Vidya Diksha In Telugu – విద్యా దీక్ష

Vidya Diksha In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్యా దీక్ష నీతికథ.

విద్యా దీక్ష

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో యితర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అనికదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ)

చాలా రోజుల క్రితం మాట !
కశ్యపుడు అనేముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.

ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండే వారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు.

అలా సాగుతోంది.
అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షసగురువు చాలాకాలం తపస్సు చేసి మృతసంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు.

అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు. కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తనకుమారుడయిన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి:
‘శ్రీగురుభ్యోనమః ‘ అని పాదాలమీద వ్రాలి:
‘నేను అంగీరస వంశ్యడను, బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాత్యాసానికి వచ్చాను’ అన్నాడు.

శుక్రాచార్యులు ఆ కుర్రవాని వివయానికి చాలా సంతోషించి: ‘నాయనా! చాలా ఆనందం’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు.’

కచుడు రోజూ సూర్యోదయంకాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు.

శుక్రాచార్యులవారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు వదహారు దాటింది.

ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేకవిధాల తన ప్రేమను వ్యక్తంచేసేది. కచుడికి తవ విద్యాత్యాసం తప్ప మరోదృష్టి లేదు. పయిగా గురువుగారి కూతురు కమక సోదరభావంతోనే చూపేవాడు.

ఇలా ఉండగా –
రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు.
‘ దేవతల గురువయిన బృహస్పతి కొడుకు మన గురువులవద్ద విద్యా భ్యాసానికి వచ్చాడు? శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువుగారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది.

అది వీడు నేర్చుకు వెడితే మన వంశానికే ప్రమాదం. కనక వీట్టి అడవిలో చంపి పారేద్దాం’ అని నిశ్చయించారు.

గురు సేవాభావంతో అడవిలో అవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు.

ప్రొద్దు గ్రుంకింది.
చీకటి ముదురుతోంది.
రోజూ సాయం సంధ్యావేళకు ఆశ్రమంచేరే కచుడు అప్పటికీ రాక పోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితోచూచి, జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవనితో కచుని బ్రతికించాడు.

అది విన్న రాక్షసులకు కడుపు మండి పోయింది. బాగా ఆలో చించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కల్లు తెచ్చి శుక్రాచార్యులకు వివయంగా అందించారు.

ఆయన వెనుక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళారు.

మళ్ళీ చీకటి పడింది.

ప్రేమపాశంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది.
ఆయన జాలివడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది.
‘అమ్మా! ఈ రాక్షసులు వరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కల్లు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్బుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపం సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి.

వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు, అని పద్మాసనం వేసి, లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు.

కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు.
వస్తూనే తాను నేర్పిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు.

వెను వెంట వచ్చి దేవయాని :
‘ఏమయ్యా ః ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి పెడ కావా’ అంది.

‘ సోదరి గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లిలివి ‘, ‘ అన్నాడు.

దేవయానికి కోపం వచ్చి :
‘ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగ పడదు బా’ అంది,
‘ సోదరీ ! విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా! ఈ మృత సంజీవని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడక పోయినా నేను బోధిం చిన వారికి ఉపయోగపడుతుంది వెళ్ళు’, అని దేవలోకం చేరాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Kathopanishad In Telugu – కఠోపనిషత్

Kathopanishad In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. కఠోపనిషత్ భారతీయ దర్శన సాహిత్యంలో ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. ఇది యాజ్ఞవల్క్య శాఖలో ఉన్నది. వేదాంత దర్శనంలో ముఖ్యమైన ప్రమాణ గ్రంథంగా కనిపిస్తుంది. యోగ మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, మరణం, మరణానంతర జీవితం మొదలు చేస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు కఠోపనిషత్తు గురించి తెలుసుకుందాం.

Kathopanishad In Telugu Book

కఠోపనిషత్

ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు |
మా విద్విషావహై |

ఓం శాంతి: శాంతి: శాంతి: ||

|| అథ ప్రథమాధ్యాయే ప్రథమావల్లీ ||

ఓం ఉశన్ హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ |
తస్య హ నచికేతా నామ పుత్ర ఆస ||

1

తఁ హ కుమారఁ సన్తం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సోఽమన్యత ||

2

పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరిన్ద్రియాః |
అనన్దా నామ తే లోకాస్తాన్ స గచ్ఛతి తా దదత్ ||

3

స హోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి |
ద్వితీయం తృతీయం తఁ హోవాచ మృత్యవే త్వా దదామీతి ||

4

బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః |
కిఁ స్విద్యమస్య కర్తవ్యం యన్మయాఽద్య కరిష్యతి ||

5

అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాఽపరే |
సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః ||

6

వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ |
తస్యైతాఁ శాన్తిం కుర్వన్తి హర వైవస్వతోదకమ్ ||

7

ఆశాప్రతీక్షే సంగతఁ సూనృతాం
చేష్టాపూర్తే పుత్రపశూఁశ్చ సర్వాన్ |
ఏతద్వృఙ్క్తే పురుషస్యాల్పమేధసో
యస్యానశ్నన్వసతి బ్రాహ్మణో గృహే ||

8

తిస్రో రాత్రీర్యదవాత్సీర్గృహే మే-
-ఽనశ్నన్ బ్రహ్మన్నతిథిర్నమస్యః |
నమస్తేఽస్తు బ్రహ్మన్ స్వస్తి మేఽస్తు
తస్మాత్ప్రతి త్రీన్వరాన్వృణీష్వ ||

9

శాన్తసంకల్పః సుమనా యథా స్యా-
-ద్వీతమన్యుర్గౌతమో మాఽభి మృత్యో |
త్వత్ప్రసృష్టం మాఽభివదేత్ప్రతీత
ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే ||

10

యథా పురస్తాద్భవితా ప్రతీత
ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టః |
సుఖఁ రాత్రీః శయితా వీతమన్యు-
-స్త్వాం దదృశివాన్మృత్యుముఖాత్ ప్రముక్తమ్ ||

11

స్వర్గే లోకే న భయం కించనాస్తి
న తత్ర త్వం న జరయా బిభేతి |
ఉభే తీర్త్వాఽశనాయాపిపాసే
శోకాతిగో మోదతే స్వర్గలోకే ||

12

స త్వమగ్నిఁ స్వర్గ్యమధ్యేషి మృత్యో
ప్రబ్రూహి త్వఁ శ్రద్దధానాయ మహ్యమ్ |
స్వర్గలోకా అమృతత్వం భజన్త
ఏతద్ద్వితీయేన వృణే వరేణ ||

13

ప్ర తే బ్రవీమి తదు మే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్ |
అనన్తలోకాప్తిమథో ప్రతిష్ఠాం
విద్ధి త్వమేతన్నిహితం గుహాయామ్ ||

14

లోకాదిమగ్నిం తమువాచ తస్మై
యా ఇష్టకా యావతీర్వా యథా వా |
స చాపి తత్ప్రత్యవదద్యథోక్త-
-మథాస్య మృత్యుః పునరేవాహ తుష్టః ||

15

తమబ్రవీత్ ప్రీయమాణో మహాత్మా
వరం తవేహాద్య దదామి భూయః |
తవైవ నామ్నా భవితాఽయమగ్నిః
సృంకాం చేమామనేకరూపాం గృహాణ ||

16

త్రిణాచికేతస్త్రిభిరేత్య సన్ధిం
త్రికర్మకృత్తరతి జన్మమృత్యూ |
బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా
నిచాయ్యేమాఁ శాన్తిమత్యన్తమేతి ||

17

త్రిణాచికేతస్త్రయమేతద్విదిత్వా
య ఏవం విద్వాఁశ్చినుతే నాచికేతమ్ |
స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య
శోకాతిగో మోదతే స్వర్గలోకే ||

18

ఏష తేఽగ్నిర్నచికేతః స్వర్గ్యో
యమవృణీథా ద్వితీయేన వరేణ |
ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యన్తి జనాస-
-స్తృతీయం వరం నచికేతో వృణీష్వ ||

19

యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే-
-ఽస్తీత్యేకే నాయమస్తీతి చైకే |
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాఽహం
వరాణామేష వరస్తృతీయః ||

20

దేవైరత్రాపి విచికిత్సితం పురా
న హి సువిజ్ఞేయమణురేష ధర్మః |
అన్యం వరం నచికేతో వృణీష్వ
మా మోపరోత్సీరతి మా సృజైనమ్ ||

21

దేవైరత్రాపి విచికిత్సితం కిల
త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్థ |
వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో
నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్ ||

22

శతాయుషః పుత్రపౌత్రాన్వృణీష్వ
బహూన్పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్ |
భూమేర్మహదాయతనం వృణీష్వ
స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి ||

23

ఏతత్తుల్యం యది మన్యసే వరం
వృణీష్వ విత్తం చిరజీవికాం చ |
మహాభూమౌ నచికేతస్త్వమేధి
కామానాం త్వా కామభాజం కరోమి ||

24

యే యే కామా దుర్లభా మర్త్యలోకే
సర్వాన్ కామాఁశ్ఛన్దతః ప్రార్థయస్వ |
ఇమా రామాః సరథాః సతూర్యా
న హీదృశా లమ్భనీయా మనుష్యైః |
ఆభిర్మత్ప్రత్తాభిః పరిచారయస్వ
నచికేతో మరణం మాఽనుప్రాక్షీః ||

25

శ్వోభావా మర్త్యస్య యదన్తకైతత్
సర్వేంద్రియాణాం జరయన్తి తేజః |
అపి సర్వం జీవితమల్పమేవ
తవైవ వాహాస్తవ నృత్యగీతే ||

26

న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్త్వా |
జీవిష్యామో యావదీశిష్యసి త్వం
వరస్తు మే వరణీయః స ఏవ ||

27

అజీర్యతామమృతానాముపేత్య
జీర్యన్మర్త్యః క్వధఃస్థః ప్రజానన్ |
అభిధ్యాయన్ వర్ణరతిప్రమోదాన్
అతిదీర్ఘే జీవితే కో రమేత ||

28

యస్మిన్నిదం విచికిత్సన్తి మృత్యో
యత్సామ్పరాయే మహతి బ్రూహి నస్తత్ |
యోఽయం వరో గూఢమనుప్రవిష్టో
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే ||

29

|| అథ ద్వితీయా వల్లీ ||

అన్యచ్ఛ్రేయోఽన్యదుతైవ ప్రేయ-
-స్తే ఉభే నానార్థే పురుషఁ సినీతః |
తయోః శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతేఽర్థాద్య ఉ ప్రేయో వృణీతే ||

