Ayodhya Kanda Sarga 101 In Telugu – అయోధ్యాకాండ ఏకాధికశతతమః సర్గః

అయోధ్యకాండ సర్గ 101″ రామాయణం లో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు కైకేయి మాట మేరకు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటించి అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. లక్ష్మణుడు మరియు సీతా ఆయనతో పాటు రావడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో, అయోధ్య నగరం దుఃఖంలో మునిగిపోతుంది. ప్రజలు రాముడు వెళ్లిపోతుండడాన్ని చూడలేక బాధపడతారు. రాముడు తన తల్లి కౌసల్య, సుమిత్రా, మరియు ఇతర పెద్దలను వీడిపోతాడు. ఆ తరువాత, రథం పై అరణ్యవాసం వైపు పయనమవుతాడు. ఈ సర్గలో రాముడి ధర్మనిష్ట, పితృవాక్యపారిపాలనం, మరియు కుటుంబ పట్ల అతని ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి.

పితృదిష్టాంతశ్రవణమ్

రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచ హ |
కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యతి || ౧ ||

శాశ్వతోఽయం సదా ధర్మః స్థితోఽస్మాసు నరర్షభ |
జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్న కనీయాన్ నృపో భవేత్ || ౨ ||

స సమృద్ధాం మయా సార్ధమయోధ్యాం గచ్ఛ రాఘవ |
అభిషేచయ చాత్మానం కులస్యాస్య భవాయ నః || ౩ ||

రాజానం మానుషం ప్రాహుర్దేవత్వే స మతో మమ |
యస్య ధర్మార్థసహితం వృత్తమాహురమానుషమ్ || ౪ ||

కేకయస్థే చ మయి తు త్వయి చారణ్యమాశ్రితే |
దివమార్యో గతో రాజా యాయజూకః సతాం మతః || ౫ ||

నిష్క్రాంతమాత్రే భవతి సహసీతే సలక్ష్మణే |
దుఃఖశోకాభిభూతస్తు రాజా త్రిదివమభ్యగాత్ || ౬ ||

ఉత్తిష్ఠ పురుషవ్యాఘ్ర క్రియతాముదకం పితుః |
అహం చాయం చ శత్రుఘ్నః పూర్వమేవ కృతోదకౌ || ౭ ||

ప్రియేణ ఖలు దత్తం హి పితృలోకేషు రాఘవ |
అక్షయ్యం భవతీత్యాహుర్భవాంశ్చైవ పితుః ప్రియః || ౮ ||

త్వామేవ శోచంస్తవ దర్శనేప్సుః
త్వయ్యేవ సక్తామనివర్త్య బుద్ధిమ్ |
త్వయా విహీనస్తవ శోకరుగ్ణః
త్వాం సంస్మరన్నస్తమితః పితా తే || ౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాధికశతతమః సర్గః || ౧౦౧ ||

Ayodhya Kanda Sarga 101 Meaning In Telugu

భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?” అని అడిగాడు.

దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు.

రామా! మనవంశాచారము నీకు తెలుసు. మన వంశములో పెద్దవాడికే రాజ్యాభిషేకము జరుగుతుంది. ఇది అనువంశికంగా వస్తున్న ఆచారము. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడివి కావడం ధర్మమే కాని అధర్మము కాదు. నీ రాక కొరకు అయోధ్య ఎదురుచూస్తూ ఉంది. నేను, శత్రుఘ్నుడు, మన మంత్రులు అందరూ శిరస్సువంచి నీకు నమస్కారము చేస్తున్నాము. మామాట మన్నించు. వంశాచారమును మన్నించు. పెద్దల ఆచారములను గౌరవించు.” అనిచెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు భరతుడు.

రాముడు భరతుని కౌగలించుకొని అనునయించాడు. “ఓ భరతా! కులీనుడు, సత్త్వసంపన్నుడు, తేజస్వి, ధృడనిశ్చయము కలవాడు ఎవరైనా తుచ్ఛమైన రాజ్యము కోసరం మాట తప్పుతాడా! నేనూ అంతే. భరతా! నీవు చిన్నవాడవు. నీవు అనవసరంగా నీ తల్లిని దూషిస్తున్నావు. తప్పు. నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసింది కానీ వేరుకాదు.

పెద్దలకు భార్యను, పుత్రులను, శాసించే అధికారము ఉంది. ఆ అధికారం తోనే దశరథుడు నాకు నార చీరలు కట్టబెట్టి అరణ్యానికి పంపాడు. నేను ఆయన ఆదేశము పాటించాలి. నేను నా తండ్రి యందు ఎలాంటి గౌరవము చూపిస్తున్నానో, నీవు నీ తల్లి పట్ల అంత గౌరవము చూపించు. నీ తల్లి తనస్వార్థము కోసరం ఇదంతా చేయలేదు. కేవలం నీకోసరమే చేసింది. నీ తల్లి కూడా నా తల్లితో సమానము. నా తల్లి కైక, నా తండ్రి దశరథుడు నన్ను అడవులకు వెళ్లమన్నారు. నేను అడవులకు వచ్చాను. ఇంతకన్నా వేరు విధంగా నేను ఎలా చేయగలను? తల్లి తండ్రుల మాట నాకు శిరోధార్యము కదా!

నా తరువాత రాజ్యమునకు అర్హుడవు నీవు. అందుకని నీవు రాజ్యము చేయవలెను. నేను అరణ్యములలో ఉండవలెను. నా తండ్రి దశరథుడు పదిమంది ఎదుట ఈవిధంగా భాగపంపకములు చేసాడు. నీకు రాజ్యము ఇచ్చాడు. నాకు 14 ఏళ్లు వనవాసము ఇచ్చాడు. దీనిని మనము పాటించాలి. ఇప్పుడు మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు. ఆయన లేడు కదా అని మనకు ఆయన మాటను వమ్ముచేయలేము కదా!కాబట్టి నేను రాజ్యాభిషిక్తుని కాలేను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః (102) >>

Leave a Comment