Sri Mallikarjuna Prapatti In Telugu – శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

Sri Mallikarjuna Prapatti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Saila Mallikarjuna Prapatti In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్.

టీక. శంభో! = ఓ శంకర! జంభభిత్ = ఇంద్రుఁడు, పూర్వదేవ = రాక్ష శులు మొదలగువారిచేత, ప్రణత = నమస్కరింపఁబడిన, పదసరోజిద్వంద్వ = పాదపద్మమాల జంటగలఁవాడా! నిర్ద్వంద్వ = ద్వంద్వభావము లేనివాఁడా!బంధో! = ఆపద్బాంధవుఁడా! జయ, జయ, జయ! = ముమ్మాటికి నీకు జయమగుఁగాక ! జన్మమ సంహారకార! = జన్మస్థితిలయకార = కుఁడైనవాఁడా! ప్రణయ సగుణమూర్తే! = భక్తియే గుణముగాఁగల మూర్తీ! జయ, జయ, జయ = ముమ్మాటికి జయము నొందుమ!, ప్రశన్నాన్ = నిన్ను శరణన్న, ఆస్మాన్ = మమ్ము, పాలయ= పరిపాలిం పుము !

తా. దేవాసురులచే నమస్కరింపఁబడు పాదపద్మయుగళము గలవాఁడా! అద్వైతమూర్తి ! ఆపద్బాంధవ! జన్మస్థితి లయ కారక ప్రపన్నులమగు మమ్ము పాలింపుమ ! నీకు జయ మగుఁ గాక !

వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్,
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః.

టీక. వల్గదపొంగరేఖం = ఏటవాలుగనున్న క్రీగంటి రేఖలఁ గలిగినట్టిదగ్గు, వధూముఖం = తన కాంతాముఖమును, అఖండితానందకర ప్రసాదం = అమితానందానుగ్రహము గలుగునట్లుగా, విలోకయన్ = చూచుచు, విస్ఫురదాత్మభావః = ప్రకాశించు నాత్మస్వరూపముగానున్న, సః = ఆ, శ్రీగిరిసార్వభౌమః = శ్రీశైలసార్వభౌముఁడైన శివుఁడు, మే = నాకు, గతిః = దిక్క గుఁగాక !

తా. క్రీఁగన్నులఁజూచుచున్న ఆత్మకాంతాముఖము నమితా నందానుగ్రహములతోఁ జూచుచు నాత్మస్వరూపియై ప్రకాశించు నా మల్లికార్జున ప్రభువు నాకు గతియగుఁగాక!

కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః,
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః.

టీక. కురంగపాణి = లేడిని చేతియందుఁగలవాఁడును, కరుణావలోకః = దయా వీక్షణములు గలవాఁడును, సురోత్తమః = దేవతలలో నుత్తముఁడును, చంద్రకళావతంసః = చంద్రకళను శిరోమణిగ ధరించినవాఁడును, వధూసహాయః = వామభాగార్ధమున నాఁడుతోఁడుగలవాఁడును, అగు, అసౌ = ఈ, శ్రీగిరిభాగ్యరాశిః = శ్రీశైలేశ్వరుఁడు, సకలేష్టదా = సమస్తాభీష్టము లిచ్చువాఁడు, భవతి = అగుచున్నాఁడు.

తా. దేవోత్తముఁడు నర్ధనారీ రూపుఁడగు చంద్రకళాశేఖరుడు తేడి నొకచేతథరించి దయారస మొలుకు చూపులతో నీ శ్రీశైల వాసుఁడుగా నుండెను, అట్టి యీ దేవుఁడు మాకు సకలాభీష్టము లొసఁగుగాక !

Sri Saila Mallikarjuna Prapatti In Telugu

సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్,
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున  మహాలింగం శివాలింగితమ్.

టీక. సంధ్యారంభ = సంధ్యానట నారంభ సమయమునందు, విజృంభితమ్ = ప్రకటితమైనట్టియు; శ్రుతిశిరస్థాన = ఉపనిషత్ప్రదేశములయొక్క, అంతర = నడుమ, ఆధిష్ఠితం = నిండియున్నట్టియు, సప్రేమ = ప్రీతితో గూడిన, భ్రమరా = భ్రమరాదేవితో, అభిరామం = మనోహరమైనట్టియు, అసకృత్ = మాటిమాటికి, సద్వాసనా = సువాసనచే, శోభితం = ప్రకాశించునట్టియు, భోగీంద్రాభరణం = సర్పరాజాభరణముల గల్గినట్టియు, సమస్తసుమనఃపూజ్యం = పండితుఅందఆకు (ఎల్లదేవతలకు) పూజ్యం = పూజింపఁజగినట్టియు, గణావిష్కృతమ్ = సత్త్వరజోగుణ ములచేఁ బ్రకటిత మైనదియు, శివాలింగితం = పార్వతిచే నాలింగితమైన, శ్రీశైలమల్లికార్జున మహాలింగం = శ్రీ శైలమల్లికార్జున మహాలింగమును, సేవే = సేవించుచున్నాను.

