కిష్కింధాకాండ అష్టావింశః సర్గః, ఈ సర్గలో సుగ్రీవుడు తన వానర సేనను సీతా మాత కోసం అన్వేషణ ప్రారంభించాలని ఆదేశిస్తాడు. సేనను ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అనే నాలుగు దిశల్లో పంపుతాడు. సేనకు నాయకత్వం వహించడానికి ప్రధాన వానరులను నియమిస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు దక్షిణ దిశలో అన్వేషణకు బయలుదేరుతారు. రాముడు హనుమంతుడికి తన రింగును అందించి, సీతా మాతకు చూపించమని ఆదేశిస్తాడు. ఈవిధంగా, వానర సేన సీతా మాత కోసం విస్తృతంగా అన్వేషణ మొదలుపెడుతుంది.
ప్రావృడుజ్జృంభణమ్
స తథా వాలినం హత్వా సుగ్రీవమభిషిచ్య చ |
వసన్మాల్యవతః పృష్ఠే రామో లక్ష్మణమబ్రవీత్ || ౧ ||
అయం స కాలః సంప్రాప్తః సమయోఽద్య జలాగమః |
సంపశ్య త్వం నభో మేఘైః సంవృతం గిరిసన్నిభైః || ౨ ||
నవమాసధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః |
పీత్వా రసం సముద్రాణాం ద్యౌః ప్రసూతే రసాయనమ్ || ౩ ||
శక్యమంబరమారుహ్య మేఘసోపానపంక్తిభిః |
కుటజార్జునమాలాభిరలంకర్తుం దివాకరమ్ || ౪ ||
సంధ్యారాగోత్థితైస్తామ్రైరంతేష్వధికపాండరైః |
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైర్బద్ధవ్రణమివాంబరమ్ || ౫ ||
మందమారుతనిశ్వాసం సంధ్యాచందనరంజితమ్ |
ఆపాండుజలదం భాతి కామాతురమివాంబరమ్ || ౬ ||
ఏషా ధర్మపరిక్లిష్టా నవవారిపరిప్లుతా |
సీతేవ శోకసంతప్తా మహీ బాష్పం విముంచతి || ౭ ||
మేఘోదరవినిర్ముక్తాః కల్హారసుఖశీతలాః |
శక్యమంజలిభిః పాతుం వాతాః కేతకిగంధినః || ౮ ||
ఏష ఫుల్లార్జునః శైలః కేతకైరధివాసితః |
సుగ్రీవ ఇవ శాంతారిర్ధారాభిరభిషిచ్యతే || ౯ ||
మేఘకృష్ణాజినధరా ధారాయజ్ఞోపవీతినః |
మారుతాపూరితగుహాః ప్రాధీతా ఇవ పర్వతాః || ౧౦ ||
కశాభిరివ హైమీభిర్విద్యుద్భిరివ తాడితమ్ |
అంతఃస్తనితనిర్ఘోషం సవేదనమివాంబరమ్ || ౧౧ ||
నీలమేఘాశ్రితా విద్యుత్ స్ఫురంతీ ప్రతిభాతి మే |
స్ఫురంతీ రావణస్యాంకే వైదేహీవ తపస్వినీ || ౧౨ ||
ఇమాస్తా మన్మథవతాం హితాః ప్రతిహతా దిశః |
అనులిప్తా ఇవ ఘనైర్నష్టగ్రహనిశాకరాః || ౧౩ ||
క్వచిద్బాష్పాభిసంరుద్ధాన్ వర్షాగమసముత్సుకాన్ |
కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు |
మమ శోకాభిభూతస్య కామసందీపనాన్ స్థితాన్ || ౧౪ ||
రజః ప్రశాంతం సహిమోఽద్య వాయు-
-ర్నిదాఘదోషప్రసరాః ప్రశాంతాః |
స్థితా హి యాత్రా వసుధాధిపానాం
ప్రవాసినో యాంతి నరాః స్వదేశాన్ || ౧౫ ||
సంప్రస్థితా మానసవాసలుబ్ధాః
ప్రియాన్వితాః సంప్రతి చక్రవాకాః |
అభీక్ష్ణవర్షోదకవిక్షతేషు
యానాని మార్గేషు న సంపతంతి || ౧౬ ||
క్వచిత్ప్రకాశం క్వచిదప్రకాశం
నభః ప్రకీర్ణాంబుధరం విభాతి |
క్వచిత్క్వచిత్పర్వతసన్నిరుద్ధం
రూపం యథా శాంతమహార్ణవస్య || ౧౭ ||
వ్యామిశ్రితం సర్జకదంబపుష్పై-
-ర్నవం జలం పర్వతధాతుతామ్రమ్ |
మయూరకేకాభిరనుప్రయాతం
శైలాపగాః శీఘ్రతరం వహంతి || ౧౮ ||
రసాకులం షట్పదసన్నికాశం
ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామమ్ |
అనేకవర్ణం పవనావధూతం
భూమౌ పతత్యామ్రఫలం విపక్వమ్ || ౧౯ ||
విద్యుత్పతాకాః సబలాకమాలాః
శైలేంద్రకూటాకృతిసన్నికాశాః |
గర్జంతి మేఘాః సముదీర్ణనాదా
మత్తా గజేంద్రా ఇవ సంయుగస్థాః || ౨౦ ||
వర్షోదకాప్యాయితశాద్వలాని
ప్రవృత్తనృత్తోత్సవబర్హిణాని |
వనాని నిర్వృష్టబలాహకాని
పశ్యాపరాహ్ణేష్వధికం విభాంతి || ౨౧ ||
సముద్వహంతః సలిలాతిభారం
బలాకినో వారిధరా నదంతః |
మహత్సు శృంగేషు మహీధరాణాం
విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి || ౨౨ ||
మేఘాభికామా పరిసంపతంతీ
సమ్మోదితా భాతి బలాకపంక్తిః |
వాతావధూతా వరపౌండరీకీ
లంబేవ మాలా రచితాంబరస్య || ౨౩ ||
బాలేంద్రగోపాంతరచిత్రితేన
విభాతి భూమిర్నవశాద్వలేన |
గాత్రానువృత్తేన శుకప్రభేణ
నారీవ లాక్షోక్షితకంబలేన || ౨౪ ||
నిద్రా శనైః కేశవమభ్యుపైతి
ద్రుతం నదీ సాగరమభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనమభ్యుపైతి
కాంతా సకామా ప్రియమభ్యుపైతి || ౨౫ ||
జాతా వనాంతాః శిఖిసంప్రనృత్తా
జాతాః కదంబాః సకదంబశాఖాః |
జాతా వృషా గోషు సమానకామా
జాతా మహీ సస్యవరాభిరామా || ౨౬ ||
వహంతి వర్షంతి నదంతి భాంతి
ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి |
నద్యో ఘనా మత్తగజా వనాంతాః
ప్రియావిహీనాః శిఖినః ప్లవంగాః || ౨౭ ||
ప్రహర్షితాః కేతకపుష్పగంధ-
-మాఘ్రాయ హృష్టా వననిర్ఝరేషు |
ప్రపాతశబ్దాకులితా గజేంద్రాః
సార్ధం మయూరైః సమదా నదంతి || ౨౮ ||
ధారానిపాతైరభిహన్యమానాః
కదంబశాఖాసు విలంబమానాః |
క్షణార్జితం పుష్పరసావగాఢం
శనైర్మదం షట్చరణాస్త్యజంతి || ౨౯ ||
అంగారచూర్ణోత్కరసన్నికాశైః
ఫలైః సుపర్యాప్తరసైః సమృద్ధైః |
జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖా
నిలీయమానా ఇవ షట్పదౌఘైః || ౩౦ ||
తడిత్పతాకాభిరలంకృతానా-
-ముదీర్ణగంభీరమహారవాణామ్ |
విభాంతి రూపాణి బలాహకానాం
రణోద్యతానామివ వారణానామ్ || ౩౧ ||
మార్గానుగః శైలవనానుసారీ
సంప్రస్థితో మేఘరవం నిశమ్య |
యుద్ధాభికామః ప్రతినాగశంకీ
మత్తో గజేందః ప్రతిసన్నివృత్తః || ౩౨ ||
క్వచిత్ప్రగీతా ఇవ షట్పదౌఘైః
క్వచిత్ప్రనృత్తా ఇవ నీలకంఠైః |
క్వచిత్ప్రమత్తా ఇవ వారణేంద్రై-
-ర్విభాంత్యనేకాశ్రయిణో వనాంతాః || ౩౩ ||
కదంబసర్జార్జునకందలాఢ్యా
వనాంతభూమిర్నవవారిపూర్ణా |
మయూరమత్తాభిరుతప్రనృత్తై-
-రాపానభూమిప్రతిమా విభాతి || ౩౪ ||
ముక్తాసకాశం సలిలం పతద్వై
సునిర్మలం పత్రపుటేషు లగ్నమ్ |
హృష్టా వివర్ణచ్ఛదనా విహంగాః
సురేంద్రదత్తం తృషితాః పిబంతి || ౩౫ ||
షట్పాదతంత్రీమధురాభిధానం
ప్లవంగమోదీరితకంఠతాలమ్ |
ఆవిష్కృతం మేఘమృదంగనాదై-
-ర్వనేషు సంగీతమివ ప్రవృత్తమ్ || ౩౬ ||
క్వచిత్ప్రనృత్తైః క్వచిదున్నదద్భిః
క్వచిచ్చ వృక్షాగ్రనిషణ్ణకాయైః |
