Aranya Kanda Sarga 43 In Telugu – అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గం రామాయణంలోని కీలక అధ్యాయం. ఈ సర్గంలో రావణుడు తన మాయవిలాసాలు ప్రదర్శించి మారీచుడిని సీతను అపహరించడానికి పంపిస్తాడు. మారీచుడు సువర్ణ మృగంగా మారి సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలని రాముని కోరుతుంది. రాముడు ఆ మృగాన్ని తరమడానికి వెళతాడు, కానీ అది మాయమృగం అని తెలుసుకుంటాడు.

లక్ష్మణశంకాప్రతిసమాధానమ్

సా తం సంప్రేక్ష్య సుశ్రోణీ కుసుమాన్యపచిన్వతీ |
హైమరాజతవర్ణాభ్యాం పార్శ్వాభ్యాముపశోభితమ్ ||

1

ప్రహృష్టా చానవద్యాంగీ మృష్టహాటకవర్ణినీ |
భర్తారమభిచక్రంద లక్ష్మణం చాపి సాయుధమ్ ||

2

తయాఽఽహూతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్యా రామలక్ష్మణౌ |
వీక్షమాణౌ తు తం దేశం తదా దదృశతుర్మృగమ్ ||

3

శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ |
తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగమ్ ||

4

చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినా వనే |
అనేన నిహతా రాజన్ రాజానః కామరూపిణా ||

5

అస్య మాయావిదో మాయామృగరూపమిదం కృతమ్ |
భానుమత్ పురుషవ్యాఘ్ర గంధర్వపురసన్నిభమ్ ||

6

మృగో హ్యేవం విధో రత్నవిచిత్రో నాస్తి రాఘవ |
జగత్యాం జగతీనాథ మాయైషా హి న సంశయః ||

7

ఏవం బ్రువాణం కాకుత్స్థం ప్రతివార్య శుచిస్మితా |
ఉవాచ సీతా సంహృష్టా చర్మణా హృతచేతనా ||

8

ఆర్యపుత్రాభిరామోఽసౌ మృగో హరతి మే మనః |
ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి ||

9

ఇహాశ్రమపదేఽస్మాకం బహవః పుణ్యదర్శనాః |
మృగాశ్చరంతి సహితాః సృమరాశ్చమరాస్తథా ||

10

ఋక్షాః పృషతసంఘాశ్చ వానరాః కిన్నరాస్తథా |
విచరంతి మహాబాహో రూపశ్రేష్ఠా మనోహరాః ||

11

న చాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా |
తేజసా క్షమయా దీప్త్యా యథాఽయం మృగసత్తమః ||

12

నానావర్ణవిచిత్రాంగో రత్నబిందుసమాచితః |
ద్యోతయన్ వనమవ్యగ్రం శోభతే శశిసన్నిభః ||

13

అహో రూపమహో లక్ష్మీః స్వరసంపచ్చ శోభనా |
మృగోఽద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవ మే ||

14

యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ |
ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి ||

15

సమాప్తవనవాసానాం రాజ్యస్థానాం చ నః పునః |
అంతఃపురవిభూషార్థో మృగ ఏష భవిష్యతి ||

16

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి ||

17

జీవన్న యది తేఽభ్యేతి గ్రహణం మృగసత్తమః |
అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి ||

18

నిహతస్యాస్య సత్త్వస్య జాంబూనదమయత్వచి |
శష్పబృస్యాం వినీతాయామిచ్ఛామ్యహముపాసితుమ్ ||

19

కామవృత్తమిదం రౌద్రం స్త్రీణామసదృశం మతమ్ |
వపుషా త్వస్య సత్త్వస్య విస్మయో జనితో మమ ||

20

తేన కాంచనరోమ్ణా తు మణిప్రవరశృంగిణా |
తరుణాదిత్యవర్ణేన నక్షత్రపథవర్చసా ||

21

బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతమ్ |
ఏవం సీతావచః శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతమ్ ||

22

లోభితస్తేన రూపేణ సీతాయా చ ప్రచోదితః |
ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచః ||

23

పశ్య లక్ష్మణ వైదేహ్యాః స్పృహాం మృగగతామిమామ్ |
రూపశ్రేష్ఠతయా హ్యేష మృగోఽద్య న భవిష్యతి ||

24

న వనే నందనోద్దేశే న చైత్రరథసంశ్రయే |
కుతః పృథివ్యాం సౌమిత్రే యోఽస్య కశ్చిత్సమో మృగః ||

25

ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయః |
శోభంతే మృగమాశ్రిత్య చిత్రాః కనకబిందుభిః ||

26

పశ్యాస్య జృంభమాణస్య దీప్తామగ్నిశిఖోపమామ్ |
జిహ్వాం ముఖాన్నిఃసరంతీం మేఘాదివ శతహ్రదామ్ ||

27

మసారగల్లర్కముఖః శంఖముక్తానిభోదరః |
కస్య నామాభిరూపోఽసౌ న మనో లోభయేన్మృగః ||

28

కస్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో |
నానారత్నమయం దివ్యం న మనో విస్మయం వ్రజేత్ ||

