Balakanda Sarga 70 In Telugu – బాలకాండ సప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ సప్తతితమః సర్గలో రాముడు విశ్వామిత్రునితో కలిసి సిధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పుత్రకామేష్ఠి యాగం జరుగుతుంది. యాగం సమయంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు యాగాన్ని భగ్నం చేయడానికి వస్తారు. రాముడు, లక్ష్మణుడు వీరిని వధించి యాగాన్ని రక్షిస్తారు. యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, అగ్నిదేవుడు దశరథ మహారాజుకు పాయసం అందిస్తాడు, దానిని సంతానము కోసం పంపిస్తారు.

|| కన్యావరణమ్ ||

తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||

1

భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః |
కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీమధ్యవసచ్ఛుభామ్ ||

2

వార్యాఫలకపర్యంతాం పిబన్నిక్షుమతీం నదీమ్ |
సాంకాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్ ||

3

తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా స మే మతః |
ప్రీతిం సోఽపి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ ||

4

ఏవముక్తే తు వచనే శతానందస్య సన్నిధౌ |
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్సమాదిశత్ ||

5

శాసనాత్తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః |
సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా ||

6

సాంకాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్ |
న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చింతితమ్ ||

7

తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః |
ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః ||

8

స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్ |
సోఽభివాద్య శతానందం రాజానాం చాతిధార్మికమ్ ||

9 [జనకం]

రాజార్హం పరమం దివ్యమాసనం సోఽధ్యరోహత |
ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావమితౌజసౌ ||

10

ప్రేషయామాసతుర్వీరౌ మంత్రిశ్రేష్ఠం సుదామనమ్ |
గచ్ఛ మంత్రిపతే శీఘ్రమైక్ష్వాకమమితప్రభమ్ ||

11

ఆత్మజైః సహ దుర్ధర్షమానయస్వ సమంత్రిణమ్ |
ఔపకార్యాం స గత్వా తు రఘూణాం కులవర్ధనమ్ ||

12

దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్ |
అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః ||

13

సత్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయపురోహితమ్ |
మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా ||

14

సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే |
స రాజా మంత్రిసహితః సోపాధ్యాయః సబాంధవః ||

15

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్ |
విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్ ||

16

వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవానృషిః |
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః ||

17

ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠస్తే యథాక్రమమ్ |
తూష్ణీం‍భూతే దశరథే వసిష్ఠో భగవానృషిః ||

18

ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోహితమ్ | [పురోధసమ్]
అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః ||

19

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః |
వివస్వాన్కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః ||

20

మనుః ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ ||

21

ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్కుక్షిరిత్యేవ విశ్రుతః |
కుక్షేరథాత్మజః శ్రీమాన్వికుక్షిరుదపద్యత ||

22

వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాతేజా అనరణ్యో మహాయశాః ||

23 [ప్రతాపవాన్]

అనరణ్యాత్పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోః సుతః |
త్రిశంకోరభవత్పుత్రో ధుంధుమారో మహాయశాః ||

24

ధుంధుమారాన్మహాతేజా యువనాశ్వో మహాబలః |
యువనాశ్వసుతస్త్వాసీన్మాంధాతా పృథివీపతిః ||

25

మాంధాతుస్తు సుతః శ్రీమాన్సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ ||

26

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో నామ నామతః |
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ ||

27

యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశబిందవః ||

28

తాంస్తు స ప్రతియుధ్యన్వై యుద్ధే రాజ్యాత్ప్రవాసితః |
హిమవంతముపాగమ్య భార్యాభ్యాం సహితస్తదా ||

29

అసితోఽల్పబలో రాజా కాలధర్మముపేయివాన్ |
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్ ||

30

ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ |
తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః ||

31

భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్ ||

32

వవందే పద్మపత్రాక్షీ కాంక్షంతీ సుతముత్తమమ్ | [ఆత్మనః]
తమృషిం సాఽభ్యుపాగమ్య కాలిందీ చాభ్యవాదయత్ ||

33

స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని |
తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాయశాః ||

34 [బలః]

మహావీర్యో మహాతేజా అచిరాత్సంజనిష్యతి |
గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే ||

35

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా |
పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత ||

36

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
సహ తేన గరేణైవ జాతః స సగరోఽభవత్ ||

37

సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః ||

38

భగీరథాత్ కకుత్స్థోఽభూత్ కకుత్స్థస్య రఘుః సుతః |
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ||

39

కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్జాతశ్చ శంఖణః |
సుదర్శనః శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్ ||

40

శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః |
మరోః ప్రశుశ్రుకస్త్వాసీదంబరీషః ప్రశుశ్రుకాత్ ||

41

అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః | [పృథివీపతిః]
నహుషస్య యయాతిశ్చ నాభాగస్తు యయాతిజః ||

42

నాభాగస్య బభూవాజో అజాద్దశరథోఽభవత్ |
అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

43

ఆదివంశవిశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణామ్ |
ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్ ||

44

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |
సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తతితమః సర్గః ||

Balakanda Sarga 70 Meaning In Telugu

మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు.

“శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు.

వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు.

సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు.

దశరథునితో ఇలా అన్నాడు.

“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.

సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు.

“ఓ జనక మహారాజా! మా కులగురువు, వసిష్ఠుడు అని మీకు తెలియును కదా! బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వసిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు.” అని పలికి దశరథుడు వసిష్ఠునని వంక చూచాడు.

దశరథుని మాటలు విన్న వసిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! సభాసదులారా! ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆ వించింది.

ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు.

హైహయ రాజులైన హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శతృత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.

ఆ సమయములో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశ్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది.

చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి “ఓ భాగ్యశాలీ! నీ గర్భములో మహా బలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహా వీరుడు. తేజశ్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు.” అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజశ్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.

ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుత్తుడు. కకుత్తుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది.

రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాప వశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరుకూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు.

అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు. ఈ దశరథమహారాజు పుత్రులే రామలక్ష్మణులు.

ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా! వీరు మొదటి నుండీ విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు. వీరులు. సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్భయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Leave a Comment