మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… ఈ క్రింద ఇచ్చిన లింకు నందు శ్రీ రాఘవేంద్ర కవచం ఇవ్వబడినది. అది ఏమిటో తెలుసుకుందాం…
Sri Raghavendra Kavacham In Telugu Lyrics
శ్రీ రాఘవేంద్ర కవచం
కవచం రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః |
వ్యమి గురువర్యస్య వాంఛితార్థ ప్రదాయకమ్ ||
1
మహాత్ముడు, యతి శ్రేష్ఠుడు, గురువర్యుడు నగురాఘ వేంద్రునియొక్క వాంఛితార్ధము నొసంగు కవచమును చెప్పుచున్నాను.
ఋషిరస్యప్పణాచార్య ఛందొనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీరాఘ వేంద్రగురురిష్టార్థ సిద్ధయే ||
2
ఈ కవచమునకు ఋషి అప్పణాచార్యులు, ఛందస్సు అనుష్టుప్పు, దేవత శ్రీరాఘ వేంద్రగురువు, ఇష్టార్థసిద్ధి కొఱకు ఇది చెప్పబడినది.
అష్టోత్తరశతం జాప్యం భ క్తియు క్తేన చేతసా |
ఉద్యత్ ప్రద్యోతనద్యోతద్భర్మ కూర్మాస నేస్థితమ్ ||
3
ప్రకాశించు సూర్యునివలె వెలుగొందు సువర్ణకూర్మాస నమునందు కూర్చుండి భక్తితో గూడిన మనస్సుతో నూట యెనిమిది మారులు దీనిని జపింపవలెను.
ఖద్యఖద్యోతనద్యోత ప్రతాపం రామమానసమ్ |
ధృత కాషాయవసనం తులసీహారవక్షసమ్ ||
4
సూర్యునిప్రకాశము వంటి ప్రతాపము గలవాడు, రామ మానసుడు, కాషాయ వస్త్రములను ధరించినవాడు, తులసీ మాలలచే శోభిల్లు వక్షస్థలము గలవాడు.
దోర్దండ విలసద్దండ క మండలువిరాజితమ్ |
అభయజ్ఞానముద్రాక్షమాలసీల కరాంబుజమ్ ||
5
భుజదండములయందు విరాజిల్లు దండకమండలములు గలవాడు, అభయజ్ఞానముద్ర అక్షమాల హస్తమునందు గలవాడు.
యోగీంద్రవంద్య పాదాబ్జం రాఘవేంద్రగుణం భజే
శిరోరక్షతు మే నిత్యం రాఘ వేంద్రో౭ఖ లేష్టదః ||
6
యోగీంద్రులచే నమస్కరింపదగు పాదపద్మములు గలవాడు నగు రాఘవేంద్ర గురువును సేవించుచున్నాను. సమ స్తవాంఛలను దీర్చునట్టి రాఘ వేంద్రుడు నిత్యము నాశిరస్సును రక్షించుగాక !
పాపాద్రిపాట నే వజ్రః కేశాన్ రక్షతు మే సదా !
క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః ॥
7
పాపములనెడు పర్వతమును ఛేధించుటయందు వజ్రా యుధము వంటివాడై న రాఘవేంద్రుడు ఎల్లప్పుకునా కేశములను రక్షించుగాక ! భూసురగణముల కధీశుడు, గురువునగు శ్రీరాఘ వేంద్రుడు నా ముఖమును రక్షించుగాక !
హరి సేవాలబ్ధసర్వసంపత్ ఫాలం మమావతు |
దేవస్వభావోఒవతు మే దృశౌ తత్వప్రదర్శకః ||
8
హరిసేవవలన లభించిన సర్వసంపదలు గలిగిన రాఘ వేంద్రుడు నాఫాల భాగమును కాపాడుగాక ! దేవస్వభావుడు, తత్త్వజ్ఞానమును ప్రదర్శించువాడు నగు రాఘ వేంద్రుడు నాదృక్కులను కాపాడుగాక !
