Kishkindha Kanda Sarga 29 In Telugu – కిష్కింధాకాండ ఏకోనత్రింశః సర్గః

కిష్కింధాకాండ ఏకోనత్రింశః సర్గః, ఈ సర్గలో హనుమంతుడు లంకా నుంచి తిరిగి రావడంతో రాముడు హర్షం పొందుతాడు. హనుమంతుడు సీతకు సంబంధించిన చూడు, రాక్షసుల గురించి రాముడికి వివరించతాడు. హనుమంతుడు సీతమ్మత చేతులు రాముడి పాదుకలను తీసుకొని వచ్చి, రాముడికి అందిస్తాడు. హనుమంతుడు సీతా మాత రాముడిని స్మరించి ఉంచిన అంగుళి రింగును కూడా రాముడికి చూపిస్తాడు. రాముడు సీతా మాతకు భరోసా కల్పిస్తాడు. హనుమంతుడు సీతని రక్షించడానికి తీసుకువెళ్లే విధానాలపై చర్చిస్తాడు. రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు లంకా యుద్ధానికి సన్నద్ధమవుతారు.

హనుమత్ప్రతిబోధనమ్

సమీక్ష్య విమలం వ్యోమ గతవిద్యుద్బలాహకమ్ |
సారసారవసంఘుష్టం రమ్యజ్యోత్స్నానులేపనమ్ || ౧ ||

సమృద్ధార్థం చ సుగ్రీవం మందధర్మార్థసంగ్రహమ్ |
అత్యర్థమసతాం మార్గమేకాంతగతమానసమ్ || ౨ ||

నిర్వృత్తకార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా |
ప్రాప్తవంతమభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్ || ౩ ||

స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్ |
విహరంతమహోరాత్రం కృతార్థం విగతజ్వరమ్ || ౪ ||

క్రీడంతమివ దేవేంద్రం నందనేఽప్సరసాం గణైః |
మంత్రిషు న్యస్తకార్యం చ మంత్రిణామనవేక్షకమ్ || ౫ ||

ఉత్సన్నరాజ్యసందేహం కామవృత్తమవస్థితమ్ |
నిశ్చితార్థోఽర్థతత్త్వజ్ఞః కాలధర్మవిశేషవిత్ || ౬ ||

ప్రసాద్య వాక్యైర్మధురైర్హేతుమద్భిర్మనోరమైః |
వాక్యవిద్వాక్యతత్త్వజ్ఞం హరీశం మారుతాత్మజః || ౭ ||

హితం తత్త్వం చ పథ్యం చ సామధర్మార్థనీతిమత్ |
ప్రణయప్రీతిసంయుక్తం విశ్వాసకృతనిశ్చయమ్ || ౮ ||

హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్ |
రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరపి వర్ధితా || ౯ ||

మిత్రాణాం సంగ్రహః శేషస్తం భవాన్ కర్తుమర్హతి |
యో హి మిత్రేషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే || ౧౦ ||

తస్య రాజ్యం చ కీర్తిశ్చ ప్రతాపశ్చాభివర్ధతే |
యస్య కోశశ్చ దండశ్చ మిత్రాణ్యాత్మా చ భూమిప || ౧౧ ||

సమవేతాని సర్వాణి స రాజ్యం మహదశ్నుతే |
తద్భవాన్ వృత్తసంపన్నః స్థితః పథి నిరత్యయే || ౧౨ ||

మిత్రార్థమభినీతార్థం యథావత్కర్తుమర్హతి |
సంత్యజ్య సర్వకర్మాణి మిత్రార్థే యోఽనువర్తతే || ౧౩ ||

సంభ్రమాద్ధి కృతోత్సాహః సోఽనర్థైర్నావరుధ్యతే |
యస్తు కాలవ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే || ౧౪ ||

స కృత్వా మహతోఽప్యర్థాన్న మిత్రార్థేన యుజ్యతే |
యదిదం వీర కార్యం నో మిత్రకార్యమరిందమ || ౧౫ ||

క్రియతాం రాఘవస్యైతద్వైదేహ్యాః పరిమార్గణమ్ |
న చ కాలమతీతం తే నివేదయతి కాలవిత్ || ౧౬ ||

త్వరమాణోఽపి సన్ ప్రాజ్ఞస్తవ రాజన్ వశానుగః |
కులస్య హేతుః స్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవః || ౧౭ ||