1

శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత-
-స్తౌ సమ్పరీత్య వివినక్తి ధీరః |
శ్రేయో హి ధీరోఽభి ప్రేయసో వృణీతే
ప్రేయో మన్దో యోగక్షేమాద్వృణీతే ||

2

స త్వం ప్రియాన్ప్రియరూపాఁశ్చ కామా-
-నభిధ్యాయన్నచికేతోఽత్యస్రాక్షీః |
నైతాం సృఙ్కాం విత్తమయీమవాప్తో
యస్యాం మజ్జన్తి బహవో మనుష్యాః ||

3

దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా |
విద్యాభీప్సినం నచికేతసం మన్యే
న త్వా కామా బహవోఽలోలుపన్త ||

4

అవిద్యాయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పణ్డితం మన్యమానాః |
దన్ద్రమ్యమాణాః పరియన్తి మూఢా
అన్ధేనైవ నీయమానా యథాన్ధాః ||

5

న సామ్పరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢమ్ |
అయం లోకో నాస్తి పర ఇతి మానీ
పునః పునర్వశమాపద్యతే మే ||

6

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః
శృణ్వన్తోఽపి బహవో యం న విద్యుః |
ఆశ్చర్యో వక్తా కుశలోఽస్య లబ్ధా-
-శ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ||

7

న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చిన్త్యమానః |
అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీయాన్ హ్యతర్క్యమణుప్రమాణాత్ ||

8

నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ |
యాం త్వమాపః సత్యధృతిర్బతాసి
త్వాదృఙ్నో భూయాన్నచికేతః ప్రష్టా ||

9

జానామ్యహఁ శేవధిరిత్యనిత్యం
న హ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్ |
తతో మయా నాచికేతశ్చితోఽగ్ని-
-రనిత్యైర్ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యమ్ ||

10

కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠాం
క్రతోరానన్త్యమభయస్య పారమ్ |
స్తోమమహదురుగాయం ప్రతిష్ఠాం దృష్ట్వా
ధృత్యా ధీరో నచికేతోఽత్యస్రాక్షీః ||

11

తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్ |
అధ్యాత్మయోగాధిగమేన దేవం
మత్వా ధీరో హర్షశోకౌ జహాతి ||

12

ఏతచ్ఛ్రుత్వా సమ్పరిగృహ్య మర్త్యః
ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య |
స మోదతే మోదనీయఁ హి లబ్ధ్వా
వివృతఁ సద్మ నచికేతసం మన్యే ||

13

అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా-
-దన్యత్రాస్మాత్కృతాకృతాత్ |
అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ
యత్తత్పశ్యసి తద్వద ||

14

సర్వే వేదా యత్పదమామనన్తి
తపాగ్ంసి సర్వాణి చ యద్వదన్తి |
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదగ్ం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ ||

15

ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరమ్ |
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ ||

16

ఏతదాలంబనఁ శ్రేష్ఠమేతదాలంబనం పరమ్ |
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే ||

17

న జాయతే మ్రియతే వా విపశ్చి-
-న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||

18

హన్తా చేన్మన్యతే హన్తుఁ హతశ్చేన్మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయఁ హన్తి న హన్యతే ||

19

అణోరణీయాన్మహతో మహీయా-
-నాత్మాఽస్య జన్తోర్నిహితో గుహాయామ్ |
తమక్రతుః పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః ||

20

ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః |
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి ||

21

అశరీరఁ శరీరేష్వనవస్థేష్వవస్థితమ్ |
మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి ||

22

నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన |
యమేవైష వృణుతే తేన లభ్య-
-స్తస్యైష ఆత్మా వివృణుతే తనూగ్ం స్వామ్ ||

23

నావిరతో దుశ్చరితాన్నాశాన్తో నాసమాహితః |
నాశాన్తమానసో వాఽపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ ||

24

యస్య బ్రహ్మ చ క్షత్రం చోభే భవత ఓదనః |
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సః ||

25

|| అథ తృతీయా వల్లీ ||

ఋతం పిబన్తౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే |
ఛాయాతపౌ బ్రహ్మవిదో వదన్తి
పఞ్చాగ్నయో యే చ త్రిణాచికేతాః ||

1

యః సేతురీజానానామక్షరం బ్రహ్మ యత్ పరమ్ |
అభయం తితీర్షతాం పారం నాచికేతఁ శకేమహి ||

2

ఆత్మానఁ రథినం విద్ధి శరీరఁ రథమేవ తు |
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ||

3

ఇన్ద్రియాణి హయానాహుర్విషయాఁ స్తేషు గోచరాన్ |
ఆత్మేన్ద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ||

4

యస్త్వవిజ్ఞానవాన్భవత్యయుక్తేన మనసా సదా |
తస్యేన్ద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః ||

5

యస్తు విజ్ఞానవాన్భవతి యుక్తేన మనసా సదా |
తస్యేన్ద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః ||

6

యస్త్వవిజ్ఞానవాన్భవత్యమనస్కః సదాఽశుచిః |
న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి ||

7

యస్తు విజ్ఞానవాన్భవతి సమనస్కః సదా శుచిః |
స తు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే ||

8

విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః |
సోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్ ||

9

ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్పరః ||

10

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః |
పురుషాన్న పరం కించిత్సా కాష్ఠా సా పరా గతిః ||

11

ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే |
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః ||

12

యచ్ఛేద్వాఙ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్ఛేజ్జ్ఞాన ఆత్మని |
జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్తద్యచ్ఛేచ్ఛాన్త ఆత్మని ||

13

ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత |
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదన్తి ||

14

అశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథాఽరసం నిత్యమగన్ధవచ్చ యత్ |
అనాద్యనన్తం మహతః పరం ధ్రువం
నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే ||

15

నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తఁ సనాతనమ్ |
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే ||

16

య ఇమం పరమం గుహ్యం శ్రావయేద్బ్రహ్మసంసది |
ప్రయతః శ్రాద్ధకాలే వా తదానన్త్యాయ కల్పతే |
తదానన్త్యాయ కల్పత ఇతి ||

17

|| అథ ద్వితీయోఽధ్యాయః ||

|| ప్రథమా వల్లీ ||

పరాఞ్చి ఖాని వ్యతృణత్స్వయంభూ-
-స్తస్మాత్పరాఙ్పశ్యతి నాన్తరాత్మన్ |
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష-
-దావృత్తచక్షురమృతత్వమిచ్ఛన్ ||

1

పరాచః కామాననుయన్తి బాలా-
-స్తే మృత్యోర్యన్తి వితతస్య పాశమ్ |
అథ ధీరా అమృతత్వం విదిత్వా
ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయన్తే ||

2

యేన రూపం రసం గన్ధం శబ్దాన్ స్పర్శాగ్ంశ్చ మైథునాన్ |
ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే | ఏతద్వై తత్ ||

3

స్వప్నాన్తం జాగరితాన్తం చోభౌ యేనానుపశ్యతి |
మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి ||

4

య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమన్తికాత్ |
ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే | ఏతద్వై తత్ ||

5

యః పూర్వం తపసో జాతమద్భ్యః పూర్వమజాయత |
గుహాం ప్రవిశ్య తిష్ఠన్తం యో భూతేభిర్వ్యపశ్యతే | ఏతద్వై తత్ ||

6

యా ప్రాణేన సంభవత్యదితిర్దేవతామయీ |
గుహాం ప్రవిశ్య తిష్ఠన్తీం యా భూతేభిర్వ్యజాయత | ఏతద్వై తత్ ||

7

అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః |
దివే దివే ఈడ్యో జాగృవద్భిర్హవిష్మద్భిర్మనుష్యేభిరగ్నిః | ఏతద్వై తత్ ||

8

యతశ్చోదేతి సూర్యోఽస్తం యత్ర చ గచ్ఛతి |
తం దేవాః సర్వేఽర్పితాస్తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ ||

9

యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ |
మృత్యోః స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి ||

10

మనసైవేదమాప్తవ్యం నేహ నానాఽస్తి కించన |
మృత్యోః స మృత్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి ||

11

అఙ్గుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి |
ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే | ఏతద్వై తత్ ||

12

అఙ్గుష్ఠమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః |
ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉ శ్వః | ఏతద్వై తత్ ||

13

యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి |
ఏవం ధర్మాన్ పృథక్ పశ్యంస్తానేవానువిధావతి ||

14

యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి |
ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ ||

15

|| అథ ద్వితీయా వల్లీ ||

పురమేకాదశద్వారమజస్యావక్రచేతసః |
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే | ఏతద్వై తత్ ||

1

హఁసః శుచిషద్వసురన్తరిక్షస-
-ద్ధోతా వేదిషదతిథిర్దురోణసత్ |
నృషద్వరసదృతసద్వ్యోమస-
-దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ||

2

ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం ప్రత్యగస్యతి |
మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే ||

3

అస్య విస్రంసమానస్య శరీరస్థస్య దేహినః |
దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే | ఏతద్వై తత్ ||

4

న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన |
ఇతరేణ తు జీవన్తి యస్మిన్నేతావుపాశ్రితౌ ||

5

హన్త త ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనమ్ |
యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ ||

6

యోనిమన్యే ప్రపద్యన్తే శరీరత్వాయ దేహినః |
స్థాణుమన్యేఽనుసంయన్తి యథాకర్మ యథాశ్రుతమ్ ||

7

య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః |
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే |
తస్మిఁల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ ||

8

అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ||

9

వాయుర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ||

10

సూర్యో యథా సర్వలోకస్య చక్షు-
-ర్న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః ||

11

ఏకో వశీ సర్వభూతాన్తరాత్మా
ఏకం రూపం బహుధా యః కరోతి |
తమాత్మస్థం యేఽనుపశ్యన్తి ధీరా-
-స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్ ||

12

నిత్యోఽనిత్యానాం చేతనశ్చేతనానా-
-మేకో బహూనాం యో విదధాతి కామాన్ |
తమాత్మస్థం యేఽనుపశ్యన్తి ధీరా-
-స్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్ ||

13

తదేతదితి మన్యన్తేఽనిర్దేశ్యం పరమం సుఖమ్ |
కథం ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా ||

14

న తత్ర సూర్యో భాతి న చన్ద్రతారకం
నేమా విద్యుతో భాన్తి కుతోఽయమగ్నిః |
తమేవ భాన్తమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి ||

15

|| అథ తృతీయా వల్లీ ||

ఊర్ధ్వమూలోఽవాక్శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః |
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే |
తస్మిఁల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ ||