ఇష్టప్రదానే కల్పద్రుః శ్రోత్రే శ్రుత్యర్థబోధకః |
భవ్యస్వరూపో మే నాసాం జిహ్వంమేవతుభవ్యకృత్ ||
9
ఇష్టార్థముల నొసంగుటయందు కల్పవృక్షమువంటివాడు శ్రుత్యర్థములను బోధించువాడు నగురాఘ వేంద్రుడు నాశ్రోత్ర ములను (చెవులను) భవ్య స్వరూపుడు నానాసికను, శుభంకరుడు నాజిహ్వను (నాలుకను) రక్షించుగాక !
ఆస్యం రక్షతు మే దుఃఖతూలసంఘాగ్ని చర్యకః |
సుఖధై.ర్యాదిసుగుణో భ్రువౌ మమ సదావతు ||
10
దుఃఖములనెడు దూది మూటలను అగ్నివలె దగ్ధము చేయువాడు నా ముఖమును, సుఖము ధైర్యము మున్నగు సుగుణములు గలవాడు నా కనుబొమ్మలను ఎల్లప్పుడు రక్షించుగాక !
ఓస్టౌ రక్షతు మే సర్వగ్రహనిగ్రహశ క్తిమాన్ |
ఉపప్ల వోదధి సేతుర్దంతాన్ రక్షతు మే సదా ||
11
సర్వగ్రహములను నిగ్రహించుటయందు సామర్ధ్యము గలవాడు నా ఓష్ఠములను (పెదవులను), ఉపద్రవములనెడు సముద్రమునకు సేతువువంటివాడు నా దంతములను ఎల్లప్పుడు రక్షించుగాక !
నిర స్తదోషో ”మే పాతు కపోతా సర్వపాలకః |
నిరవద్యమహావేషః కంఠం మే౭వతు సర్వదా ||
12
దోషములు లేనివాడు, సర్వపాలకుడు నాక పోలములను (చెంపలను), దోషము లేని మహా వేషముగలవాడు నా కంఠమును అన్ని వేళల రక్షించుగాక !
కర్ణమూలే తు ప్రత్యర్థి మూకత్వకరవాఙ్మమ |
బహువాదిజయీ పాతు హస్తా స త్తత్వవాదకృత్ ||
13
ప్రత్యర్థులను మూగివారినిగా జేయువాడు. నా కర్ణములను. (చెవులను) పెక్కండ్రు వాదులను జయించువాడు, సత్తత్వమును గూర్చి వాదించువాడు నా హస్తములను రక్షించుగాక!
కరౌ రక్షతు మే విద్వత్ పరిజ్ఞేయని శేష వాన్ |
వాగ్వైఖరీభవ్య శేషజయీ వక్ష స్థలం మమ ||
14
విద్వాంసులు దెలిసికొన దగిన విశేషములు గలవాడు నా కరములను రక్షించుగాక ! వాగై ఖరి చేత గొప్పవాడైన అది శేషువును జయించినవాడు నా వక్షస్థలమును రక్షించుగాక !
సతీసంతానసంపత్తి భ క్తిజ్ఞానాదివృద్ధికృత్ |
స్తనౌ రక్షతు మే నిత్యం శరీరావద్యహానికృత్ ||
15
పత్నీ పుత్రసంతాన సంపదను భ క్తిజ్ఞానాదులను వృద్ధి చేయువాడు, శరీరము నందలి దోషములను నశింప జేయు వాడు నగురాఘ వేంద్రుడు నా స్తనములను రక్షించుగాక!
పుణ్యవర్ధనపాదాబ్జాభి షేకజలసంచయః |
నాభిం రక్షతు మే పార్శ్వౌ ద్యునదీతుల్య సద్గుణః ||
16
పుణ్యమును పెంచునట్టి పాదపద్మముల యందలి అభిషేక జలముయొక సమూహముగలవాడు నానాభిని రక్షించుగాక. ఆకాశగంగతో సమాన మైన సద్గుణములుగలవాడు రెండువైపుల నన్ను రక్షించుగాక !
