కిష్కింధాకాండ సప్తవింశః సర్గః, ఈ సప్తవింశ సర్గలో, వానర సైన్యాలు నాలుగు దిక్కులలో పంపబడతాయి. సుగ్రీవుడు, రాముడు ఇచ్చిన ఉంగరంతో హనుమంతుడు నాయకత్వంలో దక్షిణ దిశకు వెళ్ళే వానర సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తూ సీతమ్మకు చూపించాలని ఆదేశిస్తాడు. వానరులు దారిలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ ప్రయాణంలో, వారు సీతమ్మ జాడను కనుగొనడమే ప్రధాన లక్ష్యం. హనుమంతుడు మరియు అతని సహచరులు, సీతమ్మను రక్షించడం కోసం తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ముందుకు సాగుతారు. ఈ సర్గ సీతమ్మ గవేషణలో కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది.
మాల్యవన్నివాసః
అభిషిక్తే తు సుగ్రీవే ప్రవిష్టే వానరే గుహామ్ |
ఆజగామ సహ భ్రాత్రా రామః ప్రస్రవణం గిరిమ్ || ౧ ||
శార్దూలమృగసంఘుష్టం సింహైర్భీమరవైర్వృతమ్ |
నానాగుల్మలతాగూఢం బహుపాదపసంకులమ్ || ౨ ||
ఋక్షవానరగోపుచ్ఛైర్మార్జారైశ్చ నిషేవితమ్ |
మేఘరాశినిభం శైలం నిత్యం శుచిజలాశ్రయమ్ || ౩ ||
తస్య శైలస్య శిఖరే మహతీమాయతాం గుహామ్ |
ప్రత్యగృహ్ణత వాసార్థం రామః సౌమిత్రిణా సహ || ౪ ||
కృత్వా చ సమయం సౌమ్యః సుగ్రీవేణ సహానఘః |
కాలయుక్తం మహద్వాక్యమువాచ రఘునందనః || ౫ ||
వినీతం భ్రాతరం భ్రాతా లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ |
ఇయం గిరిగుహా రమ్యా విశాలా యుక్తమారుతా || ౬ ||
అస్యాం వసావ సౌమిత్రే వర్షరాత్రమరిందమ |
గిరిశృంగమిదం రమ్యమున్నతం పార్థివాత్మజ || ౭ ||
శ్వేతాభిః కృష్ణతామ్రాభిః శిలాభిరుపశోభితమ్ |
నానాధాతుసమాకీర్ణం దరీనిర్ఝరశోభితమ్ || ౮ ||
వివిధైర్వృక్షషండైశ్చ చారుచిత్రలతావృతమ్ |
నానావిహగసంఘుష్టం మయూరరవనాదితమ్ || ౯ ||
మాలతీకుందగుల్మైశ్చ సింధువారకురంటకైః |
కదంబార్జునసర్జైశ్చ పుష్పితైరుపశోభితమ్ || ౧౦ ||
ఇయం చ నలినీ రమ్యా ఫుల్లపంకజమండితా |
నాతిదూరే గుహాయా నౌ భవిష్యతి నృపాత్మజ || ౧౧ ||
ప్రాగుదక్ప్రవణే దేశే గుహా సాధు భవిష్యతి |
పశ్చాచ్చైవోన్నతా సౌమ్య నివాతేయం భవిష్యతి || ౧౨ ||
గుహాద్వారే చ సౌమిత్రే శిలా సమతలా శుభా |
శ్లక్ష్ణా చైవాయతా చైవ భిన్నాంజనచయోపమా || ౧౩ ||
గిరిశృంగమిదం తాత పశ్య చోత్తరతః శుభమ్ |
భిన్నాంజనచయాకారమంభోధరమివోత్థితమ్ || ౧౪ ||
