క్రింది విధముగ పూజలను కొనసాగింప వలెను.

1. నైవేద్యసమర్పణము
2. హస్తప్రయోళనార్థము అర్ఘ్యసమర్పణము
3. తాంబూల సమర్పణము
4. సువర్ణ దక్షిణాసమర్పణము
5. మంత్రపుష్పసమర్పణము
6. నీరాజన సమర్పణము
7. ప్రదక్షిణా చరణము.

తదనంతరము ఉత్తరపూజ నొనరింపవలెను.

1. ఛత్ర సమర్పణము,
2. చామర సమర్పణము,
3. దర్పణదర్శనము
4. వాద్యవాదనము
5. జయజయా కార సమర్పణము
6. నృత్యము
7. గీతము
8. సమస్తరాజోపచారమంత్రోపచార పూజాసమర్పణము
9. శ్రీకృష్ణార్పణము
10. సాష్టాంగదండప్రణామము.

ఇట్లుపూజను పూర్తి చేసి శ్రీవారి విగ్రహమును చేతులతో పైకెత్తి ఆరాధనా మహోత్సవమునకు అఱు దెంచిన సర్వులకు జూపించిన లెను.

మరిన్ని పూజా విధానాలు:

Saraswathi Prarthana In Telugu – సరస్వతీ ప్రార్థన

Saraswathi Prarthana In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సరస్వతీ ప్రార్థన గురించి తెలుసుకుందాం…

Saraswathi Prarthana Lyrics

సరస్వతీ ప్రార్థన

శ్లో॥ 1

యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా।
యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా
సామాంపాతుసరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥

సీ॥ మల్లెలు, చంద్రుండు, మంచు, ముత్తెపు దండ వలె శోభమెరిసెడి వాణియీమె ధవళ కాంతుల నొప్పి ధరియుంచు నీ తల్లి శుభ్ర వస్త్రంబును శోభగూర్ప ఉత్తమ వీణియ నొప్పు హస్తంబుల తెల్లకమలమె ఆ దేవి పీట బ్రహ్మ విష్ణువులును పరమేశ్వరుడు తాము నుతియింతురీమెను నోరు పండ.

తే॥ జడము నెలకొన, తాను, అజ్ఞానమందు
దాని పూర్తిగా తొలగించు తల్లియీమె
దేవి భగవతి విద్యల దేవి ఈమె
ఓ సరస్వతి రక్షించు ఉన్నతముగ.

తా॥ మల్లెపూలు, చంద్రుడు, మంచుకొండ, ముత్యాలదండ, వలె మెరిసి పోతున్న తెల్లటికాంతినిచ్చు శుభ్రమైన తెల్లని వస్త్రములు శోభకలిగిస్తుండగా, ఉత్తమమైన వీణియను చేతులలో ధరించి తెల్లటి పద్మమున కూర్చుని ఆ త్రిమూర్తులు తమ నోరుపండునట్లు నుతించుచుండగా, అజ్ఞాన జనితమైన జడత్వమును ఆమె సంపూర్తిగా తొలగ చేయగలదు. అట్టి భగవతీ విద్యలరాణి, ఓ సరస్వతీ నన్ను చక్కగా రక్షించుము తల్లీ!

శ్లో॥ 2

శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
సర్వదా సర్వదాSస్మాకం, సన్నిధి స్సన్నిధిం క్రియాత్॥

తే॥ వాణి! శరదృతు పద్మము వంటి నీదు
పద్మ వదనపు దర్శన భాగ్యమిమ్ము
కోర్కెదీరిచి పండిత గురువులకును
ఎల్లవేళల సన్నిధి నీయుగాక.

తా॥ ఓ సరస్వతీ! శరత్కాల పద్మమువంటి నీ ముఖము యొక్క దర్శన భాగ్యము కల్పించుము. నీవు మా కోరికలను తీర్చుదానవు. ఎల్లవేళల పండితులకు గురువులకు నీ సన్నిధి దొరుకుగాక.

శ్లో॥ 3

సరస్వతి! నమస్తుభ్యం, వరదే! కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా||

తే॥ ఎల్లయెడల సరస్వతి ఈయవమ్మ
వరములను నాకు వలయు రూపమును దాల్చు
వాణి! ఓయమ్మ! పద్మ సంభవుని రాణి!
విద్య మొదలిడ సిద్ధిని వేడెదమ్మ!