1

యదిదం కిం చ జగత్సర్వం ప్రాణ ఏజతి నిఃసృతమ్ |
మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవన్తి ||

2

భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః |
భయాదిన్ద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పఞ్చమః ||

3

ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్శరీరస్య విస్రసః |
తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే ||

4

యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే |
యథాఽప్సు పరీవ దదృశే తథా గన్ధర్వలోకే
ఛాయాతపయోరివ బ్రహ్మలోకే ||

5

ఇన్ద్రియాణాం పృథగ్భావముదయాస్తమయౌ చ యత్ |
పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి ||

6

ఇన్ద్రియేభ్యః పరం మనో మనసః సత్త్వముత్తమమ్ |
సత్త్వాదధి మహానాత్మా మహతోఽవ్యక్తముత్తమమ్ ||

7

అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకోఽలిఙ్గ ఏవ చ |
యం జ్ఞాత్వా ముచ్యతే జన్తురమృతత్వం చ గచ్ఛతి ||

8

న సందృశే తిష్ఠతి రూపమస్య
న చక్షుషా పశ్యతి కశ్చనైనమ్ |
హృదా మనీషీ మనసాఽభిక్లుప్తో
య ఏతద్విదురమృతాస్తే భవన్తి ||

9

యదా పఞ్చావతిష్ఠన్తే జ్ఞానాని మనసా సహ |
బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్ ||

10

తాం యోగమితి మన్యన్తే స్థిరామిన్ద్రియధారణామ్ |
అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ ||

11

నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా |
అస్తీతి బ్రువతోఽన్యత్ర కథం తదుపలభ్యతే ||

12

అస్తీత్యేవోపలబ్ధవ్యస్తత్త్వభావేన చోభయోః |
అస్తీత్యేవోపలబ్ధస్య తత్త్వభావః ప్రసీదతి ||

13

యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేఽస్య హృది శ్రితాః |
అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే ||

14

యదా సర్వే ప్రభిద్యన్తే హృదయస్యేహ గ్రన్థయః |
అథ మర్త్యోఽమృతో భవత్యేతావద్ధ్యనుశాసనమ్ ||

15

శతం చైకా చ హృదయస్య నాడ్య-
-స్తాసాం మూర్ధానమభినిఃసృతైకా |
తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి
విష్వఙ్ఙన్యా ఉత్క్రమణే భవన్తి ||

16

అఙ్గుష్ఠమాత్రః పురుషోఽన్తరాత్మా
సదా జనానాం హృదయే సంనివిష్టః |
తం స్వాచ్ఛరీరాత్ప్రవృహేన్ముఞ్జాదివేషీకాం ధైర్యేణ |
తం విద్యాచ్ఛుక్రమమృతం తం విద్యాచ్ఛుక్రమమృతమితి ||

17

మృత్యుప్రోక్తాం నచికేతోఽథ లబ్ధ్వా
విద్యామేతాం యోగవిధిం చ కృత్స్నమ్ |
బ్రహ్మప్రాప్తో విరజోఽభూద్విమృత్యు-
-రన్యోఽప్యేవం యో విదధ్యాత్మమేవ ||

18

ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వి నావధీతమస్తు |
మా విద్విషావహై |
ఓం శాంతి: శాంతి: శాంతి: ||

మరిన్ని ఉపనిషత్తులు:

Chakshushopanishad (Chakshushmati Vidya) In Telugu – చాక్షుషోపనిషత్

Chakshushopanishad (Chakshushmati Vidya) In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు చాక్షుషోపనిషత్ గురించి తెలుసుకుందాం.

చాక్షుషోపనిషత్

అథాతశ్చాక్షుషీం పఠిత సిద్ధవిద్యాం చక్షూరోగహరాం వ్యాఖ్యాస్యామః | యచ్చక్షూరోగాః సర్వతో నశ్యంతి | చక్షుషీ దీప్తిర్భవిష్యతీతి ||

వినియోగః –

తస్యాశ్చాక్షుషీవిద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః | గాయత్రీ ఛందః | సూర్యో దేవతా | చక్షూరోగనివృత్తయే జపే వినియోగః ||

మంత్రాః-

ఓం చక్షుశ్చక్షుశ్చక్షుస్తేజః స్థిరో భవ | మాం పాహి పాహి | త్వరితం చక్షూరోగాన్ శమయ శమయ | మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ | యథాహం అంధో న స్యాం తథా కల్పయ కల్పయ | కల్యాణం కురు కురు | యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ |

ఓం నమః చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ | ఓం నమః కరుణాకరాయాఽమృతాయ | ఓం నమః సూర్యాయ | ఓం నమో భగవతే సూర్యాయాక్షితేజసే నమః | ఖేచరాయ నమః | మహతే నమః | రజసే నమః | తమసే నమః | అసతో మా సద్గమయ | తమసో మా జ్యోతిర్గమయ | మృత్యోర్మా అమృతం గమయ | ఉష్ణో భగవాన్ శుచిరూపః | హంసో భగవాన్ శుచిరప్రతిరూపః |

ఫలశృతిః –

య ఇమాం చక్షుష్మతీం విద్యాం బ్రాహ్మణో నిత్యమధీతే న తస్యాక్షిరోగో భవతి | న తస్య కులే అంధో భవతి | అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి |

సూర్యస్మరణ –

ఓం విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపంతమ్ | విశ్వస్య యోనిం ప్రతపంతముగ్రం పురః ప్రజానాముదయత్యేష సూర్యః ||

ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే అహోవాహిన్యహోవాహినీ స్వాహా | ఓం వయః సుపర్ణా ఉపసేదురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః | అపధ్వాంతమూర్ణూహి పూర్ధి చక్షుర్ముముగ్ధ్యస్మాన్నిధయేవ బద్ధాన్ | పుండరీకాక్షాయ నమః | పుష్కరేక్షణాయ నమః | అమలేక్షణాయ నమః | కమలేక్షణాయ నమః | విశ్వరూపాయ నమః | మహావిష్ణవే నమః |

ఇతి చాక్షుషోపనిషత్ |

[ పాఠాంతరం – ఓం నమో భగవతే ఆదిత్యాయ సూర్యాయాహోవాహిన్యహోవాహినీ స్వాహా | ]

మరిన్ని ఉపనిషత్తులు:

Vidya Viveka Hetuvu in Telugu – విద్య వివేక హేతువు

Vidya Viveka Hetuvu in Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్య వివేక హేతువు నీతికథ.

విద్య వివేక హేతువు:

(ఈ కథ ఆరణ్య పర్వంలో ఉంది)

విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.

ఎంతటి మహా విద్వాంసుడై నా వందితో వాదించి గెలవలేక పోతు న్నాడు. అందరినీ ఓడించిన అహంకారంతో ఉన్న నంది:

“నాతో వాదించి ఓడినవారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’, అని ప్రకటించాడు.
అలా ఎందరినో నదిలో తోయించి సగర్వంగా ఉన్నాడు వంది..

ఆ రోజులలో
ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతులలో ఓడిపోయి ప్రాణాలు విడిచాడు.

అప్పటికి గర్భవతిగా ఉంది కహోడుని భార్య సుజాత, భర్త మరణవార్త విని ఎంతో దుఃఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకో లేక విచారాన్ని విడనాడి జీవితం గడుపుతూ కొంత కాలానికి కుమారుని కన్నది.

ఆ బాలుడు తండ్రి శాపంవల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అందరూ వానిని ‘అష్టావక్రుడు’ అని పిలిచేవారు.

పన్నెండు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదనకు బయలుదేరి విదేహ రాజ్యానికి వచ్చాడు.

‘నిండా పన్నెండేళ్ళు రాని బాలుడు వంటివంటి మహా విద్వాంసు నితో వాదించడమా !’ అని ద్వారపాలకుడు నిరోధించాడు.

‘ద్వారపాలక విద్యకు వయస్సుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయస్సు ముదిరినవాడు మహా విద్వాంసుడని అనుకోకు”, అని వాదిస్తుండగా అటు వచ్చిన జనక మహారాజు:

‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాలవలె వెల వెల బోతుంటారు’ అనగా అష్టావక్రుడు :

‘ మహారాజా ! నా వంటి వాడెవరూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు, అన్నాడు.

‘ అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వుః ‘ అని జనకుడు ప్రశ్నించాడు.

“మహారాజా ! ముప్పది దినాలు అవయవాలు, అమావాస్యలు పన్నెండు, పూర్ణిమలు పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలలు అంశలు, మూడు వందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమయిన కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’, అన్నాడు.

జనకుడు: అడు గుర్రాలజంటవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండిటినీ ధరించే దెవరు ?
అష్టా : మహారాజా ! అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్వాలవల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.
జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?
అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.
జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?
అష్టా: పక్షులు పెట్టే గ్రుడ్డు.
జన: హృదయం లేనిదేది?
అషా : బండరాయి.
జన: ఓవేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా తీసుకు వెళ్ళాడు.

చూశాడు మహావిద్వాంసుడు వంది. అష్టావక్రుడు ఆయనను సమీపించాడు.

వంది: బాలకా! నిద్రపోయే సింహాన్ని లేవకు. కాలకూట విషభరిత మయిన పాము పడగ మీద కాలు పెట్టకు,
అష్టా: : మహారాజా ! పర్వతాలన్నీ మైనం కంటె చిన్నవి. లేగదూడలు ఆంబోతుకంటే చిన్నవి. రాజులందరూ జనకునికంటె అల్పులు. దేవతలలో యింద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.

అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవరావతి, యముడొక్కడే, అని ప్రారంభించాడు, వంది.

అష్టా: నంది ! ఇంద్రుడు- అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు, అలానే పర్వత నారదులు. అశ్వనీ దేవత లిద్దరు. రథా నికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు..

వంది: ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడు ధరి స్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యా హ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు, అగ్ని, సూర్య చంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.

అష్టా: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వావవస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు, దిక్కులూ నాలుగే హ్రస్వ, దీర్ఘ, ప్లత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. వేరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రగాలు.

వంది: గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, సభ్య అసభ్యం అనే అవస్థా భేదంతో యజ్ఞాగ్ని అయిదు విధాలు. వంక్తి ఛందస్సుకి ‘ పాదాలు అయిదు. దేవ, పితృ, ఋషి, మమష్య, భూత, యజ్ఞాలు అయిదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రి యాలు అయిదు. విపాశ, ఇరావతి, వితస్త, చంద్రభాగ శశుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం.