పృష్టం రక్షతు మే నిత్యం తాపత్రయవినాశకృత్ |
కటిం మే రక్షతు సదా వంధ్యా సత్పుత్రదాయకః ||
17
తాపత్రయమును నాశముచేయువాడు ఎల్లప్పుడు నాపృష్టమును ( వెనుక భాగమున్ను రక్షించుగాక ! గొడ్రాలికి సత్పుత్రులనొసంగువాడు ఎల్లప్పుడు నా కటి (నడుమును) భాగమును రక్షించుగాక !
జఘనం మే౭వతు సదా వ్యంగస్వంగ సమృద్ధికృత్ |
గుహ్యం రక్షతు మే పాపగ్రహారిష్ట వినాశకృత్ ||
18
వికలాంగులకు సహితముమంచి అవయవముల యొక్క పాటవము నొసంగువాడు నిత్యము నాజఘనములను (పిరుదులను) రక్షించుగాక! పాపగ్రహాదుల వలన సంభవించు అనర్థములను నాశన మొనరించువాడు నాగుహ్యాంగములను రక్షించుగాక !
భక్తాఘవిధ్వంసకరనిజమూర్తి ప్రదర్శకః |
మూర్తిమాన్ పాతు మేరోమం రాఘవేంద్రో జగద్గురుః ||
19
భక్తుల పాపములను విధ్వంస మొనరించునట్టి తన స్వరూపమును ప్రదర్శించువాడు, జగద్గురువు నగు శ్రీరాఘ వేంద్ర స్వామి రోమములను మూర్తిమంతుడై రక్షించుగాక !
సర్వతంత్ర స్వతంత్రో సౌ జానునీ మే సదా౭వతు |
జంఘే రక్షతు మే నిత్యం శ్రీమధ్వమతవర్ధనః ||
20
సర్వతంత్ర స్వతంత్రు డైనవాడు నాజానువులను (మోకాళ్ళను) రక్షించుగాక! మధ్యమత వర్ధను డైనవాడు నాజంఘములను (పిక్క్లను) రక్షించుగాక !
విజయీంద్రక రాజ్జోత సుధీంద్రవరపుత్రకః |
గుల్ఫౌ శ్రీరాఘ వేంద్రో మే యతిరాట్ సర్వదావతు ||
21
శ్రీవిజయీంద్ర కరపద్మములనుండి ఉద్భవించినవాడైన సుధీంద్రునివరపుత్రుడు, శిష్యుడు, యతీశ్వరుడు నైనశ్రీరాఘ వేంద్రస్వామి నాగుల్ఫములను (చీలమండలను రక్షించుగాక !
పాదౌ రక్షతు మే సర్వఅభయహరీ కృపానిధిః |
జ్ఞాన భక్తి సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్ధనః ||
22
సర్వజనులకు అభయము నిచ్చునట్టిదాయానిధి, జ్ఞానము, భక్తి, సుపుత్రులను, ఆయుష్యమును, యశశును, సంపదను, పుణ్యమును వృద్ధి యొనరించువాడు. నా పాదములను రక్షించుగాక !
కరపాదాంగులీస్సర్వా మసూవతు జగద్గురుః |
ప్రతివాడి జయస్వంత భేదచిహ్నాదరో గురుః ||
23
ప్రతివాదులను జయించునపుడు తన హృదయమున భేద (ద్వైతచిహ్నమును) ఆదరమున ధరించు చిహ్నమును జగద్గురువు నా కరపాదాంగుళీయకములను రక్షించుగాక !
సఖానవతు మే సర్వాన్ సర్వశాస్త్ర విశారదః |
అపరోక్షకృతశ్రీశః ప్రాచ్యాం దిశి సదావతు ||
24
సర్వశాస్త్రవిశారదుడు నా నఖములను రక్షించుగాక ! శ్రీపతిని ప్రత్యక్ష మొనరించుకొనినవాడు, నన్ను తూర్పుదిక్కు నందు సదా రక్షించుగాక !
స దక్షిణే చావతు మాం సముపేక్షిత భావజః ।
అపేక్షితప్రదాతా చ ప్రతీచ్యామవతూ ప్రభుః ॥
25
మన్మథుని ఉపేక్షించినవాడు నన్ను దక్షిణదిక్కునందు సదారక్షించుగాక ! అపేక్షితములు (కోరినకోర్కెలు) నిచ్చు ప్రభువు నన్ను పడమర దిక్కునందు రక్షించుగాక !