తా॥ ఓ సరస్వతీ! నాకు ఎప్పుడూ కోరిన వరములిచ్చి కరుణించుము. కావలసిన రూపమును ధరించగల ఓ వాణీ! నలువరాణీ విద్యను ఆరంభము చేయుటకు ముందు ఓ తల్లీ సిద్ధించు కృపను వేడెదను.

శా || 4

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా.

తా॥ ఈ జగత్తుకంతటికీ మోహనరూపివైన ఓ సరస్వతీదేవీ తెల్లటి పద్మముల వంటి కన్నులుగల భగవతీ! పూర్ణచంద్ర బింబము వంటి ముఖముగల ఓతల్లీ! నిన్ను ధ్యానించి పుస్తకమును నాచేత ధరించితిని. నీవు నామనసున నిలిచి విరివిగా మంచిమాటలను, శబ్దములను శోభకలుగునట్లుగా పలుకుము. నామాట యందు ప్రీతిపూర్వకముగా నుండుము.

ఉ.

క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుక వారిజ పుస్తకరమ్య పాణికిన్

తా॥ ఇసుక తిన్నెలవంటి పిరుదులు, తుమ్మెద రెక్కల వంటి ముంగురులు గలిగి పద్మసంభవుడైన బ్రహ్మను ఆకర్షించు కంఠస్వరము గలిగి, జపమాల, రామచిలుక, పద్మము, పుస్తకము ధరించిన సుందర హస్తములుగల ఓ వాణీ! నేలపై నెన్నుదురు తాకునట్లు వంగి నమ్రతతో నేను నీకు నమస్కరించెదను.

ఉ.

కాటుక కంటినీరు చనుఁ గట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటకగర్భురాణి నిను నాకటికిన్ గొనిపోయి యల్లక
ర్ణాటకిరాత కీచకులకమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ

తా॥ కైటభాసుర సంహారి ఆ శ్రీమహావిష్ణువు యొక్క ప్రియమైన కోడలివైన నా తల్లీ! సరస్వతీ నీ కాటుక కన్నులనుండి కారిన కన్నీరు నీ కుచద్వయముపై పడునట్లు రోదించెదవెందుకు? స్వర్ణగర్భుడైన ఆ బ్రహ్మ సతీమణీ! నిన్ను నా క్షుద్బాధ తీర్చుకొనుటకు తీసుకొనిపోయి అక్కడ యున్న ఆ కర్ణాట కిరాత కీచకులకు అమ్ముకోను. త్రికరణశుద్ధిగా చెప్పు నామాట నమ్ము.

ఉ.

అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్న దీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తివివిక్తనిజ ప్రభావ భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి నన్ గృపఁ జూడు భారతీ.

తా॥ తల్లీ! నూతన పద్మము వలె ప్రకాశించు హస్త పద్మములు గల దాన, శరచ్చంద్రుని వెన్నెల వలె ఆడంబరమైన సుందర రూపముగల దేవీ, ధరించిన నగలయొక్క రత్నదీపముల వంటి వెలుగులు ముద్దిడుచున్న దిక్కులుగల అమ్మా వేదవిదితమైన సహజ సిద్ధ ప్రభావముగల దాన, భావగగన వీధిలో యధేచ్ఛగా విహరించు సరస్వతీ మాతా! నన్ను దయజూడుము.

ఉ.

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేనరజతాచలకాశ ఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానఁగ నెన్నఁడు గల్గు భారతీ||

తా॥ ఓ సరస్వతీ దేవీ! శరత్కాల మేఘము (తెల్లగా) వలెను, చంద్రుని వలెను, కర్పూరము వలెను, పటిక వలెను, హంసవలెను, మల్లెల దండవలెను, మంచువలెను, సముద్రపు నురగవలెను, మంచుకొండ వలెను, ఆదిశేషుని వలెను, తెల్ల మందారము వలెను, పాల సముద్రము వలెను, తెల్లని పద్మము వలెను, ఆకాశ గంగవలెను, శుభకరమైన తెలుపు రంగుతో స్వచ్ఛముగా శోభించు నిన్ను నామనస్సున ఎప్పుడు చూడగల్గుదునో కదా!

మరిన్ని పూజా విధానాలు: