Gayatri Mantram In Telugu | గాయత్రి మంత్రము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ మంత్రము విశిష్టత, గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి, మరియు గాయత్రీ మంత్రమును గురించి తెలుసుకుందాం.

Gayatri Mantram In Telugu Lyrics

మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది.

గాయత్రీ మంత్రము విశిష్టత

భారతదేశమున పూర్వకాలములో ముఖ్యముగా ఐదు విధములైన దేవతారాధనలు ఉండెడివి. అవి 1) గాణాపత్యము 2) సౌరము 3) శాక్తేయము 4) శైవము 5) వైష్ణవము. గాణాపత్యులు- గణపతిని; సౌరులు – సూర్యుని; శాక్తేయులు – శక్తిని; శైవులు – శివుని; వైష్ణవులు – విష్ణువును ఆరాధించెడివారు. వీరిమధ్య పరస్పర అవగాహన కన్న పరస్పరవిద్వేషమే అధికముగా ఉండెడిది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించరు. కాని, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరము లేని ఒకే ఒక దేవత “గాయత్రి”. అట్టి వైశిష్ట్యము గాయత్రీ మాతకు ఉన్నది.

గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి?

బుద్ధులు పెడత్రోవ త్రొక్కకుండా ప్రచోదనము చేయునది గాయత్రి కాబట్టి, ముందుగా ఈ సద్భుద్ధికై “గాయత్రి” పఠించి అటు పైన పొందిన సద్భుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము చేకూరును. ఈ కారణము వలన మిగిలిన మంత్రములకన్న ముందుగా గాయత్రి చేయవలెనని చెప్పుట జరిగినది. అంతేగాని ‘గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలిన మంత్రములు పనికిరానివి’ అని అర్థము కాదు.

గాయత్రీ మంత్రము

గానము చేయదగిన గాయత్రీ మంత్రములో రెండు విధములైన మంత్రములు గలవు. 1) విశిష్ట గాయత్రి 2) జప గాయత్రి. ఇందులో జప గాయత్రిలో ప్రణవము (ఓంకారము), మూడు పాదములు మాత్రమే ఉండును. ఈ జపగాయత్రినే సాధారణముగా గాయత్రీ మంత్రముగా వ్యవహరింతురు. ఈ జపగాయత్రి ఈ క్రింద తెలిపిన విధముగా నుండును.

Gayatri Mantram In Words

పైన తెలుపబడిన జప గాయత్రీ మంత్రములో మొత్తము 29 అక్షరములు లెక్కకు వచ్చును. మరి గాయత్రీ మంత్రములో 24 అక్షరములు (చతుర్విగ్ ంశత్యక్షరా) వుండును అందురు గదా! మరి 29 వచ్చినవేమి ? పైన తెలిపిన మంత్రములో మూడు వ్యాహృతులు అనగా భూః, భువః, సువః, (కొందరు ‘సువః’ కు బదులు ‘స్వః’ అందురు. అయినను అర్థము మారదు.)

గాయత్రీ మంత్రపద విభాగము

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య. ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్.

పదక్రమము:

వరేణ్యమ్, నః, ధియః, ప్రచోదయాత్ యః
తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి.

వరేణ్యమ్                      =   (అందరికినీ శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు)
నః                                 =   మన
ధియః                           =   బుద్ధులను
ప్రచోదయాత్                =  ప్రేరేపించునదియు
యః                              =   ఎవరో
ఓం                               =   ప్రణవ ప్రతీకమైన
తత్                              =   ఆ
సవితు:దేవస్య              =  వెలుగుల సవితృమూర్తి యొక్క
భర్గః                             =  (స్వయంప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును
ధీమహి                         =   ధ్యానించుదము (గాక)

తాత్పర్యము:

అందరికిని శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు, మన బుద్దులను ప్రేరేపించునదియు ఎవరో – ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తి యొక్క (స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము (గాక!) (ఈ గాయత్రీ మంత్రమునకు బహువచనములోనే గాక ఏకవచనములో గూడా అర్థ తాత్పర్యాదులు చెప్పుకొనవచ్చును.) ఇది ఒక వర్గమునకు, వర్ణమునకు, కులమునకు, మతమునకు, జాతికి, సంబంధించిన మంత్రము కాదనియు, సమస్త మానవాళి శ్రేయస్సును కోరు సహృదయులందరూ ఈ మంత్రమును ఒంటిరిగానైననూ, సామూహికముగా నైననూ ఉచ్చరించవచ్చుననియు ఈ మంత్ర తాత్పర్యమును బట్టి తేట తెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల ప్రార్థనలు, మంత్రములు అన్నియు ఇదే విధముగా స్వార్థ రహితముగా సర్వజన శ్రేయోదాయకములుగా ఉండునని గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినోభవన్లు ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః, 

(సర్వలోక జీవులకు సుఖశాంతులు కలుగుగాక!)

హరిః ఓం తత్సత్

శ్రీ కృష్ణార్పణమస్తు

సంబందిత ప్రశ్నలు:

1. ప్రశ్న
గాయత్రీ మంత్రమును బాహాటముగా గొంతెత్తి ఉచ్చరించవచ్చునా?

సమాధానము :
“గాయంతాం త్రాయతే – ఇతి గాయత్రి” అనగా పాడిన కొలది రక్షించు మంత్రము గాయత్రి అని నిర్వచనములోనే ఉండగా ఈ సందేహము కలుగవలసిన పనిలేదు. మరియు, గాయత్రి వేదములోని మంత్రము. వేదమంతయు స్వరయుక్తము. బయటకు ఉచ్చరించినపుడే స్వర భేదము స్ఫుటముగా తెలియును గాని, లోపల నసిగినపుడు, గొణగినపుడు కాదు. అందుచేతనే స్వరయుక్త మంత్రములన్నియు బయటకు ఉచ్చరించుట తప్పుకాదు.

2. ప్రశ్న
అందఱూ కలసి సామూహికముగా ఉచ్చరించవచ్చునా ?

సమాధానము :
“థియోయోనః ప్రచోదయాత్’ అనుటలో “థియః” అనగా బుద్ధులు అని, “నః” అనగా “మమ్ము” లేదా “మా యొక్క” అను పదములతో బహువచనములు ఉండగా అందరూ కలసి చేయవచ్చుననియే తెలుపును గదా!

3. ప్రశ్న
ఈ ఉపదేశము ఎప్పుడు జరుగవలెను?

సమాధానము:
ఏ విద్యనైనను, ఏ మంత్రము నైనను నేర్చుకొనవలెనని అభిలాష, శ్రద్ధ, పట్టుదల కలిగిన వారు వాటిని చేర్చుకొనుటకు అర్హులే. ఆసక్తి, శ్రద్ధ కలుగుట అనగా బుద్ధి దానిపట్ల ప్రచోదనమగుట అనియే కదా! నిజమునకు ఆ మంత్రమును నేర్చుకొనవలెనని బుద్ధి పుట్టినపుడు మంత్రోపదేశము (Initiation) జరిగినట్లు లెక్క. ఆ తరువాత భౌతికముగా గురువు వద్ద ఉపదేశము పొందుట దానిని సమర్ధించుచు (Ratify) చేయు ప్రక్రియయే!

4. ప్రశ్న
వేరువేరు వర్ణములకు వేరు వేరు గాయత్రీ మంత్రములు వున్నవా?

సమాధానము:
అన్ని వర్ణములవారు గాయత్రిని చేసుకొనవచ్చును. ఆ మంత్రమును చేయుట తప్పనుకొనువారికి – వేరు, వేరు గాయత్రీ మంత్రములు గూడ కలవు. బ్రాహ్మణులకు అనుష్టుప్ ఛందస్సులో పై మంత్రము ఈయబడినది. (అనుష్టుప్ అనగా 8 అక్షరముల ఛందస్సు.