వ్యాలంబబర్హాభరణైర్మయూరై-
-ర్వనేషు సంగీతమివ ప్రవృత్తమ్ || ౩౭ ||
స్వనైర్ఘనానాం ప్లవగాః ప్రబుద్ధా
విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధామ్ |
అనేకరూపాకృతివర్ణనాదా
నవాంబుధారాభిహతా నదంతి || ౩౮ ||
నద్యః సముద్వాహితచక్రవాకా-
-స్తటాని శీర్ణాన్యపవాహయిత్వా |
దృప్తా నవప్రాభృతపూర్ణభోగా
ద్రుతం స్వభార్తారముపోపయాంతి || ౩౯ ||
నీలేషు నీలాః ప్రవిభాంతి సక్తా
మేఘేషు మేఘా నవవారిపూర్ణాః |
దవాగ్నిదగ్ధేషు దవాగ్నిదగ్ధాః
శైలేషు శైలా ఇవ బద్ధమూలాః || ౪౦ ||
ప్రహృష్టసన్నాదితబర్హిణాని
సశక్రగోపాకులశాద్వలాని |
చరంతి నీపార్జునవాసితాని
గజాః సురమ్యాణి వనాంతరాణి || ౪౧ ||
నవాంబుధారాహతకేసరాణి
ద్రుతం పరిత్యజ్య సరోరుహాణి |
కదంబపుషాణి సకేసరాణి
వనాని హృష్టా భ్రమరాః పతంతి || ౪౨ ||
మత్తా గజేంద్రా ముదితా గవేంద్రా
వనేషు విక్రాంతతరా మృగేంద్రాః |
రమ్యా నగేంద్రా నిభృతా నరేంద్రాః
ప్రక్రీడితో వారిధరైః సురేంద్రః || ౪౩ ||
మేఘాః సముద్భూతసముద్రనాదా
మహాజలౌఘైర్గగనావలంబాః |
నదీస్తటాకాని సరాంసి వాపీ-
-ర్మహీం చ కృత్స్నామపవాహయంతి || ౪౪ ||
వర్షప్రవేగా విపులాః పతంతీ
ప్రవాంతి వాతాః సముదీర్ణఘోషాః |
ప్రనష్టకూలాః ప్రవహంతి శీఘ్రం
నద్యో జలైర్విప్రతిపన్నమార్గాః || ౪౫ ||
నరైర్నరేంద్రా ఇవ పర్వతేంద్రాః
సురేంద్రదత్తైః పవనోపనీతైః |
ఘనాంబుకుంభైరభిషిచ్యమానా
రూపం శ్రియం స్వామివ దర్శయంతి || ౪౬ ||
ఘనోపగూఢం గగనం సతారం
న భాస్కరో దర్శనమభ్యుపైతి |
నవైర్జలౌఘైర్ధరణీ విసృప్తా
తమోవిలిప్తా న దిశః ప్రకాశాః || ౪౭ ||
మహాంతి కూటాని మహీధరాణాం
ధారాభిధౌతాన్యధికం విభాంతి |
మహాప్రమాణైర్విపులైః ప్రపాతై-
-ర్ముక్తాకలాపైరివ లంబమానైః || ౪౮ ||
శైలోపలప్రస్ఖలమానవేగాః
శైలోత్తమానాం విపులాః ప్రపాతాః |
గుహాసు సన్నాదితబర్హిణాసు
హారా వికీర్యంత ఇవాభిభాంతి || ౪౯ ||
శీఘ్రప్రవేగా విపులాః ప్రపాతా
నిర్ధౌతశృంగోపతలా గిరీణామ్ |
ముక్తాకలాపప్రతిమాః పతంతో
మహాగుహోత్సంగతలైర్ధ్రియంతే || ౫౦ ||
సురతామర్దవిచ్ఛిన్నాః స్వర్గస్త్రీహారమౌక్తికాః |
పతంతీవాకులా దిక్షు తోయధరాః సమంతతః || ౫౧ ||
నిలీయమానైర్విహగైర్నిమీలద్భిశ్చ పంకజైః |
వికసంత్యా చ మాలత్యా గతోఽస్తం జ్ఞాయతే రవిః || ౫౨ ||
వృత్తా యాత్రా నరేంద్రాణాం సేనా ప్రతినివర్తతే |
వైరాణి చైవ మార్గాశ్చ సలిలేన సమీకృతాః || ౫౩ ||
మాసి ప్రోష్ఠపదే బ్రహ్మ బ్రాహ్మణానాం వివక్షతామ్ |
అయమధ్యాయసమయః సామగానాముపస్థితః || ౫౪ ||
నివృత్తకర్మాయతనో నూనం సంచితసంచయః |
ఆషాఢీమభ్యుపగతో భరతః కోసలాధిపః || ౫౫ ||
నూనమాపూర్యమాణాయాః సరయ్వా వర్ధతే రయః |
మాం సమీక్ష్య సమాయాంతమయోధ్యాయా ఇవ స్వనః || ౫౬ ||
ఇమాః స్ఫీతగుణా వర్షాః సుగ్రీవః సుఖమశ్నుతే |
విజితారిః సదారశ్చ రాజ్యే మహతి చ స్థితః || ౫౭ ||
అహం తు హృతదారశ్చ రాజ్యాచ్చ మహతశ్చ్యుతః |