29

[* కిం పునర్మైథిలీ సీతా బాలా నారీ న విస్మయేత్ | *]
మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్వినః |
ఘ్నంతి లక్ష్మణ రాజానో మృగయాయాం మహావనే ||

30

ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే |
ధాతవో వివిధాశ్చాపి మణిరత్నసువర్ణినః ||

31

తత్సారమఖిలం నౄణాం ధనం నిచయవర్ధనమ్ |
మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ ||

32

అర్థీ యేనార్థకృత్యేన సంవ్రజత్యవిచారయన్ |
తమర్థమర్థశాస్త్రజ్ఞాః ప్రాహురర్థ్యాశ్చ లక్ష్మణ ||

33

ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి |
ఉపవేక్ష్యతి వైదేహీ మయా సహ సుమధ్యమా ||

34

న కాదలీ న ప్రియకీ న ప్రవేణీ న చావికీ |
భవేదేతస్య సదృశీ స్పర్శనేనేతి మే మతిః ||

35

ఏష చైవ మృగః శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః |
ఉభావేతౌ మృగౌ దివ్యౌ తారామృగమహీమృగౌ ||

36

యది వాఽయం తథా యన్మాం భవేద్వదసి లక్ష్మణ |
మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోఽస్య వధో మయా ||

37

ఏతేన హి నృశంసేన మారీచేనాకృతాత్మనా |
వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాః ||

38

ఉత్థాయ బహవో యేన మృగయాయాం జనాధిపాః |
నిహతాః పరమేష్వాసాస్తస్మాద్వధ్యస్త్వయం మృగః ||

39

పురస్తాదిహ వాతాపిః పరిభూయ తపస్వినః |
ఉదరస్థో ద్విజాన్ హంతి స్వగర్భోఽశ్వతరీమివ ||

40

స కదాచిచ్చిరాల్లోభాదాససాద మహామునిమ్ |
అగస్త్యం తేజసా యుక్తం భక్ష్యస్తస్య బభూవ హ ||

41

సముత్థానే చ తద్రూపం కర్తుకామం సమీక్ష్య తమ్ |
ఉత్స్మయిత్వా తు భగవాన్ వాతాపిమిదమబ్రవీత్ ||

42

త్వయావిగణ్య వాతాపే పరిభూతాః స్వతేజసా |
జీవలోకే ద్విజశ్రేష్ఠాస్తస్మాదసి జరాం గతః ||

43

తదేతన్న భవేద్రక్షో వాతాపిరివ లక్ష్మణ |
మద్విధం యోఽతిమన్యేత ధర్మనిత్యం జితేంద్రియమ్ ||

44

భవేద్ధతోఽయం వాతాపిరగస్త్యేనేవ మాం గతః |
ఇహ త్వం భవ సన్నద్ధో యంత్రితో రక్ష మైథిలీమ్ ||

45

అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన |
అహమేనం వధిష్యామి గ్రహీష్యామ్యపి వా మృగమ్ ||

46

యావద్గచ్ఛామి సౌమిత్రే మృగమానయితుం ద్రుతమ్ |
పశ్య లక్ష్మణ వైదేహీం మృగత్వచి గతస్పృహామ్ ||

47

త్వచా ప్రధానయా హ్యేష మృగోఽద్య న భవిష్యతి |
అప్రమత్తేన తే భావ్యమాశ్రమస్థేన సీతయా ||

48

యావత్పృషతమేకేన సాయకేన నిహన్మ్యహమ్ |
హత్వైతచ్చర్మ చాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ ||

49

ప్రదక్షిణేనాతిబలేన పక్షిణా
జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ |
భవాప్రమత్తః ప్రతిగృహ్య మైథిలీం
ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః ||

50

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 43 Meaning In Telugu PDF

ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామృగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి.

“ఆర్యపుత్రా! లక్ష్మణా! రండి! త్వరగా రండి. ఇక్కడకు రండి. ఇటు చూడండి. ఈ లేడిని చూడండి. అబ్బా! ఎంత బాగుందో! ఎంత ముచ్చటగా ఉందో!” అని అరిచినట్టు పిలిచింది.

రాముడు, అక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడిని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మృగమును చూచి అనుమానం కలిగింది.

“రామా! ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి, వేటకు వచ్చిన రాజులను వంచించి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మృగముకాదు. కదా! నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము. కానీ ఇంతటి ప్రకాశవంతమైన, బంగారు వర్ణములో ఉన్న లేడిని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడి భూలోకములో ఉంటుందా అని నా అనుమానము.

రామా! సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది. ఇది నిస్సంశయముగా మాయాలేడి. రాక్షస మాయ.” అని అన్నాడు లక్ష్మణుడు.

అప్పుడు సీత లక్ష్మణుని చూచి ఇలా అంది. “లక్ష్మణా! నీకు అన్నీ అనుమానాలే. అందమైన లేడి పిల్లను చూచి ఆనందించక అనుమా నిస్తావెందుకు. ఈ లేడి పిల్లను మన ఆశ్రమములో ఉంచి పెంచు కుందాము. రోజూ దీనితో నాకు కాలక్షేపము అవుతుంది.