5. ప్రశ్న
స్త్రీలు యీ మంత్రమును పఠించవచ్చునా?

సమాధానము:
స్త్రీ, పురుషులందఱూ జీవాత్మలే ! అనగా జీవాత్మకు లింగభేదము లేదు. మైత్రేయి, గార్గి, అనసూయ మొదలగు వారు వేద శాస్త్రాదులు చదివిన వారే ! గాయత్రీ మంత్రమును జపించిన వారే ! చేయు పద్ధతిలో స్వల్ప భేదము ఉండునేమో గాని, సంధ్యా వందనము గూడ స్త్రీలకు నిషిద్ధము కాదు.

మరిన్ని పోస్ట్లు:

Mantra – మంత్రా

Mantra

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్రం అంటే ఒక ఆధ్యాత్మిక అలంకారం. ఇది జీవనంలో సంతోషం, శాంతి, మనస్సుకి సంతృప్తి, మానసిక తృప్తి లభించడానికి వాడే విధానం. మంత్రం చదువుట, గానం చేయుట, మంత్రాలను జపించుట, ధ్యానం చేయుట ద్వారా మన మాధుర్యం, భక్తి, ఆత్మీయత వంటి గుణాలను పెంచవచ్చు. మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది. మొదలగు మంత్ర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Mantralu – మంత్రాలు

Mantra Pushpam In Telugu | మంత్ర పుష్పం

Mantra Pushpam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం  అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంత్ర పుష్పం  గురించి తెలుసుకుందాం…

Mantra Pushpam In Telugu Lyrics

మంత్ర పుష్పం

ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాస్త్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్హా అయనాయ విద్యతే |

ఓం సహస్రశీర్ణం దేవం విశ్వాక్షం విశ్వశమ్భువమ్ |
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ |

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి |

పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ |

నారాయణః పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణః పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |

నారాయణః పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః |
యచ్చ కిఇ్చజ్జగత్సర్వం దృశ్యతే” శ్రూయతే2పి వా ||

అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః |
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేన్తం విశ్వశమ్భువమ్ |

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ |
అధో నిష్ట్యా వితస్త్యానే నాభ్యాముపరి తిష్ఠతి |

జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ |
సన్తతగ్ం సిరాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ |

తస్యాన్తో సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతిష్ఠితమ్ |
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః |

సో గ్రభుగ్విభజన్తిష్ఠన్నాహారమజరః కవిః |
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా |

సన్తాపయతి స్వం దేహమాపాదతలమస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థితా |

నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ సీతా భా”స్వత్యణూపమా |

తస్యా”: శిఖాయా మధ్యే పరమా”త్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివ: (స హరి:) సేన్ద్ర: సోఒక్షరః పరమః స్వరాట్ ||

యోపాం పుష్పం వేద |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |

చన్ద్రమా వా అపాం పుష్పమ్” |
పుష్పవాన్ ప్రజావా”న్ పశుమాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

అగ్నిర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో”ఒగ్నేరాయతనం వేద || ఆయతనవాన్ భవతి |
ఆపో వా అగ్నేరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

వాయుర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో వాయోరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై వాయోరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద | |
ఆయతనవాన్ భవతి |

అసౌ వై తపన్నపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో ముష్య తపత ఆయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
ఆపో వా అముష్య తపత ఆయతనమ్ ||
ఆయతనవాన్ భవతి ||
య ఏవం వేద | యో౬పామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

చన్ద్రమా వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యశ్చన్ద్రమస ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై చక్రమస ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

నక్షత్రాణి వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో నక్షత్రాణామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై నక్షత్రాణామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో పామాయతనం వేద || య |
ఆయతనవాన్ భవతి |

పర్జన్యో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యః పర్జన్యస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై పర్జన్యస్యా౬ఒయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో పామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |

సంవత్సరో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యస్సంవత్సరస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి | వేద | |
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యో”ఒప్సు నావం ప్రతిష్ఠితాం వేద |
ప్రత్యేవ తిష్ఠతి ||