అష్టా : బాలకా! అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మన స్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞలు ఆర

వంది: విద్వాంసుడా! ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద ఇవి ఏడూ గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, కార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం – యివి. ఏడూ వన్యమృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతి జగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్, భేదాలతో ఛందస్సు ఏడురకాలు. అత్రి, పులస్త్య, క్రతు, మరీచి, అంగిరస, వసిష్ఠులు సప్త మహర్షులు. ధూప, దీప, నైవేద్య, ఆచమన, గంధ, పుష్ప, తాంబూలాదులు కూడా ఏడే.

అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీ పంలో యూవస్థంభానికి రోజులు ఎనిమిది. వసువులు ఎవ మండుగురు.

వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మా త్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెలమీద ఆధారపడి ఉంది.

అష్టా: దిక్కులువది. గర్భంలో శివుడు పది మాసాలుంచాడు. రోగి, దరిద్రుడు శోకార్హుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అనూయాపరుడు, మూర్ఖుడు మొండివాడు ఈ పదిమంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పది మంది పూజింప దగినవారు.

ప్రాణికి పది దశలు :
గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కై కోరం, యౌవనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు.

వంది: ప్రాణి కోటికి యింద్రియాలు పదకొండు. విషయాలూ వద కొండే. జ్ఞాన, కర్మేంద్రియాలతో మనస్సు కలిసి పదకొండు|| శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు జ్ఞానేంద్రియ విషయాలు.
మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం యివి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసేపవి. ఇవి పదకొండు.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు పదకొండు.

మృగ, వ్యాధ, సర్ప, అజై కపాద, అహిర్బుధ్న్య, కపాలి, పివారి, నిర్భతి, దహిస, స్థాయి, ఈశ్వర వీరు ఏకాదశ రుద్రులు.

అష్టా: పసివాడా। మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.

వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ఆరంభించగా,

అహ్జైాన్నకుడు: మహారాజా! మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విర మించాడు. మిగిలింది నేను చెబుతా.

కేశి దానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేసాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, పంది తల వంచేశాడు.

నియమానుసారం పంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలెనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.

విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వ హేతువు కారాదు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Dattatreya Shodasopachara Pooja In Telugu – శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజ

Sri Dattatreya Shodasopachara Pooja In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజా విధానం గురించి తెలుసుకుందాం…

Sri Dattatreya Shodasopachara Pooja Vidhanam

శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజ విధానము

ధ్యానమ్:

(ఓం) గురుర్ర్బహ్మా గురుర్విష్టుర్గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమః ॥

1. ఆవాహనము:

ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిమ్ ।
సర్వధర్మపరం నిత్యం పూర్ణానందకవిగ్రహమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆవాహయామి.

2. ఆననము:

కల్పద్రుమూలే మణివేదిమధ్యే, సింహాసనం స్వర్ణమయం సురత్నమ్ ।
విచిత్రవస్త్రాన్విత మచ్యుత ప్రభో, గృహాణ లక్ష్మీధరణీసమన్విత ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి.

3. పాద్యము (పాదములు కడుగుట):

గంగాజలం సమానీతం సుగంధద్రవ్యసంయుతమ్ ।
పాద్యం గృహాణ భో స్వామిన్ ! తీర్థపాద దయాకర॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః పాదయోః పాద్యం సమర్పయామి.

4. అర్ఘ్యము (చేతులు కడుగుట):

ధర్మస్వరూప ధర్మజ్ఞ ! తులసీదామ భూషణ ।
కంబుగ్రీవ మయా దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

5. ఆచమనము (గొంతు తడుపుకొనుట):

జ్ఞానవైరాగ్యసంపన్న భవరోగైక భేషజ ।
గృహాణ త్వం మయా దత్త మిదమాచమనీయకమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి.

6. స్నానము:

గంగాదిపుణ్యసలిలైర్మయా నీతైశుస్మభావహైః ।
స్నాపయిష్యామ్యహమ్ భక్త్యా ప్రసన్నో భవ సద్గురో ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి.

7. వస్త్రము:

స్వర్ణాంచలం చిత్రవిచిత్రశోభితం కౌశేయయుగ్మం పరికల్పితం మయా ।
దామోదర ప్రావరణం గృహాణ మాయాచల ప్రాకృతదివ్యరూప ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

8. గంధము:

కస్తూరికా చన్దన కర్దమాని కాశ్మీర సంయోజిత గంధసారైః ।
విలేపనం స్వీకురు దేవదేవ ! శ్రీభూమి వక్షోజ విలేపనార్హమ్ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః హస్తయోః గంధం ధారయామి,

9. యజ్ఞోపవీతము:

తన్తుం తన్వన్ మయా భక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితమ్ ॥
దాస్యామి ధారణార్థం వై గృహాణ బ్రహ్మవిద్వర ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం
ఆచమనీయం సమర్పయామి.

10. పుష్పములు:

కల్హారైశ్చంపకైర్జాజీ పున్నాగైర్మల్లికాదిభిః ।
మన్హరైః పూజయిష్యామి స్వీకుర్వాచార్యసత్తమ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః పుష్పైః పూజయామి.

అథాంగపూజ:

ఓం తీర్థపాదాయ నమః – పాదౌ పూజయామి
ఓం బలాయ నమః – జజ్ఞే పూజయామి
ఓం ఆధారభూతాయ నమః – జానునీ పూజయామి
ఓం విశ్వపూజితాయ నమః – ఊరూ పూజయామి
ఓం జితేంద్రియాయ నమః – గుహ్యం పూజయామి
ఓం స్థితప్రజ్ఞాయ నమః – కటిం పూజయామి
ఓం మితాసనాయ నమః – ఉదరం పూజయామి
ఓం విశాల వక్షసే నమః – వక్షఃస్థలం పూజయామి
ఓం శుద్ధహృదయాయ నమః – హృదయం పూజయామి
ఓం శిష్య వత్సలాయ నమః – స్తనౌ పూజయామి
ఓం ఆత్మోద్ధారకాయ నమః – భుజౌ పూజయామి
ఓం దానహస్తాయ నమః – హస్తా పూజయామి
ఓం కంబుకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం ప్రసన్నవదనాయ నమః – ముఖం పూజయామి
ఓం మృదుభాషణాయ నమః – జిహ్వాం పూజయామి
ఓం కరుణాజలనిధయే నమః – నేత్రే పూజయామి
ఓం శాస్త్రానుసారిణే నమః – కర్ణా పూజయామి
ఓం సర్వజ్ఞాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి

11. ధూపము:

వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైస్సుసంయుతమ్ ।
ఆగ్నేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ॥

12. దీపము:

జ్ఞానజ్యోతిస్వరూపస్త్వ మాత్మజ్ఞానప్రదాయక ॥
మృతవరా కృతం దీపం దాస్యామి స్వీకురు ప్రభో ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః దీపం దర్శయామి.

13. నైవేద్యము:

సత్యం చిత్తేన పరిషించామి । అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా ।

శ్లో ॥ పక్వాన్నం పంచభక్ష్యాణి గోఘృతం సూపసంయుతమ్ ।
లేహ్యం పేయం తథా చోష్యం స్వీకురు ప్రాణవల్లభ॥

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తప్రక్షాళనం సమర్పయామి । పాదప్రక్షాళనం సమర్పయామి । శుద్ధ మనీయం సమర్పయామి ।

14. తాంబూలము:

పూగీఫలై స్సకర్పూరై ర్నాగవల్లీదళై ర్యుతమ్ ।
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి.

15. నీరాజనము:

నీరాజనమిదం జ్ఞాన దీపక సద్గుణాకర ।
పూర్వ మనోవాం స్వీకురు భజనప్రియ ॥
మంగళం జ్ఞానసంపన్న మంగళం సుజనప్రియ ।
మంగళం జగదుద్ధార మంగళం దేశికోత్తమ ॥
శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి.

16. మస్త్రపుష్పము:

శ్రద్ధా భక్త్యా హ్యక్షతైశ్చ హృత్పద్మసహితం గురో ।
మయార్పితం మస్త్రపుష్పం స్వీకురు శిష్యవత్సల ॥

నమః ప్రసన్నవదన నమః కారుణ్యసాగర ।
నమః కర్మఫలత్యాగిన్ నమః పాపనికృంతన ॥

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటీ యుగధారిణే నమః ॥

శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః సప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

త్వమేవ మాతా చ పితా చ త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥

శ్రీసద్గురుపరబ్రహ్మణే నమః ఛత్ర మాచ్ఛాదయామి – చామరం వీజయామి – నృత్యం దర్శయామి – ఆందోళికానారోహయామి – అశ్వానారోహయామి – గజానారోహయామి సమస్త రాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి ।

మరిన్ని పూజా విధానాలు:

The Real Story Of Ahalya In Telugu – అహల్య రాయిగా మారలేదు

The Real Story Of Ahalya In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

పరిచయం

శ్రీరాముడు శాపగ్రస్తురాలై రాయిగా మారిన అహల్యను తన కాలితో తాకగానే తిరిగి అహల్య స్త్రీగా మారినదని ఒక కట్టుకథ ఉంది. హిందువులు శ్రీరాముని దేవుని అవతారమని చెప్పుటకే ఈ కట్టుకథను కల్పించారు. శ్రీరాముని దేవుడంటే తప్పులేదు. కానీ ఈ చరాచర జగత్తునంతా చేసి పోషించి లయంచేసే సృష్టికర్త ధర్త హర్త అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీరాముడు ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, వేదవిదుడు. అందువలన ఆయనను దేవుడు – దివ్యగుణములు కలవాడు అంటే దోషమేమీ లేదు. మానవులలోనే విద్వాంసులు, దాన ధర్మములు చేయువారు, వేద విద్యలను నేర్పు ఆచార్యులు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయు రాజులు మున్నగు వారు కూడా దేవతలనబడతారు. అందువలన శ్రీరాముడొక దేవుడు. సృష్టికర్తయైన పరమేశ్వరుడు మాత్రం కాడు.

మహాభారత యుద్ధానికి పూర్వమే వేద సిద్ధాంతాలు కనుమరుగైన కారణంగా మానవ సమాజంలో అనేక దురాచారాలు ప్రబలం కాసాగాయి. మన ప్రాచీన ఋషులను, మహాత్ములను నిందించటం, అవహేళన చేయటం కూడా అప్పటినుండే ఆరంభమైనది. ఋషులు, ఋషి పత్నులపై నిందలు వేస్తూ మన ప్రాచీన వైదిక సంస్కృతి – సభ్యతలను సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ అహల్య శాపం కట్టు కథ. బుద్ధిమంతులు ఆలోచించి ఇటువంటి నిందలను తిరస్కరించాలి.

