Aranya Kanda Sarga 28 In Telugu – అరణ్యకాండ అష్టావింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టావింశః సర్గ (28వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, శూర్పణఖా రాముడు మరియు లక్ష్మణుని చేత అవమానింపబడిన తర్వాత తన అన్న రావణుడిని కలుస్తుంది. ఆమె రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి వివరించి, తనపై జరిగిన దాడిని చెప్పుతుంది. సీత యొక్క అపూర్వ సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆమెను కిడ్నాప్ చేయమని పెల్లుబికుతుంది.

ఖరరామసంప్రహారః

నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ |
ఖరస్యాప్యభవత్రాసో దృష్ట్వా రామస్య విక్రమమ్ ||

1

స దృష్ట్వా రాక్షసం సైన్యమవిషహ్యం మహాబలః |
హతమేకేన రామేణ త్రిశిరోదూషణావపి ||

2

తద్బలం హతభూయిష్ఠం విమనాః ప్రేక్ష్య రాక్షసః |
ఆససాద ఖరో రామం నముచిర్వాసవం యథా ||

3

వికృష్య బలవచ్చాపం నారాచాన్రక్తభోజనాన్ |
ఖరశ్చిక్షేప రామాయ క్రుద్ధానాశీవిషానివ ||

4

జ్యాం విధున్వన్ సుబహుశః శిక్షయాఽస్త్రాణి దర్శయన్ |
చకార సమరే మార్గాన్ శరై రథగతః ఖరః ||

5

స సర్వాశ్చ దిశో బాణైః ప్రదిశశ్చ మహారథః |
పూరయామాస తం దృష్ట్వా రామోఽపి సుమహద్ధనుః ||

6

స సాయకైర్దుర్విషహైః సస్ఫులింగైరివాగ్నిభిః |
నభశ్చకారావివరం పర్జన్య ఇవ వృష్టిభిః ||

7

తద్బభూవ శితైర్బాణైః ఖరరామవిసర్జితైః |
పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకులమ్ ||

8

శరజాలావృతః సూర్యో న తదా స్మ ప్రకాశతే |
అన్యోన్యవధసంరంభాదుభయోః సంప్రయుధ్యతోః ||

9

తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
ఆజఘాన ఖరో రామం తోత్రైరివ మహాద్విపమ్ ||

10

తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితమ్ |
దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకమ్ ||

11

హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితమ్ |
పరిశ్రాంతం మహాసత్త్వం మేనే రామం ఖరస్తదా ||

12

తం సింహమివ విక్రాంతం సింహవిక్రాంతగామినమ్ |
దృష్ట్వా నోద్విజతే రామః సింహః క్షుద్రమృగం యథా ||

13

తతః సూర్యనికాశేన రథేన మహతా ఖరః |
ఆససాద రణే రామం పతంగ ఇవ పావకమ్ ||

14

తతోఽస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః |
ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవమ్ ||

15

స పునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి |
నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశనిసమప్రభాన్ ||

16

తతస్తత్ప్రహతం బాణైః ఖరముక్తైః సుపర్వభిః |
పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః ||

17

తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసమ్ |
అర్దయిత్వా మహానాదం ననాద సమేరే ఖరః ||

18

స శరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః |
రరాజ సమరే రామో విధూమోఽగ్నిరివ జ్వలన్ ||

19

తతో గంభీరనిర్హ్రాదం రామః శత్రునిబర్హణః |
చకారాంతాయ స రిపోః సజ్యమన్యన్మహద్ధనుః ||

20

సుమహద్వైష్ణవం యత్తదతిసృష్టం మహర్షిణా |
వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత ||

21

తతః కనకపుంఖైస్తు శరైః సన్నతపర్వభిః |
బిభేద రామః సంక్రుద్ధః ఖరస్య సమరే ధ్వజమ్ ||

22

స దర్శనీయో బహుధా వికీర్ణః కాంచనధ్వజః |
జగామ ధరణీం సూర్యో దేవతానామివాజ్ఞయా ||

23

తం చతుర్భిః ఖరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గణైః |
వివ్యాధ యుధి మర్మజ్ఞో మాతంగమివ తోమరైః ||