తా. సంధ్యానటన విజృంభితమును, ఉపనిషత్సం వేద్యమును, భ్రమరాంబా ప్రేమాభిశోభితమును, సగుణనిర్గుణోపేతమును, శేషాహిభూషితమును, సర్వదేవతాపూజ్యమును పార్వతీప్రియమైన శ్రీగిరి మల్లికార్జున లింగమును నేను. సేవించుచున్నాను.

యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః,
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ.

టీక. యా = ఏ దేవి, సచరాచరస్య = స్థావరజంగమాత్మకమైన, జగతః = ప్రపంచమానకు, మూలం = ప్రథానమైనదో (ప్రకృతియైనదో) పుంసః = ఆదిపురషుఁడైన యీశ్వరునకు, పురాణీ = ప్రాచీనమైన, సఖీ = చెలికత్తియయో, వ్యక్తాత్మా = ఆకారముతోఁ బ్రకటితమైనదో, జగ తాం = లోకములయొక్క, పరిపాలనాయ= రక్షణమకొఱకు, ఆప్తావ తారస్థితిః = పొందఁబడిన జన్మలంగలదో, దుష్టధ్వంస = దష్టులనాశ మొనర్చిట, సత్ = నుఁచివారలకు, ఇష్టదాన = అభీష్టములిచ్చుటయను, విధయే = పనికొఱకు, నానాసనాధ్యానినీ = శ్రీ గిరిశిఖరమున నివసించిన, భ్రామరీ = ఆ భ్రమరాఁబిక, మే నాకు, మే నాకు, శ్రేయస్కరీ = మంగళప్రదురాలు, భవతు = ఆగుఁగాక !

తా. ఏ దేవి చరాచరజగత్తున కంతటికి మూలప్రకృతియో, పురాణపురుషుఁడై న యీశ్వరునకే దేవి పట్టపురాణియో, లోకుల సనుగ్రహింప నేదేవి రూపమును ధరించినదో, దుష్ట సంహారము, శిష్టరక్షణ మొనర్చుచు సర్వాభీష్టములను భక్తుల కనేక స్థలములనుండి యొసంగుచున్నదో ఆ శ్రీగిరి భ్రమరాఁబిక నాకు శుభప్రదురాలగుఁగాక !

యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే,
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః.

టీక . ఏతత్ = ఈ, ఆఖిలం = సమస్తజగత్తు, యత్తేజః పరమాణుః = ఏ దేవి యొక్క తేజో రూపపరమాణువో, ఏతత్ = ఈ భూతం, భావి, భవత్ = జరిగినది (పుట్టినది) భావి = పుట్టఁబోవుంది, భగత్ = జరుగుచున్న, చరాచరజగత్ = స్థావరజంగమాత్మళమగు ప్రపంచమును నానాస్ఫురన్నా మభిః = తేజోవంతములగు ననేక నామములతో, ఆంతరే = లోపలను, బహిశ్చా = వె· పలను, ధత్తే = ఏ దేవి ధరించుచున్నదో, సా = ఆ, శివసఖీ = శివప్రియము, శ్రీ శైలవాసోత్సుకా = శ్రీ శైలశిఖర వాసమందు వేడ్కఁ గలదియు, ఆశ్రితలోక కల్పలతికా = ఆశ్రితజనమునకుఁ గల్పవృక్షమువంటిదైన, సాక్షాత్ప్రమరాంబికా = ప్రత్యేక్ష భనురాంబిక, సః = మాకు, భూయాంని = అనేకములగు, శ్రేయాంసి = శుభములను, దిశ్యాత్ = ఇచ్చునుగాక !

తా. ఏ జగదంబికయొక్క తేజోవిశేషమే యీ చరాచర ప్రపంచరూపమో, భూత భవిష్య ద్వర్తమాన సర్వ ప్రపంచము నేదేవి యనేకరూప నామములతో ధరించుచున్నదో, ఆ శ్రీశైలవాసిని యగు భ్రమరాంబిక మాకు శుభము లొడఁ గూర్చుఁగాక !

శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా,
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్.