– సంధ్యావందనం శ్రీనివాసరావు

అహల్య రాయిగా మారలేదు

తులసీరామాయణంలో గౌతమ ఋషిపత్నియైన అహల్యా గౌతమ ఋషి శాపంతో రాయిగా మారినట్లు ఒక కట్టు కథ ఉంది. శ్రీరాముడు రాతిని కాలితో తాకగానే ఆయన పాదధూళి అంటుకొని ఆ రాయి మళ్ళీ స్త్రీగా మారి స్వర్గానికి ఎగిరిపోయింది. చూడండి

గౌతమ నారీ శాపవశ, ఉపల దేహ ధరి ధీర,
చరణ కమల రజ చాహతీ, కృపా కరహు రఘువీర.

గౌతమ ఋషి పత్ని అహల్య శాపం వలన రాయిగా మారింది. ఓ రామా ! నీ పాద ధూళిని కోరుతోంది. నీవామెను కరుణింపుమని విశ్వామిత్ర ఋషి శ్రీరామునితో అనెను. శ్రీరాముడు వనవాసమున కెళ్ళుచున్నపుడు గంగానదిని
దాటుటకై నావ అవసరమైనది.

మాంగీ నావ న కేవట ఆనా, కహా తుమ్హర మర్మమై జానా……… తులసీ రామాయణం)

“శ్రీరాముడు నదిని దాటుటకు నావనడుపువానిని (ముల్లాహ) నావను తెమ్మనగా అతడిట్లనెను – చరణ్ కమల్ రజ్ కహం సబ్ కహ ఈ. మానుష్ కరని మూరి కఛు అహఈ”.

ఓ రామా ! మీ రహస్యం నా కర్ధమైంది. మీ పాద పద్మముల ధూళి మానవులను తయారుచేసే ఔషధమని అంతా అంటుంటారు. మీ పాద ధూళిని తాకగానే రాయి సుందర స్త్రీగా మారింది. రాయి కంటే కర్ర గట్టిది కాదు. రాయే స్త్రీగా మారినపుడు నా కర్రనావ స్త్రీగా మారదా ! ? ఈ నావకూడా ఋషి పత్నిగా మారి పైకెగిరి పోతే నాగతేమిటి? నేనీనావతోనే నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు వేరే పనేదీ రాదు. అందుకని మహారాజా! మీరీ గంగానదిని నా నావపైనే దాటాలనుకుంటే, ముందు నేను మీ పాదాలను నీటితో కడగటానికి అనుమతించండి. కాళ్ళు కడగటంతో మీ పాదాలకంటిన ధాళి పోతుంది. కనుక నా నావ ఎగిరి పోకుండా ఉంటుంది !

ఈ కథ వలన మనకు తెలిసేదేమంటే – శ్రీరాముని పాదాలలో ఆ శక్తి లేదు. ఆయన పాదాలకంటియున్న ధూళి (మట్టి) కాచమత్కారమున్నది. దీనిపైన రహీంకవి దోహ ఒకటుంది. అది ధూరి ధరత గజ శీశ పర్…….

రహీం కవిని ఒకరిలా అడిగాడు – “రహీం ఈ ఏనుగు తన తలపై దుమ్మునెందుకు పోసుకుంటున్నది? అని. అందుకు రహీం : గౌతమముని పత్ని అహల్యా తరించిన ధూళి కొరకు ఈ ఏనుగు వెదుకుతూ తిరుగుతోంది. ఆ దుమ్ము ఎక్కడైనా దొరికితే తాను కూడా తరించవచ్చని దాని ఆశ! అన్నారు.

అహల్య రాయిగా మారటం. అహల్య శ్రీరాముని పాదధూళి తాకగానే స్త్రీగా మారటం వంటి దేమీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అచ్చటిలా ఉంది –

విశ్వామిత్రం పురస్కృత్య ఆశ్రమం ప్రవివేశ హ । (12)
దదర్శ చ మహాభాగాం, తపసా మౌతిత ప్రభామ్ । (13)
రాఘవౌస్తు తదా తస్యాః, పాదౌ జగృహతుర్ ముదా । (17)
పాధమర్ధ్య తథాతిథ్యం, చకార సు సమాహితా । (18)
(వాల్మీకి రామాయణం – బాలకాండ – 49వ సర్గ) విశ్వామిత్ర ఋషితో రామలక్ష్మణులు గౌతమ ఋషి ఆశ్రమమును సందర్శించుట.

ఆశ్రమంలో ప్రవేశిస్తుండగా మహాభాగ్యశాలిని యైన అహల్య తన తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది.
శ్రీరామలక్ష్మణులు ఎంతో ఆనందంతో అహల్యయొక్క పాదములు రెండింటిని స్పర్శించిరి. (శ్రీరాముడు తన పాదాలతో అహల్యను తాకలేదు) అహల్య ఆ ఇరువురు అన్నదమ్ములను ఎంతో ఆదరంతో అర్ఘ్యపాద్యాదులను (కాళ్ళు ముఖం చేతులు కడుగుకొనుటకు నీళ్ళు) త్రాగుటకు (ఆచమనం) నీళ్ళిచ్చి అతిథి సత్కారమును చేసెను. వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారటం శ్రీరాము డారాతిని తాకగానే అది స్త్రీగా మారటం వంటివేవీ లేవు. గౌతమ ఋషి శాపంతో అహల్య రాయిగా మారెనను మాట వాల్మీకి రామాయణంలో లేదు. ఇందుకు విరుద్ధంగా ఇచ్చట ప్రకరణం ఇలా ఉంది. చూడండి –

‘తపసా ద్యోతిత ప్రభా’ తపస్సు చేస్తున్న అహల్య అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తోంది. అని మీరు రామాయణంలోని వాక్యాన్ని చదివే ఉంటారు. శ్రీరాముడామెను దర్శించి అన్నదమ్ములిరువురు ఆమె పాదాలను స్పర్శించిరి.

రామాయణంలో అహల్యా ఇంద్రుల జారకర్మ (వ్యభిచారం) ను గురించి వ్రాసి ఉంది. కానీ రామాయణ కథను చెప్పే భాగవతులు దీనిని రామాయణంలో కల్పినట్లుగా భావిస్తున్నాను. కలపటానికి కారణాలివి –

గౌతమ – అహల్య – ఇంద్రులను గూర్చిన ఈ కథ శతపథ బ్రాహ్మణంలో రూపకాలంకారంలో ఉన్నది –
అహల్యపతి గౌతముడు. ఇంద్రుడు – జారుడు. చూడండి. ‘రాత్రిరహల్యా కస్మా దహర్దినం లీయతే స్యాం తస్మా ద్రాత్రి రహల్యోచ్యతే’
రాత్రి ‘అహల్య’. దినమునకు ‘అహః’ అని పేరు. అహల్యా” “అహః” దినము దీనిలో లయమగును (కలిసిపోవును) కనుక రాత్రికి “అహల్యా” అని పేరు. గౌతముడు – చంద్రుడు. చంద్రుడు రాత్రివేగంగా వెళ్ళుతున్నట్లు కనబడతాడు కనుక – గచ్ఛతి ఇతి గౌ”నడచువాడు – చంద్రుడు- “గౌ” అనబడును. వేగంగా వెళ్ళును. కావున “గౌతముడు” అనబడతాడు. చంద్రుని రాత్రికి పతి అందురు. అందువలన చంద్రుని “నిశా – పతి” అంటారు. నిశా అంటే రాత్రి. చంద్రునకు రాకేశ్ అని కూడా పేరు. రాత్రికి రాకా అనిపేరు. పూర్ణిమకు కూడా రాకా అని పేరు. చంద్రుడు లేని రాత్రి ‘విధవ’వలె కనబడుతుంది. చంద్రునితో కలిసిఉన్న రాత్రి శోభాయమానంగా ప్రకాశిస్తూ అంటే సౌభాగ్యవతియైన స్త్రీలా కనబడుతుంది. అందువలన చంద్రుడు అంటే గౌతముడు రాత్రి అంటే అహల్యకు పతి.

The Real Story Of Ahalya In Telugu pdf

సూర్యుడు ఇంద్రుడు. సూర్యుడు రాత్రిని నశింపజేస్తాడు. (లేకుండా చేస్తాడు) అంటే బలహీనపరుస్తాడు. ఇది జారకర్మ. అందువలన ఇంద్రుడనగా సూర్యుడు, అహల్య అనగా రాత్రితో వ్యభిచరించును. సూర్యోదయం కాగానే రాత్రి బలహీనపడుతూ పడుతూ పూర్తిగా నశించిపోతుంది. ఇదొక విజ్ఞానంతో కూడి యున్న సుందర రూపకాలంకారం.

దీనిని అర్థం చేసుకోకుండా గౌతమ ఋషిపత్ని అహల్యతో ఇంద్రుడు జారకర్మ – వ్యభిచరించాడని పురాణాలలో వ్రాశారు. రామాయణంలో గౌతమ ముని పత్ని అహల్యయొక్క చరిత్రకు సంబంధించిన వర్ణన ఉంది. దానితో బ్రాహ్మణగ్రంథంలోని ఈ రూపకాలంకారాన్ని జోడించి చరిత్ర భ్రష్టు పట్టించారు – నాశనం చేశారు. ఇంద్రుడు – అహల్యకు మధ్య అబద్ధపు వ్యభిచారదోషాన్ని కల్పించారు.

ఈ విధంగా శబ్దాలకు (అనర్థాలను) తప్పుడు అర్థాలను కల్పనచేసి చేసి కథలు చెప్పే మన పౌరాణికులు మన చరిత్ర గాధలన్నింటిని నాశనం చేశారు. రామాయణంలో అనేక చోట్ల తమ ఇష్టం వచ్చిన కల్పిత కథలున్నాయి. వీనితో వాస్తవాలు మరుగున పడ్డాయి. నేటి ఆధునిక యుగంలో ప్రతి విషయాన్ని తర్కబుద్ధితో ఆలోచించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాతకాలం నాటి మాటలు- “చేపచెట్టెక్కిందని పండితుల వారంటే. భక్తబృందం సత్యం మహరాజ్’ అన్నారు. ఇటువంటి భ్రమలు కలిగించే అబద్ధపు కథలు చదివి చదివి నేటి యువతీ – యువకులు రామాయణ, మహాభారత ఇతిహాసాలకు తిలాంజలులివ్వటానికి తయారౌ తున్నారు. కనుక విద్వాంసులంతా ప్రతివిషయాన్ని సత్యంతో పరీక్షించి యుక్తి-యుక్తంగా వ్రాయాలి. మన దేశ చరిత్ర, ధర్మగ్రంథాలలో ఎటువంటి దోషాలూ రానివ్వరాదు.