దక్షిణస్యామపి దిశి స్థితం శ్వేతమివాపరమ్ |
కైలాసశిఖరప్రఖ్యం నానాధాతువిభూషితమ్ || ౧౫ ||
ప్రాచీనవాహినీం చైవ నదీం భృశమకర్దమామ్ |
గుహాయాః పూర్వతః పశ్య త్రికూటే జాహ్నవీమివ || ౧౬ ||
చంపకైస్తిలకైస్తాలైస్తమాలైరతిముక్తకైః |
పద్మకైః సరలైశ్చైవ అశోకైశ్చైవ శోభితామ్ || ౧౭ ||
వానీరైస్తిమిశైశ్చైవ వకులైః కేతకైర్ధవైః |
హింతాలైస్తిరిటైర్నీపైర్వేత్రకైః కృతమాలకైః || ౧౮ ||
తీరజైః శోభితా భాతి నానారూపైస్తతస్తతః |
వసనాభరణోపేతా ప్రమదేవాభ్యలంకృతా || ౧౯ ||
శతశః పక్షిసంఘైశ్చ నానానాదైర్వినాదితా |
ఏకైకమనురక్తైశ్చ చక్రవాకైరలంకృతా || ౨౦ ||
పులినైరతిరమ్యైశ్చ హంససారససేవితైః |
ప్రహసంతీవ భాత్యేషా నారీ సర్వవిభూషితా || ౨౧ ||
క్వచిన్నీలోత్పలైశ్ఛన్నా భాతి రక్తోత్పలైః క్వచిత్ |
క్వచిదాభాతి శుక్లైశ్చ దివ్యైః కుముదకుడ్మలైః || ౨౨ ||
పారిప్లవశతైర్జుష్టా బర్హిణక్రౌంచనాదితా |
రమణీయా నదీ సౌమ్య మునిసంఘైర్నిషేవితా || ౨౩ ||
పశ్య చందనవృక్షాణాం పంక్తీః సురచితా ఇవ |
కకుభానాం చ దృశ్యంతే మనసేవోదితాః సమమ్ || ౨౪ ||
అహో సురమణీయోఽయం దేశః శత్రునిషూదన |
దృఢం రంస్యావ సౌమిత్రే సాధ్వత్ర నివసావహై || ౨౫ ||
ఇతశ్చ నాతిదూరే సా కిష్కింధా చిత్రకాననా |
సుగ్రీవస్య పురీ రమ్యా భవిష్యతి నృపాత్మజ || ౨౬ ||
గీతవాదిత్రనిర్ఘోషః శ్రూయతే జయతాం వర |
నర్దతాం వానరాణాం చ మృదంగాడంబరైః సహ || ౨౭ ||
లబ్ధ్వా భార్యాం కపివరః ప్రాప్య రాజ్యం సుహృద్వృతః |
ధ్రువం నందతి సుగ్రీవః సంప్రాప్య మహతీం శ్రియమ్ || ౨౮ ||
ఇత్యుక్త్వా న్యవసత్తత్ర రాఘవః సహలక్ష్మణః |
బహుదృశ్యదరీకుంజే తస్మిన్ ప్రస్రవణే గిరౌ || ౨౯ ||
సుసుఖేఽపి బహుద్రవ్యే తస్మిన్ హి ధరణీధరే |
వసతస్తస్య రామస్య రతిరల్పాఽపి నాభవత్ || ౩౦ ||
హృతాం హి భార్యాం స్మరతః ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ |
ఉదయాభ్యుదితం దృష్ట్వా శశాంకం చ విశేషతః || ౩౧ ||
ఆవివేశ న తం నిద్రా నిశాసు శయనం గతమ్ |
తత్సముత్థేన శోకేన బాష్పోపహతచేతసమ్ || ౩౨ ||
తం శోచమానం కాకుత్స్థం నిత్యం శోకపరాయణమ్ |
తుల్యదుఃఖోఽబ్రవీద్భ్రాతా లక్ష్మణోఽనునయన్ వచః || ౩౩ ||
అలం వీర వ్యథాం గత్వా న త్వం శోచితుమర్హసి |
శోచతో వ్యవసీదంతి సర్వార్థా విదితం హి తే || ౩౪ ||