అప్రమేయప్రభావశ్చ స్వయం చాప్రతిమో గుణైః |
తస్య త్వం కురు వై కార్యం పూర్వం తేన కృతం తవ || ౧౮ ||

హరీశ్వర హరిశ్రేష్ఠానాజ్ఞాపయితుమర్హసి |
న హి తావద్భవేత్కాలో వ్యతీతశ్చేదనాదృతే || ౧౯ ||

చోదితస్య హి కార్యస్య భవేత్కాలవ్యతిక్రమః |
అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర || ౨౦ ||

కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ ధనేన చ |
శక్తిమానపి విక్రాంతో వానరర్క్షగణేశ్వర || ౨౧ ||

కర్తుం దాశరథేః ప్రీతిమాజ్ఞాయాం కిం న సజ్జసే |
కామం ఖలు శరైః శక్తః సురాసురమహోరగాన్ || ౨౨ ||

వశే దాశరథిః కర్తుం త్వత్ప్రతిజ్ఞాం తు కాంక్షతే |
ప్రాణత్యాగావిశంకేన కృతం తేన తవ ప్రియమ్ || ౨౩ ||

తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే |
న దేవా న చ గంధర్వా నాసురా న మరుద్గణాః || ౨౪ ||

న చ యక్షా భయం తస్య కుర్యుః కిముత రాక్షసాః |
తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తవ || ౨౫ ||

రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనా ప్రియమ్ |
నాధస్తాదవనౌ నాప్సు గతిర్నోపరి చాంబరే || ౨౬ ||

కస్యచిత్సజ్జతేఽస్మాకం కపీశ్వర తవాజ్ఞయా |
తదాజ్ఞాపయ కః కిం తే కృతే కుత్ర వ్యవస్యతు || ౨౭ ||

హరయో హ్యప్రధృష్యాస్తే సంతి కోట్యగ్రతోఽనఘాః |
తస్య తద్వచనం శ్రుత్వా కాలే సాధు నివేదితమ్ || ౨౮ ||

సుగ్రీవః సత్త్వసంపన్నశ్చకార మతిముత్తమామ్ |
స సందిదేశాభిమతం నీలం నిత్యకృతోద్యమమ్ || ౨౯ ||

దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాముపసంగ్రహే |
యథా సేనా సమగ్రా మే యూథపాలాశ్చ సర్వశః || ౩౦ ||

సమాగచ్ఛంత్యసంగేన సేనాగ్రాణి తథా కురు |
యే త్వంతపాలాః ప్లవగాః శీఘ్రగా వ్యవసాయినః || ౩౧ ||

సమానయంతు తే సైన్యం త్వరితాః శాసనాన్మమ |
స్వయం చానంతరం సైన్యం భవానేవానుపశ్యతు || ౩౨ ||

త్రిపంచరాత్రాదూర్ధ్వం యః ప్రాప్నుయాన్నేహ వానరః |
తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణా || ౩౩ ||

హరీంశ్చ వృద్ధానుపయాతు సాంగదో
భవాన్మమాజ్ఞామధికృత్య నిశ్చితామ్ |
ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరో
విధాయ వేశ్మ ప్రవివేశ వీర్యవాన్ || ౩౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకోనత్రింశః సర్గః || ౨౯ ||

Kishkindha Kanda Sarga 29 Meaning In Telugu

వర్షాకాలము పూర్తి అయింది. శరదృతువు ప్రవేశించింది. ఆకాశం నిర్మలమయింది. కాని సుగ్రీవుడు ఇంకా కామభోగములలో మునిగి తేలుతున్నాడు. అంత:పురము విడిచి రావడం లేదు. స్త్రీల సాహచర్యంలోనే గడుపుతున్నాడు. తన భార్య రుమతోనూ, తన అన్న భార్య తార సాహచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు.

(స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్, విహరన్తమహోరాత్రం అంటే తన భార్యను, తానుకోరిన తారను అహోరాత్రాలు విహరిస్తున్నాడు… అని ఉంది. అలాగే ముప్పది ఒకటవ సర్గలో కూడా ఈ క్రింది శ్లోకము ఉంది. “తారయా సహితః కామాసక్త:” అంటే తారతో కలిసి కామాసక్తుడై ఉన్నవాడు అనిఉంది. అంటే వాలి చని పోయిన తరువాత వాలి భార్య తార సుగ్రీవుని వశం అయిందని అర్ధం అవుతూ ఉంది. మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా! అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే వాలి, సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు. కానీ సుగ్రీవుడు, వాలి చనిపోయిన తరువాత, వాలి భార్య తారను అనుభవించాడు అని అర్థం చెప్పుకోవాలి.)

సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వడం లేదు. కార్యభారము అంతా మంత్రులకు అప్పచెప్పాడు. ఇంక ఎవరి వల్లా తనకు ఆపదలేదు అని నిర్భయంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు. రాముడికి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తుచేయాలని అనుకున్నాడు. సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు. ” ఓ రాజా! నీవు రాముని మూలంగా ఈ రాజ్యమును, కీర్తిని సంపాదించుకున్నావు. ఇంక నీవు, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. నీవు రాముని కార్యము నిర్వర్తించాలి.

మిత్రుల విషయంలో బాగా ప్రవర్తించే వాళ్లు కీర్తిమంతులు అవుతారు. ఒక రాజుకు తన కోశాగారము, సైన్యము, తన మిత్రులు, తన ప్రభుత్వము ఈ నాలుగు అత్యంత ముఖ్యమైనవి. అందుకని, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాట నెరవేర్చు. మిత్రునికి ఇచ్చిన మాట నెరవేర్చని వాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటాడు.

రాజా! ఏకార్యము చేసినా సకాలంలో చెయ్యకపోతే, తరువాత ఎంత గొప్పగా చేసినా దానికి ఫలితం ఉండదు. పైగా ఆ పనిచెయ్యనట్టే అవుతుంది. ఓ రాజా! రాముని కార్యం చెయ్యడంలో ఇప్పటికే కాలం మించిపోయింది. ఇప్పటికైనా రామకార్యములో నిమగ్నమవ్వు. వానలు తగ్గిపోయాయి. సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది. వానాకాలము ఆగిపోయింది, సమయం మించి పోయింది అని రామునికి తెలిసినా, నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు. రాముడు నీకు మేలు చేసాడు. తిరిగి రాముడికి మేలు చెయ్యడానికి ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తుచేసే వరకూ ఆగకు. అప్పటిదాకా ఆగితే, నీవు కావాలని ఆలస్యము చేసినట్టు అవుతుంది.

ఓ రాజా! నీకు ఏ సాయమూ చేయని వారికి కూడా నీవు సాయం చేస్తావు కదా! మరి నీకు ఇంత సాయం చేసిన రామునికి సాయం చెయ్యడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వానరులను పిలిచి వారికి సీతాన్వేషణకు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? రాముడు తన బాణములతో దేవతలను, రాక్షసులను అంతమొందించ గల సామర్ధ్యము కలవాడు. కానీ నీ సాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తావా లేదా అని వేచి ఉన్నాడు.

కాబట్టి ఓ వానర రాజా! నీకు ముందుగా ఉపకారము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయడానికి ఉద్యమించు. మేమందరమూ నీ కొరకు ఎదురుచూస్తున్నాము. నీ ఆజ్ఞ అయితే మేము భూమ్యాకాశములను గాలించి సీత జాడ తెలుసుకుంటాము. నీ అధీనములో ఒక కోటి కంటే ఎక్కువ సంఖ్యలో వానరులు ఉన్నారు. వారిని రామకార్యమునకు తగిన విధంగా నియోగించు. త్వరపడు.” అని హితబోధ చేసాడు హనుమంతుడు. తనమంత్రి అయిన హనుమంతుని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు. వెంటనే నీలుని పిలిపించాడు. సీతాన్వేషణ కొరకు వానర సేనలను అన్నిదిక్కులనుండి కిష్కింధకు రప్పించమని ఆదేశాలు ఇచ్చాడు. సమస్త వానరసేనలను తన ముందు నిలుప మని ఆదేశాలు ఇచ్చాడు. “పదిహేను దినములలో వానరులందరూ కిష్కింధ చేరు కోవాలి. ఆ గడువు మించితే మరణదండన విధించబడుతుంది.” అని వానరులను ఆదేశించాడు. హనుమంతుని, అంగదుని కొంతమంది వానర ప్రముఖులను కలిసికొనమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చిన సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము
ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ త్రింశః సర్గః (30) >>

Leave a Comment