ఒక ధర్మము, ఒక భాష, ఒక లక్ష్యము భారతవాసుల కేర్పడనంతవరకు భారత దేశమునకు పూర్ణహిత మేర్పడజాలదు. ఉన్నతియు జరుగదు.
(మహర్షి దయానంద సరస్వతి).

మరిన్ని భక్తి యోగాలు:

Sundopasundulu In Telugu – సుందోపసుందులు

Sundapasundulu In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సుందోపసుందులు నీతికథ.

సుందోపసుందులు

(ఇద్దరు తమలో తాము పోట్లాడుకొని ఇద్దరూ నాశనమువ కాన్ని సుందోప సుందన్యాయ మంటారు.)

ఈ నాటికీ మారుమూల పల్లెలలోనే కాక, మహానగరాలలో కూడా భారత సంస్కారం కలవారు ఈ సామెత వాడుతుంటారు. సుందోప సుందుల వలె కొట్టుకుంటున్నారు అని. ఆ కథ భారతం ఆదిపర్వంలో నారదుడు వినిపిస్తున్నాడు.

ధర్మరాజా !
హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కథ ఎరుగుదువు కదా ! వారి వంశ ములో కుంభుడనే పేరు గల రాక్షసుడుండేవాడు. వీడు మహాబలశాలి. ఈ బలశాలికి ఇద్దరు కుమారులు.

వారు మహా భయంకర దేహులు. పెద్దవాడు సుందుడు. వాడి -తమ్ముడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ విషయంలోనూ వారికి అభిప్రాయ భేదం లేదు.

నిరంతరం ఒకరినొకరు విడువకుండా కలిసి తిరిగే వారు.
అలా ఉండగా వారికి తమ పూర్వీకుల వలె త్రిలోకాలనూ జయిం చాలనే కోరిక కలిగింది. కలగగానే వింధ్యపర్వతం చేరి ఆ గిరి శిఖరం మీద పద్మాసనం వేసి తపస్సు ఆరంభించారు. అన్నపానాలు విడిచేశారు.

వాయువునే ఆహారంగా గ్రహిస్తూ, ఒంటికాలి బొటన వేలుమీద నిలబడి తీవ్రదీక్షతో సాధన చేస్తున్నారు. ఆ తపస్సు వేడికి మంటలు లేచేవి. ఎలా అయినా ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవ తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు చలించలేదు. ధ్యా ధిలోనే ఉన్నారు.

బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్య అంతా తమకు రావాలనీ, ఇంద్ర జాల మహేంద్రజాల విద్యలు తమ అధీనంలో ఉండాలనీ, తమకు తమకు వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరెవరివల్ల చావు రాకూడ దనీ కోరుకున్నారు.

అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు.
వారు తమ నగరం చేరి సేవలతో విజయ యాత్రకు బయలు దేరారు.

ముందుగా అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం, యక్షరాక్షప లోకాలన్నీ వశపరుచుకున్నారు.

పెద్దపులి రూపాలతో, సింహాకారాలతో గుహలలో దూరి అక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించే వారు.

ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞసామగ్రిని విరిచి, విసిరేసే వారు. అలా ప్రపంచం అంతటా తిరుగుతూ సాధు, సజ్జన హింసతో, వర స్త్రీ బలాత్కారాలతో జీవితం నడుపుతున్నారు.

ప్రపంచంలో ఏ ప్రాణికి శాంతి లేదు. అంతటా దీనారావాలు, హాహాకారాలు. ఏ పూట ఎవరికి కీడు మూడుతుందో తెలీదు. ఏ రాత్రి ఏ నగరం శ్మశానం అవుతుందో తెలీదు.

అలా భయానకంగా ఉన్న సమయంలో దేవతలూ, మునులూ కలిసి బ్రహ్మను ప్రార్థించగా ఆయన విశ్వకర్మను పిలిచి:

మహాశిల్పీ ప్రపంచంలో ఎంతటి వారి నయినా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు అన్నాడు. ఆలోచించాడు విశ్వకర్మ.

ఇంతకుముందు నిర్మించిన సుందరరూపాలన్నింటినించి అందాన్ని నువ్వుగింజంత (శిలాంశ) తీసి ఒక అందగత్తెను రూపొందించాడు.
కాలిగోరు నుంచి కమరెప్పల వరకూ అంతా లావణ్యం జాలువారు తున్నది.
తిగాంశగా తీయడం వల్ల ఆమెకు తిలోత్తమ అని పేరుపెట్టారు.

ఆమె బయలుదేరింది.

దేవతా నాయకు అందరికీ కన్ను చెదరింది. దేవేంద్రుడు వెయ్యి కళ్ళూ విప్పి చూశాడు. అంతటి అందగత్తె అంచనడకలతో, కాలి అందెల రవళి ఎందరినో మోహింపచేస్తూ సాగిసాగి సుందోపసుందులున్న వనా నికి వచ్చి విలాసంగా విహరిస్తున్నది.

అది వింధ్యగిరి శిఖరం.
అక్కడ విశాలమయిన సాలవృక్షం.
ఆ చెట్టు నీడలో రకరకాల పానపాత్రలు.
కనులు మిరుమిట్లుగొలిపే కామినీ జనం.
హంసతూలికాతల్పాలు.
వింజామరలతో సుందరీమణులు.
కమ్మని కంఠాలతో పాటలు.

ఆ పాటలకు అనుగుణంగా అందెల రవళులతో, గాజుల గలగలలతో, చూపుల మిలమిలలతో సుందరాంగుల నాట్యాలతో ఆ సోదరు లిద్దరూ పరమ సంతోషంగా ఉన్నారు.

అటువంటివారి కంటికి అల్లంత దూరంలో వయ్యారంగా ముట జారుస్తూ కనులు త్రిప్పుతూ, తన అందాన్ని ఒలకబోస్తూ’ నిలిచింది. తిలో త్తమ,

అంత మైకంలో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆ సుందరిని చూస్తూనే కోరమీసం ఎగదువ్వుతూ, పానపాత్రలు జారవిడిచి, ఆశ నిండిన కను లతో, రాచఠీవితో, ఆమె వయిపే అడుగులు వేశారు.

ఇద్దరూ దగ్గరగా చేరారు,
ఆమె భయాన్నీ, సిగ్గునీ, అభినయిస్తూ, జారుతున్న పైట సరి జేస్తున్నట్టు నటించి, వెనుదిరిగి ఓరచూపుతో యిద్దరినీ రెచ్చగొట్టింది.
ఒకడు కుడిచెయ్యి అందుకుంటూండగా రెండవవాడు ఎడమచెయ్యి పట్టుకున్నాడు.

బలమడం, ధనమదం, రాజ్యమదం, వరమిదం ఇన్నిటికీ మద్యపానమదంలోవున్న వారిని చూసి తిలోత్తమ ఒక కంటితో నుందుని రెండవ కంటితో ఉవసుండుని రెచ్చగొట్టింది.
“తమ్ముడూ! అన్నగారి భార్య తల్లితో సమానం. నువ్వు దీన్ని తాకకూడదు ” అన్నాడు సుందుడు.

“తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వు దూరంగా వెళ్ళు” అన్నాడు ఉవసుందుడు.

మీరిద్దరూ తేల్చుకోండి అని దూరంగా నిలబడి యిద్దరి వయిపూ కోరచూపులే విసిరింది తిలో త్తమ.

కామమదంతో రెచ్చిపోయిన ఉభయులూ ఒళ్ళు తెలి_రుకుండా ఒకరినొకరు పిడిగుద్దులతో, మోకాటిపోటులతో కొంతసేపు యుద్ధం సాగించారు.

అంతలో గదాదండాలు అందుకున్నారు.
ఆ గదా ఘాతాలతో వారి శరీరాలు చీలి రక్తధారలు సెల వీరుల్లా ప్రవహించాయి.
అంతే పర్వత దేహులయిన అన్నదమ్ములిద్దరూ నదీ ప్రవాహంలో బండరాళ్ళవలె నేల కూలారు, అని నారదుడు కథ ముగించి,

నాయనా! కానుపిశాచి ఎంత చెడ్డదో చూశావా, అన్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Pranava Stotram In Telugu – శ్రీ ప్రణవ స్తోత్రమ్

Sri Pranava Stotram In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ ప్రణవ స్తోత్రమ్

(రఘుపతి రాఘవ రాజారాం…. అనే బాణీలో పాడుకోవచ్చును)

1. అనంత గుణగణ భూషిత

ఓమ్

(పరమేశ్వరుడు అనంత గుణములతో అలంకరింపబడినవాడు)

2. శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

(శుద్ధుడు. అందరికంటె గొప్పవాడు. పెద్దవాడు)

3. సబల బ్రహ్మ సునామక

ఓమ్

(బలవంతుడు. బ్రహ్మయను సుందర నామము కలవాడు)

4. కాలాత్మక పరమేశ్వర

ఓమ్

(కాలమును నియమించువాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు)

5. ప్రళయానంతర సుస్థిత

ఓమ్

(ప్రళయంలోను తరువాత ఉండువాడు)

6. ఈక్షిత సృష్టి విధాయక

ఓమ్

(కనబడుచున్న ఈ సృష్టిని చేయువాడు)

7. వ్యాపక యజ్ఞ ప్రసారక

ఓమ్

(సృష్టియను యజ్ఞమును అంతటా విస్తరింపజేయువాడు)

8. లోకాఖిల గతిదాయక

ఓమ్

(లోకాలన్నింటిని త్రిప్పువాడు)

9. జగన్నియంతా పాలక

ఓమ్

(జగత్తును నియమముగా పాలించువాడు)

10. జనతా దుఃఖ ప్రభంజక

ఓమ్

(ప్రజల దుఃఖములను తొలగించువాడు)

11. భక్తప్రియ సుఖదాయక

ఓమ్

(భక్తులను ప్రేమించి సుఖముల నిచ్చువాడు)

12. సూర్యాదిక ద్యుతి ధారక

ఓమ్

(సూర్యాది నక్షత్రములకు ప్రకాశమునిచ్చువాడు)

13. పరమసహాయక ప్రియవర

ఓమ్

(గొప్ప సహాయకుడు. ప్రియుడు. శ్రేష్ఠుడు)