భవాన్ క్రియాపరో లోకే భవాన్ దైవపరాయణః |
ఆస్తికో ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ || ౩౫ ||
న హ్యవ్యవసితః శత్రుం రాక్షసం తం విశేషతః |
సమర్థస్త్వం రణే హంతుం విక్రమైర్జిహ్మకారిణమ్ || ౩౬ ||
సమున్మూలయ శోకం త్వం వ్యవసాయం స్థిరం కురు |
తతః సపరివారం తం నిర్మూలం కురు రాక్షసమ్ || ౩౭ ||
పృథివీమపి కాకుత్స్థ ససాగరవనాచలామ్ |
పరివర్తయితుం శక్తః కిమంగ పున రావణమ్ || ౩౮ ||
శరత్కాలం ప్రతీక్షస్వ ప్రావృట్కాలోఽయమాగతః |
తతః సరాష్ట్రం సగణం రావణం త్వం వధిష్యసి || ౩౯ ||
అహం తు ఖలు తే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే |
దీప్తైరాహుతిభిః కాలే భస్మచ్ఛన్నమివానలమ్ || ౪౦ ||
లక్ష్మణస్య తు తద్వాక్యం ప్రతిపూజ్య హితం శుభమ్ |
రాఘవః సుహృదం స్నిగ్ధమిదం వచనమబ్రవీత్ || ౪౧ ||
వాచ్యం యదనురక్తేన స్నిగ్ధేన చ హితేన చ |
సత్యవిక్రమయుక్తేన తదుక్తం లక్ష్మణ త్వయా || ౪౨ ||
ఏష శోకః పరిత్యక్తః సర్వకార్యావసాదకః |
విక్రమేష్వప్రతిహతం తేజః ప్రోత్సాహయామ్యహమ్ || ౪౩ ||
శరత్కాలం ప్రతీక్షిష్యే స్థితోఽస్మి వచనే తవ |
సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదమనుపాలయన్ || ౪౪ ||
ఉపకారేణ వీరస్తు ప్రతికారేణ యుజ్యతే |
అకృతజ్ఞోఽప్రతికృతో హంతి సత్త్వవతాం మనః || ౪౫ ||
అథైవముక్తః ప్రణిధాయ లక్ష్మణః
కృతాంజలిస్తత్ప్రతిపూజ్య భాషితమ్ |
ఉవాచ రామం స్వభిరామదర్శనం
ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభమ్ || ౪౬ ||
యథోక్తమేతత్తవ సర్వమీప్సితం
నరేంద్ర కర్తా న చిరాద్ధరీశ్వరః |
శరత్ప్రతీక్షః క్షమతామిమం భవాన్
జలప్రపాతం రిపునిగ్రహే ధృతః || ౪౭ ||
నియమ్య కోపం ప్రతిపాల్యతాం శరత్
క్షమస్వ మాసాంశ్చతురో మయా సహ |
వసాచలేఽస్మిన్ మృగరాజసేవితే
సంవర్ధయన్ శత్రువధే సముద్యమమ్ || ౪౮ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తవింశః సర్గః || ౨౭ ||
Kishkindha Kanda Sarga 27 Meaning In Telugu
రాముడు, లక్ష్మణుడు ప్రస్రవణ పర్వతము చేరుకున్నారు. ఆ పర్వతము మీద పులులు, సింహములు, మొదలగు క్రూరజంతువులు నివాసముంటున్నాయి. అవే కాకుండా ఎన్నోరకములైన వానరములు, భల్లూకములు కూడా నివాసముంటున్నాయి. అనేకములైన పొదలు, లతలు, వృక్షములతో ఆ పర్వతము శోభిల్లుతూ ఉంది.