24

స రామో బహుభిర్బాణైః ఖరకార్ముకనిఃసృతైః |
విద్ధో రుధిరసిక్తాంగో బభూవ రుషితో భృశమ్ ||

25

స ధనుర్ధన్వినాం శ్రేష్ఠః ప్రగృహ్య పరమాహవే |
ముమోచ పరమేష్వాసః షట్ శరానభిలక్షితాన్ ||

26

శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోరథార్దయత్ |
త్రిభిశ్చంద్రార్ధవక్త్రైశ్చ వక్షస్యభిజఘాన హ ||

27

తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ భాస్కరోపమాన్ |
జిఘాంసూ రాక్షసం క్రుద్ధస్త్రయోదశ సమాదదే ||

28

తతోఽస్య యుగమేకేన చతుర్భిశ్చతురో హయాన్ |
షష్ఠేన తు శిరః సంఖ్యే ఖరస్య రథసారథేః ||

29

త్రిభిస్త్రివేణుం బలవాన్ ద్వాభ్యామక్షం మహాబలః |
ద్వాదశేన తు బాణేన ఖరస్య సశరం ధనుః ||

30

ఛిత్త్వా వజ్రనికాశేన రాఘవః ప్రహసన్నివ |
త్రయోదశేనేంద్రసమో బిభేద సమరే ఖరమ్ ||

31

ప్రభగ్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః |
గదాపాణిరవప్లుత్య తస్థౌ భూమౌ ఖరస్తదా ||

32

తత్కర్మ రామస్య మహారథస్య
సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ |
అపూజయన్ ప్రాంజలయః ప్రహృష్టా-
-స్తదా విమానాగ్రగతాః సమేతాః ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే అరణ్యకాండే అష్టావింశః సర్గః ||

Aranya Kanda Sarga 28 Meaning In Telugu PDF

రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు.

ఖరుడు రాముని మీద నారాచములను (ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు.

రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు.

అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకొన్నాడు. ఖరుడు. కాని రామునిముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు. పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఖరునికి తెలియదు.

ఖరుడు రాముని ధనుస్సును సగ భాగంలో విరగగొట్టాడు. మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు. రాముని కవచము విరిగి నేలమీద పడింది. అదే అవకాశముగా, ఖరుడు రాముని శరీరం అంతా బాణములతో కొట్టాడు. విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. రాముడు వెంటనే తనకు అగస్త్యమహాముని ఇచ్చిన వైష్ణవ ధనుస్సుకు నారి బిగించి సంధించాడు. ముందు ఖరుని ధ్వజమును కూల్చాడు. అది చూచిన ఖరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది.

రాముని కోపము కట్టలు తెంచుకుంది. ఒక బాణముతో ఖరుని శిరస్సును, రెండు బాణములతో ఖరుని రెండు చేతులను, మూడు అర్థచంద్రాకారపు బాణములతో ఖరుని వక్షస్థలమును కొట్టాడు. ఎలాగైనా ఖరుని చంపాలని నిశ్చయించుకొన్న రాముడు ఖరుని మీద తీవ్రమైన 13 నారాచములను ప్రయోగించాడు. అందులో ఒక బాణముతో ఖరుని రథము యొక్క నొగలను, నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను, ఒక బాణముతో రథ సారథిని, మూడు బాణములతో రధం ముందు భాగమును, రెండు బాణములతో ఖరుని రథము ఇరుసులను, ఒక బాణముతో ఖరుని కంఠమును కొట్టాడు. ఇలా 13 బాణములతో ఖరుని ఆపాదమస్తకము కొట్టాడు రాముడు.

ఖరునికి రథము విరిగిపోయింది. సారథి చచ్చాడు. రథానికి కట్టిన గుర్రాలు నేలకూలాయి. విల్లు విరిగిపోయింది. చేసేది లేక ఖరుడు తన గదను తీసుకొని నేలమీదికి దూకాడు. ఖరుని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలలో నిలబడి చూస్తున్న దేవతాసమూహములు రాముని అభినందించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Leave a Comment