14. నిత్య తృప్త సర్వాశ్రయ

ఓమ్

(జీవులను తృప్తిపరిచే సృష్టికి ఆశ్రయము)

అనంత గుణ గణ భూషిత

ఓమ్

శుద్ధబ్రహ్మ పరాత్పర

ఓమ్

15. జ్ఞానరూప సత్ప్రేరక

ఓమ్

(సత్యజ్ఞానమును ప్రేరేపించువాడు)

16. సకల ద్రవ్య వ్యాపక

ఓమ్

(సృష్టిలోని పదార్థాలన్నింటిలో వ్యాపించియున్నవాడు)

17. శ్రోత్రా దీంద్రియ శక్తిద

ఓమ్

(జ్ఞాన కర్మేంద్రియాలకు శక్తినిచ్చువాడు)

18. కర్మాశ్రిత ఫలదాయక

ఓమ్

(జీవులు చేయు కర్మలకు ఫలము నిచ్చువాడు)

19. అద్భుత తేజో బలయుత

ఓమ్

(అద్భుతమైన తేజస్సు బలములు కలవాడు)

20. శ్రేయః ప్రాప్తి సుసాధక

ఓమ్

(మోక్షప్రాప్తికి సాధనము)

21. హర్షిత మతి సందాయక

ఓమ్

(సుఖములనిచ్చు బుద్ధిని ప్రసాదించువాడు)

22. మాతృప్రేమ పరిపోషక

ఓమ్

(తల్లి ప్రేమతో అందరిని పెంచువాడు)

23. స్నేహా త పితృపాలక

ఓమ్

(స్నేహంతో దయతో తండ్రివలె పోషించువాడు)

24. వ్యాహృతి లోక విభాజక

ఓమ్

(విస్తారమైన సృష్టిని లోకాలుగా విభజించువాడు)

25. సకల బుద్ధి సిద్ధిప్రద

ఓమ్

(సకల జ్ఞానము నిచ్చువాడు)

26. వేద చతుష్టయ దాయక

ఓమ్

(ఋగ్, యజుస్, సామ, అథర్వ వేదాల నిచ్చువాడు)
అనంత గుణ గణ భూషిత

ఓమ్

శుద్ధబ్రహ్మ పరాత్పర

ఓమ్

27. అగ్న్యాధిక ఋషి పూజిత

ఓమ్

(అగ్ని వాయు ఆదిత్య అంగిరసులను ఆది ఋషులచే పూజింపబడువాడు)

28. సాధన సాధ్య సముచ్చయ

ఓమ్

(సాధ్యమునకు తగిన సాధనములను సమకూర్చువాడు.
(మోక్షమునకు – యోగమును)

29. ప్రాణదక్ష సందాయక

ఓమ్

(జీవులకు ప్రాణముల నిచ్చువాడు)

30.ఇంద్ర బృహస్పతి నామక

ఓమ్

(ఇంద్రుడు, బృహస్పతి మున్నగు పేర్లతో పిలువబడువాడు)

31. ఋతుపరివర్తన కారణ

ఓమ్

(వసంతాది ఆఱు ఋతువులను కల్పించువాడు)

32. ఋతుమూలక హిత దాయక

ఓమ్

(ఋతువుల ద్వారా జీవులకు మేలు చేయువాడు)

33. జ్ఞాన సూర్య విస్తారక

ఓమ్

(జ్ఞానమనే సూర్యుని మానవులలో ప్రకాశింపజేయువాడు)

34. సుర సంపూజిత సురవర

ఓమ్

(దేవతలు పూజించే శ్రేష్ఠుడు – అధిదేవుడు)

35. సత్సంకల్ప ప్రపూరక

ఓమ్

(సత్యసంకల్పములను నెరవేర్చువాడు)

36. ధర్మాధర్మ సుశిక్షక

ఓమ్

(ధర్మము – అధర్మములను వేదముద్వారా బోధించువాడు)

37. జన్మరహిత జన్మప్రద

ఓమ్

(తాను శరీరమును ధరించక జీవులకు శరీరముల నిచ్చువాడు)

38. దేవాధిక ఋణమోచక

ఓమ్

(విద్వాంసులను ఋణములనుండి విడిపించువాడు)
అనంత గుణగణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

39. క్లేశ విముక్త విశేషణ

ఓమ్

(కష్టములు లేని పురుష విశేషుడు)

40. స్నాయు రహిత సుఖపూరక

ఓమ్

(నాడీ బంధనములు లేనివాడు. జీవులలో సుఖమును నింపువాడు)

41. దైహికరోగ నివారక

ఓమ్

(దేహసంబంధమైన రోగాలను రాకుండా చేయువాడు)

42. తనుపాలక దీర్ఘాయుద

ఓమ్

(శరీరాలను పోషించి దీర్ఘాయువునిచ్చువాడు)

43. ఆత్మికబల సందాయక

ఓమ్

(ఆత్మబలము నిచ్చువాడు)

44. మానవ లక్ష్య మహాశ్రయ

ఓమ్

(మానవులకు లక్ష్యము (పొందవలసినవాడు) మరియు గొప్ప ఆశ్రయము)

45. నిత్య నిరంజన నిరుపమ

ఓమ్

(భగవంతుడు నిత్యుడు, నిరంజనుడు, నిరుపముడు)

46. భవభయ భంజన భేషజ

ఓమ్

(ప్రపంచమునందలి భయమును నాశనమొనర్చే ఔషధము)

47. ఆర్తత్రాణ పరాయణ

ఓమ్

(కష్టములలోనున్న మంచివారిని రక్షించువాడు)

48. అజ్ఞానాదిక రిపుహర

ఓమ్

(అజ్ఞానము మున్నగు శత్రువులను హరించువాడు)

49. దారిద్ర్యాది వినాశక

ఓమ్

(పురుషార్ధపరులైన వారి దారిద్ర్యమును పోగొట్టువాడు)

50. పరమైశ్వర్య సుదాయక

ఓమ్

(తన ఐశ్వర్యాదులతో జీవులకు సుఖముల నిచ్చువాడు)
అనంత గుణగణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

51. సర్వానంద సుసాధక

ఓమ్

(పూర్ణానందమును పొందుటకు సాధనం)

52. సామ్రాజ్యర్క ప్రసారక

ఓమ్

(సామ్రాజ్య సూర్యుని విస్తరింపజేయువాడు)

53. విశ్వ వినోదక విభువర

ఓమ్

(విశ్వమును సకల సుఖములతో వినోదంగా సృష్టించి వ్యాపించి యుండువాడు)

54. సద్బోధిత హృద్వర్ధక

ఓమ్

(సత్యసంకల్పములను చేయు మనస్సును వృద్ధి చేయువాడు)

55. నిర్మల నాయక శర్మద

ఓమ్

(మల రహితుడు. నాయకుడు. ఆనందం నిచ్చువాడు)

56. లోభాదిక రిపు నాశక

ఓమ్

(లోభము మున్నగు శత్రువులను నాశనము చేయువాడు)

Sri Pranava Stotram In Telugu pdf

57. తేజః ప్రద తేజోమయ

ఓమ్

(సూర్యాది నక్షత్రములకు జీవులకు పూర్ణ ప్రకాశము నిచ్చువాడు)

58. ఓజః ప్రద ఓజోమయ

ఓమ్

(అనంతసామర్థ్యము కలిగియుండి పూర్ణ సామర్థ్యము నిచ్చువాడు)

59. శ్రద్ధాప్రద శ్రద్ధామయ

ఓమ్

(అనంత శ్రద్ధతో జీవులలో శ్రద్ధను కలుగజేయువాడు)

60. రసవాహక సర్వేశ్వర

ఓమ్

(పుష్పఫలాదులలో రసమును చేర్చుచు సృష్టిఅంతా ఐశ్వర్యంగాకలవాడు)

61. దాన సృష్టి సంచాలక

ఓమ్

(తాను సృష్టించిన జగత్తును జీవుల కొరకు దానమొనర్చి చక్కగా నడపువాడు)

62. రసభేదక సంవర్ధక

ఓమ్

(వృక్షాదులలోని రసమును సూర్యాదుల ద్వారా పైకి ఆకర్షింపజేయుచు వృద్ధిచేయువాడు)

అనంత గుణగణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

63. పాపనివారక మోక్షద

ఓమ్

(పాపములు చేయకుండా నివారించి మోక్షము నిచ్చువాడు)

64. మృత్యురూప సంశోధక

ఓమ్

(మరణము ద్వారా జీవులను ఉద్దరించేవాడు)

65. చిత్ర విచిత్ర మహాతుథ

ఓమ్

(సృష్టిలోని చిత్రవిచిత్రములన్నీ తెలిసినవాడు)

66. సత్యసనాతన ధర్మద

ఓమ్

(సత్యము సనాతనమైన వేదధర్మము బోధించేవాడు)

67. హోమార్పిత హవిభేదక

ఓమ్

(హోమంలో అర్పించిన ద్రవ్యముల ద్వారా సుగంధమును వెదజల్లువాడు)

68. సభ్యసభా ప్రతిభాప్రియ

ఓమ్

(ప్రతిభావంతులైన సభ్యుల సభకు ప్రియుడు)

69. విస్తృత శాంతి విధాయక

ఓమ్

(శాంతిని విస్తరింపజేయువాడు)

70. వరుణ ప్రజాపతి ప్రేరక

ఓమ్

(వరుణుడు. ప్రజాపతి. ప్రేరణ నిచ్చువాడు)

71. స్థావర జంగమ రక్షక

ఓమ్

(స్థావరములను (కదలనివి) జంగమములను (కదలునవి) రక్షించువాడు)

72. విద్వజ్జన మతి ప్రేరక

ఓమ్

(విద్వాంసుల బుద్ధిని వికసింపజేయువాడు)

73. విక్రమ విష్ణు విరాడసి

ఓమ్

(విక్రముడు. విష్ణువు . విరాట్ మున్నగు నామములు కలవాడవు)

74. దాన రహిత నరనాశక

ఓమ్

(దానము చేయని ప్రజలను నాశనము చేయువాడు)
అనంత గుణగణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

75. త్యాగయుక్త నర భద్రద

ఓమ్

(త్యాగము చేయు నరులను రక్షించువాడు)

76. మన్యురూప మన్యుప్రద

ఓమ్

(దుష్టులపైన దుష్టకార్యములపైన క్రోధము కలిగి, మానవులకును అట్టి మన్యువును ఇచ్చువాడు)

77. వీర్యరూప వీర్యప్రద

ఓమ్

(అనంత పరాక్రమముతో మానవులకు పూర్ణ పరాక్రమము నిచ్చువాడు)