Sri Raghavendra Kavacham In Telugu
దయాదాక్షిణ్య వై రాగ్యవాక్పాటవముఖాంకితః |
సదోదీచ్యామవతు మాం శాపానుగ్రహశక్తిమాన్ ||
26
దయ, దాక్షిణ్యము, వైరాగ్యము, వాక్పాటవములతో కూడిన ముఖము కలవాడు, శాపానుగ్రహశక్తి కలవాడు, నన్ను ఉత్తరదిక్కు నందు సదా రక్షించుగాక !
నిఖి లేంద్రియదోషఘ్నో మహానుగ్రహకృద్గురుః |
అధశోర్ధ్వం చావతు మామాష్టాక్షరమనూదితః ||
27
సర్వేంద్రియ దోషములను పోగొట్టి మహానుగ్రహమును సంపాదింప జేయునట్టి గురువు నా అధో దేశమును, అష్టాక్షర మంత్రముచే నిరూపితు డైనగురువు నా ఊర్ధ్వ దేశమును రక్షించుగాక !
ఆత్మాత్మీయాఘరాశిఘ్నా మాం రక్షతు విధిక్షు చ |
చతుర్ణాం చ పునర్థానాం దాతా ప్ర్రాతః సదావతు ||
28
నా యొక్కయు, నా ఆత్మీయుల యొక్కయు, పాప సమూహములను నాశన మొనరించు నట్టివాడు, ధర్మార్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల నిచ్చు నట్టివాడు, దిక్కులయందు, విదిక్కులందు నన్ను రక్షించుగాక!
సంగ మ్కేవతు మాం నిత్యం తత్వవిత్ సర్వసౌఖ్యకృత్ |
మధ్యాహ్నేగమ్యమహిమా మాం రక్షతు మహాయశాః ||
29
తత్వములు నెరింగినవాడు, సర్వ సౌఖ్యములను సంపా దించువాడు, మధ్యాహ్న సమయమున మహిమ తెలియుటకు శక్యముగానివాడు నన్ను సంగమమున రక్షించుగాక !
మృతపోత ప్రాణదాతా సాయాహ్నే మాం సదావతు |
వేదిస్థ పురుపోజ్జీవీ నిశీథే పాతు మాం గురుః ||
30
చనిపోయిన బాలకులకు ప్రాణదాత నన్ను సాయం కాలమున రక్షించుగాక! అరుగుపైనున్న పురుషుని జీవింప జేసిన వాడు సన్ను రాత్రియందు రక్షించుగాక !
వహ్నిస్థమాలికోద్ధర్తా వహ్ని తాపాత్సదావతు |
సమగ్రటీకావ్యాఖ్యాతా గురు ర్మే విషయే: ఒవతు ||
31
అగ్నిలో పడిన రత్నమాలికను ఉద్దరించినవాడు, అగ్ని పాతమునుండి నన్ను రక్షించుగాక! సంపూర్ణముగ టీకా వాఖ్యాన మొనరించిన గురువు విషయములనుండి నన్ను సదా రక్షించుగాక !
కాంతా రేవతు మాం నిత్యం భాట్టసంగ్రహకృద్గురుః |
సుధాపరిమళోద్ధర్తా సుచ్ఛందస్తుసదావతు ||
32
భాట్ట సంగ్రహమహా గ్రంథమును రచించిన గురువు నన్ను అరణ్యములందు రక్షించుగాక! శ్రీమన్న్యాయ సుధకు పరిమళ వ్యాఖ్యానమును రచించినవాడు, మంచి అభిప్రాయముల యందు సదా నన్ను రక్షించుగాక !
రాజచోరవిష వ్యాధియాదోవన్యమృగాదిభిః |
అపస్మారాపహర్తా నః శాస్త్రవిత్ సర్వదావతు ||
33
రాజభయము, చోరభయము, విషవ్యాధులు, జలజంతువులు, వన్యమృగములు వీనినుండి రక్షించువాడు, సర్వ శాస్త్రములు నెరింగినవాడు నన్ను అపస్మార రోగమునుండి రక్షించుగాక !