ఆ పర్వతము మీద ఉన్న ఒక పెద్ద గుహను తమ నివాసంగా చేరుకున్నారు రామలక్ష్మణులు. “లక్ష్మణా! ఈ గుహ మనకు నివాస యోగ్యముగా ఉన్నది కదూ! వర్షాకాలము అంతా ఇక్కడే ఉందాము. ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సుఉంది. అందులో అందమైన పద్మములు వికసించి ఉన్నాయి. కొంచెం దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. అందులో మనము స్నానాదులు చేయవచ్చును. ఈ నదీ తీరంలో వందలాది పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఈ అందమైన ప్రదేశములో మనము సుఖంగా జీవించెదము. పైగా ఇక్కడి నుండి కిష్కింధా నగరము కనుచూపుమేరలోనే ఉంది. వానర రాజైన సుగ్రీవుడు తన రాజ్యమును, తన భార్యను తిరిగి పొంది, తన బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు.” అని అన్నాడు రాముడు.
కాని రాముని మనసులో తన భార్య తనకు దూరంగా ఉంది అనే బాధ మాత్రం తొలుస్తూనే ఉంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. అనుక్షణం సీసీత గుర్తుకు వస్తూనే ఉంది. రాముని బాధను చూచి లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నీవు వీరుడవు. వీరుడవైన నీవు ఇలా దు:ఖించడం తగదు. దు:ఖముతో అన్నిపనులు నాశనం అవుతాయి. నీవు భగవంతుడిని నమ్ముతావు. నీవు చేయవలసిన పనులను సక్రమంగా చేస్తావు. ఎల్లప్పుడూ ధర్మంగా ప్రవర్తిస్తావు. అలాంటి నీవు ఇలా దు:ఖపడుతూ ఉంటే, నీ భార్యను అపహరించిన దుర్మార్గుడైన రాక్షసుని ఎలా సంహరిస్తావు. కాబట్టి దు:ఖమును విడిచి పెట్టు. ధైర్యం తెచ్చుకో. అప్పుడు సరిగా ఆలోచించ గలుగుతావు. రాక్షస సంహారము చేయగలుగుతావు.
ఓ రామా! నీవు తలచుకుంటే ముల్లోకములను గడగడ లాడించగలవు. అటువంటప్పుడు ఈ రాక్షసుడు రావణుడు ఒక లెక్కా! ఈ వర్షాకాలము పోయి శరత్కాలము రాగానే వానర వీరులతో కలిసి రాక్షస సంహారము చేయగలవు. రామా! నేను నీకు నీతులు చెప్పడం లేదు. నీలో నివురు కప్పిన నిప్పులా ఉన్న పరాక్రమాన్ని ప్రజ్వరిల్ల జేస్తున్నాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు నాకు నీతులు చెప్పలేదు. ఒక మంచి మిత్రుని మాదిరి హితబోధ చేసావు. నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసావు. అన్ని అనర్ధములకు మూలమైన ఈ శోకమును తక్షణము విడిచిపెడుతున్నాను. ధైర్యము తెచ్చుకుంటున్నాను. శరత్కాలము కొరకు, సుగ్రీవుని రాక కొరకు ఎదురుచూస్తుంటాను.”అని అన్నాడు రాముడు. రాముని మాటలకు సంతోషించాడు లక్ష్మణుడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఈ నాలుగు నెలలు ఇట్టే గడిచిపోతాయి. సుగ్రీవుడు నీకు ఇచ్చిన మాట ప్రకారము సీతను వెదకడానికి వానరులను పంపుతాడు. శత్రు సంహారము జరుగుతుంది. అంత దాకా కోపమును అణిచి పెట్టి ఓపిక వహించు. ఈ నాలుగునెలలు మనము ఈ పర్వత గుహలో ఆనందంగా గడుపుదాము.” అని అన్నాడు లక్ష్మణుడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్