Aranya Kanda Sarga 29 In Telugu – అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రావణుడు మారీచుడిని సీతను అపహరించడానికి సహాయం చేయమని కోరుతాడు. మొదట మారీచుడు, రాముడి శక్తి గురించి తెలుసు కావున, ఈ పని చేయవద్దని రావణుడిని హెచ్చరిస్తాడు. కానీ, రావణుడు అతన్ని బలవంతం చేసి, రాముడు మరియు లక్ష్మణులను వలలో పడేసే పథకాన్ని తయారు చేస్తాడు.

ఖరగదాభేదనమ్

ఖరం తు విరథం రామో గదాపాణిమవస్థితమ్ |
మృదుపూర్వం మహాతేజాః పరుషం వాక్యమబ్రవీత్ ||

1

గజాశ్వరథసంబాధే బలే మహతి తిష్ఠతా |
కృతం సుదారుణం కర్మ సర్వలోకజుగుప్సితమ్ ||

2

ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్ |
త్రయాణామపి లోకానామీశ్వరోపి న తిష్ఠతి ||

3

కర్మ లోకవిరుద్ధం తు కుర్వాణం క్షణదాచర |
తీక్ష్ణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతమ్ ||

4

లోభాత్పాపాని కుర్వాణః కామాద్వా యో న బుధ్యతే |
భ్రష్టాః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివ ||

5

వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః |
కింను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస ||

6

న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః |
ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠంతి శీర్ణమూలా ఇవ ద్రుమాః ||

7

అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః |
ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివార్తవమ్ ||

8

న చిరాత్ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలమ్ |
సవిషాణామివాన్నానాం భుక్తానాం క్షణదాచర ||

9

పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్ఛతామ్ |
అహమాసాదితో రాజ్ఞా ప్రాణాన్ హంతుం నిశాచర ||

10

అద్య హి త్వాం మయా ముక్తాః శరాః కాంచనభూషణాః |
విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః ||

11

యే త్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః |
తానద్య నిహతః సంఖ్యే ససైన్యోఽనుగమిష్యసి ||

12

అద్య త్వాం విహతం బాణైః పశ్యంతు పరమర్షయః |
నిరయస్థం విమానస్థా యే త్వయా హింసితాః పురా ||

13

ప్రహర త్వం యథాకామం కురు యత్నం కులాధమ |
అద్య తే పాతయిష్యామి శిరస్తాలఫలం యథా ||

14

ఏవముక్తస్తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః |
ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః ||

15

ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ |
ఆత్మనా కథమాత్మానమప్రశస్యం ప్రశంససి ||

16

విక్రాంతా బలవంతో వా యే భవంతి నరర్షభాః |
కథయంతి న తే కించిత్తేజసా స్వేన గర్వితాః ||

17

ప్రాకృతాస్త్వకృతాత్మానో లోకే క్షత్రియపాంసనాః |
నిరర్థకం వికత్థంతే యథా రామ వికత్థసే ||

18

కులం వ్యపదిశన్వీరః సమరే కోఽభిధాస్యతి |
మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవే స్తవమ్ ||

19

సర్వథైవ లఘుత్వం తే కత్థనేన విదర్శితమ్ |
సువర్ణప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నినా ||

20

న తు మామిహ తిష్ఠంతం పశ్యసి త్వం గదాధరమ్ |
ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితమ్ ||

21

పర్యాప్తోఽహం గదాపాణిర్హంతుం ప్రాణాన్రణే తవ |
త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతకః ||

22

కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి న త్వహమ్ |
అస్తం గచ్ఛేద్ధి సవితా యుద్ధవిఘ్నస్తతో భవేత్ ||

23

చతుర్దశ సహస్రాణి రాక్షసానాం హతాని తే |
త్వద్వినాశాత్కరోమ్యేష తేషామస్రప్రమార్జనమ్ ||

24

ఇత్యుక్త్వా పరమక్రుద్ధస్తాం గదాం పరమాంగదః |
ఖరశ్చిక్షేప రామాయ ప్రదీప్తామశనిం యథా ||

25

ఖరబాహుప్రముక్తా సా ప్రదీప్తా మహతీ గదా |
భస్మ వృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాఽగాత్తత్సమీపతః ||

26

తామాపతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదామ్ |
అంతరిక్షగతాం రామశ్చిచ్ఛేద బహుధా శరైః ||

27

సా వికీర్ణా శరైర్భగ్నా పపాత ధరణీతలే |
గదా మంత్రౌషధబలైర్వ్యాలీవ వినిపాతితా ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 29 Meaning In Telugu

ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు.

ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు.

నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో, పాపపు పనులుచేస్తే, ఆ పాపఫలము కూడా వెంటనే కట్టికుడుపుతుంది. దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యములో ఉన్న ఋషులు, మునులు నన్ను ఆశ్రయించారు. అందుకే నేను దుష్టుడవైన నిన్ను చంపుతున్నాను. ఓ ఖరుడా! ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యములో ఉన్న మునులను, ఋషులను ఎలా యమపురికి పంపారో, అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు. నీవు చంపిన మునులందరూ స్వర్గ ద్వారముల వద్ద నిలబడి, నువ్వు నరకానికి పోవడం కళ్లారా చూస్తారు. ఓ దురాత్ముడా! కాచుకో! ఒకే ఒక్క బాణంతో నీ తల తాటి పండు మాదిరి నేల మీద దొర్లుతుంది.” అని తన ధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు.

రాముని సూటి పోటీ మాటలు విన్న ఖరుడు అవమాన భారంతో కోపంతో రగిలిపోయాడు. “ఓ రామా! ఇదేంటి! నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నా సైన్యము నశించినా నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే నన్ను గెల్చానని గర్వపడుతున్నావు. నిన్ను నీవే అభినందించుకుంటున్నావు.

నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.

రామా! నీకు మృత్యువు ఆసన్నమయింది. ముందు అది తెలుసుకో. నిన్ను అభినందించుకోడం మానుకో! లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు. నీ ఎదుట పాశమును చేత ధరించిన కాల యముడి వలె గదాయుధమును ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా! జీవులు యముని కాలపాశమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు.

ఓ రామా! ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి. కానీ సూర్యాస్తమయము కాబోతోంది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా! అందుకని చెప్పడం లేదు. నీవు నా సేనలను 14,000 మందిని మట్టుబెట్టావు. ఈ రోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధు మిత్రుల కన్నీళ్లు తుడుస్తాను.”

ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముని మీదికి విసిరాడు. రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేసాడు. ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేలమీద పడ్డాయి.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రింశః సర్గః (30) >>

Leave a Comment