గతౌ సర్వత్ర మాం పాతూపనిషదర్థ కృద్గురుః |
ఋగ్వ్యాఖ్యానకృదాచార్యః స్థితా రక్షతు మాం సదా ||
34
ఉపనిషదర్థములను ఆచరించిన గురువు అంతటా నన్ను రక్షించుగాక ! ఋగ్వేద వ్యాఖ్యానముల నొనరించిన గురువు, స్థితిలో నన్ను రక్షించుగాక !
మంత్రాలయనివాసీ మాం జాగ్రత్ కాలే సదావతు |
న్యాయముక్తావలీకర్తా స్వప్నే రక్షతు మాం సదా ||
35
మంత్రాలయమున నివసించువాడు నన్ను జాగ్రత్కాల మందు సదా రక్షించుగాక ! న్యాయముక్తావళి యను మహా గ్రంథమును రచించినవాడు నన్ను సదా స్వప్నములో రక్షించుగాక !
మాం పాతు చంద్రికావ్యాఖ్యాకర్తా సుప్తాహి తత్త్వకృత్ |
సుతంత్రదీపికాకర్తా ముక్తా రక్షతు మాం గురుః ||
36
చంద్రికా వ్యాఖ్యానమును రచించినవాడు, తత్త్వ మెరిగినవాడు, సుతంత్ర దీపికయను గ్రంథమును రచించినవాడు, నన్ను ముక్తిలో రక్షించుగాక !
గీతార్థసంగ్రహకర్తా సదా రక్షతు మాం గురుః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధి చంద్రోవతు సదానఘః ||
37
గీతార్థ సంగ్రహమును రచించిన గురుదేవుడు నన్ను యెల్లప్పుడు రక్షించుగాక! మధ్వ మత మనెడు క్షీరసాగరము నుండి ఉద్భవించిన చంద్రుడు నిత్యము నన్ను రక్షించుగాక !
ఇతి శ్రీ రాఘవేంద్రస్య కవచం పాపనాశనమ్ |
సర్వవ్యాధిహరం సద్యః పావనం పుణ్యవర్ధనమ్ ||
38
ఇది శ్రీరాఘవేంద్ర కవచము. పాపములను నశింప జేయునది. సర్వ వ్యాధులను హరించునది. ఇది సత్యము, పావనము, పుణ్యములను వృద్ధి చేయునది.
య ఇదం పఠతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణదృష్టిః స్యా దేడమూకోపివాక్పతిః ||
39
నియమముగా నిష్టకలవాడై నిత్యము ఈ కవచమును పఠించినచో, దృష్టి లేనివాడు పూర్ణ దృష్టివంతుడగును, మూగవాడు వాక్పతి యగును.
పూర్ణాయుః పూర్ణ సంపత్తి భ క్తి జ్ఞానాదివృద్ధికృత్ |
పీత్వా వారినలో యేన కవచేనాభిమంత్రితమ్ ||
40
ఈకవచముతో మంత్రించిన ఉదకమును ద్రావినచో పూర్ణాయుర్దాయము, పూర్ణ సంపద, భక్తి, జ్ఞానాభివృద్ధి కలవాడగును.
జహాతి కుషిగాన్ రోగాన్ గురువర్య ప్రసాదతః |
ప్రదక్షిణ నమస్కారాన్ గురో వృందావనస్య యః ||
41
గురు దేవునకు, బృందావనమునకు ప్రదక్షిణ నమస్కార ముల నొనరించినవాడు గురువు అనుగ్రహమువలన ఉదర రోగ ముల నన్నింటిని నశింపజేసికొనగలడు.
కరోతి పరయా భక్త్యా తదేతత్ కవచం పఠన్ |
పంగుః కుణిశ్చపోగండః పూర్ణాంగో జాయతేధ్రువమ్ ||
42
భ క్తి తోకూడుకొని ఈకవచమును పఠించువాడు, కుంటి వాడై నను అంగహీను డైసను పూర్ణాంగుడగును.