రామా! నాకు ఆ లేడిని తెచ్చి ఇవ్వరా! ప్రాణములతోటి పట్టి తెండి. మన ఆశ్రమ ప్రాంతములో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి. కానీ అవి ఈ లేడి అంత అందంగా ఆకర్షణీయంగా లేవు. అసలు ఇలాంటి మృగమును నేను ఇంతవరకూ చూడలేదు. చూడండి. దాని శరీరం చిత్రవిచిత్రరంగులతో ఎలా మెరిసిపోతోందో! ఆ లేడి మనుషులను చూచి భయపడటం లేదు. నిర్భయంగా తిరుగుతూ ఉంది. దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది.

ఆహా! ఏమి రూపము! ఏమి సౌందర్యము. దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాధా! దీనిని చూడగానే నా మనసు దీని యందే లగ్నం అయింది. అది నా మనసు హరించింది. దీనిని వదిలి నేను ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాను. కాబట్టి నాధా! దీనిని సజీవంగా పట్టి తెండి. మనము వనవాసకాలములో దీనితో వినోదించి, మరలా మనము అయోధ్యకు పోవునపుడు దీనిని మన వెంట అయోధ్యతీసుకొని పోవుదము. దీనిని చూచి అత్తయ్యగారు, భరతుడు, నా చెల్లెళ్లు ఎంతో సంతోషిస్తారు.

పోనీలెండి. ఈ మృగమును సజీవంగా పట్టుకోలేక పోతే, కనీసము దీని చర్మమును అన్నా నాకు బహుమతిగా ఇవ్వండి. నేను దాచుకుంటాను. నేను పూజచేసుకొనేటప్పుడు దీని మీద కూర్చుని పూజచేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు! స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరకూడదను మాట నిజమే. కాని, ఈ బంగారు లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నాను. ఈ సారికి మన్నించండి.” అని గోముగా ప్రేమగా అడిగింది సీత.

రామునికి కూడా ఆ మృగమును చూస్తే ఆనందం కలిగింది. వెంటనే ఆశ్చర్యము కూడా కలిగింది. సీత ఆ మృగమును కావాలి అంటూ ఉంది. తనకు కూడా ఆ మృగమును వేటాడవలెనని కోరికగా ఉంది. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! సీత మాటలు విన్నావు కదా. సీతకు ఈ మృగము అంటే ఎంతో ఆసక్తిగా ఉంది. నాకు చూడ ఇటువంటి మృగమును మనము ఈ దండకారణ్యములో ఇంతవరకూ చూడలేదు. అంతే కాదు ఇది దేవలోకములో ఉండవలసిన మృగము. భూలోకములోకి ఎలా వచ్చిందో! అటువంటిది మన కంటపడింది. దీని ఒంటి మీద ఉన్న బంగారు చుక్కలు అతిమనోహరంగా ఉన్నాయి. అసలు ఇటువంటి మృగమును చూచి ఎవరు ఆనందించరు! ఈ మృగము అందరినీ ఆకర్షిస్తుంది.

లక్ష్మణా! సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకు పోయి ఇటువంటి మృగములను చంపుతారు. వాటి మాంసమును తింటారు. అది క్షత్రియులకు సహజము. కాబట్టి మనము ఈ మృగమును చంపి దాని చర్మమును సీతకు ఇస్తాము. నేను సీత ఈ మృగచర్మము మీద సుఖంగా ఆసీనులము అవుతాము. ఏ మృగ చర్మము కూడా దీని చర్మము అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటాను.

పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే, మనము దీనిని వెంటనే చంపుదాము. ఆ రాక్షసుడు కూడా చస్తాడు. నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది. ఈ మారీచుడు ఇదివరకు ఈ దండ కారణ్యములో ఎంతో మంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు. వీడే మారీచుడు అయితే అవశ్యం వీడిని చంపితీరాలి. వీడు చంపతగ్గవాడు కదా! ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనము మారీచుని చంపుదాము. వీడిపీడను, ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు, ఇక్కడ నివసించే ఋషులకు, లేకుండా చేద్దాము.

అలాకాకుండా, ఈ మృగము మామూలు మృగము అయితే దీనిని చంపి సీతకు చర్మము ఇద్దాము. ఇది రాక్షసుడు అయితే దీనిని చంపి ఇక్కడివారలకు రాక్షసపీడను విరగడ చేద్దాము. కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించతగినది.

లక్ష్మణా! నేను ఈ మృగమును వేటాడి చంపుతాను. నేను వచ్చేదాకా నీవును సీతను రక్షిస్తూ ఉండు. నేను ఒక్కక్షణములో ఈ మృగమును చంపి దాని చర్మమును తీసుకొని వస్తాను. నీవుమాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చువరకూ జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు. లక్ష్మణా! కావాలంటే జటాయువు సాయం తీసుకో. నీవు, జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి.” అని పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గః (44) >>

Leave a Comment