78. సహనరూప సహదాయక

ఓమ్

(అనంత సహనముతో మానవులకు సహనము నిచ్చువాడు)

79. అచల రూప సంచాలక

ఓమ్

(తానుకదలక జగత్తునంతటినీ నడిపించువాడు)

80. రుద్ర భీమ భయవాహక

ఓమ్

(రుద్రుడు. భీముడు. భయంకరుడు)

81. సజ్జన సమ్మత సౌఖ్యద

ఓమ్

(సజ్జనులకిష్టమైన సుఖముల నిచ్చువాడు)

82. వర్ణ చతుష్టయ స్థాపక

ఓమ్

(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణములను ఏర్పరచినవాడు)

83. సర్వ న్యూన సంపూరక

ఓమ్

(సృష్టిలో ఏలోటులేకుండా చేయువాడు)

84. విద్వేషాదిక భంజక

ఓమ్

(ద్వేషాదులను నాశనము చేయువాడు)

85. సర్వమిత్ర సంపాదక

ఓమ్

(అందరికీ మిత్రుడు)

86. సృష్టి స్థితి లయ కారక

ఓమ్

(సృష్టిని చేసి పోషించి నాశనము చేయువాడు)
అనంత గుణ గణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

87. క్షోభరహిత నభ నామక

ఓమ్

(దుఃఖము లేనివాడు, ఆకాశనామముకలవాడు)

88. మంగళ మూల మయోభవ

ఓమ్

(మంగళకారకుడు)

89. శంకరరూప మయస్కర

ఓమ్

(శంకరుడు. మయస్కరుడను పేర్లతో పిలువబడువాడు)

90. సృష్టి మయా వసు రసవతి

ఓమ్

(నేను చేసిన ఈ సృష్టి ఐశ్వర్య, రసాదులతో కూడినది)

91. సత్పథ ధర్మ పురోహిత

ఓమ్

(ధార్మికులను సత్యమార్గములో నడిపించువాడు)

92. నాశ నివారక స్వస్తిద

ఓమ్

(నాశమునుండి తప్పించి శుభములనిచ్చువాడు)

93. సకల యజ్ఞ స్వీకారక

ఓమ్

(శ్రేష్ఠ కర్మలన్నింటినీ అనుమతించువాడు)

94. ఉక్షిత రక్షక శిక్షక

ఓమ్

(శుభకర్మలాచరించువారిని రక్షించువాడు. దుష్టులను శిక్షించువాడు)

95. విశ్వరూప విశ్వావసు

ఓమ్

(విశ్వమనెడు ఈ సమస్త ఐశ్వర్యము పరమేశ్వరునిది)

96. విశ్వమిత్ర వైశ్వానర

ఓమ్

(అందరికి మిత్రుడు. ఈశ్వరుడు)

97. పుణ్య పురూత మపూరుష

ఓమ్

(జీవునివలె పుణ్య పాపకర్మలు చేయువాడు కాడు)

98. పాహి నిరంతర పూషణ

ఓమ్

(సజ్జనులను ఎల్లప్పుడు రక్షించి పోషించువాడు)
అనంత గుణగణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

99. పాహి ప్రవాహణ ప్రభువర

ఓమ్

(అందరికీ ప్రభువైన ఓ ఈశ్వర మమ్ము రక్షించు)

100.అద్భుత మిత్ర కృపాకర

ఓమ్

(గొప్పమిత్రుడు, కృపను జూపువాడు)

101. మిత్ర రూప వ్రతపాలక

ఓమ్

(స్నేహ వ్రతమును పాలించువాడు)

102. నిశ్చిత మిత్ర నిరాశ్రయ

ఓమ్

(సదా మిత్రుడు, ఆశ్రయము)

103. అధమోద్ధారక చిన్మయ

ఓమ్

(దీనుల నుద్ధరించువాడు. అనంత జ్ఞానము కలవాడు)

104. సత్య సుఖాత్మక సర్వద

ఓమ్

(సత్యసుఖముతో కూడినవాడు. సృష్టిని దానము చేయువాడు)

105.నిర్గుణ రూప నిరామయ

ఓమ్

(రూపరస గంధాది గుణములు, అజీర్ణాది రోగములు లేనివాడు)

106. ఆనందామృత వర్షక

ఓమ్

(ఆనందమనే అమృతము నిచ్చువాడు)

107. గణనాయక గణపాలక

ఓమ్

(దేవతాది గణములకు నాయకుడు – పోషకుడు)

108. మర్మాచ్ఛాదక విభువర

ఓమ్

(జీవనమునకు కారణములైన ప్రాణాదులను కప్పియుంచువాడు)
అనంత గుణ గణ భూషిత

ఓమ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర

ఓమ్

(ఇతి అష్టోత్తర శత ప్రణవ నామాని)

మరిన్ని స్తోత్రములు

Sri Dattatreya Ashtottara Shatanamavali In Telugu – దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళీ

Sri Dattatreya Ashtottara Shatanamavali In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

Dattatreya Ashtottara Shatanamavali Lyrics In Telugu

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళీ

 • ఓం శ్రీదత్తాయ నమః
 • ఓం దేవదత్తాయ నమః
 • ఓం బ్రహ్మదత్తాయ నమః
 • ఓం విష్ణుదత్తాయ నమః
 • ఓం శివదత్తాయ నమః
 • ఓం అత్రిదత్తాయ నమః
 • ఓం ఆత్రేయాయ నమః
 • ఓం అత్రివరదాయ నమః
 • ఓం అనసూయాయ నమః
 • ఓం అనసూయాసూనవే నమః
 • ఓం అవధూతాయ నమః
 • ఓం ధర్మాయ నమః
 • ఓం ధర్మపరాయణాయ నమః
 • ఓం ధర్మపతయే నమః
 • ఓం సిద్ధాయ నమః
 • ఓం సిద్ధిదాయ నమః
 • ఓం సిద్ధిపతయే నమః
 • ఓం సిద్ధసేవితాయ నమః
 • ఓం గురవే నమః
 • ఓం గురుగమ్యాయ నమః
 • ఓం గురోర్గురుతరాయ నమః
 • ఓం గరిష్ఠాయ నమః
 • ఓం వరిష్ఠాయ నమః
 • ఓం మహిష్ఠాయ నమః
 • ఓం మహాత్మనే నమః
 • ఓం యోగాయ నమః
 • ఓం యోగగమ్యాయ నమః
 • ఓం యోగాదేశకరాయ నమః
 • ఓం యోగపతయే నమః
 • ఓం యోగీశాయ నమః
 • ఓం యోగాధీశాయ నమః
 • ఓం యోగపరాయణాయ నమః
 • ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః
 • ఓం దిగంబరాయ నమః
 • ఓం దివ్యాంబరాయ నమః
 • ఓం పీతాంబరాయ నమః
 • ఓం శ్వేతాంబరాయ నమః
 • ఓం చిత్రాంబరాయ నమః
 • ఓం బాలాయ నమః
 • ఓం బాలవీర్యాయ నమః
 • ఓం కుమారాయ నమః
 • ఓం కిశోరాయ నమః
 • ఓం కందర్పమోహనాయ నమః
 • ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
 • ఓం సురాగాయ నమః
 • ఓం విరాగాయ నమః
 • ఓం వీతరాగాయ నమః
 • ఓం అమృతవర్షిణే నమః
 • ఓం ఉగ్రాయ నమః
 • ఓం అనుగ్రరూపాయ నమః
 • ఓం స్థవిరాయ నమః
 • ఓం స్థవీయసే నమః
 • ఓం శాంతాయ నమః
 • ఓం అఘోరాయ నమః
 • ఓం గూఢాయ నమః
 • ఓం ఊర్ధ్వరేతసే నమః
 • ఓం ఏకవక్త్రాయ నమః
 • ఓం అనేకవక్త్రాయ నమః
 • ఓం ద్వినేత్రాయ నమః
 • ఓం త్రినేత్రాయ నమః
 • ఓం ద్విభుజాయ నమః
 • ఓం షడ్భుజాయ నమః
 • ఓం అక్షమాలినే నమః
 • ఓం కమండలధారిణే నమః
 • ఓం శూలినే నమః
 • ఓం డమరుధారిణే నమః
 • ఓం శంఖినే నమః
 • ఓం గదినే నమః
 • ఓం మునయే నమః
 • ఓం మౌనినే నమః
 • ఓం శ్రీవిరూపాయ నమః
 • ఓం సర్వరూపాయ నమః
 • ఓం సహస్రశిరసే నమః
 • ఓం సహస్రాక్షాయ నమః
 • ఓం సహస్రబాహవే నమః
 • ఓం సహస్రాయుధాయ నమః
 • ఓం సహస్రపాదాయ నమః
 • ఓం సహస్రపద్మార్చితాయ నమః
 • ఓం పద్మహస్తాయ నమః
 • ఓం పద్మపాదాయ నమః
 • ఓం పద్మనాభాయ నమః
 • ఓం పద్మమాలినే నమః
 • ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
 • ఓం పద్మకింజల్కవర్చసే నమః
 • ఓం జ్ఞానినే నమః
 • ఓం జ్ఞానగమ్యాయ నమః
 • ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
 • ఓం ధ్యానినే నమః
 • ఓం ధ్యాననిష్ఠాయ నమః
 • ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
 • ఓం ధూలిధూసరితాంగాయ నమః
 • ఓం చందనలిప్తమూర్తయే నమః
 • ఓం భస్మోద్ధూలితదేహాయ నమః
 • ఓం దివ్యగంధానులేపినే నమః
 • ఓం ప్రసన్నాయ నమః
 • ఓం ప్రమత్తాయ నమః
 • ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః
 • ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
 • ఓం వరదాయ నమః
 • ఓం వరీయసే నమః
 • ఓం బ్రహ్మణే నమః
 • ఓం బ్రహ్మరూపాయ నమః
 • ఓం విష్ణవే నమః
 • ఓం విశ్వరూపిణే నమః
 • ఓం శంకరాయ నమః
 • ఓం ఆత్మనే నమః
 • ఓం అంతరాత్మనే నమః
 • ఓం శ్రీ దత్తాత్రేయాయ నమో నమః

మరిన్ని అష్టోత్తరములు:

Ashtottara – అష్టోత్తర

Ashtottara

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అటువంటి అష్టోత్తరాన్నిఎలా చదవాలి, ఏయ్ ఏయ్ అష్టోత్తరాన్ని చదవాలి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, మొదలగు అష్టోత్తర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం.

Ashtottara – అష్టోత్తర