టీక. మే = నాకు, తరుణేందుశేఖరః = బాలచంద్ర శేఖరుఁడు, శరణం = రక్షకుఁడు; గిరిరాజకన్యకా = హిమవత్పు తియగు పార్వతి, మే = నాకు, శరణం = రక్షణము. తౌ = ఆ, ఉభౌపునః = పార్వతీపరమేశ్వరు : లిరువురును, శరణ మేవ = రక్షకులేయగుదురుగాక! ఆన్యత్ = ఇతరమగు, (ఈ పార్వతీపర మేశ్వరులకంటే) దైవతం = దైవమును, శరణం = రక్షణను, నోప్రేమి = పొందను,

తా. నాకా చంద్రకళావతంసుఁడు, శ్రీగిరి భ్రమరాంబికయు రక్షకులగుదురు గాక! ఆ యుభయమునకున్న నితరదైవ మెద్దియు నాచే శరణ మనఁబడ కుండుఁగాక!

మరిన్ని ప్రపత్తులు:

Sri Venkateswara Prapatti In Telugu – శ్రీ వేంకటేశ ప్రపత్తిః

Sri Venkateswara Prapatti

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Prapatti Telugu Lyrics

శ్రీ వేంకటేశ ప్రపత్తిః

ఈశానాంజగతోఒస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థలనిత్యవాసరసికాం తర్జాంతిసంవర్ధినీమ్।
పద్మాలంకృతపాణిపల్ల వయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥

1

శ్రీమః కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శ క్త నతవత్సల సర్వశ్లేషిజా।
స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

2

ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప
సౌరభ్యసౌరభకరౌ సమసన్ని వేశా|
సౌమ్యౌ సదాఒనుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

3

సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ
సౌరభ్యనిర్భరసరోరుహసామ్యవార్తామ్|
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతా
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

4

రేఖామయధ్వజసుధాకలశాతపత్ర-
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః|
భవ్యైరలంకృతతలౌ పరతత్త్వచి హ్నైః
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

5

తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బా హ్యైర్మహోభిరభిభూతమ హేంద్రనీలౌ|
ఉద్యన్నఖాంశుభిరుద స్తశశాంకథాసౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

6

సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఒపి సపది క్లమమాదధానౌ।
కాన్తావవాఙ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

7

లక్ష్మీమహీతదనురూపనిజానుభావ
నీలాదిదివ్యమహిషీ కరపల్ల వానామ్ |
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

8

నిత్యా౬౬నమద్విధిశివాదికిరీటకోటి
ప్రత్యు పదీ పనవరత్నమహఃప్రరో హైః|
నీరాజనావిధిముదారముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

9

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వఉత్స ఇతి భోగ్యతయాఒప్యుపాత్తా|
భూయ స్తథేతి తవ పాణితల ప్రదిష్టా
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

10

పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణా శరణం వ్రజేతి|
భూయో౬పి మహ్యమిహ తౌ కరదర్శితా తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

11

మన్మూర్ధ్ని కాళీయఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రిశిఖరే శిరసి ప్రతీనామ్|
చి త్తే౬ప్యనన్యమనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే॥

12

అమ్లానహృష్యదవనీతలకీర్ణ పుష్పా
శ్రీ వేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ।
ఆనందితాఖిలమనోనయనౌ తవైతే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

13

ప్రాయః ప్రపన్నజనతాప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశోరమృతాయమానౌ ।
ప్రాప్తో పరస్పరతులామతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

14

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసారతారకదయార్ద్రదృగంచలేన।
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితో తే
శ్రీ వేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥

15

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయము పేయతయా స్ఫురంత్యా।
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ ॥

16

ఇతి శ్రీ వేంకటేశ ప్రపత్తిః సమాప్తా

మరిన్ని కీర్తనలు:

Prapattulu | ప్రపత్తులు

Prapattulu

ప్రపత్తులు హిందూ ధర్మంలో ముఖ్యమైన అనుష్ఠానాల లో ఒకటి. ఈ అనుష్ఠానంలో భక్తులు తమ దోషాలను త్యజించి, దేవుని పాదపద్మాలను తమ జీవితంలో స్థానం ఇచ్చడం ఉంది. ప్రపత్తులను నిర్వహించే విధానం కేవలం దేవుడు తో సంబంధమైనది కాదు, అలాగే అవి ఆత్మాన్ని దేవుడి కార్యాన్ని పూర్తి చేయటానికి ఉపయోగపడే విధానంగా కూడా ఉంటాయి.

Prapattulu | ప్రపత్తులు

ఈ అనుష్ఠానం అనేది నిత్య, నైమిత్తిక, కామ్య ప్రపత్తులను విభజించే గురుత్వాకర్షణ శక్తిని ప్రకటించేది. ప్రపత్తులు ధర్మాన్ని, ధర్మ మరియు సమాజాన్ని అభివృద్ధి చేసేది కాదు, అవి తమ వ్యక్తిత్వంను కూడా తరలించడం అనే ఒక ఆదర్శ జీవన సాధనగా భావిస్తారు. ఈ క్రింది లింకుల ఆధారంగా ప్రపత్తుల గురించి తెలుసుకుందాం…