కిం తద్విష్ణోర్బలమాహుః కా దీప్తిః కిం పరాయణం
ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే
వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే
త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం |

ఆతనుష్వ ప్రతనుష్వ |
ఉద్ధమా౬౭ధమ సన్దమ |
ఆదిత్యే చన్ద్రవర్ణానామ్ |
గర్భమాధేహి యః పుమాన్ |

ఇతస్సిక్తగ్ం సూర్యగతమ్ |
చన్ద్రమస్తే రసఙ్కృధి |
వారాదఞనయాగ్రేగ్నిమ్ |
య ఏకో రుద్ర ఉచ్యతే ||

ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే” |
నమో వయం వై”శ్రవణాయ కుర్మహే |
స మే కామాన్కామకామాయ మహ్యమ్” |
కామేశ్వరో వై”శ్రవణో దదాతు |
కుబేరాయ వైశ్రవణాయ |
మహారాజాయ నమ: ||

ఓం తద్రృహ్మ ఓ”O తద్వాయుః ఓ”ం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వమ్” ఓ”O తత్పురోర్నమ: |

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిన్ద్రస్త్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః |

త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||

ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మా ధీపతిర్బహ్మణో ధీపతిర్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||

సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా
సర్వగ్ం హరతుమే పాపం దూర్వాదు స్స్వప్న నాశినీ

కాణ్ణాత్ కాణ్ణాత్ ప్రరోహన్తి పరుషః పరుషః పరి
ఏవానో దూర్వే వ్రతను సహస్రేణ శతేనచ

యాశతేన వ్రతనోషి సహ సేణ విరోహసి
తస్యాస్తే దేవీష్టకే విధేమా హవిషావయం

అశ్వక్రాన్తో రథకార్డే విష్ణు క్రాన్తె వసుంధరా
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే
భూమిరే నుర్దరణీ లోకధారిణీ

ఉదృతాసి వరాహేణ కృష్ణన శతబాహునా
మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం
మృత్తికే బ్రహ్మ దత్తాసి కాశ్యపేనాభి మన్రితా
మృత్తికే దేహిమే పుష్టింత్వయి సర్వం ప్రతిష్ఠితం
మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మేనిర్ణుదమృత్తికే
తయాహతేన పాపేన గచ్చామి పరమాం గతిమ్

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సిద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్ణయలక్ష్మీ స్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశాపాశ మభీతి ముద్రాం కరైర్వహన్తమ్ కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహ మంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నోదుర్గిః ప్రచోదయాత్.
సద్భావపుష్పాణ్యాదాయ సహజ ప్రేమ రూపిణే
లోకమాత్రే దదామ్యద్య, ప్రీత్యా సంగృహ్యతాం సదా
శ్రీ లలితా దేవ్యై నమః

సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

మరిన్ని పోస్ట్లు:

Vande Shivam Shankaram In Telugu – వందే శివం శంకరమ్

Vande Shivam Shankaram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వందే శివం శంకరమ్ స్తోత్రం గురించి తెలుసుకుందాం…

Vande Shivam Shankaram Lyrics Telugu

వందే శివం శంకరమ్

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సర్వజగద్విహారమతులం వందేన్దక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హారే ర్వల్లభమ్!
వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే దివ్యమచిన్త్య మద్వయ మహం వందే ర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం మఖ ధ్వంసినమ్ !
వందే సత్యమనన్త మాద్యమభయం వందే శాన్తాకృతం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్!
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్థ గంగాధరమ్ !
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్!
వందే విప్రసురార్చితాంఘ్ర కమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూత గణేశ మవ్యయ మహం వందే ర్థ రాజ్యప్రదమ్ !
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్డే నకారాపహం
వందే రావణ నందిభృంగి వినతం వందే సుపర్ణావృతమ్!
వందే శైల సుతార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్దేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్!
వందే జహ్నుసుతారి మికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

మరిన్ని స్తోత్రములు