నదీకూలమివ క్లిన్నమవసీదామి లక్ష్మణ || ౫౮ ||
శోకశ్చ మమ విస్తీర్ణో వర్షాశ్చ భృశదుర్గమాః |
రావణశ్చ మహాన్ శత్రురపారం ప్రతిభాతి మే || ౫౯ ||
అయాత్రాం చైవ దృష్ట్వేమాం మార్గాంశ్చ భృశదుర్గమాన్ |
ప్రణతే చైవ సుగ్రీవే న మయా కించిదీరితమ్ || ౬౦ ||
అపి చాతిపరిక్లిష్టం చిరాద్దారైః సమాగతమ్ |
ఆత్మకార్యగరీయస్త్వాద్వక్తుం నేచ్ఛామి వానరమ్ || ౬౧ ||
స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతమ్ |
ఉపకారం చ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయః || ౬౨ ||
తస్మాత్కాలప్రతీక్షోఽహం స్థితోఽస్మి శుభలక్షణ |
సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదమనుపాలయన్ || ౬౩ ||
ఉపకారేణ వీరో హి ప్రతికారేణ యుజ్యతే |
అకృతజ్ఞోఽప్రతికృతో హంతి సత్త్వవతాం మనః || ౬౪ ||
తేనైవముక్తః ప్రణిధాయ లక్ష్మణః
కృతాంజలిస్తత్ప్రతిపూజ్య భాషితమ్ |
ఉవాచ రామం స్వభిరామదర్శనం
ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభమ్ || ౬౫ ||
యథోక్తమేతత్తవ సర్వమీప్సితం
నరేంద్ర కర్తా న చిరాద్ధరీశ్వరః |
శరత్ప్రతీక్షః క్షమతామిమం భవాన్
జలప్రపాతం రిపునిగ్రహే ధృతః || ౬౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టావింశః సర్గః || ౨౮ ||
Kishkindha Kanda Sarga 28 Meaning In Telugu
వర్షాకాలము మొదలయింది. ఆకాశమంతా మేఘావృతము అయింది. వేసవి కాలము అంతా ఆకాశము సూర్య కిరణముల ద్వారా నీటిని తాగి, వర్షాకాలములో ఆ జలములను మరలా భూమి మీదికి వదులుతూ ఉంది. ఆకాశమునుండి కారుతున్న వర్షపు ధారలు సీత కళ్ల నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనపడుతున్నాయి రామునికి.
మేఘాలు వర్షిస్తున్నాయి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నెమళ్లు నర్తిస్తున్నాయి. అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు, వర్షము పడగానే భూమిపైకి వచ్చి రణగొణధ్వనులు చేస్తున్నాయి. నదులన్నీ గట్లు తెంచుకొని ప్రవహిస్తూ తమ నాధుడైన సముద్రుని చేరుటకు ఉరకలు వేస్తున్నాయి. ఇవన్నీ చూచి రాముడు ఇలా అనుకుంటున్నాడు.
“అయోధ్యలో కూడా సరయూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకొని ఆషాఢ మాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు. భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టు కొని దు:ఖిస్తున్నాను.
సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో! ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్లి వెతకడం అసాధ్యం కదా! అందుకే సుగ్రీవుడు వర్షాకాలము అయిపోయిన తరువాత వస్తాడు. అప్పుడు సీతను వెదకడం సులభం అవుతుంది. సుగ్రీవుని కోసరం వేచి ఉండక తప్పదు” అని అనుకొన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణం
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్