శేషాశ్చ కుష్టపూర్వాశ్చ నశ్యంత్యామయరాశయః |
అష్టాక్ష రేణ మంత్రేణ స్తోత్రేణ కవచేన చ ||
43
అష్టాక్షరమంత్రమును, కవచమును, స్తోత్రమును పఠించినచో కుష్ఠు ‘మొదలైన మిగిలిన భయంకర వ్యాధులు నశించిపోవును.
వృందావనే సన్నిహితమభిషి చ్య యథావిధి |
యంతే మంత్రాక్షరాణ్యష్టా విలిఖ్యాత్ర ప్రతిష్టితం ||
44
బృందావనము చెంత మంత్రాక్షరములను యెనిమిదింటిని లిఖించి, యంత్రమునుంచి యథావిధిగా అభిషేకింపవలెను.
షోడశై రుపచారైశ్చ సంపూజ్య త్రిజగద్గురుమ్ |
అష్టోత్తర శతాఖ్యాభిరర్చయేత్ కుసుమాదిభి ||
45
త్రిజగములకు గురువైన శ్రీరాఘ వేంద్రస్వామిని పోడ శోపచారములతో పూజింపవలెను. అష్టోత్తరశతనామములను బల్కుచు పుష్పములు నర్పింపవలెను…
ఫలైశ్చ వివిధై రేవ గురోరర్చాం ప్రకుర్వతః |
నామశ్రవణమా తేణ గురువర్య ప్రసాదతః ||
46
భూత ప్రేతపిశాచాద్యాః విద్రవంతి దిశో దశ |
పఠేదేతత్ త్రికం నిత్యం గురో వృందావనాంతికే ||
47
నిత్యము బృందావనము చెంత యీ మూడింటిని ( స్తోత్ర, కవచ, మంత్రములను) పఠించి వివిధములగు ఫలములతో గురు దేవు నర్చించినచో, గురుదేవుని నామశ్రవణ మాత్రముననే ఆయన ప్రసాదమువలన భూత ప్రేతపిశాచాదులు పది దిక్కులకు పారిపోవును.
దీపంసం యోజ్య విద్యావాన్ సభాసు విజయీభవేత్ |
రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాది పీడనమ్ ||
48
విద్యావంతు డైనవాడు బృందావనము చెంత దీపమును వెలిగించినచో సభలలో విజయమును పొందగలడు. అతడు రాజువలన, చోరులవలన, వ్యాఘ్రాది క్రూర జంతువులవలన, సర్పములవలన, మొసళ్ళవలన పీడ లేనివాడగును.
కవచస్య ప్రభావేన భయం తస్య నజాయతే |
సోమసూర్యోపరాగాదికాలే వృందావనాంతికే ||
49
సూర్యచంద్ర గ్రహణ సమయములో బృందావనము చెంత నీకవచమును పఠించిన వానికి ఈకవచప్రభావమున ఎట్టి భయము యుండదు.
కవచాదిత్రికం పుణ్యం అప్పణాచార్యదర్శితం |
జపేద్యః స ధనం పుత్రాన్ భార్యాం చ సుమనోహరామ్ ||
50
శ్రీఅప్పణాచార్యులు రచించిన పుణ్యమయము లేన ఈకవచత్రయము (కవచము, స్తోత్రము, మంగళాష్టకము) ను జపించువాడు ధనమును, భార్యను, పుత్రులను, సంపదలను పొందగలడు.
జ్ఞానం భక్తిం చ వై రాగ్యం భుక్తిం ముక్తిం చ శాశ్వతీమ్ |
మోదతే నిత్యం గురువర్య ప్రసాదతః ||
51
ఈకవచత్రికమును కవచము, స్తోత్రము, మంగళాష్ట కము) పఠించినవాడు ” గురుదేవుని అనుగ్రహము వలన జ్ఞాన మును, భక్తిని, వైరాగ్యమును, భక్తిని, శాశ్వతమగు ముక్తిని పొంది సంతోషము కలవాడగును.
మరిన్ని కవచాలు మీకోసం: